సేనా రాజవంశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Sena Empire

সেন সাম্রাজ্য
Shen Shamrajjo
CE 1070–CE 1230
రాజధానిGauda, Bikrampur, Nabadwip
సామాన్య భాషలుSanskrit
మతం
Hinduism (Vedic Hinduism, Shaivism, Tantra and Vaishnavism)
ప్రభుత్వంMonarchy
King 
• 1070–1095 AD
Samanta Sena]]
• 1095–1096 AD
Hemanta Sena
• 1096–1159 AD
Vijaya Sena
• 1159–1179 AD
Ballala Sena
• 1179–1204 AD
Lakshmana Sena
• 1204–1225 AD
Keshava Sena
• 1225–1230 AD
Vishvarupa Sena
• 
Surya Sena[1]
• 
Narayana Sena[1]
• 
Laksmana Sena ।। [1]
చారిత్రిక కాలంClassical India
• స్థాపన
CE 1070
• పతనం
CE 1230
Preceded by
Succeeded by
Pala Empire
Deva dynasty

సేన సామ్రాజ్యం (బెంగాలీ:সেন সাম্রাজ্য) (షెను షమరాజ్జో) భారత ఉపఖండంలో క్లాసికలు యుగం చివరికాలంలోని హిందూ రాజవంశం. ఇది బెంగాలు నుండి 11 – 12 వ శతాబ్దాల వరకు పరిపాలించింది. ఈ సామ్రాజ్యం భారత శిఖరాగ్రహస్థితిలో ఉన్న కాలంలో ఈశాన్య ప్రాంతంలో చాలా భూభాగం వారి ఆధీనంలో ఉంది. సేన రాజవంశం పాలకులు మూలం దక్షిణ భారత ప్రాంతమైన కర్ణాటకగా గుర్తించారు. [2]

సేన రాజవంశాన్ని సమంత సేన స్థాపించాడు. ఆయన తరువాత పాలకుడైన హేమంత సేన సా.శ. 1095 లో అధికారాన్ని స్వాధీనం చేసుకుని తనకు తాను రాజుగా ప్రకటించాడు. ఆయన వారసుడు విజయ సేన (సా.శ. 1096 నుండి సా.శ. 1159 వరకు పాలించారు) పాలన రాజవంశానికి గట్టి పునాదులు వేయడానికి సహాయపడింది. ఆయన పాలన అసాధారణంగా 60 ఏళ్ళకు పైగా సాగింది. బల్లాల సేన పాలా నుండి గౌరును జయించి నాబాదువిపును రాజధానిగా చేసుకుని బెంగాలు డెల్టా పాలకుడు అయ్యాడు. బల్లాలా సేన పశ్చిమ చాళుక్య సామ్రాజ్యం యువరాణి రామదేవిని వివాహం చేసుకున్నాడు. సేన పాలకులు దక్షిణ భారతదేశంతో సన్నిహిత సామాజిక సంబంధాన్ని కొనసాగించారని ఇది సూచిస్తుంది.[3] బల్లాల సేన తరువాత 1179 లో లక్ష్మణ సేన సుమారు 20 సంవత్సరాలు బెంగాలును పరిపాలించాడు. సేన సామ్రాజ్యం అస్సాం, ఒడిశా, బీహారు, బహుశా వారణాసి వరకు విస్తరించింది. సా.శ. 1203–1204లో తుర్కికు జనరలు బఖ్తియారు ఖల్జీ నాబాద్విపు మీద దాడి చేశాడు. తూర్పు బెంగాలు సేన నియంత్రణలో ఉన్నప్పటికీ ఖిల్జీ లక్ష్మణు సేనును ఓడించి వాయవ్య బెంగాలును స్వాధీనం చేసుకున్నాడు.

ప్రారంభ ఉనికి

[మార్చు]

బెంగాలులో పాలాల అధికారం క్షీణించిన తరువాత రాజకీయ భూభాగాన్ని సేనాలు ఆక్రమించారు. విజయసేన రాజు పాలల భూభాగంలో ఎక్కువ భాగాన్ని స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించాడు. సేనారాజులు సనాతన హిందూ మతానికి మద్దతుదారులుగా ఉన్నారు. రాజవంశం మూలం దక్షిణ భారతదేశంలోని పశ్చిమ చాళుక్య సామ్రాజ్యంగా గుర్తించబడింది.[4] గౌడ, కమరూప రాజులను ఓడించిన ఆయన కుమారుడు ఆరవ విక్రమాదిత్య నేతృత్వంలోని మొదటి సోమేశ్వరుడి పాలనలో పాశ్చాత్య చాళుక్య దండయాత్ర గురించి నమోదుచేయబడింది.[5][6] కన్నడ పాలకుడి ఈ దాడి కర్ణాటక నుండి బెంగాలులోకి తన దేశవాసుల మృతదేహాలను తీసుకువచ్చింది. ఇది సేన రాజవంశం మూలాన్ని వివరిస్తుంది.[4][5]

