Jump to content

సేవాగడ్ టు పోహారాగడ్

వికీపీడియా నుండి
సేవాగడ్ టు పోహారాగడ్ గ్రంథం
కృతికర్త: ఎ.యస్.యన్.మూర్తి
సంపాదకులు: ఎ.యస్.యన్.మూర్తి
దేశం: భారత దేశము
భాష: ఇంగ్లీషు
విభాగం (కళా ప్రక్రియ): జీవిత చరిత్ర
ప్రచురణ: సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ సేవాగడ్ అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా 515401
విడుదల: మొదటి ముద్రణ. అక్టోబరు 2024
పేజీలు: 180
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): ISBN 978-93-341-3729-3

సేవాగడ్ టు పోహారాగడ్ అనే పుస్తకాన్ని తొలి సారిగా ఆంగ్ల భాషలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా,భీమవరం లో జన్మించిన హైదరాబాద్ వాస్తవ్యులు. విశ్రాంత రైల్వే డిప్యూటీ చీఫ్ సిగ్నల్ & టెలికామ్ ఇంజనీర్,రచయిత,ఎ.యస్.యన్.మూర్తి రచించారు. ఈ పుస్తకం బంజారాల ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ మహరాజ్ యొక్క చారిత్రాత్మక జీవిత విశేషాల పైన రచింపబడినది[1][2].

ప్రాముఖ్యత

[మార్చు]

సంత్ సేవాలాల్ మహరాజ్(1739-1806) లేక సంత్ సేవాభాయా అని పిలువబడే బంజారాల ఆధ్యాత్మిక ధర్మ గురువు, యొక్క ఆధ్యాత్మిక, చారిత్రాత్మక జీవిత విశేషల పైన ఇంగ్లీషులో రచింపబడిన తొలి గ్రంథము. "సేవాగడ్ టు పోహరా గడ్". ఒక రాష్ట్రంలో ఉండే బంజారా ప్రజలు ఇంకొక రాష్ట్రం వారితో మాట్లాడడానికి గోర్ బోలి భాషను ఉపయోగిస్తారు. ఈ భాషకు లిపి లేదు.సమస్త విశ్వ బంజారా సమాజానికి అర్థం కావాలి అంటే ఇంగ్లీషు భాష లోనే రాయాలి. ఈ కారణంగా వారి జీవిత విశేషాలను, ఒక రాష్ట్ర బంజారా ప్రజలు మరొక రాష్ట బంజారా లతో ఎక్కువగా పంచుకోలేక పోయారు. ఈ కారణం గా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఛారిటబుల్ ట్రస్ట్ వారు, సేవాలాల్ వారి జీవిత చరిత్ర ను యావత్ బంజారాలకు, ప్రపంచానికి తెలియ చేయుటకు ఎంతో కాలంగా ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో ఎ.యస్. యన్. మూర్తి రచించిన సేవాగడ్ టు పోహరా గడ్ అనే ఆంగ్ల గ్రంథాన్ని ట్రస్ట్ వారు ప్రచురించారు[3].

రచన శైలి

[మార్చు]

పుస్తకం లోని ఇంగ్లీషు గ్రాంధిక, వాడుక భాషల మిశ్రమం గా ఉంటుంది. ఈ పుస్తకం లోని చిత్రకారునిచే గీయబడిన చిత్రాలు, కృతిమ మేథస్సు తో పొందుపరిచిన చిత్రాలు చాలా మందిని ఆకర్షించాయి.సంత్ సేవాలాల్ మహారాజ్ వారి జీవిత విశేషాలపై పరిశోధనలు చేసే వారికి అనుగుణంగా రిఫెరెన్స్ లు పేర్కొనబడినవి.

రచన నేపథ్యం

[మార్చు]

పవిత్ర గ్రంథమైన భగవద్గీతను గోర్ బోలి బంజారా భాషలో గోర్ బంజారా భగవద్గీత సంగీత రూపకం ద్వారా ఎ.యస్.యన్.మూర్తి ప్రాచుర్యం కల్పిస్తున్నారు., ఈ విధంగా బంజారా సంస్కృతి పై అవగాహన గల ఎ.యస్. యన్. మూర్తి "సేవాగడ్ టు పోహరా గడ్" పుస్తక రచన చేశారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున కొర్రా జగన్నాథరావు పోత్సాహంతో ఈ పుస్తకాన్ని ట్రస్ట్ వారు ప్రచారించారు.

అనువాదం

[మార్చు]

సేవాగడ్ టు పోహారాగడ్ అనే ఆంగ్ల గ్రంథాన్ని వివిధ భాషలలోనికి అనువదించుటకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఉదాహరణ

[మార్చు]

లిపిలేని కారణం గా , బంజారా సంస్కృతి జానపద గేయాలు ,మౌఖిక సంప్రదాయాలు, జానపద కథనాల మీద ఆధారపడి ఉంటుంది. వాటి నుండి విషయాలు స్వీకరించడం వలన, సహజంగానే అర్థవివరణ ధృవీకరణకు సంబంధించిన సవాళ్లు ఉంటాయి. రచయిత అనేక పరిశోధనా ప్రచురణలు, పుస్తకాలు, పత్రాలు, చారిత్రక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పొందికను కొనసాగించడానికి తన తార్కిక వ్యాఖ్యాన విధానం ద్వారా వ్యత్యాసాలను తగ్గించారు.

మూలాలు

[మార్చు]
  1. Nestham, Vaasthava (2025-01-13). "Sevaalaal Maharaj : ఆంగ్ల భాషలో సంత్ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్ర పుస్తకం". Vaasthava Nestham (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2025-01-14. Retrieved 2025-02-07.
  2. "The Hans India ePaper, English News Paper, Today Newspaper, Online News Epaper". epaper.thehansindia.com. Retrieved 2025-02-07.
  3. "సేవాగడ్ టు పోహారాగడ్ పుస్తక ఆవిష్కరణ". 2025-02-09. Retrieved 2025-02-09.