Jump to content

సెల్వరాఘవన్

వికీపీడియా నుండి
సెల్వరాఘవన్
జననం
సెల్వరాఘవన్ కస్తూరి రాజా

(1977-03-05) 1977 మార్చి 5 (వయసు: 49)
చెన్నై, తమిళనాడు
ఇతర పేర్లుశ్రీ రాఘవ
వృత్తిసినీ దర్శకుడు, రచయిత
క్రియాశీలక సంవత్సరాలు2003–ప్రస్తుతం
భాగస్వామి

సెల్వరాఘవన్ తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు. తన తండ్రి దర్శకత్వంలో మొదటి సినిమా తుళ్ళువదో ఇల్లమై కోసం స్క్రిప్ట్ మీద పని చేసిన రాఘవ తరువాత వరుసగా కాదల్ కొండేన్, 7G బృందావన్ కాలనీ లాంటి ప్రేమ చిత్రాలు తీశాడు. తరువాత పుదుపేట్టై, మాయాక్కం ఎన్న లాంటి గ్యాంగ్ స్టర్ సినిమాలు తీశాడు. కొన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు కూడా తీశాడు. రాఘవ నేరుగా తెలుగులో తీసిన సినిమా వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. [1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సెల్వరాఘవన్ 1977 మార్చి 5 న చెన్నైలో జన్మించాడు. తండ్రి కస్తూరి రాజా ప్రముఖ సినీ దర్శకుడు. ఇతనికి మరో ప్రముఖ నటుడైన ధనుష్ తమ్ముడు. అంతేకాక ఇతనికి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వారిద్దరూ వైద్యులే. ఇతనికి చిన్నప్పుడే రెటీనా సంబంధిత క్యాన్సర్ వ్యాధి సోకడంతో ఒక కన్ను తొలగించాల్సి వచ్చింది. అందుకని బయటకు వచ్చేటప్పుడు ఎక్కువగా కళ్ళద్దాలతో కనిపిస్తుంటాడు. డిసెంబరు 15, 2006న ఇతని మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సోనియా అగర్వాల్ ను వివాహం చేసుకున్నాడు. రెండేళ్ళ వైవాహిక జీవితం తర్వాత ఆగస్టు 9, 2009 న వీరిద్దరూ చెన్నైలోని ఓ కుటుంబ న్యాయస్థానంలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. తరువాత జూన్ 19, 2011న తమిళనాడు మాజీ అడ్వొకేట్ జనరల్ పి. ఎస్. రామన్ కూతురైన గీతాంజలిని వివాహం చేసుకున్నాడు. ఈ అమ్మాయి ఇతనితో ఒక సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేసి ఉన్నది.[2] ఈ దంపతులకు జనవరి 19, 2012 న లీలావతి అనే ఓ కూతురు కలిగింది.[3] అక్టోబరు 7, 2013 న ఓంకార్ అనే కుమారుడు పుట్టాడు.[4]

కెరీర్

[మార్చు]

సెల్వరాఘవన్ తండ్రి కస్తూరి రాజా సినీ నేపథ్యం కలవాడే అయినా తన పిల్లలను బాగా చదువుకోమని ప్రోత్సహించాడు. దాంతో సెల్వ మెకానికల్ ఇంజనీరింగ్ లో బి.ఇ చేశాడు. కానీ అందులో తాను సరిపోనని భావించి వివిధ రంగాలలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండేవాడు. కొద్ది రోజులకు తాను రచయితగా పనిచేయడమంటే ఇష్టమని తెలుసుకున్నాడు. 1997లో ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత తాన రాసిన కథలను చేతపట్టుకుని నిర్మాతల కోసం తిరిగాడు కానీ ఎవరూ అతనికి అవకాశం ఇవ్వలేదు. దాంతో అతను ఇంటిపట్టునే ఉండిపోవాల్సి వచ్చింది. 2000 లో తన తండ్రి కస్తూరి రాజాకు కూడా అవకాశాలు సన్నగిల్లడంతో కుటుంబం ఆర్థికంగా కూడా సమస్యలు ఎదుర్కొన్నది. తమ దగ్గర మిగిలున్న సొమ్ములతో తుళ్ళువదే ఇల్లమై అనే సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. 2002 లో వచ్చిన ఈ సినిమాకు సెల్వరాఘవన్ కథ నందించాడు. ఇందులో అతని తమ్ముడు ధనుష్ హీరోగా నటించాడు. ఆరుగురు హైస్కూలు కుర్రాళ్ళ కథతో తయారైన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా బాణీలు సమకూర్చాడు. ఈ సినిమాకు మొదట్లో అంతంత మాత్రమే ఆదరణ వచ్చినా టీనేజర్ల నుంచి మంచి స్పందన వచ్చి చెప్పుకోదగ్గ విజయం సాధించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత సెల్వరాఘవన్ నిజానికి ఆ సినిమాకు దర్శకత్వం వహించింది తానేనని, డిస్ట్రిబ్యూటర్లను ఆకట్టుకోవడం కోసం అప్పటికే దర్శకుడిగా పేరున్న తన తండ్రి కస్తూరి రాజా పేరు వాడుకున్నానని చెప్పాడు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
  • గమనిక: ప్రత్యేకంగా పేర్కొనకపోతే, అన్ని సినిమాలు తమిళంలో ఉన్నాయి.
కీ
† (**) ఇంకా విడుదల కాని సినిమా లేదా టీవీ నిర్మాణాలను సూచిస్తుంది.

దర్శకత్వ పని

[మార్చు]
సంవత్సరం పేరు గమనికలు
2002 తుళ్ళువాధో ఇలామై దర్శకుడిగా గుర్తింపు పొందలేదు
2003 కాదల్ కొండెయిన్
2004 7/జి రెయిన్బో కాలనీ తెలుగులో 7G బృందావన్ కాలనీ

(తెలుగులో శ్రీ రాఘవగా పేరు పెట్టారు)  గా ఒకేసారి చిత్రీకరించబడింది .

