Jump to content

సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి, కొచ్చి

Coordinates: 9°57′57″N 76°14′28″E / 9.965945°N 76.241102°E / 9.965945; 76.241102
వికీపీడియా నుండి
సెయింట్ ఫ్రాన్సిస్ CSI చర్చి, ఫోర్ట్ కొచ్చి
చర్చి ముఖద్వారం
పటం
9°57′57″N 76°14′28″E / 9.965945°N 76.241102°E / 9.965945; 76.241102
Locationకొచ్చి, కేరళ
Countryభారతదేశం
Denominationదక్షిణ భారతదేశ చర్చి
History
Consecrated1506
Architecture
Completed1516
Administration
Dioceseకొచ్చి డియోసెస్

కేరళలోని కొచ్చి నగరంలో, ఫోర్ట్ కొచ్చిలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి వాస్తవానికి 1503లో నిర్మించబడింది. ఇది భారతదేశంలోని పురాతన యూరోపియన్ చర్చీలలో ఒకటి.[1] భారత ఉపఖండంలో యూరోపియన్ వలసరాజ్యాల ఆశయాలకు సాక్షిగా దీనికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది.[2][3] పోర్చుగీస్ యాత్రికుడు వాస్కో డ గామా 1524లో తన మూడవ పర్యటనలో కొచ్చిలో మరణించాడు. అతని దేహం మొదట ఈ చర్చిలోనే ఖననం చేశారు, కానీ పద్నాలుగు సంవత్సరాల తరువాత అతని అవశేషాలు లిస్బన్ తరలించబడ్డాయి. ఇప్పుడు జెరోనిమోస్ మొనాస్టరీలో భద్రపరచబడ్డాయి.[4]

చరిత్ర

[మార్చు]

యూరప్ నుండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కో డ గామా 1498లో కోజికోడ్ సమీపంలోని కప్పడ్ వద్దకు చేరుకున్నాడు.[5] అతని తర్వాత పెడ్రో అల్వారెస్ కాబ్రల్[5], అఫోన్సో డి అల్బుకెర్కీ వచ్చారు. కొచ్చిన్ రాజా అనుమతితో వారు ఫోర్ట్ కొచ్చి బీచ్ వద్ద ఫోర్ట్ ఇమ్మాన్యుయేల్ నిర్మించారు. కోట లోపల వారు ఒక చెక్క చర్చిని నిర్మించారు. దీనిని సెయింట్ బార్తోలోమ్యూకు అంకితం చేశారు. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ఫోర్ట్ కొచ్చి అని పిలుస్తారు. పోర్చుగీస్ వైస్రాయ్ ఫ్రాన్సిస్కో డి అల్మైడా 1506లో చెక్క భవనాలను రాయి, తాపీపనితో పునర్నిర్మించడానికి కొచ్చిన్ రాజా అనుమతి పొందాడు.[5]

పోర్చుగీస్ యాత్రికుడు వాస్కోడగామా 1524లో తన మూడవ భారత పర్యటనలో కొచ్చిలో మరణించాడు. అతని భౌతికకాయం మొదట ఈ చర్చిలో ఖననం చేశారు, కానీ పద్నాలుగు సంవత్సరాల తరువాత అవశేషాలు లిస్బన్ తరలించారు.

సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి ప్రవేశద్వారం వైపు దృశ్యం
చర్చి లోపలి దృశ్యం

1663లో డచ్ వారు కొచ్చిని స్వాధీనం చేసుకునే వరకు ఫ్రాన్సిస్కాన్ వారు చర్చిపై అధికారాన్ని కలిగి ఉన్నారు. పోర్చుగీస్ వారు రోమన్ క్యాథలిక్కులు కాగా, నెదర్లాండ్స్‌లో క్యాథలిక్, ప్రొటెస్టంట్ పౌరులు ఉన్నారు. డచ్ ప్రభుత్వం, వలసవాదులు ప్రొటెస్టంట్లు. వారు దీనిని తప్ప మిగిలిన అన్ని చర్చీలను కూల్చివేశారు. వారు దీనిని మరమ్మత్తు చేసి ప్రభుత్వ చర్చిగా మార్చారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "National Portal of India". Govt Of India. Archived from the original on 21 July 2011. Retrieved 9 January 2010.
  2. "St. Francis Church, Kochi". Wonderful Kerala. Retrieved 21 February 2008.
  3. Missick, Stephen Andrew. "Mar Thoma: The Apostolic Foundation of the Assyrian Church and the Christians of St. Thomas in India" (PDF). Ancient Indian Christianity. Journal of Assyrian Academic Studies Vol. XIV, no. 2, 2000. Archived from the original (PDF) on 27 ఫిబ్రవరి 2008. Retrieved 21 ఫిబ్రవరి 2008.
  4. Ayub, Akber (ed), Kerala: Maps & More, Fort Kochi, 2006 edition 2007 reprint, pp. 20–24, Stark World Publishing, Bangalore, ISBN 81-902505-2-3
  5. 5.0 5.1 5.2 "St. Francis Church". webindia123. Retrieved 21 February 2008.

బాహ్య లింకులు

[మార్చు]