సైనికుడు (జవాన్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒక దేశ భూభాగాన్ని పరిరక్షించడం కోసం ఆ దేశ రక్షణ బళం తరపున నియమించబడిన వ్యక్తిని సైనికుడు అంటారు. ఇతని నియామకం అతని యొక్క శక్తి సామర్ధ్యాలపై అధికారులు నిర్వహించే వివిధ పరీక్షలపై ఆధారపడి ఉంటుంది. సైనికుడు దేశ సరిహద్దు వద్ద కాపలా ఉంటూ చోరబాటు దారులను అడ్డుకుంటారు. భారతదేశంలో బ్రిటీష్ వారి తరపున పని చేసిన సైనికులను సిపాయిలు అంటారు.

సైనికుడిని ఇంగ్లీషులో Soldier అంటారు. Soldier అనే పదం sou లేదా soud, shilling అనే పదాల నుండి వచ్చింది. shilling అంటే బ్రిటిష్ పౌండులో 20 వ వంతు విలువగల ద్రవ్య నాణెము. సైనికులకు షిల్లింగ్ ను వేతనంగా ఇవ్వటం, లాటిన్ పదం soldarius అనగా ఒకరికి వేతనాన్ని (బైజాంటైన్ సామ్రాజ్యం లో ఉపయోగించిన ఒక పురాతన రోమన్ నాణెం పేరు solidus) చెల్లించడం అనే పదాల నుండి 14వ శతాబ్దంలో ఆధునిక ఆంగ్ల భాషా పదమైన Soldier అనే పదం ఏర్పడింది.

గౌరవనీయమైన వృత్తి[మార్చు]

ఒక దేశ భూభాగాన్ని కాపాడుట కోసం ఆ దేశంలో ఉన్న సైనికులు దేశాన్ని దేశ ప్రజలని అహర్నిశలు కాపాడుతూ దేశ రక్షణలో తమ ప్రాణాలను సైతం అర్పిస్తారు. అలాంటి మహోన్నత మైన వృత్తి కేవలం ఒక సైనికుడు మాత్రమే.

ఇవి కూడా చూడండి[మార్చు]

సిపాయి

భారత సైనిక దళం

రక్షకులు

బయటి లింకులు[మార్చు]