సైరస్ పల్లోంజీ మిస్త్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సైరస్ పల్లోంజీ మిస్త్రీ
సైరస్ మిస్త్రీ
సైరస్ పల్లోంజీ మిస్త్రీ
జననం (1968-07-04) 1968 జూలై 4 (వయస్సు: 51  సంవత్సరాలు)
జాతీయతఐరిష్ ,
విద్యాసంస్థలుఇంపీరియల్ కాలేజి , లండన్
లండన్ బిజినెస్ స్కూలు
వృత్తిఛైర్మన్, టాటా గ్రూప్
మతంజోరాస్ట్ర్రియానిజం ,
జీవిత భాగస్వామిరోహిక్యా మిస్త్రీ
పిల్లలు2
తల్లిదండ్రులుపల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీ
పాట్సీ పెరిన్ దుబాష్

టాటా గ్రూప్ ఛైర్మనుగా రతన్ టాటా నిష్క్రమించిన తదుపరి ఆయన స్థానంలో కొత్త ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. టాటా గ్రూపు ఛైర్మన్‌గా రతన్ టాటా పదవీ విరమణ తర్వాత ఆరో రథ సారథిగా యేడాది చివరి రోజున పగ్గాలు చేపట్టినట్లు కంపెనీ ఉన్నతాధికారులు వెల్లడించారు. జంషెడ్‌జీ నుసెర్వాన్‌జీ టాటా 1868లో టాటా గ్రూపును స్థాపించారు. యాభై ఏళ్లు సంస్థకు సేవలందించిన మాజీ ఛైర్మన్ రతన్ టాటా పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది.

ఇదిలావుండగా, షాపూర్‌జీ పల్లోంజీ కుటుంబానికి చెందిన సైరస్ మిస్త్రీ.. 2006లో టాటా గ్రూపు బోర్డులో చేరారు. టాటా గ్రూపు హోల్డింగ్ సంస్థ టాటా సన్స్‌లో పల్లోంజీ కుటుంబానికి 18 శాతం వాటా ఉంది. రతన్ టాటా తర్వాత ఛైర్మన్ పదవిలో ఎవరిని కూర్చోబెట్టాలా అని చాలా పెద్ద కసరత్తు జరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ, మొత్తం ఐదుగురు ప్రతిపాదిత సభ్యుల నుంచి చివరికి మిస్త్రీని ఎంపిక చేసింది. టాటా గ్రూప్ 6వ ఛైర్మన్‌గా 2012 డిసెంబర్ 28 న బాధ్యతలు చేపట్టారు.

2016 అక్టోబరు 24 న టాటా సన్స్ బోర్డు, సైరస్ మిస్త్రీని చైర్మన్ పదవి నుండి బర్తరఫ్ చేసింది[1]. దీనికి కారణమేమీ ప్రకటించలేదు. తాత్కాలిక ఛైర్మనుగా రతన్ టాటాను నియమించింది. నాలుగు నెలల కాలంలో కొత్త ఛైర్మనును ఎన్నుకునేందుకు ఒక సెర్చి కమిటీని నియమించింది.

టాటా సంస్థలు[మార్చు]

భారతదేశపు తొలి బహుళజాతి సంస్థ " టాటా" సంస్థలు . 20 వ శతాబ్దపు తొలి సంవత్సరాలలోనే వ్యాపార కార్యాలయం కలిగిన సంస్థ టాటా సన్స్ . భారతదేశము బానిసపాలనలో ఉన్న కాలములో జాతీయ భావాలు కలిగిన ఒక పార్శీ - జంషెడ్జీ టాటా ఈ సంస్థను నెలకొలిపారు. ప్రపంచములో పలుదేశాలలో పరిశ్రమలు, పెట్టుబడులు కలిగిన టాటాలు ప్రవేశించని పరిశ్రమలేదు. ఉప్పునుండి సాప్ట్ వేర్ వరకు ప్రతి రంగములో వారి ఉత్పత్తులు ఉన్నాయి. టాటా స్టీల్, టాటా లారీలు, టాటా కార్లు, టాటా టీ, టాటా కెమికల్స్, టాటా టెలికమ్యూనిమేషన్‌ ... ఇలా వారి ఉత్పత్తులు భారతీయలందరి జీవితాలను తాకేవే . నాన్యత విషయములో రాజీ పడని కంపెనీగా, నిజాయితీ విషయ్ములో చాలా పారిశ్రామిక సంస్థలకన్నా మెరుగైనదిగా టాటా లకు గుర్తింపు ఉంది. ఈ సంస్థల ఆధాయము సుమారు 100 బిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా . 80 దేశాలకు పైగా వీరి పెట్టుబడులు, పరిశ్రమలు కలిగి ఉన్నాయి.

52 ఏళ్ళపాటు ఛైర్మన్‌గా వ్యవహరించిన జె.ఆర్.డి.టాటా నుండి వారసత్వముగా ఛైర్మన్‌ పదవిని 1991 లో రతన్‌ టాటా అందుకున్నారు. సుమారు 20 ఏళ్ళ పైబడి ఆయన ఆ పదవిలో ఉన్నారు. రతన్‌ టాటా అవివాహితుడైనందున తన 75 వ ఏట తన వారసుడుగా ఎంఫిక 5 గురు సభ్యులున్న కమిటీకి అప్పగించి ... అలా ఎన్నికైన వారే ఈ సైరస్ మిస్త్రీ.

టాటా గ్రూప్ ఛైర్మన్ జాబితా[మార్చు]

  1. జమ్సేట్జి టాటా- Jamsetji Tata (1887–1904)
  2. దొరబ్జి టాటా-Dorabji Tata (1904–1932)
  3. నౌరోజీ శక్లత్వల- Nowroji Saklatwala (1932–1938)
  4. జె.ఆర్ డి టాటా J. R. D. Tata (1938–1991)
  5. రతన్ టాటా- Ratan Tata (1991–2012)
  6. సైరస్ మిస్త్రీ -Cyrus Mistry (2012–present

మూలాలు[మార్చు]

యితర లింకులు[మార్చు]

  1. "Cyrus Mistry sacked, Ratan Tata appointed interim Chairman of Tata Sons". Cite web requires |website= (help)