సైమా పురస్కారాలు
| సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు | |
|---|---|
![]() | |
| Awarded for | దక్షిణ భారత సినిమా, సంగీతం లో శ్రేష్ఠత |
| Location | బహుళ స్థానాలు |
| దేశం | భారతదేశం |
| అందజేసినవారు | విబ్రీ మీడియా గ్రూప్ |
| Established | 2012 |
| మొదటి బహుమతి | 21–22 జూన్ 2012 |
| Last awarded | 15–16 ఆగస్టు 2019 |
| వెబ్సైట్ | సైమా.ఇన్ |
| Television/radio coverage | |
| Networks | |
సైమా పురస్కారాలు అని పిలవబడే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా పురస్కారాలు), దక్షిణ భారత చిత్ర పరిశ్రమ కళాత్మక, సాంకేతిక విజయాలకు ప్రతిఫలంగా లభించే పురస్కారాలు.[1]
ఈ వేడుకను సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకుడు విష్ణువర్ధన్ ఇందూరి 2012 లో స్థాపించాడు. అడుసుమిల్లి బృందా ప్రసాద్ దీనికి చైర్‌పర్సన్. అవార్డులు రెండు రోజుల పాటు వేర్వేరు భాగాలలో ప్రదర్శించబడతాయి. మొదటి రోజు జనరేషన్ నెక్స్ట్ అవార్డులలో అత్యంత ఆశాజనకంగా రాబోయే దక్షిణ భారత చిత్ర కళాకారులను సత్కరిస్తారు. రెండవ రోజు ప్రధాన సిమా అవార్డులకు కేటాయించబడింది. అవార్డు నామినీలను సీనియర్ ఆర్టిస్టులు, నిపుణుల జ్యూరీ ఎంపిక చేస్తుంది. బహిరంగ పోలింగ్ ద్వారా ఓటు వేయబడుతుంది. మొదటి సైమా వేడుక 21 & 22 జూన్ 2012 న దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరిగింది. ఇది భారతదేశంలో ప్రముఖ వినోద అవార్డు వేడుకలలో ఒకటి.
లఘు చిత్రాల రూపకర్తలు, నటీనటులను ప్రోత్సహించే లక్ష్యంతో 2017లో సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రారంభించబడ్డాయి.[2] సెప్టెంబర్ 2017లో, ఈ అవార్డుల వేడుక కోసం ట్విట్టర్ వేదికపై ఒక ప్రత్యేకమైన ఎమోజీని విడుదల చేశారు.[3]
చరిత్ర
[మార్చు]సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ను 2012 లో విష్ణువర్ధన్ ఇందూరి ప్రారంభించాడు. దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలైన, తెలుగు సినిమా, తమిళ సినిమా, మలయాళ సినిమా, కన్నడ సినిమా నుండి వచ్చిన చిత్రనిర్మాతలను అభినందించి, దక్షిణ భారత చిత్రాలను అంతర్జాతీయ మార్కెట్లలో ప్రోత్సహించడానికి ఒక వేదికను అందించారు.[4]
జనవరి 2024లో, ఇన్వెనియో ఆరిజిన్ (Invenio Origin) సంస్థ సైమా, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL)లో గణనీయమైన వాటాను కొనుగోలు చేసి వ్యూహాత్మక భాగస్వామిగా చేరింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఈ వేడుకల స్థాయిని అంతర్జాతీయంగా మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో పాటు, ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అనే కొత్త మీడియా ఐపి ద్వారా OTT స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్ను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.[5]
ప్రధానోత్సవ వేడుకలు
[మార్చు]| సంఖ్య | తేదీ | వ్యాఖ్యాత(లు) | వేదిక | నగరం | దేశం | మూలాలు |
|---|---|---|---|---|---|---|
| మొదటి సైమా | 21–22 జూన్ 2012 | ఆర్. మాధవన్, మంచు లక్ష్మి, పార్వతి ఓమనకుట్టన్ | దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ | దుబాయ్ | [6] | |
| రెండవ సైమా | 12–13 సెప్టెంబర్ 2013 | శ్రియా శరణ్, రానా దగ్గుబాటి, సోనూ సూద్, పార్వతి ఓమనకుట్టన్, ఆష్ చాండ్లర్ | ఎక్స్పో సెంటర్ షార్జా | షార్జా | [7] | |
