సొనెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సొనెట్ అనేది యూరప్‌లో ఉద్భవించిన అనేక పద్య కవితా రూపాలలో ఒకటి. ఒక్కిటాన్ భాష లోని పదమైన సోనేట్ మరియు ఇటాలియన్ పదమైన సోనేట్టో నుండి సొనెట్ అనే పదం గ్రహించబడింది. ఈ రెండిటికీ కూడా "చిన్న పాట" లేక "చిన్న శబ్దం" అని అర్ధం. పదమూడవ శతాబ్దం నాటికి సొనెట్ ను ఒక పదునాల్గు పంక్తులతో ఒక క్రమబద్ధమైన అంత్య ప్రాసలో రూపొందించబడిన పద్యంగా పరిగిణించడం ప్రారంభమయ్యింది. సొనెట్ కు సంబంధించిన అనేక రకాల పద్ధతులు క్రమంగా చరిత్రలో ఆవిష్కృతమయ్యాయి. ఈ పదానికి కొంత వ్యతిరేక అర్ధం ఉన్నప్పటికీ సొనెట్ రచయితలను తరచుగా "సోనెటీర్"లు అని పిలవడం పరిపాటి. మొత్తం 154 సొనెట్లు రచించిన (ఆయన నాటకాలలో కనిపించేవి కాక) విలియం షేక్స్పియర్ ప్రముఖ సొనెట్ రచయితలలో ఒకరిగా గుర్తింపు పొందారు. షేక్స్పియర్ లేక ఇంగ్లీష్ సొనెట్ మొత్తం పదునాలుగు పంక్తులు కలిగి ఉండి ప్రతి పంక్తి లోను పది మాత్రలు ఉండి ఇయామ్బిక్ పెంటామీటర్‌లో వ్రాయబడి ఉంటుంది. ఈ మీటర్ లో ఒక సాధారణ మాత్ర మరియు ఒక వత్తు మాత్ర ఐదు సార్లు వరుసగా వస్తాయి. షేక్స్పియర్ సొనెట్ యొక్క ప్రాస విధానం a-b-a-b, c-d-c-d, e-f-e-f, g-gగా ఉండి చివరి రెండు పంక్తులు ప్రాసను కలిగి ఉంటాయి.

సాంప్రదాయకంగా సొనెట్ లు రచించేందుకు ఇంగ్లీష్ రచయితలు ఇయామ్బిక్ పెంటామీటర్ నే వినియోగిస్తుంటారు. లాటిన్ ఆధారిత భాషలలో హేన్డెకసిలబల్ మరియు అలెక్జాన్డ్రైన్ అనేవి సాధారణంగా ఉపయోగించే మీటర్లు.

ఇటాలియన్ (పెట్రార్చన్) సొనెట్[మార్చు]

ఫ్రెడరిక్ 2 క్రింద ఉన్న సిసిలియన్ స్కూల్ అధిపతి అయిన గియాకోమో డా లేంటిని ఇటాలియన్ సొనెట్ ను రూపొందించారు.[1] గ్యుట్టన్ డి అరెజ్జో దీనిని పునఃపరిశీలించి టుస్కనీ ప్రాంతానికి తీసుకువచ్చి తాను నియో-సిసిలియన్ స్కూల్ (1235-1294) ప్రారంభించే సమయంలో దీనిని తమ భాషలోనికి అనుసరణ చేయడం జరిగింది.

ఈయన దాదాపు 250 సొనెట్ లను రచించాడు.[2] ఆ సమయంలోని ఇతర ఇటాలియన్ కవులు డాంటే అలిఘేరి (1265-1321) మరియు గైడో కవల్కంటి (1250-1300 ) వంటి వారు కూడా కొన్ని సొనెట్ లను రచించినప్పటికీ తోలి సోనెటర్ లలో పెట్రార్క అంత్యంత ప్రముఖులు. (ఇంగ్లీష్ లో ఈయన పెట్రార్చ్ గా సుపరిచితులు) ఇంకా ఎన్నో అందమైన సొనెట్ లను రచించిన వారిలో మైకలెంజిలో ఒకరు. 

