Jump to content

సూరాడ ప్రసాద్

వికీపీడియా నుండి
సూరాడ ప్రసాద్‌
జననం
సూరాడ ప్రసాద్‌

(2000-12-12) 2000 డిసెంబరు 12 (వయసు: 25)
ఇతర పేర్లుప్రసాద్‌ సూరి
వృత్తివిద్యార్థి
పేరుపడ్డదికవి
తల్లిదండ్రులుసూరాడ చంద్రరావు, నూకరత్నం
2025 కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన సురాడ ప్రసాద్ ను సన్మానించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

సూరాడ ప్రసాద్‌ (కలం పేరు ప్రసాద్‌ సూరి) వర్థమాన తెలుగు కవి. ఆయనకు 2025లో 'మైరావణ' నవలకు గాను ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం దక్కింది.[1][2][3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ప్రసాద్‌ సూరి 2000 డిసెంబరు 12న ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం, వాడ నర్సాపురం గ్రామంలో సూరాడ చంద్రరావు, నూకరత్నం దంపతులకు జన్మించాడు. ఆయన ఆర్ధిక కారణాల వల్ల వాడరాంబిల్లిలో అమ్మమ్మ వద్ద ఉంటూ 2016లో పదవ తరగతి, 2018లో ఎలమంచిలి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీయడిట్‌ పూర్తి చేయగా ఉన్నత చదువులు చదివించే స్థోమత లేదని కుటుంబసభ్యులు చెప్పడంతో ఆయన హైదరాబాద్‌ వచ్చి సంవత్సరం పాటు బార్‌లో పని చేసి ఆ సంపాదనతో 2019లో హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో (జేఎన్‌టీయూ) చేరి 2024లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ డిగ్రీ పూర్తి చేసి ఆ తరువాత 2025లో కేంద్ర సాహిత్య యువ పురస్కారం ప్రకటించిన నాటికీ గుజరాత్‌ రాష్ట్రం బరోడాలో మహారాజా సాయాజీరావు యూనివర్సిటీలో ఎంఏ ఆర్కియాలజీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు.

సాహితీ ప్రస్థానం

[మార్చు]

ప్రసాద్‌ సూరి చిన్నతనం నుండే హైస్కూల్‌ నటి నుండే పుస్తకాలు చెదివే అలవాటు. ఆయన ఆ తరువాత హైదరాబాద్‌లో పనిచేసే సమయంలో రచనలు చేయడం మొదలు పెట్టి ప్రసాద్‌ సూరి కలం పేరిట రచనలు ప్రారంభించి తన 19వ ఏట మై నేమ్‌ ఈజ్‌ చిరంజీవి పేరుతో మొదటి నవల రాశాడు. ఈ నవలకు ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది, ఆ తరువాత మైరావణ పేరుతో రెండో నవలను రచించగా 2025లో 'మైరావణ' నవలకు గాను ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం దక్కింది.[4][5][6]

రచనలు

[మార్చు]
  • మై నేమ్ ఈజ్ చిరంజీవి (నవల)
  • మై రావణ (నవల)[7][8]
  • బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (నవల)[9]

అభినందనలు

[మార్చు]

ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య యువ పురస్కారాన్ని అందుకున్న ప్రసాద్‌ సూరికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా అభినందించారు.[10][11]

మూలాలు

[మార్చు]
  1. "కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు". V6 Velugu. 21 June 2025. the original నుండి 4 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 July 2025.
  2. "అలల సంద్రం నుంచి కలల తీరంవైపు." Eenadu. 19 June 2025. the original నుండి 4 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 July 2025.
  3. "కబుర్ల దేవతకు బాల సాహిత్య పురస్కారం..మైరావణకు యువ పురస్కారం". Navatelangana. 18 June 2025. the original నుండి 4 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 July 2025.
  4. "పేదింట సాహితీ కెరటం". Andhrajyothy. 20 June 2025. the original నుండి 4 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 July 2025.
  5. "సినీ దర్శకుడవ్వడమే టార్గెట్‌ : మత్స్యకార మణిహారం". Sakshi. 4 July 2025. the original నుండి 4 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 July 2025.
  6. "Andhra Pradesh fisherman's son breaks barriers, wins literary award" (in ఇంగ్లీష్). The New Indian Express. 29 June 2025. the original నుండి 4 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 July 2025.
  7. "స్వానుభవమే..సాహిత్య పురస్కారమై". Eenadu. 21 June 2025. the original నుండి 4 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 July 2025.
  8. "నా పేరు మీద ఓ పది నవల లైనా ఉండాలి". Andhrajyothy. 23 June 2025. the original నుండి 4 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 July 2025.
  9. "తూరుపు గాలి.. ప్రసాద్ సూరి". Mana Telangana. 29 June 2025. the original నుండి 4 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 July 2025.
  10. "Andhra Governor, Naidu and Lokesh laud young writer's achievement" (in ఇంగ్లీష్). The New Indian Express. 30 June 2025. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 July 2025.
  11. "యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు." Andhrajyothy. 29 June 2025. the original నుండి 4 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 July 2025.