| మూడవ సైమా | 12–13 సెప్టెంబర్ 2014 | నవదీప్, శ్రద్ధా దాస్ (తెలుగు, శివ, పూజా రామచంద్రన్ (తమిళం) | స్టేడియం నెగారా | కౌలాలంపూర్ | [8] | |
| నాల్గవ సైమా | 6–7 ఆగస్టు 2015 | రానా దగ్గుబాటి, ఆలీ, శ్రీముఖి (తెలుగు)
శివ, సుచిత్ర (తమిళం) |
దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ | దుబాయ్ | [9] | |
| ఐదవ సైమా | 30 జూన్ – 1 జూలై 2016 | అల్లు శిరీష్, మంచు లక్ష్మి (తెలుగు) శివ, సతీష్, ధన్య బాలకృష్ణ (తమిళం)
రంజిని హరిదాస్ (మలయాళం) |
సన్ టెక్ కన్వెన్షన్ సెంటర్ | సింగపూర్ | [10] | |
| ఆరవ సైమా | 30 జూన్ – 1 జూలై 2017 | అల్లు శిరీష్, మంచు లక్ష్మి (తెలుగు) సతీష్, ధన్య బాలకృష్ణ (తమిళం) | అబుదాబి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ | అబుదాబి | [11] | |
| ఏడవ సైమా | 14–15 సెప్టెంబర్ 2018 | రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి పులికొండ, శ్రీముఖి (తెలుగు)
విజయ్ రాఘవేంద్ర, సంయుక్త హెగ్డే (కన్నడ) |
బాలీవుడ్ పార్క్స్ దుబాయ్ | దుబాయ్ | [12] | |
| ఎనిమిదవ సైమా | 15–16 ఆగస్టు 2019 | రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి పులికొండ, సుమ కనకాల (తెలుగు)
జనని అయ్యర్, మిర్చి శివ (తమిళం) విజయ్ రాఘవేంద్ర, అనుపమ గౌడ (కన్నడ) పెర్లే మానే (మలయాళం) |
లుసైల్ స్పోర్ట్స్ అరేనా | దోహా | [13] | |
| 9వ సైమా | 18–19 సెప్టెంబర్ 2021 | శ్రీముఖి, సందీప్ కిషన్ (తెలుగు) | హెచ్.ఐ.సి.సి. (HICC) | హైదరాబాద్ | [14] | |
| 10వ సైమా | 10–11 సెప్టెంబర్ 2022 | శ్రీముఖి, ఆలీ, సిద్ధూ జొన్నలగడ్డ (తెలుగు)
శివ, విజె రమ్య (తమిళం) అకుల్ బాలాజీ, సోనూ గౌడ (కన్నడ) ఆదిల్ ఇబ్రహీం, పెర్లే మానే (మలయాళం) |
ప్యాలెస్ గ్రౌండ్ | బెంగళూరు | [15] | |
| 11వ సైమా | 15–16 సెప్టెంబర్ 2023 | ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ (తెలుగు)
సతీష్, పవిత్ర లక్ష్మి (తమిళం) అకుల్ బాలాజీ, అనుపమ గౌడ (కన్నడ) గోవింద్ పద్మసూర్య (మలయాళం) |
దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ | దుబాయ్ | [16] | |
| 12వ సైమా | 14–15 సెప్టెంబర్ 2024 | సుడిగాలి సుధీర్, సిమ్రాన్ చౌదరి (తెలుగు)
సతీష్ (తమిళం) ఆదిల్ ఇబ్రహీం, పెర్లే మానే (మలయాళం) రిషి, శుభ్ర అయ్యప్ప (కన్నడ) |
దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ | దుబాయ్ | [17] | |
| 13వ సైమా | 5–6 సెప్టెంబర్ 2025 | సుడిగాలి సుధీర్, రూప కొడువాయూర్ (తెలుగు)
సతీష్ (తమిళం) గోవింద్ పద్మసూర్య (మలయాళం) రిషి, శుభ్ర అయ్యప్ప (కన్నడ) |
దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్ | దుబాయ్ | [18] |
అవార్డుల వివరాలు
[మార్చు]తెలుగు
[మార్చు]- ఉత్తమ చిత్రం
- ఉత్తమ దర్శకుడు
- ఉత్తమ నటుడు
- ఉత్తమ నటి
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్
- ఉత్తమ సహాయనటుడు
- ఉత్తమ సహాయనటి
- ఉత్తమ ప్రతినాయకుడు
- ఉత్తమ హాస్యనటుడు
- ఉత్తమ సంగీత దర్శకుడు
- ఉత్తమ గీత రచయిత
- ఉత్తమ నేపథ్య గాయకుడు
- ఉత్తమ నేపథ్య గాయని
- ఉత్తమ తొలిచిత్ర నటుడు
- ఉత్తమ తొలిచిత్ర నటి
- ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు
- ఉత్తమ తొలి నిర్మాత
- ఉత్తమ నటుడిగా విమర్శకుల అవార్డు
- ఉత్తమ నటిగా విమర్శకుల అవార్డు
- ఉత్తమ ఫైట్ కొరియోగ్రాఫర్