ఇటాలియన్ సొనెట్లలో రెండు భాగాలు ఉంటాయి. మొదటిది ఒక సమస్యను వివరించే ఒక అష్టపది (రెండు చతుష్పాదాలు) కాగా రెండవది దానికి సంబంధించిన ఒక పరిష్కారాన్ని సూచించే ఒక షట్పది (రెండు త్రిపదులు) గా ఉంటుంది. సాధారణంగా, తొమ్మిదవ పంక్తి సమస్య నుండి పరిష్కారం వైపు "మలుపు" లేక వోల్టాను సూచిస్తూ ఉంటుంది. కొన్ని సొనెట్ లు కచ్చితంగా సమస్య మరియు పరిష్కారం అనే ప్రక్రియను పాటించక పోయినప్పటికీ, తొమ్మిదవ పంక్తి మాత్రం ఒక "మలుపు" లాగా ఉండి పద్యం చెప్పే విధానం లోనో, భావం లోనో, దృక్పధం లోనో రానున్న మార్పును సూచిస్తుంది.

గియాకోమో డా లేంటిని రాసిన సొనెట్ లలో అష్టపది యొక్క ప్రాస a-b-a-b, a-b-a-bగా ఉండగా తరువాతి కాలంలో a-b-b-a, a-b-b-a ప్రాస ప్రక్రియ అన్ని ఇటాలియన్ సొనెట్ లకు ప్రమాణంగా మారింది. షట్పదులకు c-d-e-c-d-e మరియు c-d-c-c-d-c అనే రెండు అవకాశాలు ఉన్నాయి. కాలక్రమేణా, c-d-c-d-c-d వంటి ప్రాస ప్రక్రియలు కూడా పరిచయం చేయబడ్డాయి.

ఇంగ్లీష్ లో మొట్టమొదట ప్రఖ్యాతి చెందిన సొనెట్ రచయితలు సర్ థామస్ వ్యాట్ మరియు హెన్రీ హోవార్డ్, ఎర్ల్ ఆఫ్ సర్రే వంటి వారు ఈ ఇటాలియన్ ప్రక్రియ నే ఉపయోగించారు. తరువాతికాలంలో జాన్ మిల్టన్, థామస్ గ్రే, విలియం వర్డ్స్ వర్త్ మరియు ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ వంటి వారు కూడా ఈ ప్రక్రియనే ఉపయోగించారు. 20 వ శతాబ్దపు తొలినాళ్ళలో అమెరికన్ రచయిత్రి అయిన ఎడన సెయింట్ విన్సెంట్ మిల్లె కూడా ఆమె రచించిన సొనెట్లలో అత్యధికంగా ఇటాలియన్ ప్రక్రియనే వినియోగించింది.

మిల్టన్ రచించిన "ఆన్ హిజ్ బ్లైండ్ నెస్ " అనే సొనెట్ ఇటాలియన్ ప్రాస ప్రక్రియకు ఉదాహరణగా ఈ క్రింద ఇవ్వబడింది.

When I consider how my light is spent (a)
 Ere half my days, in this dark world and wide, (b)
 And that one talent which is death to hide, (b)
 Lodged with me useless, though my soul more bent (a)
To serve therewith my Maker, and present (a)
 My true account, lest he returning chide; (b)
 "Doth God exact day-labor, light denied?" బి
 I fondly ask; but Patience to prevent (a)
That murmur, soon replies, "God doth not need (c)
 Either man's work or his own gifts; who best (d)
 Bear his mild yoke, they serve him best. His state (e)
Is Kingly. Thousands at his bidding speed (c)
 And post o'er land and ocean without rest; (d)
 They also serve who only stand and wait." (e)

డాంటే చేసిన మార్పులు[మార్చు]

డాంటే యొక్క లా విట నుఒవా లోని అనేక సొనెట్ లు పెట్రార్చన్ విధానంలోనే ఉన్నప్పటికీ చాప్టర్ 7 [3] O voi che per la via 8 వ అధ్యాయం మోర్తే విల్లన- చతుష్పదులకు మరో ఏడు మాత్రలు కలిగి వుండే చిన్న చిన్న పంక్తులను కలపడం వల్ల మొత్తం ఐదు లేక ఆరు పంక్తులు అవడం మరియు రెండు రెండు పంక్తులకు ఇదే విధంగా కలపడం వల్ల మొత్తం నాలుగు పంక్తులు అవడం జరుగుతుంది. దీని వలన ప్రాస విధానం మరింత సంక్లిష్టంగా మారుతుంది.

