Jump to content

సేవాలాల్ దీక్ష

వికీపీడియా నుండి
సంత్ సేవాలాల్ దీక్ష
సంకేతాక్షరంS D ( Sevalal Diksha )
స్థాపన1992 (దీక్షగురు ప్రేమ్ సింగ్ మహారాజ్)
కార్యస్థానం
సేవలు‌ సేవలు,మాలధారణ
భోగ్ భండారో వేడుకలు
పద్ధతిsకఠోర ఉపవాస నియమాలు
రంగంsబంజారా తాండలో
ముఖ్యమైన వ్యక్తులుప్రేమ్ సింగ్ మహారాజ్ , మోతీరామ్ మహారాజ్
వేర్పాటులుమహాశివరాత్రి నుండి శ్రీ రామనవమి వరకు (41 రోజులు)
నినాదంజై సేవాలాల్, జై జై సేవాలాల్ .

సంత్ సేవాలాల్ దీక్ష తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్ మండలంలోని కొత్తపల్లి - హెచ్, లో సంత్ సేవాలాల్ మహరాజ్ దీక్షగురు ప్రేమ్ సింగ్ మహారాజ్ మహాశివరాత్రి రోజున 1992లో కొత్తపల్లి దీక్షభూమిలో సేవాలాల్ దీక్ష ను ప్రారంభించారు.ఈ 41 రోజుల సేవాలాల్ దీక్ష మహాశివరాత్రి పర్వదినాన్న ప్రారంభమై శ్రీరామనవమి రోజున ముగిస్తుంది.[1][2][3]

పోహ్రాదేవికి పాదయాత్రగా వేళ్ళుతున్న సేవాలాల్ దీక్ష దళం

సేవాలాల్ దీక్ష

[మార్చు]

భక్తులు సేవాలాల్ దీక్ష 41 రోజులు పాటు సేవాలాల్ దీక్షలో ఉంటారు. సేవాలాల్ దీక్ష గురు సంత్ ప్రేమ్ సింగ్ మహారాజ్ మొట్ట మొదటి సారిగా సేవాలాల్ దీక్షను దీక్షభూమి కొత్తపల్లి నుండి 1992‌లో ప్రారంభించారు.[4] దీక్షభూమి కొత్తపల్లి నుండి పౌరాగడ్ కు "సేవాదళ్" పేరుతో సుమారు యాభైవేల పైగా భక్తులను కాలినడకన ప్రేమ్ సింగ్ మహారాజ్ పౌరాదేవికి తీసుకొని వెళ్ళటం గొప్ప విషయం.అప్పటి నుండి ప్రతి సంవత్సరం భక్తులు దీక్ష భూమిలో దీక్ష తీసుకొని పౌరాదేవి వెళ్తుతుంటారు. శ్రీరామనవమి వరకు బంజారా తాండలో ఎటు చూసినా సేవాలాల్ దీక్షలు వీనులవిందు చేసే జై సేవాలాల్ నామస్మరణలు.. చల్లటి నీటితో చన్నీటి స్నానం,నేలమీద శయనం, నిరాడంబర జీవనం,గులాబీ వస్త్రాలతో శాంతస్వరూపంతో సేవాలాల్ భక్తులు.బంజారాల కాశీ మహారాష్ట్ర లోని పౌరాఘడ్ లో కొలువైవున్న బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జగదాంబ దేవిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి, ఇతర దేశాల నుంచి గోర్ బంజారా భక్తులు తరలి వెళ్తారు.[5]

దీక్ష నియమాలు

[మార్చు]

సేవాలాల్ దీక్ష సమయంలో భక్తులు మాదకద్రవ్యాలు సేవించడం గాని అబద్ధాలు మాట్లాడడం గాని,అపకారాలు తలపెట్టే విధంగా కుట్రలు పన్నడం,దూషించడం, చెడు ఆలోచనలు పెట్టుకోవడం గాని ‌చేయరు.భక్తులు స్వయంగా తయారు చేసిన వంటకాలు మాత్రమే భుజిస్తారు. అంటు ముట్టు ఐనా పానియాలు సేవించరు.ఈ కార్యక్రమం మహాశివరాత్రి పర్వదినాన మొదలుకోని శ్రీరామనవమి వరకు కొనసాగుతుంది.భక్తులు పౌరదేవికి వేళ్ళి శ్రీ రామనవమి రోజున మాతకు భక్తులు కానుకలు సమర్పించి మొక్కు చెల్లించి సేవాలాల్ దీక్షలు విరమిస్తారు.ఈ విధంగా మహారాజ్ ప్రజలు జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం గమనార్హం.సేవాలాల్ భక్తులు స్త్రీ, పురుషులు 41రోజులు దీక్షలో ఉంటారు.

