సెకండ్ హ్యాండ్
సెకండ్ హ్యాండ్ | |
---|---|
దర్శకత్వం | కిషోర్ తిరుమల |
రచన | కిషోర్ తిరుమల |
నిర్మాత | బి.వి.ఎస్. రవి, పూర్ణ నాయుడు |
తారాగణం | ధన్యా బాలకృష్ణన్ సుధీర్ వర్మ |
ఛాయాగ్రహణం | అవనీంద్ర, ఉమ |
సంగీతం | రవిచంద్ర |
నిర్మాణ సంస్థ | శ్రేయస్ చిత్ర |
విడుదల తేదీ | డిసెంబరు 13, 2013 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సెకండ్ హ్యాండ్ 2013 లో విడుదలైన తెలుగు చిత్రం.
కథ
[మార్చు]సంతోష్‌కి (సుధీర్‌వర్మ) ఫోటోగ్రఫీ హాబీ. దీపుని (ధన్య) తొలిచూపులోనే ప్రేమించిన సంతోష్ ఆమెని కూడా తన ప్రేమలో పడేస్తాడు. కానీ వీరిద్దరి ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. దీపు వేరే పెళ్ళి చేసుకుంటుంది. సుబ్బారావు (కిరీటి) ఒక మంచి మనసున్న మనిషి.. పెళ్ళి చూపుల్లోనే స్వేఛ్ఛపై (ధన్య) మనసు పారేసుకుంటాడు. కానీ ఆమెకి అదివరకే ప్రియుడు ఉన్నాడని, అతనితో ఆమె చాలా దూరం వెళ్లిందని తెలుసుకుంటాడు. అయినా కానీ ఆమెని పెళ్ళి చేసుకుంటాడు కానీ సుబ్బారావు జీవితం ఆమె వల్ల చిందర వందర అవుతుంది. సహస్ర (ధన్య) తన సహచరుడు అయిన చైతన్య (విష్ణు) ప్రేమలో పడుతుంది. ప్రేమ మత్తులో గర్భవతి అవుతుంది. ఈ ప్రేమకథతో పాటు మిగిలిన వాళ్ల ప్రేమకథలు ఎలా ముగింపుకు చేరువ అయ్యాయి, వారికి పరిష్కారం ఎలా దొరుకుతుంది అనేది మిగతా కథ.
నటవర్గం
[మార్చు]- ధన్యా బాలకృష్ణన్
- సుధీర్ వర్మ
- కిరీటి
- శ్రీవిష్ణు
- అనూజ్ రామ్
- పోసాని కృష్ణమురళి
పాటల జాబితా
[మార్చు]ఈ చిత్రంలోని పాటలు రచయితలు. కిషోర్ తిరుమల, సాగర్, కృష్ణకాంత్.
బ్రేకింగ్ న్యూస్, గానం. రేవంత్ , బి. ఆదిత్య, స్వీకార్ అగస్త
జో తేరా హి హొమేరా హై , గానం.స్వీకార్ అగస్తి , జ్యోత్స్న, ధన్య బాలకృష్ణ
లవ్ రా లవెరా, గానం. కిషోర్ తిరుమల,రవిచంద్ర , అవనీంద్ర
గోవింద గోవింద , గానం.అవనేంద్ర
సుబ్బారావు , గానం: అవనేంద్ర , బి.ఆదిత్య
లవ్ రా లవ్ రా ,(బార్ మిక్స్) గానం.రవి చంద్ర, అవనీంద్రా
జగాన ప్రేమ ఇంతేనా , గానం.రవిచంద్ర.
సాంకేతికవర్గం
[మార్చు]- బ్యానర్: శ్రేయస్ చిత్ర
- నిర్మాతలు: బి.వి.ఎస్. రవి, పూర్ణ నాయుడు
- రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల
- సంగీతం: రవిచంద్ర
- కూర్పు: ఎస్.ఆర్. శేఖర్
- ఛాయాగ్రహణం: అవనీంద్ర, ఉమ