- ఉత్తమ డాన్స్ కొరియోగ్రాఫర్
- సైమా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "SIIMA 2019 List: 'రంగస్థలం'కు అవార్డుల పంట.. ఇదిగో పూర్తి జాబితా". Samayam Telugu. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-02-18.
- ↑ "Now, Special Awards To Short Filmmakers – India9tv" (in అమెరికన్ ఇంగ్లీష్). the original నుండి 2022-03-30 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-11-06.
- ↑ "New Twitter emoji for SIIMA". Deccan Herald (in ఇంగ్లీష్). 2021-09-18. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-09-19.
- ↑ "దుబాయ్: సైమా అవార్డ్స్ 2018 విజేతల జాబితా". Zee News Telugu. 2018-09-16. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-09-28.
- ↑ Correspondent, D. C. (2024-01-18). "Indian National Cine Academy (INCA) Unveiled for Cinematic Unity". www.deccanchronicle.com (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-05-03.
{{cite web}}:|last=has generic name (help) - ↑ "Hansika, Sameera & Shruti fire up SIIMA 2012". Sify (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-09-28.
- ↑ "SIIMA 2013 Awards winners list". The Times of India (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-09-28.
- ↑ "SIIMA 2014: Sridevi, Tamanna, Shriya make staggering appearances". www.indiatvnews.com (in ఇంగ్లీష్). 2014-09-14. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-09-28.
- ↑ "SIIMA 2015". The Times of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-09-28.
- ↑ "SIIMA in Singapore: South film industry stars put on a glittering show". Firstpost. 4 July 2016. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 June 2020.
- ↑ "Abu Dhabi hosts sixth edition of South Indian International Movie Awards". Egypt Today. 30 June 2017. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 June 2020.
- ↑ "'సైమా' అవార్డులు లిస్ట్: సాహోరే బాహుబలి". Samayam Telugu. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-09-28.
- ↑ "SIIMA 2019 : సైమా అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటీనటులు వీరే." News18 Telugu. 2019-08-16. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-09-28.
- ↑ Reddy, Sandeep (2021-08-07). "SIIMA Awards 2021: హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ లో సైమా అవార్డ్స్". www.hmtvlive.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-08-08.
- ↑ "SIIMA 2021: nominations". Firstpost. 2022-08-17. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-08-17.
- ↑ "సైమా అవార్డ్స్-2023 వేడుకల ప్రకటన." Sakshi. 2023-07-08. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-08.
- ↑ "SIIMA 2024 Date and Venue". Deccan Chronicle. 2024-07-17. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-07-22.
- ↑ ABN (2025-07-18). "SIIMA 2025: సైమాకు సర్వం సిద్ధం." Chitrajyothy Telugu News. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-08-19.