2006 పుదుపెట్టై
2007 ఆడవారి మాటలకు అర్థాలే వేరులే తెలుగు సినిమా
2010 ఆయిరథిల్ ఒరువన్
2011 మయక్కం ఎన్న జెమిని ఫిల్మ్ సర్క్యూట్ తో కలిసి నిర్మించారు
2013 ఇరండం ఉలగం
2019 ఎన్‌జికె
2021 నెంజం మరప్పతిల్లై
2022 నానే వరువేయన్
టిబిఎ 7/జి రెయిన్బో కాలనీ 2 చిత్రీకరణ

రచయితగా

[మార్చు]
సంవత్సరం పేరు గమనికలు
2008 యారది నీ మోహిని ఆడవారి మాటలకు అర్థాలే వేరులే రీమేక్
2016 మలై నేరతు మయక్కం

నటుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2006 పుదుపెట్టై మణి వాయిస్ పాత్ర
2013 ఇరండం ఉలగం ఇంటి యజమాని వాయిస్ పాత్ర
2022 మృగం అల్తాఫ్ హుస్సేన్
సాని కాయితమ్ సాంగైయ్య అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది
నానే వరువేయన్ సీరియల్ కిల్లర్ అతిధి పాత్ర
2023 బకాసురన్ బీమా రాసు
ఫర్హానా ధయాలన్
మార్క్ ఆంటోనీ చిరంజీవి
2024 రాయన్ శేఖర్
సోర్గవాసల్ సిగామణి "సిగా"
2025 డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ "హిచ్‌కాక్" ఇరుత్యరాజ్
బాల్టి పోర్తమరై భైరవన్ మలయాళం-తమిళ ద్విభాషా చిత్రం
ఆర్యన్ అజ్హగర్

గీత రచయితగా

[మార్చు]
సంవత్సరం సినిమా పాటలు స్వరకర్త
2002 తుళ్ళువాధో ఇలామై "కణ్ మున్నాఎత్తనై నిలవు" యువన్ శంకర్ రాజా
2010 ఆయిరథిల్ ఒరువన్ అన్ని పాటలు ("థాయ్ తిండ్ర మన్నా" మరియు "పెమ్మనే" తప్ప) జి.వి. ప్రకాష్ కుమార్
2010 కుట్టి "నీ కాదలిక్కుం" దేవి శ్రీ ప్రసాద్
2011 మయక్కం ఎన్న "నాన్ సొన్నాదుం మజైవాంధుచ" జి.వి. ప్రకాష్ కుమార్
"ఓడ ఓడ దూరం కోరాయల"
"ఎన్నేనా సెయిధోం ఇంగు"
"కాదల్ ఎన్ కాదల్"
2016 నెంజం మరప్పతిల్లై "మంచి చెడు & అగ్లీ" యువన్ శంకర్ రాజా
"కన్నుంగాల చెల్లంగాల (కవియరసర్ కన్నదాసన్‌కు నివాళులు)"
"మాలాయ్ వరుమ్ వెన్నిల"
"ఎన్ పొందాటి ఊరుక్కు పోయిటా"
2017 పవర్ పాండి "వానం" (ది లైఫ్ ఆఫ్ పవర్ పాండి) సీన్ రోల్డాన్
2019 ఎన్‌జికె "పోతచాలుం" యువన్ శంకర్ రాజా
2022 నానే వరువేయన్ "వీర సూర"
2025 నెంజం మరప్పతిల్లై ( OST ) "డెవిల్స్ డ్యూయెట్"
"తీసుకురా!"

ప్రశంసలు

[మార్చు]

దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

[మార్చు]
సంవత్సరం సినిమాలు వర్గం ఫలితం
2004 కాదల్ కొండెయిన్ ఉత్తమ దర్శకుడు నామినేట్ అయ్యారు
2005 7/జి రెయిన్బో కాలనీ ఉత్తమ దర్శకుడు నామినేట్ అయ్యారు
2007 పుదుపెట్టై ఉత్తమ దర్శకుడు నామినేట్ అయ్యారు
2010 ఆయిరథిల్ ఒరువన్ ఉత్తమ దర్శకుడు నామినేట్ అయ్యారు
CineMAA అవార్డులు - 2004

ఎడిసన్ అవార్డు

[మార్చు]
సంవత్సరం సినిమాలు వర్గం ఫలితం
2010 ఆయిరథిల్ ఒరువన్ ఉత్తమ థ్రిల్లర్ చిత్రం గెలిచింది
2023 మృగం ఉత్తమ సహాయ పాత్ర - పురుషుడు గెలిచింది

సైమా

[మార్చు]
సంవత్సరం సినిమాలు వర్గం ఫలితం
2011 మయక్కం ఎన్న ఉత్తమ చిత్రం నామినేట్ అయ్యారు

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (18 June 2021). "తెరవెనుక నుంచి తెరపైకి". andhrajyothy. Archived from the original on 18 జూన్ 2021. Retrieved 18 June 2021.
  2. "She is Selva's Geetanjali: First look – Tamil Movie News". IndiaGlitz. Archived from the original on 31 మార్చి 2012. Retrieved 9 January 2012.
  3. "Baby girl it is for SelvaraghavanGitanjali!". indiaglitz.com. indiaglitz.com. Archived from the original on 1 డిసెంబర్ 2017. Retrieved 18 November 2016. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  4. "Selvaraghavan, Gitanjali welcome a baby boy". newindianexpress.com. newindianexpress.com. Retrieved 18 November 2016.