సైన్యంలో మహిళలు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
గత 3,000 ఏళ్ళగా వివిధ సంస్కృతుల్లోనూ, దేశాల్లోనూ స్త్రీలు సైన్యాలలో పలు విధాలుగా ఎన్నో పాత్రలు పోషించారు. ప్రపంచంలోని దాదాపు అన్ని సంస్కృతుల్లోనూ పురుషులే ప్రధానంగా యుద్ధాలలో పాల్గొంటున్నా, ప్రాచీన మహిళా యోధుల నుంచీ ప్రస్తుతం సైన్యాల్లో పని చేస్తున్న మహిళల దాకా ఎన్నో రకాలుగా యుద్ధాల్లో పాల్గొన్న వారు ఉన్నారు.
సైన్యాల్లో వివిధ హోదాల్లో, పలు శాఖల్లో స్త్రీలు పనిచేస్తున్నారు. కానీ చరిత్రలో చాలా తక్కువ మంది స్త్రీలు, పురుషులతో పాటు యుద్దాలలో పాల్గొన్నారు. యుద్ధం చేయడం కోసం అమెరికన్ సివిల్ వార్ లో కొంత మంది స్త్రీలు, మగవారి వలే వస్త్రధారణ చేసుకున్నవారున్నారు. యుద్ధంలో ముఖాముఖీ పోరాటాల్లో పాల్గొనడం ద్వారానే కాక, వేరే రకంగా సహాయం కూడా చేశారు మహిళలు. చాలా మంది స్త్రీలు సహాయకులుగానూ, నర్సులుగానూ పని చేశారు.