సేన పాలన స్థాపకుడు సమంతసేన, తనను కర్ణాటక బ్రహ్మ-క్షత్రియుడిగా అభివర్ణించాడు. తాను కర్ణాటక వ్యతిరేకులతో పోరాడి తరువాత సన్యాసిగా మారిపోయానని ఆయన స్వయంగా పేర్కొన్నాడు. [ఆధారం చూపాలి]సేన రాజుల శాసనాలు వారిని బ్రహ్మ-క్షత్రియులు (క్షత్రియులుగా పరిపాలించిన బ్రాహ్మణులు) లేదా క్షత్రియులుగా పేర్కొన్నాయి.[7] అలాగే మూలాలు వారిని వైద్య (అలాగే మిశ్రమ కులంగా పరిగణించబడే అంబష్ట కులం లేదా ఉప కులం, బ్రాహ్మణ తండ్రి, వైశ్య తల్లి నుండి జన్మించారని[7][8])గుర్తించారు. వారు పరస్పరం వివాహం చేసుకున్నారని గుర్తించారు. వైద్య కుల-పంజికాలలో (వంశవృక్షాలు) బెంగాలీ వైద్యాలు (సాధారణంగా బెంగాలులో బైద్య అని పిలుస్తారు).[9]

సేన రాజవంశం ఒక శతాబ్దానికి పైగా బెంగాలును పాలించింది (క్రీ.పూ 1097–1225). క్రీ.పూ. 11 వ శతాబ్దం ముగింపులో బెంగాలులోని పాలాల స్థానాన్ని భర్తీ చేసిన రాజవంశం ఆవిర్భావం ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన యుగాన్ని ఏర్పాటు చేసింది. రెండవ మహీపాల పాలనలో వారేంద్రలో సమంతచక్ర తిరుగుబాటును సద్వినియోగం చేసుకుని, సేన రాజవంశం స్థాపకుడు విజయసేన, పశ్చిమ బెంగాలులో తన స్థానాన్ని క్రమంగా పటిష్ఠం చేసుకుని, చివరికి మదానపాల పాలనలో స్వతంత్ర పదవిని చేపట్టారు. బెంగాలులోని సేన పాలనలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, బెంగాలు మొత్తం భూభాగం మొదటిసారిగా ఒకే పాలనలోకి తీసుకురాబడింది. ఈ కుటుంబం బెంగాలులోకి ఎలా ప్రవేశించింది. అనే ప్రశ్నకు కచ్చితమైన సమాచారాన్ని అందించడం అసాధ్యం. సేన రికార్డులు కూడా దీని గురించి మౌనంగా ఉన్నాయి.

సేన రాజులు తమ సొంత శాసనాలలో తాము బ్రహ్మ-క్షత్రియులని చెప్పుకుంటున్నారు. వారి మారుమూల పూర్వీకుడు ఒక వీరసేన పురాణకథనాలలో ఆయన పేరు ప్రస్తావించబడాలి. సేనసు "డియోపారా శాసనం" విరాసేన సేన పూర్వీకుడిగా కూడా గుర్తించింది. ఇప్పటికీ ప్రామాణికమైన రికార్డులు అందుబాటులో లేనందున సేనల మూలానికి సంబంధించి పరిశోధకుల మధ్య తీవ్ర వివాదం ఉంది[ఆధారం చూపాలి]

సేనల మూలం వలె వారి ప్రారంభ చరిత్ర లేదా పరిస్థితులు బెంగాలులో దృష్టి పెట్టడం ఇప్పటికీ అఙాతంగా ఉంది. చాళుక్య రాజులు ఆరవ విక్రమాదిత్య, సోమేశ్వర నేతృత్వంలోని ఆక్రమణ సైన్యం బెంగాలుకు వచ్చారని చరిత్రకారులు భావించారు. రాజేంద్ర చోళ సైన్యం బెంగాలు మీద దండెత్తినప్పుడు సేనలు వారితో పాటు వచ్చారని కొందరు పరిశోధకులు సూచించారు. మరికొందరు చరిత్రకారుల అభిప్రాయం ఆధారంగా పాల రాజుల అధీనంలో ఉన్న కొద్దిమంది కర్ణాటక సామంతులు, పాలా శక్తుల బలహీనతను వినియోగించుకుని రాధ ప్రాంతంలో తమ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. ఆ కర్ణాటక ముఖ్యులు చాళుక్య దండయాత్ర నేపథ్యంలో బెంగాలుకు వచ్చి తమ సొంత రాజ్యంలో స్థిరపడి ఉండవచ్చు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం సమంతసేన అటువంటి చీఫు ఆయన బెంగాలు లోని రాధా ప్రాంతంలో తన స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు.

