సేమియా పకోడీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సేమియా పకోడి తయారు చేయు విధానము

కావలసిన పదార్థాలు[మార్చు]

  • సేమియా - ఒక కప్పు,
  • శెనగపిండి - ఒక కప్పు,
  • ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు,
  • అల్లం పేస్ట్ - అర స్పూన్,
  • కరివేపాకు రెబ్బలు - కొన్ని,
  • కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు,
  • బేకింగ్ పౌడర్ - చిటికెడు,
  • కారం - ఒక స్పూన్,
  • ఉప్పు - రుచికి సరిపడా,
  • నూనె - వేగించడానికి సరిపడా.

తయారుచేసే పద్ధతి[మార్చు]

  • స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక స్పూన్ నూనె వేసి వేడెక్కాక ఒక కప్పు సేమియా వేసి దోరగా వేయించు కోవాలి.
  • ఇంకో గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు నీళ్లు పోసి వేడిచేసి అందులో వేగించిన సేమియా వేసి మెత్తగా అయ్యే వరకు మూతపెట్టి ఉడికించాలి.
  • ఉడికించిన సేమియా, శెనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర తురుము, బేకింగ్ పౌడర్, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడి పిండిలా గట్టిగా కలుపుకోవాలి .
  • ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసిస్టవ్ మీద పెట్టి వేడిచేసుకోవాలి.
  • కలిపి పెట్టుకున్న పిండిని పకోడీల్లా కొద్దికొద్దిగా కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి చిల్లుల గరిటెతో తీయాలి.
  • వేడి వేడిగా తింటుంటే బలే రుచిగా వుంటాయి.

వనరులు[మార్చు]

http://telugutaruni.weebly.com/15/category/4332b63754/1.html