సొదుం జయరాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వర్గీయ సొదుం జయరాం కడప జిల్లాలోని ఉరుటూరు గ్రామంలో జన్మించారు. వీరు ప్రొద్దుటూరు మునిసిపల్ హైస్కూలులో చదివుకున్నారు. వీరు బి.ఏ. పట్టభద్రులు. కొడవటిగంటి కుటుంబరావు ప్రశంసలు పొందిన కథకుడాయన. పాడె, వాడిన మల్లెలు, పుణ్యకాలం మించిపోయింది మొదలైనవి వీరి ప్రసిద్ధ కథలు. వీరి కథల్లో అనవసరమైన సన్నివేశం గానీ, అనవసరమైన వాక్యం గానీ, అనవసరమైన మాటగానీ ఉండవని రచయితలు, విమర్శకులు, సాహితీపత్రికల సంపాదకులు గొప్పగా చెబుతారు. వీరు రాసిన కథలు చాలా మటుకు రెండు పేజీల్లోపలే ముగుస్తాయి. 2004లో వీరి కథలకు రాచకొండ రచనాపురస్కారం వచ్చింది.[1]

రచనలు[మార్చు]

  • వాడినమల్లెలు (కథాసంకలనం)

మూలాలు:[మార్చు]

  1. సొదుం జయరాం రాసిన వ్యాసం[permanent dead link]