ఒక్కిటాన్ సొనెట్[మార్చు]

ఒక్కిటాన్ భాషలో ఉన్న ఏకైక అందుబాటులో ఉన్న సొనెట్ దాదాపు 1284 నాటిది కావొచ్చని కచ్చితమైన ఆధారాలున్నాయి. దీనిని కలిగి ఉన్న ట్రౌబడోర్ వ్రాతపతి Pలో ఉన్న 1310 నాటి పాటల పుస్తకం చాన్సోనీర్ ప్రస్తుతం XLI 42 ఫ్లోరెన్స్‌లో ఉన్న బిబ్లియోటేక లారెంజియన లైబ్రరీలో భద్రపరచబడి ఉంది.[4] ఇది పీటర్ III ఆఫ్ అరగోన్ గురించి ప్రస్తుతిస్తూ పోలో లన్ఫ్రంచి డా పిస్తోయియా చే వ్రాయబడింది. ఇందులో a-b-a-b, a-b-a-b, c-d-c-d-c-d అనే ప్రాస నియమం వాడబడింది. సిసిలియన్ వేస్పర్స్ యుద్ధము మరియు సిసిలీ కోసం అన్గేవిన్స్ మరియు అర్గోన్స్ మధ్య జరుగుతున్న ఘర్షణల పై ఉత్తర ఇటాలియన్ దృక్పధాన్ని వ్యక్తీకరించడం వల్ల ఈ పద్యానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది.[4] పీటర్ III మరియు అర్గోన్స్ యొక్క సమస్యకు ఆరోజుల్లో ఉత్తర ఇటలీలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అర్గోన్స్ క్రూసేడ్‌లో కాపెటియన్లు మరియు అన్గేవిన్ల పై పీటర్ సాధించిన విజయాన్ని వేడుక చేసుకునేందుకే పోలో ఈ సొనెట్ ను రచించారు.

   Valenz Senher, rei dels Aragones
a qi prez es honors tut iorn enansa,
remembre vus, Senher, del Rei franzes
qe vus venc a vezer e laiset Fransa
   Ab dos sos fillz es ab aqel d'Artes;
hanc no fes colp d'espaza ni de lansa
e mainz baros menet de lur paes:
jorn de lur vida said n'auran menbransa.
   Nostre Senhier faccia a vus compagna
per qe en ren no vus qal [la ] duptar;
tals quida hom qe perda qe gazaingna.
   Seigner es de la terra e de la mar,
per qe lo Rei Engles e sel d'Espangna
ne varran mais, si.ls vorres aiudar.
   Valiant Lord, king of the Aragonese
to whom honour grows every day closer,
remember, Lord, the French king[5]
that has come to find you and has left France
   With his two sons[6] and that one of Artois;[7]
but they have not dealt a blow with sword or lance
and many barons have left their country:
but a day will come when they will have some to remember.
   Our Lord make yourself a company
in order that you might fear nothing;
that one who would appear to lose might win.
   Lord of the land and the sea,
as whom the king of England[8] and that of Spain[9]
are not worth as much, if you wish to help them.

విలియం ఆఫ్ అల్మారిచికు అంకితం ఇవ్వబడిన 1321 నాటి ఒక్కిటాన్ భాషలోని సొనెట్ జేన్ డే నోస్ట్రడాం పుస్తకం లోనే కాక గియోవన్ని క్రేసేమ్బిని యొక్క స్తోరియ డెల్ల వోల్గర్ పోసియా లోను ప్రస్తావించబడింది. ఇది రాబర్ట్ ఆఫ్ నేపుల్స్ యొక్క ఇటీవలి విజయానికి శుభాకాంక్షలు తెలుపుతూ వ్రాయబడింది. దీని ప్రామాణికత పై మాత్రం వివాదాలున్నాయి. డాంటే డే మయానో అనే ఇటాలియన్ రచించిన రెండు సొనెట్ లకు అంతగా ప్రాధాన్యత లభించలేదు.

