సేవై

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

సేవై (Sevai) లేదా సంతకై అనేది ఒక రకమైన బియ్యంతో తయారుచేసే నూడిల్స్ వంటకం. దక్షిణ భారతదేశంలో, ప్రత్యేకించి తమిళనాడు (కొంగునాడు ప్రాంతం) మరియు కర్ణాటకల్లో ఇది అత్యంత ప్రసిద్ధం. సంతకై అనేది కేవలం బియ్యంతో మాత్రమే కాకుండా, గోధుమ, రాగి మొదలగు ఇతర ఆహార ధాన్యాలతోనూ తయారు చేస్తారు మరియు ఈ రూపాల్లోనూ ఇది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

అదే సమయంలో సేవై/సంతకై అనేది అదే రకమైన వంటకమైన ఇడియాప్పం నుంచి పూర్తి వైవిధ్యం ప్రదర్శిస్తుంది. తయారీ పదార్థం, తయారీ విధానం మరియు వెలుపలకు వచ్చిన తర్వాత పదార్థాల విషయంలో వీటి మధ్య ఈ రకమైన వైవిధ్యం గోచరిస్తుంది. సేవై అనేది అల్ఫాహారం/రాత్రి భోజనంగా ప్రసిద్ధమైనది. దీని తయారీలో నూనె తక్కువగా ఉపయోగించడం లేదా పూర్తిగా ఉపయోగించకపోవడంతో పాటు ఆవిరి పట్టడం ద్వారా దీన్ని తయారు చేయడం వల్ల దీన్ని తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారంగా పరిగణిస్తారు.

తాజాగా తయారుచేసిన సేవై

సేవై తయారీవిధానం[మార్చు]

సేవై/సంతకైని చాలావరకు బియ్యం సంబంధిత ధాన్యాలు నుంచి తాజాగా తయారు చేస్తుంటారు. అలాగే ఆసియా కిరాణా స్టోర్లలో లభ్యమయ్యే ఎండబెట్టిన సేవై ప్యాకెట్లు (లేదా బియ్యం పిండితో చేసిన పుల్లల వంటి సేమియా) లాంటి తక్షణం తయారీకి ఉపయోగపడే వాటితో కూడా తయారు చేస్తుంటారు. సంప్రదాయకంగా, సేవైని ఇంట్లో తయారుచేసే ప్రక్రియలో కింది దశలు ఉంటాయి (ప్రదేశం మరియు కుంటుంబ ఆచారాలను అనుసరించి ఈ విధానాల్లో చిన్నపాటి విభిన్నతలు కనిపిస్తాయి) :

  • ఉప్పుడు బియ్యాన్ని చల్లని నీటిలో 3 గంటలపాటు నానబెట్టడం
  • నానబెట్టిన బియ్యాన్ని వెట్ గ్రైండర్ సాయంతో చక్కగా పిండి రూపంలో రుబ్బడం
  • ఈ రుబ్బిన పిండి నుంచి కుడుములు తయారు చేసి, వాటిని ఆవిరిపై ఉడికించడం (ఈ దశలో కనీసం మూడు రకాల వైవిధ్యాలు గోచరిస్తాయి)
    • రుబ్బిన పిండిని వేయించడం ద్వారా చపాతీ పిండి రూపంలోకి మార్చడం, అటుపై దీనితో కుడుములు (కొలుకట్టై అని కూడా పిలుస్తారు) తయారుచేసి వాటిని ఇడ్లీ పాత్రలో ఉడికించడం
    • రుబ్బిన పిండిని పలుచగా చేసి ఇడ్లీ పాత్రలోని గుంతల్లో పోసి ఆవిరిపట్టడం
    • పిండిని వేయించి చపాతీ పిండి రూపంలోకి మార్చడం, అటుపై దాన్ని కుడుములుగా చేసి వాటిని వేడి నీటిలో వేసి బాగా ఉడికించడం
  • చివరగా సేవై ప్రెస్ సాధనాన్ని ఉపయోగించి ఉడికించిన కుడుములను ఒత్తడం ద్వారా సన్నని సేమియాల రూపంలో తయారుచేయడం

సేవై మిశ్రణం[మార్చు]

ఇంట్లో తయారైన సేవై చాలావరకు 100% బియ్యం (నీరు, ఉప్పు కలుపబడి ఉంటుంది) తో తయారవుతుంది. అదేసమయంలో ఎండించిన బియ్యం పిండి సేమియాల్లో మాత్రం చాలా తరచుగా టపియోకా, కార్న్ పిండి లాంటివి కలపబడి ఉంటాయి.

అలాగే తక్షణ తయారీకి ఉపయోగించే బియ్యం నూడిల్స్‌లో గోధుమ పిండి, గార్ జిగురు, వంటకు ఉపయోగించే స్టార్చ్ లాంటివి కలపబడి ఉంటాయి.

సేవైకి సంబంధించిన ఇతర పేర్లు[మార్చు]

తమిళనాడులోని పశ్చిమ ప్రాంతాల్లో సేవైని సంతకై అని పిలుస్తారు. కన్నడంలో దీన్ని 'సవిగే' అని పిలుస్తారు. మరోవైపు సేవై, ఇడియాప్పం అనేవి అనేక అంశాల్లో విభిన్నమైనవి అయినప్పటికీ, చాలామంది సేవై గురించి చెప్పేందుకు ఇడియాప్పం మరియు సేమియా (వెర్మిసెల్లి) పదాలను అత్యంత తరచుగా ఉపయోగిస్తుంటారు. తమిళంలో దీన్ని சந்தகை, சந்தவம், சந்தவை అని రాస్తారు.

సేవైతో తయారుచేసే వంటకాలు[మార్చు]

చింతపండు పులుసు.నిమ్మ పులుసు & కొబ్బరితో కలిపిన సేవై

సేవైని చాలావరకు నిమ్మ పులుసు, చింతపండు పులుసు, టమోటో, కొబ్బరి, పెరుగు లాంటి వాటితో కలిపి వంటకాలుగా తయారుచేస్తుంటారు. వెడిగా ఉన్నప్పుడే వడ్డిస్తే సేవై రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. మరోవైపు మామూలు సేవైతో పాటుగా తియ్యగా ఉండే కొబ్బరి పాలు, అరటి చక్కెర మరియు నెయ్యి, మోర్-కులంబు (పెరుగు పచ్చడి), వివిధ రకాల కూరగాయల కుర్మాలు మరియు మటన్/చికెన్/చేప కుర్మా లాంటివి కలిపి వడ్డిస్తుంటారు.

సేవై ప్రెస్[మార్చు]

సేవై తయారీలో ఉపయోగించే సేవై ప్రెస్‌లలోని కొన్ని రకాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి

ఇవి కూడా చూడండి[మార్చు]

మూస:Indian Dishes

"https://te.wikipedia.org/w/index.php?title=సేవై&oldid=2208508" నుండి వెలికితీశారు