దీక్ష ప్రారంభించెటప్పుడు తెల్లని ధోవతిలు, లుంగీలు,ప్యాంటులు తొడిగి గులాబీ రంగు చొక్కలు, కమీజులు ధరించి నియమ నిష్ఠలతో నలభై ఒక్క రోజులు కఠిన దీక్షకు పూనుకుంటారు. చన్నీటిస్నానం పాదరక్షలు వదిలేయడం,బ్రహ్మచర్యం లాంటి నియమాలతో ఆధ్యాత్మిక చింతన మొదలవుతుంది. తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయటంవలన మనోచైతన్యం కలుగుతుంది. మంచి మార్గానికి మళ్లించే జీవనం మొదలై ప్రశాంతత, ఏకాగ్రత కలుగుతాయి. చెడు వ్యసనాలకు దూరమై రెండు పూటలా స్నానం చేసి దుస్తులు మార్చడం ద్వారా పరిశుభ్రత అలవడుతుంది.సాముహికంగా పూజలు భక్తి శ్రద్ధలతో భజన,కీర్తనలు చేసి ఉదయం,సాయంత్రం హారతి పాడుతారు.

హారతి

[మార్చు]
హారతి పాడుతున్న సేవాలాల్ భక్తులు
  • శ్రీ సేవాదాస్ మహారాజ్ హారతి

జయ జయ సేవాదాస్ అంబర్ తారొ బోల్ హువో

గోర సమాజేరొ కిదో ఉదార శంకరేరో అవతార్

ఝాపా,సూర,ధాను వెన |

చౌతో అయో అవతార ||జయ జయ సేవాదాస్||


తోళరామ్ హుబో సమోర|

సాండేరి ధునకార |

జ్యోతి బాబా బణో పుజారి |

శంకరేరి లలకార్ ||జయ జయ సేవాదాస్||

హాపా,బద్దు శోబత్ లేన |

పూరా,బంధు ఛ బలవాన |

భమియారితో గర్దన్ తోడో |

లాకో కరో పరిణామ్ ||జయ జయ సేవాదాస్||

చంద్ర సూరజేరి జ్యోతలగావు ।

దోష కరో నికాల్ | || జయ జయ సేవాదాస్||

తన మన ధనేరి బోలు అరతి ।

ధర్మజేరి ఛ ఆశ |

హత్ జోడన కరు వినంతి ।

దార్ హుబే తార దాస్ || జయ జయ సేవాదాస్||

భవ సాగరేతి లెజో తు పార |

తారే బినా కెరి ఛేఇన అధార |

కవి మానిక్లావ్ లకు అరతి |

హాత లగాద యెమ దెద అధార ||జయ జయ సేవాదాస్||


  • సేవాదాస్ చరణ్

________________________________

సారి జగేరో రక్త హరతా ధాతా శంకర్ సేవాదాస్ |

తన్ మన్ ధనేతి లిలా గావు రాఖో మారి లాజ |

గుతి బళ్ళారామి జల్మ లిదో |

పాలేరో ఛ సవార |

జగదంబారి భక్తి కిదో జయ జయ సేవాలాల |

మిండా బదల్ వెగి లడాయి | వాజా రణభేరి |

భమ్యారాతొ మాతొ తొడే సేవా అవతారి ॥

సేవాలాల్ మహారాజ్ కీ జై


  • శ్రీ జగదాంబ దేవి హారతి

జయ జయ జగదంబ

సెవక తారె దార్ హుబె

అష్ట భుజారి మాతా సగుణి

అజో వాగేపర్ బేసతాణి

ప్యాసే ఛా భక్తున పరాజో పాణి

తన మన ధనేతి ఛ వీణవాణి

॥జయ జయ జగదాంబ॥'


