సూర్యకాంత్
| సూర్య కాంత్ శర్మ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2025 నవంబరు 24 | |||
| నియమించిన వారు | ద్రౌపది ముర్ము | ||
| ముందు | బి.ఆర్. గవాయ్ | ||
భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2019 మే 24 | |||
| సూచించిన వారు | రంజన్ గొగోయ్ | ||
| నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు 23వ ప్రధాన న్యాయమూర్తి | |||
| పదవీ కాలం 2018 అక్టోబర్ 5 – 2019 మే 23 | |||
| సూచించిన వారు | దీపక్ మిశ్రా | ||
| నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
| ముందు |
| ||
| తరువాత | వి.రామసుబ్రమణియన్ | ||
పంజాబ్ & హర్యానా హైకోర్టు న్యాయమూర్తి | |||
| పదవీ కాలం 2004 జనవరి 9 – 2018 అక్టోబర్ 4 | |||
| సూచించిన వారు | వి.ఎన్. ఖరే | ||
| నియమించిన వారు | ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ | ||
హర్యానా అడ్వకేట్ జనరల్ | |||
| పదవీ కాలం 2000 జూలై 7 – 2004 జనవరి 8 | |||
| నియమించిన వారు | బాబు పరమానంద్ | ||
| ముందు | మన్మోహన్ లాల్ సరిన్ | ||
| తరువాత | అశోక్ అగర్వాల్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1962 ఫిబ్రవరి 10 పెట్వర్, హిసార్ , హర్యానా | ||
| పూర్వ విద్యార్థి | మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం, రోహ్తక్ | ||
సూర్యకాంత్ శర్మ (జననం 1962 ఫిబ్రవరి 10) భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సీనియారిటీ సంప్రదాయాన్ని పాటిస్తూ ఆయన 53వ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా నియమించబడ్డాడు.[1] ఆయన 2025 నవంబరు 24న సీజేఐగా ప్రమాణం చేసి, 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగుతాడు. ఆయన న్యాయమూర్తిగా పదోన్నతి పొందే ముందు సీనియర్ న్యాయవాదిగా, హర్యానాకు అడ్వకేట్ జనరల్‌గా పని చేశాడు. ఆయన రాంచీలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లాకు సందర్శకుడిగా,[2] నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎక్స్ అఫిషియో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నాడు.[3]
జస్టిస్ సూర్యకాంత్ 2025 నవంబర్ 24న 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) ప్రమాణ స్వీకారం చేశాడు.[4]
జననం, విద్యాభ్యాసం
[మార్చు]సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్ జిల్లా పెట్వార్ గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు.[5][6] ఆయన 1981లో హిసార్‌లోని ప్రభుత్వ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు, 1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ పట్టా అందుకొని 2011లో కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుండి తన మాస్టర్ ఆఫ్ లాలో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ సాధించాడు.[7][8]
వృత్తి జీవితం
[మార్చు]సూర్యకాంత్ హిసార్‌లోనే న్యాయవాద వృత్తి మొదలుపెట్టి 1985లో పంజాబ్ హరియాణా హైకోర్టులో ప్రాక్టీసు చేయడం కోసం ఛండీగడ్‌కు వెళ్లి ఆ తర్వాత 2000 జులై 7న అత్యంత పిన్నవయస్సులో హరియాణా అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యాడు. ఆయన 9 జనవరి 2004న పంజాబ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా, 2018 అక్టోబరు 5న హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019 మే 24న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అందుకున్నాడు. ఆయన 2024 నవంబరు 12 నుంచి సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్‌గా పని చేస్తున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "New CJI: సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం". EENADU. Retrieved 2025-10-31.
- ↑ "General Council". NUSRL. Retrieved 7 January 2024.
- ↑ "7 Next CJIs" (in ఇంగ్లీష్). Supreme Court Observer. 23 November 2021. Archived from the original on 28 December 2021. Retrieved 24 November 2021.
- ↑ "జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం". Sakshi. 24 November 2025. Archived from the original on 24 November 2025. Retrieved 24 November 2025.
- ↑ Arora, Vijay (24 May 2019). "Full court reference for Justice Kant". The Tribune.
{{cite news}}: CS1 maint: deprecated archival service (link) - ↑ Jain, Ritika (2019-05-09). "SC collegium's two new judge picks set to give India its second Dalit chief justice". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-06-02.
- ↑ "Hon'ble Mr. Justice Surya Kant, Chief Justice". hphighcourt.nic.in. Retrieved 15 December 2018.
- ↑ "Justice Surya Kant appointed Chief Justice of HP High Court". thestatesman.com. 3 October 2018. Retrieved 15 December 2018.