సొంతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సొంతం
దర్శకత్వంశ్రీను వైట్ల
నిర్మాతఎస్. సోంపల్లి
వి. ఆర్. కన్నెగంటి
రచనకోన వెంకట్
నటులుఆర్యన్ రాజేష్
సునీల్
నమిత
రోహిత్
ఎమ్మెస్ నారాయణ
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ సంస్థ
జె. డి. ఆర్ట్స్
విడుదల
23 ఆగస్టు 2002 (2002-08-23)
దేశంభారతదేశం
భాషతెలుగు

సొంతం 2002 లో శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఆర్యన్ రాజేష్, నమిత ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.[1]

కథ[మార్చు]

వంశీ (ఆర్యన్ రాజేష్), నందు (నమిత), బోస్ (రోహిత్) ముగ్గురూ చిన్ననాటి స్నేహితులు. వీరిలో వంశీ, నందు బాగా దగ్గరిగా మసలుకుంటూ ఉంటారు. బోస్ నేహ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అదే విషయం బోసు వంశీతో చెబితే వారి ప్రేమ గెలవదనీ చాలా ప్రేమ కథల్లాగే అది కూడా విఫలమవుతుందనీ కొట్టి పడేస్తాడు. అంతే కాకుండా ప్రేమ కంటే స్నేహం గొప్పదనీ, ప్రేమ వల్ల స్నేహం చెడిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న నందు తనకు వంశీ మీద ప్రేమ ఉన్నా అతనికి చెబితే తమ స్నేహం చెడిపోతుందని తన మనసులోనే దాచుకుంటుంది.

ఒకసారి వంశీ తన తండ్రి వ్యాపార వ్యవహారాలు చక్కబెట్టడానికి న్యూజీలాండ్ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ అతనికి పదే పదే నందూ గుర్తుకు రావడంతో తనకు కూడా నందు మీద ప్రేమ ఉందని గుర్తిస్తాడు. కానీ తను తిరిగివచ్చేసరికి నందుకు వేరే అబ్బాయితో నిశ్చితార్థం జరిగిపోయి ఉంటుంది. చివరికి వారిద్దరూ కలుసుకున్నారన్నదే మిగతా కథ.

తారాగణం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. జీ. వి. "సొంతం సినిమా సమీక్ష". idlebrain.com. జీ. వి. రమణ. Retrieved 12 October 2016.
  2. ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". ర‌మేష్ గోపిశెట్టి. Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020. Check date values in: |archivedate= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=సొంతం&oldid=2995831" నుండి వెలికితీశారు