భక్తురి తు మాతా జనని

తారె బినా యాడి పాన హలేని

త్రిభువనేరి తారి రాజధాని

తోన హక మారచ ఋషి మూని

॥జయ జయ జగదాంబ॥


తు జగేరి పాలన కర్త

తుజ మాతా యాడి తూజ పితా

చారి ఖండేమా తారీ ఛ సతా

తారె నామేరో హమ వాచాచా గాతా

॥జయ జయ జగదాంబ॥


భక్తు పరియా రకాడ పంజా

తారే నామేరో వజావా వాజా

తారీ భక్తిమ భారి ఛ మజా

జల్మె జల్మెరో తుటచ సజా

॥జయ జయ జగదాంబ॥


జగత్ జనని మాతా జగేరి

నావ లంగాద యాడి తారే గొరురీ

పాపిన మారి తు సత్యేన తారి

కవి మానిక్వ్ మార తుకారి

॥జయ జయ జగదాంబ॥

భవ సాగరేతి లెజో తు పార

తారే బినా కెరి ఛేని అధార

కవి మానిక్ రావ్ లకు అరతి

హాత లగాద యెమ దెద ఆధార

'॥జయ జయ జగదాంబ॥


  • రామారావు మహారాజ్ హారతి

ఓం జయ గురు రామరాయా ।

స్వామి జయ గురు రామరాయా |

తన మన ధన ఒవాళు |

సిర మేలు తారే పాయా || ఓం జయ||

నిష్కామ కర్మయోగి నిరహార మూర్తి

శక్తిశాలి సగుణా |

సాబతేమ భగవతి ||ఓం జయ ||

తుజ యాడి, భేన భాయి ।

తుజ పీతా బందు |

పాలన హీర హమారో ।

తూ ఛీ కృష్ణా సింధూ|| ఓం జయ||

దిన దుఃఖి తొన హాక మారచ ।

సేరొ కరేచి కామ ।

జగ సారి గుణ గావచ |

సెరే ముఖి తారొ నామ||ఓం జయ॥

కరుణ విధి దయాభవ |

చరణ లాగేతి తారో |

ఆశీర్వాదం ఏమి శక్తి |

పాప మిట జల మేరో || ఓం జయ||

జయ శివ కైలాసవతి |

నేమి తారో గావా గుణ |

గోరుర కుల గురు ఛి |

లగా అచే మార్గాన ||ఓం జయ||

బాలక ప్రేమసింగేరి |

ఆర్థి ఛ అయివాళా |

తారె బినా కుణ బచాయ |

మత ఖాయెన టాళా ||ఓం జయ||

హుబో భికారి దారేవ తారో

ఛోరా మానికరావ |

జలమో జలమీ ఘడేద

తారి భక్తిరో డావ ||ఓం జయ||


  • శ్రీ ప్రేమ్ సింగ్ మహారాజ్ హారతి


సద్గురు హమారో పామణో రేవాళో

అజెరో దాడో సోనే సరికో మళో

కరతాణి వాసనా శుద్ద మనేరి

ఒవాళు ఆరతి గురు ప్రేమ్ సింగేరి


పాణి లాతాణీ టాంగే ధోరోచు

శుద్ధ వస్ర్తేతి పద్మ లురోచు

హమారే మాతేప పగ పడేద తారి

ఒవాళు ఆరతి గురు ప్రేమ్ సింగేరి


పూర్ణ భావేతి లగావు గంధ

మన శాంతి రకాడే వాళో ఆనంద

జనా గురు ఆత్మా శాంతి వియతారి

ఒవాళు ఆరతి గురు ప్రేమ్ సింగేరి


సత్యా భావేతి బలాయో ఘర

బ్రహ్మ రూప కిదో కృపా గురు దేవేరి

సంసారేమ ప్రకాశ్ పాడో సూర్యారి

ఒవాళు ఆరతి గురు ప్రేమ్ సింగేరి


బస్మ లగాయో గురు భక్తి  మార్గేమా

దహే అర్పణ శ్రీ గురుర పగేమా

సదా శాంతి రకాడ ప్రార్థన భక్తురి

ఒవాళు ఆరతి గురు ప్రేమ్ సింగేరి


ఘాలు గళహర శుబుద్ధీ ఫూలేర

వజాళో పడో జసో సూర్యారో

దేకు కేన లాగ మూర్తి గురు దేవేరి

ఒవాళు ఆరతి గురు ప్రేమ్ సింగేరి


కామ క్రోద దివో బాళు ఆరతి