సమంతసేన దక్షిణ భారతదేశంలో వివిధ యుద్ధాల ద్వారా తనకు గుర్తింపు తెచ్చుకున్న సేన కుటుంబ వంశీకుడు. ఆయన వృద్ధాప్యంలో బెంగాలు లోని రాధాలో స్థిరపడ్డాడు. ఆయన బెంగాలులో సేన కుటుంబానికి పునాది వేశాడు. ఆయన కుమారుడు హేమంతసేన పాలా సామ్రాజ్యం క్షీణతను వినియోగించుకున్న చేసుకొని రాధాలో ఒక ముఖ్యమైన రాజ్యాన్ని రూపొందించాడు. రాధాలోని వారి స్థావరం నుండి సేనాలు చివరికి బెంగాలు మొత్తం మీద తమ అధికారాలను విస్తరించారు.[10]

శిలాశాసనాలు

[మార్చు]
Edilpur Copperplate

క్రీ.పూ. 1838 లో ఫరీద్పూరు జిల్లాలోని ఆదిల్పూరు లేదా ఎడిల్పూరు పరగణాలో ఒక రాగి పలక కనుగొనబడింది. దీనిని " ఆసియాటికు సొసైటీ ఆఫ్ బెంగాలు " స్వాధీనం చేసుకుంది. కాని ప్రస్తుతం ఈ రాగి పలక సేకరణలో లేదు. రాగి పలక ఖాతా " ఢాకా రివ్యూ & ఎపిగ్రాఫికు ఇండికా "లో ప్రచురించబడింది. రాగి ఫలక శాసనం సంస్కృతం, గాండా అక్షరాలతో వ్రాయబడింది. 1136 సంవాలు లేదా సా.శ. 1079 నాటి 3 వ జైస్త నాటిది. 1838 జనవరి కొరకు ఆసియాటికు సొసైటీ కొనసాగింపులో రాగి పలక వృత్తాంతం కేశవసేన పాలనలో మూడవ సంవత్సరంలో ఒక బ్రాహ్మణుడికి మూడు గ్రామాలు ఇవ్వబడ్డాయి. ఈభూమి భూస్వామి హక్కులతో ఈ మంజూరు చేయబడింది. ఇందులో అడవిలో నివసించే జాతి అయిన చంద్రభాండలు లేదా సుందర్బన్లను శిక్షించే అధికారం ఉంది.[11] కుతారతక మండలంలోని లెలియా గ్రామంలో ఈ భూమి మంజూరు చేయబడింది. ఇది షతతా-పదమవతి-వీసాయాలో ఉంది. వల్లాల సేన అనే రాజును శత్రువుల భారి నుండి రక్షించడానికి అదృష్టదేవతలైన ఏనుగు దంత సిబ్బంది పల్లకీల (శివకా)మీద తీసుకువెళ్ళారని కేశవ సేన రాగి పలక నమోదు చేస్తుంది; వల్లల సేన కుమారుడు లక్ష్మణ సేన (1179–1205), వారణాసి, అలహాబాదు, దక్షిణ సముద్రంలోని అడోను కోస్టు వద్ద విజయ స్తంభాలను, స్మృతి స్తంభాలను నిర్మించారని పేర్కొంది. రాగి ఫలకం పురాతన బెంగాలులో ఉన్న అద్భుతంగా వరి పండించగలిగిన మృదువైన పొలాలు, నృత్యం, సంగీతం, వికసించే పువ్వులతో అలంకరించబడిన స్త్రీలను కూడా వివరిస్తుంది. కేశవ సేన ఎడిల్పూరు రాగి పలకం సుభ-వర్షకు రాజు నితిపాతక ఈశ్వరాదేవ శర్మనుకు అనుకూలంగా మంజూరు చేసినట్లు నమోదు చేసింది.

దేవపారా ప్రశస్తి అనే శిలాశాసనం రాజకవి ఉమాపతి కూర్చిన కవిత్వంలో సేన రాజులను, ముఖ్యంగా విజయ సేనను ఆరాధించే రాజుల ప్రస్తావన చోటుచేసుకుంది.

