సైక్లోస్టైల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cyclostyle.jpg

సైక్లోస్టైల్ ఒకరకమైన ప్రింటింగ్ యంత్రం లాంటిది. దీనిని దేవిడ్ జెస్టనర్ 1880కనుగొన్నారు. సైక్లోస్టైల్ చెయ్యడానికి స్టెన్సిల్ పేపరు, సైక్లోస్టైల్ యంత్రం, స్టెన్సిల్ సిర (ఇంక్), ప్రత్యేకమైన సైక్లోస్టైల్ కు అనువైన తెల్ల కాగితాలు అవసరం.

స్టెన్సిల్ పేపరు[మార్చు]

స్టెన్సిల్ కాగితం 3 కాగితాలతో కూర్చి ఉంటుంది. మెదటిది ఉల్లిపొర కాగితం, రెండెవది కార్బన్ పేపర్, మూడవది మాములు కాగితం. స్టెన్సిల్ బోర్డును కార్బన్ కాగితం మీద పెట్టి ఉల్లిపొర కాగితం పై వ్రాయాలి. అప్పుడు స్టెన్సిల్ కాగితం కత్తిరించబడుతుంది.

సైక్లోస్టైల్ యంత్రం[మార్చు]

ఈ యంత్రం మీద స్టెన్సిల్ పేపరు పెట్టి, స్టెన్సిల్ సిర పోయవలసిన ప్రదేశంలో సిర పోయాలి, తెల్ల కాగితాలు ఉండవలసిన స్థలంలో ఉంచి యంత్రం చక్రాన్ని త్రిప్పాలి. ఆప్పుడు కావలసినన్ని ప్రతులు తయారు అవుతాయి.