తేజ జ్ఞాని దికాయో గురు కృపాతి

పదార్థ దుగురున శుద్ధ భోజనేరి

ఒవాళు ఆరతి గురు ప్రేమ్ సింగేరి


హత జోడ వినంతీ గురు దేవేన

సదా తారి హమేపర రేదేశ ధ్యాన

బార బార వినంతీ సేవా దళేరి

ఒవాళు ఆరతి గురు ప్రేమ్ సింగేరి

(గాయకుడు మానిక్ రావ్ మహారాజ్ సిర్పల్లి తాండ కుబీర్)


  • శ్రీ సామకా యాడిర్ హారతి

యోగి రూపి తు సత్య వచని|

తుకారామేర ఘర అతాణీ |

ప్రసన్నకిది ఉ మాతా సగుణీ ।

సేవాబాపురో నామ లేతాణీ |

జయదేవి జయదేవి జయ సానుకి మాతా |

సత్యవచని పతి ఛ జెతా| ॥జయదేవి॥


గరిబ పితా తుకారమేర |

ఘర అయో ఓరో అవతార |

గోర సమాజేరో కిది ఉదార |

జగెరెసారు ఓరో అవతార | ॥జయదేవి॥


డెరామ ధూడ నాకెన చలిగి |

సేవాబాపున వాత కళగి |

సగాయి కిదో సేవాలాల్ యోగిక్ష్మీ।

తుకారామ ఛ గరిబ రోగి| ॥జయదేవి॥

దేవి రుపేమ జల్మేన అయి |

తిన ముట్టిమ వరాద ఖరాయి ।

లాఖో లోకుమ ఇజ్ఞత బచాయి।

అమరవేగి ఉ జగేరెమాయి | ॥జయదేవి॥


జెతాలాల్ ఘణో కిదో అడి|

కువార కెల్దిరో దుద ఉకాడి |

ప్రభు భాయారో భోగ లగాడి ।

గొరమాటిరో ధర్మ జగాడి | ॥జయదేవి॥


రామచందెన దుఃఖెమ బచాయి|

సరాణియామ సొనొ వతాయి|

ఉచె శిఖరెరో కళస లగాయి ।

గావ మానిక్ రావ్అరతి మాయి| ‌ ॥జయదేవి॥

శాస్త్రీయత

[మార్చు]

దీక్ష వెనుక దాగి ఉన్న శాస్త్రీయత ఏడాదికి సుమారుగా 360 రోజులు దానిని తొమ్మిదితో భాగించగా వచ్చేది నలభై ఆ నలభై రోజులు కఠిన నియమాలను అవలంభిస్తే, అది మిగిలిన జీవితానికి ఆదర్శ వంతంగా నిలుస్తుంది. నియంత్రణ,అలవడతాయి. నిరాడంబర జీవితం ప్రారంభమవుతుంది. సకల జీవుల్లో దేవుడున్నాడనే భావనతో ఆధ్యాత్మిక చింతనే శాశ్వతమన్న నమ్మకంతో...భక్తులు అందరిలో దైవాన్నే చూస్తారు.ఆధ్యాత్మికతను పెంచి ఆరోగ్యాన్ని సంరక్షించే నియమాలను అవలంభించాక, ఇంకా ఆ సద్భావనలను జీవన పర్యంతం ఆచరించాలి.

మూలాలు

[మార్చు]
  1. "సేవాలాల్ దీక్ష స్వీకరించిన తండావాసులు". EENADU. Retrieved 2025-03-25.
  2. "అందరి బంధువు.. సేవాలాల్‌ | - | Sakshi". www.sakshi.com. Retrieved 2025-02-26.
  3. telugu, NT News (2023-02-19). "తండాల్లో ఆధ్యాత్మిక సందడి". www.ntnews.com. Retrieved 2025-02-26.
  4. Nestham, Vaasthava (2024-01-11). "దీక్షభూమి కొత్తపల్లిలో 45 వ గురు కృప దినోత్సవం." Vaasthava Nestham (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2025-02-26. Retrieved 2025-02-26.
  5. Today, Telangana (2021-02-21). "The journey and life of Sant Sri Sevalal Maharaj". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2025-02-26.