ఇంగ్లీష్ (షేక్స్పియర్) సొనెట్[మార్చు]

హెన్రీ హోవార్డ్, ఎర్ల్ ఆఫ్ సర్రే, c.1542 బై హాన్స్ హోల్బిన్
ప్రసిద్ధ "చందోస్" చిత్రపటంలో విలియం షేక్స్పియర్కళాకారుడు మరియు కచ్చితత్వం లపై సరైన సమాచారం లేదు.నేషనల్ పోర్ట్రైట్ గేలరీ (UK).

ఇటాలియన్ సొనెట్ పరిచయమైన కొద్ది కాలానికే ఇంగ్లీష్ కవులు పూర్తిగా స్థానికమైన శైలిలో సొనెట్ లను రూపొందించడం ప్రారంభించారు. 16 శతాబ్దం ప్రారంభం లోనే థామస్ వ్యాట్ అనే రచయిత చే ఇంగ్లీష్ లో సొనెట్ లు పరిచయం కాబడినప్పటికీ ఆయన మరియు ఆయన సమకాలికుడు ది ఎర్ల్ ఆఫ్ సర్రే ల సొనెట్ లన్నీ ప్రధానంగా ఇటాలియన్ ఆఫ్ పెట్రార్చ్ మరియు ఫ్రెంచ్ ఆఫ్ రోన్సార్డ్ మరియు ఇతరుల సొనెట్ ల యొక్క అనువాదాలే. వ్యాట్ ఇంగ్లీష్ లో సొనెట్ లను పరిచయం చేసినప్పటికీ సర్రే మాత్రమే తొలుత వాటికి ఒక ప్రాస నియమాన్ని ఏర్పరిచి చతుష్పదులుగా విభజించి ప్రస్తుతం ఉన్న ఇంగ్లీష్ సొనెట్ ల రూపంలోకి తెచ్చాడు. తొలుత వీరిద్దరి సొనెట్ లు వ్రాతపతుల రూపం లోనే ఉన్నప్పటికీ, టోటేల్స్ మిస్లనిగా (1557) సుపరిచితమైన రిచర్డ్ టోటేల్ యొక్క సాంగ్స్ అండ్ సొనెట్స్ అనే పుస్తకంలో మొదట ఈ సొనెట్ లు ప్రచురితమైనాయి.