సంఘం

[మార్చు]

సేనా పాలకులు కులవ్యస్థను బెంగాలులో సమైక్యపరిచారు. మిథిలా కుల వ్యవస్థ నుండి బెంగాలు కులవ్యవస్థా విధానం రుణం తీసుకున్నప్పటికీ మిథిలాలో ఉన్నతంతగా బెంగాలులో కులవ్యవస్థ పఠిష్టంగా లేదు.[12]

వాస్తుకళ

[మార్చు]

సేనారాజవంశం హిందూ ఆయయాలు, మఠాలు నిర్మించడంలో ప్రఖ్యాతి చెందింది. ప్రస్తుతం బంగ్లాదేశు లోని ఢాకాలో ఉన్న ప్రఖ్యాత ఢాకేశ్వరి ఆలయం ఒకటి.

కాశ్మీరులో రాజవంశం శంకర గౌరే అని ప్రఖ్యాత ఆలయాన్ని కూడా నిర్మించింది.[13]

సాహిత్యం

[మార్చు]

సేన పాలకులు సాహిత్యానికి గొప్ప పోషకులుగా ఉన్నారు. పాలా రాజవంశం, సేన రాజవంశం పాలనలలో, బెంగాలులో బృహత్తర అభివృద్ధి కనిపించింది. ప్రసిద్ధ సంస్కృత కవి, గీత గోవింద రచయిత జయదేవ లక్ష్మణ సేన ఆస్థానంలో ఉన్న పంచరత్నాలలో (ఐదు రత్నాలు) ఒకరు అని కొంతమంది బెంగాలీ రచయితలు అభిప్రాయపడ్డారు. ధోయిను - సేన రాజవంశం రాజసభలో ప్రసిద్ధ కవి - లక్ష్మణ సేన ఆస్థానంలో తొమ్మిది రత్నాలు (రత్న) గురించి ప్రస్తావించారు వారిలో:

  • గోవర్ధన
  • సరన
  • జయదేవ
  • ఉమాపతి
  • ధోయి / ధోయిను కవిరాజా[14][page needed]

వారసత్వం

[మార్చు]

తరువాత తూర్పు బెంగాలును దేవా రాజవంశం పరిపాలించింది. దేవా రాజవంశం బహుశా బెంగాలు చివరి స్వతంత్ర హిందూ రాజవంశం అని భావిస్తున్నారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Raj Kumar (2003). Essays on Medieval India. p. 340. ISBN 9788171416837.
  2. The History of the Bengali Language by Bijay Chandra Mazumdar p.50
  3. Land of Two Rivers: A History of Bengal from the Mahabharata to Mujib by Nitish K. Sengupta p.51
  4. 4.0 4.1 Ancient India by Ramesh Chandra Majumdar p.320
  5. 5.0 5.1 The Cambridge Shorter History of India p.10
  6. B.P. Sinha in George E. Somers, Dynastic History of Magadha, p.214, Abhinav Publications, 1977, New Delhi, ISBN 81-7017-059-1
  7. 7.0 7.1 Ronald. B. Inden (జనవరి 1976). Marriage and Rank in Bengali Culture : A History of Caste and Clan in Middle Period Bengal. p. 60. ISBN 9780520025691.
  8. Reddy (డిసెంబరు 2006). Indian History. p. A234. ISBN 9780070635777.
  9. D.C. Sircar (1971). Studies in the religious life of ancient and medieval India. p. 216. ISBN 9788120827905.
  10. Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. pp. 35–36. ISBN 978-9-38060-734-4.
  11. Hunter, William Wilson (1875), "A statistical account of Bengal, Volume 1", Google Books, Edinburgh: Murry and Gibbs, retrieved 3 అక్టోబరు 2009
  12. Momtazur Rahman Tarafdar, "Itihas O Aitihasik", Bangla Academy Dhaka, 1995
  13. Mitra, Rajendralala (1865). "On the Sena Rajas of Bengal". Journal of the Asiatic Society of Bengal. 34 part 1 (3). Asiatic Society of Bengal: 141–142.
  14. R. C. Majumdar, ed. (1943). The History of Bengal, vol I (Hindu Period). Lohanipur.{{cite book}}: CS1 maint: location missing publisher (link)

Sources

  • Early History of India 3rd and revised edition by Vincent A Smith

వెలుపలి లింకులు

[మార్చు]
అంతకు ముందువారు
Pala dynasty
Bengal dynasty తరువాత వారు
Deva dynasty

మూస:Middle kingdoms of India