Jump to content

సూక్ష్మజీవ శాస్త్రం

వికీపీడియా నుండి

సూక్ష్మజీవ శాస్త్రం (ఆంగ్లం: Microbiology) సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఇందులో ఏకకణ జీవులు, బహుకణ జీవులు, కణరహిత జీవులు కూడా ఉండవచ్చు.[1][2] సూక్ష్మజీవశాస్త్రంలో వైరాలజీ, బ్యాక్టీరియాలజీ, ఇమ్యునాలజీ, మైకాలజీ, పారాసిటాలజీ లాంటి ఉప విభాగాలు కూడా ఉన్నాయి.

సూక్ష్మజీవుల ఉనికిని ప్రత్యక్షంగా పరిశీలించడానికి అనేక శతాబ్దాల ముందు అంచనా వేశారు. ఉదాహరణకు భారతదేశంలోని జైనులు, పురాతన రోమ్‌లోని మార్కస్ టెరెంటియస్ వర్రో. 1666లో రాబర్ట్ హుక్ మొట్టమొదటిగా సూక్ష్మదర్శిని ద్వారా వీటిని గమనించాడు. అయితే క్రైస్తవ పూజారి అథనాసియస్ కిర్చెర్ సూక్ష్మజీవులను మొదటిసారిగా గమనించాడు. అతను 1658లో పాలు, కుళ్ళిన పదార్థాలను గమనించినట్లు పేర్కొన్నాడు. ఆంథోని వాన్ లీవెన్‌హుక్ మైక్రోబయాలజీ పితామహుడుగా పరిగణిస్తారు. అతను 1670లలో తన డిజైన్‌లోని సాధారణ మైక్రోస్కోప్‌లను ఉపయోగించి సూక్ష్మ జీవులను గమనించి ప్రయోగాలు చేశాడు. శాస్త్రీయ సూక్ష్మజీవశాస్త్రం 19వ శతాబ్దంలో లూయీ పాశ్చర్, మెడికల్ మైక్రోబయాలజీలో రాబర్ట్ కోచ్ కృషి ద్వారా అభివృద్ధి చేయబడింది.

చరిత్ర

[మార్చు]

సూక్ష్మజీవుల ఉనికి వాటి వాస్తవ ఆవిష్కరణకు అనేక శతాబ్దాల ముందే ఊహించారు. సా.శ.పూ 6వ శతాబ్దం (సా.పూ 599 - 527) నాటి మహావీరుడి బోధనలపై ఆధారపడిన జైనమత రచనలలో కనిపించని సూక్ష్మజీవుల ఉనికిని ప్రతిపాదించారు.[3] పాల్ డుండాస్, మహావీరుడు భూమిలో నివసించే కనిపించని సూక్ష్మజీవుల ఉనికిని నొక్కి చెప్పాడు. అవి నీరు, గాలి, నిప్పులో లెక్కకి మించిన సంఖ్యలో ఉంటాయని చెప్పాడు.

అనువర్తనాలు

[మార్చు]

కొన్ని సూక్ష్మజీవులు జబ్బులతో ముడిపడి ఉండటం వలన కొంతమందికి ఇవంటే భయం ఉన్నప్పటికీ వీటి వల్ల పలు ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఆల్కహాలు, వెనిగర్, పాల ఉత్పత్తులను పారిశ్రామికంగా ఉత్పత్తి చేయడంలో వీటిది గణనీయమైన పాత్ర. యాంటీబయాటిక్ ఉత్పత్తి మొక్కలు, జంతువులు వంటి సంక్లిష్ట జీవులకు DNAని బదిలీ చేయడానికి అణువుల వాహనాల వలె పని చేస్తుంది. బ్యాక్టీరియాను ఎమైనో ఆమ్లాలు పారిశ్రామికంగా ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు.

మూలాలు

[మార్చు]
  1. "Microbiology". Nature. Nature Portfolio (of Springer Nature). Retrieved 2020-02-01.
  2. Madigan M, Martinko J, eds. (2006). Brock Biology of Microorganisms (13th ed.). Pearson Education. p. 1096. ISBN 978-0-321-73551-5.
  3. Dundas P (2002). Hinnels J (ed.). The Jain. London: Routledge. ISBN 978-0-415-26606-2.