అయితే సర్ ఫిలిప్ సిడ్నీ యొక్క అస్త్రోఫెల్ అండ్ స్టెల్లా (1591) అనే సీక్వెన్స్ ద్వారానే ఇంగ్లీష్ లో సొనెట్ సీక్వెన్స్ ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగింది.ఆ తరువాత రెండు దశాబ్దాలలో విలియం షేక్స్పియర్, ఎడ్మండ్ స్పెన్సర్, మైకేల్ ద్రేటన్, సామ్యుల్ డానియల్, ఫుల్కే గ్రేవిల్లె, విలియం డ్రామ్మండ్ ఆఫ్ హాతర్న్డెన్ వంటి ఇంకా ఎందరో ఈ సొనెట్ సీక్వెన్స్ లను వ్రాయడం జరిగింది. ఈ సొనెట్ లు అన్నీ కూడా ప్రధానంగా పెట్రార్చన్ సంప్రదాయంచే స్ఫూర్తి పొందినవే. ఒక్క షేక్స్పియర్ సీక్వెన్స్ లలో తప్ప మిగిలిన అన్నింటిలో దాదాపుగా కవికి ఒక మహిళపై ఉన్న ప్రేమను వ్యక్తీకరిస్తూ వ్రాసినవే అయి ఉన్నాయి. ఈ రచనా శైలికి షేక్స్పియర్ పేరు రావడం అనేది ఆయన ఈ ప్రక్రియలో కవితలు వ్రాసిన మొదటి కవి కావడం మాత్రమే కాక ఆయనే అత్యధికంగా ఈ ప్రక్రియని అనుసరించిన కవి కూడా కావడం వల్ల జరిగింది. ఈ రచనా ప్రక్రియలో మొత్తం పదునాలుగు పంక్తులు ఉండి అందులో మొదట మూడు చతుష్పాదాలు, తరువాత ఒక ద్విపది ఉంటుంది. సాధారణంగా మూడవ చతుష్పాదంలో ఒక ఊహించని, వ్యుహాత్మకమైన మలుపు 'వోల్టా' ఉంటుంది. అయితే షేక్స్పియర్ సొనెట్ లలో వోల్టా సాధారణంగా చివరలో నున్న ద్విపాదంలో వచ్చి పద్యం యొక్క భావం మొత్తాన్ని క్లుప్తంగా వ్యక్తీకరించడమో లేక మొత్తం పద్యానికీ ఒక కొత్త అర్ధాన్ని ఇవ్వడమో జరుగుతుంది. ఎక్కడో కొన్ని సందర్భాలలో తప్ప మీటర్ ఎప్పుడు ఇయామ్బిక్ పెంటామీటర్ నే వాడడం జరిగినప్పటికీ కొంత సందర్భానుసారం మీటర్ లో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. (ఉదాహరణకు పంక్తులు ఒక ఇయామ్బ్కు బదులుగా ఒక అధిక మాత్ర ఉండే ఫెమినైన్ రైం లేక రెండు అధిక మాత్రలు ఉండే ట్రోఖాఇక్ ఫుట్‌తో ముగియవచ్చు. ఈ ప్రాస ప్రక్రియలో సాధారణంగా a-b-a-b, c-d-c-d, e-f-e-f, g-g అనే అంత్య ప్రాస ఉంటుంది.

ఈ క్రింద ఇవ్వబడిన షేక్స్పియర్ యొక్క సొనెట్ 116 ఈ ప్రక్రియకు ఒక మంచి ఉదాహరణ. (అయితే ఆధునిక దృక్పధంతో చదివేవారికి ఎలిజబెత్ కాలం నాటి సొనెట్ లలో కొంత వ్యత్యాసాలు కనిపించే అవకాశం ఉంది) :

Let me not to the marriage of true minds (a)
Admit impediments, love is not love (b)*
Which alters when it alteration finds, (a)
Or bends with the remover to remove. (b)*
O no, it is an ever fixéd mark (c)**
That looks on tempests and is never shaken; (d)***
It is the star to every wand'ring bark, (c)
Whose worth's unknown although his height be taken. (d)***
Love's not time's fool, though rosy lips and cheeks (e)
Within his bending sickle's compass come, (f)*
Love alters not with his brief hours and weeks, (e)
But bears it out even to the edge of doom: (f)*
If this be error and upon me proved, (g)*
I never writ, nor no man ever loved. (g)*

* PRONUNCIATION/RHYME: Note changes in pronunciation since composition.
** PRONUNCIATION/METER: "Fixed" pronounced as two-syllables, "fix-ed."
*** RHYME/METER: Feminine-rhyme-ending, eleven-syllable alternative.

రోమియో అండ్ జూలియట్ యొక్క ఉపోద్ఘాతం కూడా ఒక సొనెట్ రూపంలోనే వ్రాయబడి ఉంది. అదేవిధంగా ఐదవ సీన్ లో రోమియో మరియు జూలియట్ ల మొదటి కలయిక అయిన ఒకటవ ఘట్టంలో "If I profane with my unworthiest hand"తో ప్రారంభమయ్యి "Then move not while my prayer's effect I take" 104 -117 వ పంక్తులు సొనెట్ రూపంలోనే వ్రాయబడ్డాయి. (117).[10]

17 శతాబ్దంలో జాన్ డొనే మరియు జార్జ్ హెర్బర్ట్లు మతసంబంధమైన సొనెట్ లను వ్రాయడం మరియు జాన్ మిల్టన్ సొనెట్ ను ఒక సాధారణ అవలోకనా పూరితమైన పద్యంగా వినియోగించడంతో సొనెట్ లను ఇతర ఉద్దేశ్యాలకు కూడా వినియోగించడం ప్రారంభమయింది. ఈ సమయంలో షేక్స్పియర్ మరియు పెట్రార్చన్ ప్రక్రియలు రెండూ ప్రాముఖ్యత కలిగినప్పటికీ ఇంకా ఎన్నో వైవిధ్యభరితమైన సానెట్ ప్రక్రియలు కూడా వెలుగులోనికి వచ్చాయి.

