సెయోని

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Seoni జిల్లా
सिवनी जिला
Madhya Pradesh జిల్లాలు
Madhya Pradesh రాష్ట్రంలో Seoni యొక్క స్థానాన్ని సూచించే పటం
Madhya Pradesh రాష్ట్రంలో Seoni యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Madhya Pradesh
డివిజన్ Jabalpur
ముఖ్యపట్టణం Seoni (Madhya Pradesh)
ప్రభుత్వం
 • లోకసభ నియోకవర్గాలు Balaghat
విస్తీర్ణం
 • మొత్తం 8
జనాభా (2011)
 • మొత్తం 1
 • సాంద్రత 160
జనగణాంకాలు
 • అక్షరాస్యత 73.01 per cent
 • లింగ నిష్పత్తి 984
సగటు వార్షిక వర్షపాతం 1384 మి.మీ
Website అధికారిక వెబ్‌సైటు

మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో సెయోని జిల్లా (హిందీ:) ఒకటి. సెయోని పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

భౌగోళికం[మార్చు]

సెయోని జిల్లా సాత్పురా మైదానంలో భాగంగా ఉంది. మైదానంలో వైంగంగా ఉంది. ఇది అధికంగా అరణ్యాలతో కప్పబడి ఉంది.ఈ జిల్లా సారవంతమైన లోయలకు మరియు ప్రకృతి సౌందర్యానికి నిలయమై ఉంది.[1] ఉత్తర మరియు పశ్చిమ భాగంలో లక్ష్నడన్ మరియు సెనోయి జిల్లాలు ఉన్నాయి. తూర్పు భూభాగంలో వైంగంగా ముఖద్వారం ఉంది. అలాగే జిల్లా ఆగ్నేయ భూభాగంలో ఇరుకైన రాళ్ళతో నిండిన డొంగర్‌తల్ లోయ ఉంది. సముద్రమట్టానికి లక్ష్నడన్ మరియు సెనోయి మైదానాలు 1800 - 2000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇది సారవంతమైన అరణ్య రహితమైన అనుకూల వాతావరణం కలిగిన భూమి.[1] భౌగీళికంగా ఉత్తర సెయోనీ భూభాగంలో కొండలు మరియు దక్షిణ సెయోనీ భూభాగంలో క్రిస్టలైజ్డ్ రాళ్ళు ఉంటాయి. మైదానం మూడింట రెండు వంతులు నల్లరేగడి మట్టితో నిండి ఉంటుంది. దక్షిణ భూభాగంలో గ్నెయిసెస్ క్లిఫ్ట్ మరియు ఇతర మైన శిలలు ఉంటాయి. ఇక్కడి మట్టి సిలిసెయెస్ మరియు పెద్ద ఎత్తున బంకమట్టి ఉంటుంది.[1] జిల్లాలో ప్రవహిస్తున్న ప్రధాన నది వైనగంగా. సాగర్, థెలి, బింజ మరియు థంవర్ వంటి ఇతర నెర్బుద్ద నది ఉపనదులు మరియు జలప్రవాహాలు ఉన్నాయి. వార్షిక వర్షపాతం 53 అంగుళాలు. ప్రధాన పంటలు గోధుమలు, సజ్జలు, వడ్లు, పప్పుధాన్యాలు, నూనె గింజలు మరియు పత్తి.[1] జిల్లా వైశాల్యం 8,758.2.[2]

చరిత్ర[మార్చు]

1956 నవంబరు 1 న సెయోని జిల్లా రఒందించబడింది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న సెరోనా ప్రజల పేరు జిల్లాపేరుగా నిర్ణయించబడింది. [2]

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ... జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న సెయోని రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,378,876,[4]
ఇది దాదాపు. స్విడ్జర్‌లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 355 వ స్థానంలో ఉంది..[4]
1చ.కి.మీ జనసాంద్రత. 157 .[4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 18.2%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 984:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 73.01%.[4]
జాతియ సరాసరి (72%) కంటే.

2011 గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
2001 గణాంకాలను అనుసరించి - జనసంఖ్య 1,165,893,
నగరీకరణ శాతం
ఇందులో పురుషుల సంఖ్య 588,135
స్త్రీలసంఖ్య 577,758
స్త్రీ పురుష నిష్పత్తి 982:1000
జాతీయ సరాసరి 928 కంటే
1991 నుండి 2001 వరకు జనాభా అభివృద్ధి 16.89%

[7]

ప్రజలు[మార్చు]

జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజలు 36% ఉన్నారు.[2] సెనోయి జిల్లాలో గోండు ప్రజలు అధికంగా ఉన్నారు. .[8] జిల్లాలో బర్గి ప్రజలు కూడా అధికంగా ఉన్నారు. గోండులు జిల్లాలో 250 జిల్లాలలో ఉన్నారు.

సంస్కృతి[మార్చు]

రుద్యార్ద్ కిప్లింగ్స్ " ది జంగిల్ బుక్ " పుస్తకం సెనోయు జిల్లా నేపథ్యంలో వ్రాయబడింది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "Seoni". Classic Encyclopedia (based on the 11th edition of Encyclopaedia Britannica, published 1911). Retrieved 2010-08-19. 
  2. 2.0 2.1 2.2 "Seoni, Madhya Pradesh". District administration. Retrieved 2010-08-19. 
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011. 
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Swaziland 1,370,424 
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Hawaii 1,360,301 
  7. "Population, decadal growth rate, sex ratio and density – States/Union territories and Districts : 2001". Table 1. Education for all in India, Source:Registrar General of India, Government of India, New Delhi. Retrieved 2010-08-12. 
  8. "Madhya Pradesh: DATA HIGHLIGHTS: THE SCHEDULED TRIBES, Census of India 2001" (PDF). Govt. of Madhya Pradesh. Retrieved 2010-08-20. 

Public Domain This article incorporates text from a publication now in the public domainChisholm, Hugh, ed. (1911). Encyclopædia Britannica (11th ed.). Cambridge University Press. 

వెలుపలి లింకులు[మార్చు]

  • [1] list of places in Seoni

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సెయోని&oldid=2127197" నుండి వెలికితీశారు