Jump to content

సేనావతి రాగం

వికీపీడియా నుండి
Senavati scale with shadjam at C

సేనావతి రాగం కర్ణాటక సంగీతంలో ఒక రాగం. కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాలలో ఇది 7వ మేళకర్త రాగము.[1] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని సేనాగ్రణి అని పిలుస్తారు.

రాగ లక్షణాలు

[మార్చు]
  • ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R1 G2 M1 P D1 N1 S)
  • అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N1 D1 P M1 G2 R1 S)

ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, శుద్ధ నిషాధం. ఇది 43 మేళకర్త గవాంభోది రాగానికి శుద్ధ మధ్యమ సమానము.

ఉదాహరణలు

[మార్చు]

చాలామంది వాగ్గేయకారులు సేనావతి రాగంలో కీర్తనల్ని రచించారు.

జన్య రాగాలు

[మార్చు]

సేనావతి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి.

సంబంధిత రాగాలు

[మార్చు]

గ్రహ భేదం ఉపయోగించి మార్చినప్పుడు సేనావతి నోట్లు , 2 మేళకర్త రాగాలను ఇస్తాయి, అవి లతాంగి, సూర్యకాంతం. సాపేక్ష నోట్ పౌనః పున్యాలను ఒకే విధంగా ఉంచడంలో తీసుకున్న చర్య గ్రాహ భేదం, షడ్జమం‌ను రాగం‌లోని తదుపరి నోట్‌కు మార్చడం.

మూలాలు

[మార్చు]
  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్