సేథ్ గోవింద్ దాస్
సేథ్ గోవింద్ దాస్ కాకా సహిబు | |
---|---|
Member of Parliament for జబల్‌పూర్ | |
In office భారత సాధారణ ఎన్నికలు (1951) – 1974 | |
అంతకు ముందు వారు | సుశీల్ కుమార్ పటేరియా |
తరువాత వారు | శరద్ యాదవ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1896 అక్టోబరు 16 |
మరణం | 1974 జూన్ 18 బాంబే, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 77)
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | గోదావరి బాయ్ |
సంతానం | ఇద్దరు కుమారులు (జగ్మోహన్ దాస్, మన్మోహన్ దాస్) & ఇద్దరు కుమార్తెలు (రత్న కుమారి, పద్మ) |
తల్లి | పార్వతీ బాయ్ |
తండ్రి | జీవన్ దాస్ |
కళాశాల | రాణి దుర్గావతి యూనివర్సిటీ, జబల్పూర్ |
నైపుణ్యం | స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంట్ సభ్యుడు, రచయిత |
వెబ్‌సైట్ | http://www.gokuldas.com/sg/ |
As of 26 జూన్, 2016 |
సేథ్ గోవింద్ దాస్ ( 1896 అక్టోబరు 16 - 1974 జూన్ 18) మహారాష్ట్రకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంట్ సభ్యుడు, రచయిత.[1]
జననం
[మార్చు]సేథ్ గోవింద్ దాస్ 1896, అక్టోబరు 16న మహారాష్ట్రలోని జబల్‌పూర్‌కు చెందిన రాజ గోకుల్దాస్ మహేశ్వరి వ్యాపారి కుటుంబంలో జన్మించాడు.[2] సేవారం ఖుషాల్‌చంద్ బ్యాంకింగ్ సంస్థ ఉంది.[3][4]
ఉద్యమం
[మార్చు]మహాత్మా గాంధీకి సన్నిహితుడిగా, అనుచరుడిగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడు. మధ్యప్రదే్శ్ రాటస్ట్రంలోని దామోహ్ పట్టణంలో జైలు శిక్షను కూడా అనుభవించాడు.
రచనా ప్రస్థానం
[మార్చు]గోవింద్ హిందీ రచయిత కూడా. హిందీ భారత జాతీయ భాషగా రావడానికి తన మద్దతు ఇచ్చాడు.[5] జైలులో ఉన్న సమయంలో 'ప్రకాశం' (సాంఘిక), 'కార్తవ్య' (పౌరాణిక), 'నవరాలు' (తాత్విక), 'స్పార్ధ' (ఒక నాటకం నాటకం) అనే నాలుగు నాటకాలు కూడా రాశాడు.[6]
రాజకీయరంగం
[మార్చు]1957 నుండి 1974 వరకు భారత పార్లమెంట్‌లో జబల్‌పూర్‌కు ప్రాతినిధ్యం వహించాడు.[7]
పురస్కారాలు
[మార్చు]1961లో భారత ప్రభుత్వం నుండి భారతదేశ మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు.[8]
మరణం
[మార్చు]దాస్ 1974, జూన్ 18న ముంబైలో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Biography". Lok Sabha.
- ↑ The Life of a Text, Performing the Ramcaritmanas of Tulsidas, Philip Lutgendorf, UNIVERSITY OF CALIFORNIA PRESS, p. 423
- ↑ Timberg, Thomas, (1971), A Study of a "Great" Marwari Firm: 1860-1914, The Indian Economic & Social History Review, 8, issue 3, p. 264-283.
- ↑ The Marwaris: From Jagat Seth to the Birlas, Thomas A Timberg, Gurcharan Das, Penguin UK, 2015
- ↑ हिंदी बोलने में गर्व महसूस करते हैं ये 7 बॅालीवुड, Patrika, Sep 11, 2018
- ↑ सेठ गोविन्ददास अभिनन्दन ग्रन्थ, नगेन्द्र, चतुर्वेदीमहेन्द्र, सम्पा. सेठ गोविन्ददास हीरक जयन्ती समारोह समिति, नई दिल्ली, 1956.
- ↑ [Is J. P. the Answer?, Minocheher Rustom Masani, Macmillan Company of India, 1975 p. 105]
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 21 July 2015.