సైబరాబాద్ నగరపాలక సంస్థ
| గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ | |
|---|---|
| రకం | |
| రకం | నగర పాలక సంస్థ |
| చరిత్ర | |
| స్థాపితం | 2026 ఫిబ్రవరి 11 |
| నాయకత్వం | |
మున్సిపల్ కమీషనర్ | జి.సృజన (ఐ.ఎ.ఎస్) |
| నిర్మాణం | |
| సీట్లు | 76 డివిజన్లు |
రాజకీయ వర్గాలు | |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
| సమావేశ స్థలం | |
| నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్, హైటెక్స్, మాదాపూర్ | |
జీహెచ్‌ఎంసీ చట్టం-1955, సెక్షన్-3(1) ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)తో పాటు సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజ్‌గిరి మునిసిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)గా మూడు నగర పాలక సంస్థలుగా విభజిస్తూ 2026 ఫిబ్రవరి 11న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1] జీహెచ్‌ఎంసీని మొత్తం 6 జోన్‌లుగా (శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్)గా, 30 సర్కిళ్లు, 150 డివిజన్లుగా విభజించారు. సైబరాబాద్ కార్పొరేషన్‌లో మూడు జోన్‌లుగా (శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్), 76 డివిజన్లు ఉన్నాయి. మల్కాజ్‌గిరి కార్పొరేషన్‌లో మూడు జోన్‌లుగా (మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్‌బీనగర్), 74 డివిజన్లు ఉన్నాయి.
కార్యాలయం
[మార్చు]సైబరాబాద్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం మాదాపూర్‌లోని హైటెక్స్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది.[2]
మూడు కార్పొరేషన్లకు కలిపి ప్రత్యేక అధికారిగా నియమితులైన జయేశ్ రంజన్ ఫిబ్రవరి 11న బాధ్యతలు స్వీకరించాడు. సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్‌గా జి.సృజన ఫిబ్రవరి 11న బాధ్యతలు చేపట్టింది.[3][4]
పరిపాలనా వ్యవస్థ
[మార్చు]సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తాన్ని 6 జోన్‌లుగా (మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్‌బీనగర్), 16 సర్కిల్‌లుగా, 76 వార్డులుగా విభజించారు. కమిషనరు, మహానగర పాలక మండలికి సర్వాధికారి. రాష్ట్ర ప్రభుత్వం, ఐఎఎస్ అధికారిని ఈ పదవిలో నియమిస్తుంది. ప్రతీ జోనుకూ ఒక జోనల్ కమిషనరు ఉంటారు. ప్రతి సర్కిలుకూ ఒక అదనపు కమిషనరు నేతృత్వం వహిస్తారు. ఇంజనీరింగు శాఖకు ఇంజనీరింగ్ ఇన్ ఛీఫ్, చీఫ్ ఇంజనీరు అధిపతులుగా ఉంటారు. ఈ శాఖ కింద ప్రతి జోనుకూ ఒక ఎస్.ఇ ఉంటారు. పట్టణ ప్రణాళికా విభాగానికి నేతలుగా అదనపు కమిషనరు (ప్రణాళిక), ఛీఫ్ సిటీ ప్లానరు ఉంటారు. ఈ శాఖ కింద ప్రతి జోనుకూ ఒక సిటీ ప్లానరు ఉంటారు.
సీఎంసీ పరిధి
[మార్చు]పాత జీహెచ్‌ఎంసీలోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్లలో విలీనమైన మణికొండ, నార్సింగి, తెల్లాపూర్, అమీన్‌పూర్, బొల్లారం, నిజాంపేట్, దుండిగల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, మేడ్చల్ పట్టణ స్థానిక సంస్థలు కలిశాయి. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) ఏర్పాటు చేశారు.
శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలు పూర్తిగా, పటాన్‌చెరు, కూకట్‌పల్లి, మేడ్చల్, రాజేంద్రనగర్ నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి.[5][6]
జోన్‌లు
[మార్చు]సైబరాబాద్‌లో 3 జోన్‌లు, 16 సర్కిల్‌లు ఉంటాయి.[7][8]
- శేరిలింగంపల్లి జోన్: నార్సింగి, పటాన్‌చెరు, అమీన్‌పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి
- కూకట్‌పల్లి జోన్: మాదాపూర్, ఆల్విన్ కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట్
- కుత్బుల్లాపూర్ జోన్: చింతల్, జీడిమెట్ల, కొంపల్లి, గాజులరామారం, నిజాంపేట్, దుండిగల్, మేడ్చల్
మూలాలు
[మార్చు]- ↑ "హైదరాబాద్: మూడు ముక్కలుగా మహానగరం". BBC News తెలుగు. 11 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
- ↑ "GHMC split into 3: Cyberabad, Malkajgiri new corporations". The Times of India. 12 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
- ↑ "GHMC Reorganization: Commissioners take charge of 3 newly formed Hyderabad civic bodies" (in ఇంగ్లీష్). Telangana Today. 11 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
- ↑ "Cyberabad Municipal Corporation Commissioner takes charge" (in Indian English). The Hindu. 11 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
- ↑ "జీహెచ్‌ఎంసీలో నూతన అధ్యాయం.. 3 కార్పొరేషన్లుగా GHMC, ఏ ప్రాంతం ఏ పరిధిలోకి వస్తుందంటే." ABP Desam. 11 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
- ↑ "Telangana: Reorganised Greater Hyderabad Municipal Corporation split into three civic bodies" (in Indian English). The Hindu. 11 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
- ↑ "మూడు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్.. మీ ఏరియా ఏ జోన్ కిందకు వస్తుందో ఇక్కడ చూడండి?". Hindustan Times. 11 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
- ↑ "మహానగరం.. 3 కార్పొరేషన్లు". Sakshi. 12 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.