Jump to content

సు ఫ్రమ్ సో

వికీపీడియా నుండి
సు ఫ్రమ్ సో
దర్శకత్వంజె.పి. తుమినాడ్
రచనజె.పి. తుమినాడ్
నిర్మాతశశిధర్ శెట్టి బరోడా
రవి రాయ్ కలసా
రాజ్ బి. శెట్టి
తారాగణంషానీల్ గౌతమ్
జె.పి. తుమినాడ్
సంధ్య అరకెరె
ఛాయాగ్రహణంఎస్. చంద్రశేఖరన్
కూర్పునితిన్ శెట్టి
సంగీతంపాటలు:
సుమేధ్ కె.
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్:
సందీప్ తులసీదాస్
నిర్మాణ
సంస్థ
లైటర్ బుద్దా ఫిలింస్
విడుదల తేదీ
2025 జూలై 25
సినిమా నిడివి
135 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషకన్నడ
బడ్జెట్₹ 5.5 కోట్లు[2][3] [4]
బాక్సాఫీసు₹115 కోట్లు

సు ఫ్రమ్ సో 2025లో విడుదలైన కన్నడ భాషా సినిమా. లైటర్ బుద్దా ఫిలింస్ బ్యానర్‌పై శశిధర్ శెట్టి బరోడా, రవి రాయ్ కలసా, రాజ్ బి. శెట్టి నిర్మించిన ఈ సినిమాకు జె.పి. తుమినాడ్ దర్శకత్వం వహించాడు. షానీల్ గౌతమ్, జె.పి. తుమినాడ్, సంధ్య అరకెరె, ప్రకాష్ తుమినాడ్ , దీపక్ రాయ్ పనాజే, మైమ్ రాందాస్, రాజ్ బి. శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై 25న థియేటర్లలో విడుదలై సానుకూల సమీక్షలు అందుకొని వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి.[5]

సు ఫ్రమ్ సో 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ సినిమాగా నిలిచింది. రాజకుమార (2017), కెజిఫ్ సిరీస్ (2018-2022), కాంతారా (2022) & 777 చార్లీ (2022) తర్వాత కన్నడ సినిమాల్లోకి పెద్ద సంఖ్యలో అభిమానులను తీసుకువచ్చిన ఘనత దీనికి దక్కింది.

సు ఫ్రమ్ సో సినిమాకు క‌న్న‌డలో మంచి స్పంద‌న రావ‌డంతో మ‌ల‌యాళంలో దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్ ఆగస్టు 1న, తెలుగులో ఆగస్ట్ 8న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా సినిమాను విడుదల చేశారు.[6][7] ఈ సినిమా సెప్టెంబర్ 5 నుండి జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.[8][9]

నటీనటులు

[మార్చు]
  • రవి "అన్న" గా షనీల్ గౌతమ్
  • అశోక్ గా జె.పి. తుమినాడ్
  • భానుగా సంధ్య అరకెరె
  • చంద్రగా ప్రకాష్ తుమినాడ్
  • సతీషగా దీపక్ రాయ్ పనాజే
  • యధుగా మైమ్ రాందాస్
  • కరుణాకర్ "గురూజీ"గా రాజ్ బి. శెట్టి
  • భావ గా పుష్పరాజ్ బోలార్
  • మాలా, చంద్ర భార్యగా మమతా శెట్టి
  • మనీష్ శెట్టి
  • అశోక్ సోదరిగా ప్రకృతి అమీన్

పాటలు

[మార్చు]

ఈ సినిమాలోని పాటలను సుమేధ్ కె సంగీతాన్ని స్వరపరిచాడు, ఈ సినిమా సౌండ్‌ట్రాక్‌తో ఆయన తొలిసారి సినిమాల్లోకి అడుగుపెట్టారు. నేపథ్య సంగీతాన్ని సందీప్ తులసిదాస్ స్వరపరిచాడు. మొదటి సింగిల్ డాంక్స్ ఆంథమ్ జూన్ 27న విడుదలైంది.[10]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."డాంక్స్ ఆంథమ్"రాజ్ బి. శెట్టిఅనురాగ్ కులకర్ణి3:16
2."స్కూటర్ సాంగ్"పృథ్వీ అంటసిద్ధార్థ బెల్మన్ను3:48

మూలాలు

[మార్చు]
  1. "Su From So [M]". Australian Classification Board. 4 August 2025. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 August 2025.
  2. Sharadhaa, A. (2025-08-07). "Raj B Shetty clarifies on speculations about Su From So budget". Cinema Express. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-08-08.
  3. "Su From So: Raj B Shetty sets the record straight on the budget of his hit film". Hindustan Times. 8 August 2025.
  4. Prakash, Vinay (2025-08-07). "Su From So: Made On Rs 4 Crore Budget, How This Kannada Horror-Comedy Became Box Office Phenomenon". Times now news (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-08-07.
  5. "'Su From So' movie review: JP Thuminad delivers a refreshing and hilarious horror comedy" (in Indian English). The Hindu. 25 July 2025. the original నుండి 2 September 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 September 2025.
  6. "తెలుగు తెరపై కన్నడ కామెడీ 'సు ఫ్రమ్‌ సో'." NT News. 4 August 2025. the original నుండి 2 September 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 September 2025.
  7. "రివ్యూ: సు ఫ్రమ్‌ సో.. కన్నడ సూపర్‌హిట్‌ మూవీ తెలుగులో అలరించిందా?". Eenadu. 8 August 2025. the original నుండి 2 September 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 September 2025.
  8. "థియేటర్లలో నవ్వించిన కన్నడ హారర్ కామెడీ... ఈ వారమే ఓటీటీలోకి - స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?". ABP Desam. 2 September 2025. the original నుండి 2 September 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 September 2025.
  9. "ఓటీటీకి.. వ‌చ్చేస్తోన్న రీసెంట్‌ హ‌ర్ర‌ర్‌, కామెడీ! పోతారు అంతా.. న‌వ్వి న‌వ్వి పోతారు". Chitrajyothy. 2 September 2025. the original నుండి 2 September 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 September 2025.
  10. Sharadhaa, A. (2025-06-28). "'Danks Anthem' brings the groove in JP Thuminad's directorial debut Su From So". Cinema Express. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-07-28.

బయటి లింకులు

[మార్చు]