పునరుజ్జీవనము తర్వాత సొనెట్ ల పట్ల ఉన్న ఆసక్తి కొంత తగ్గి 1670 కి వర్డ్స్వర్త్ కాలానికీ మధ్య దాదాపుగా ఎటువంటి సొనెట్ లు వ్రాయబడలేదు. అయితే, ఫ్రెంచ్ విప్లవం నేపథ్యంలో సొనెట్ లు మళ్లీ బలంగా తెర మీదకు వచ్చాయి. వర్డ్స్వర్త్ ఎన్నో సొనెట్ లను రచించారు. అందులో "The world is too much with us" అనే సొనెట్ తో పాటు మిల్టన్ కు రాసిన సొనెట్ కూడా ఎంతో ప్రఖ్యాతి పొందింది. ఆయన సొనెట్ లు ప్రధానంగా మిల్టన్ పద్ధతిలోనే వ్రాయబడ్డాయి. కీట్స్ మరియు షెల్లీలు కూడా ఎన్నో సొనెట్ లు రచించారు. కీట్స్ రాసిన సొనెట్లు కొంత వరకు షేక్స్పియర్ చే ప్రభావితం చేయబడినవి కావడంతో కొన్ని సాధారణ పద్ధతిలోను మరికొన్ని ఉత్ప్రేక్షాలంకారంలోను వ్రాయబడి ఉన్నాయి. అయితే షెల్లీ మాత్రం తన "ఒజమాన్డస్" సొనెట్ పూర్తిగా సరికొత్త ప్రాస నియమాన్ని సృష్టించాడు. 19 శతాబ్దం అంతా కూడా అనేక మంది సొనెట్ లను రచించినప్పటికీ ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ రాసిన సొనేట్స్ ఫ్రం ది పోర్చుగీస్ మరియు డాంటే గాబ్రియల్ రోసేట్టి ల సొనెట్ లు తప్ప వేరే ఏ సొనెట్ లు పెద్దగా గుర్తింపు సాధించలేకపోయాయి. గెరార్డ్ మాన్లే హాప్కిన్స్ చాలావరకు స్ప్రంగ్ ప్రాసలో అనేక ప్రఖ్యాత సొనెట్ లను రచించారు. వీటిలో "ది విన్దోవర్" అనేది చాలా పేరు పొందింది. ఇంతే కాక ఆయన కొంత వైవిధ్యంతో వ్రాసిన 10½ లైన్ కర్తల్ సొనెట్ అయిన "పైడ్ బ్యూటీ" మరియు 24 లైన్ల కాడేట్ సొనెట్ అయిన "దట్ నేచర్ ఈజ్ ఎ హెరాక్లితెన్ ఫైర్" అనే సొనెట్ లు కూడా ప్రముఖమైనవి. 19 శతాబ్దం చివరకు సొనెట్ అనేది మార్పులు చేర్పులకు ఎంతో అనుకూలమైన ఒక సాధారణ పద్య రూపంగా మారింది.

ఈ సౌలభ్యత 20 వ శతాబ్దం చివరి వరకు కొనసాగింది. ఆధునిక యుగ తొలినాళ్ళలో ప్రముఖ కవులైన రాబర్ట్ ఫ్రాస్ట్, ఎద్నా సెయింట్ విన్సెంట్ మిల్లె మరియు యి.యి.కమ్మింగ్స్ వంటి వారు సొనెట్ ప్రక్రియను విరివిగా వినియోగించారు. విలియం బట్లర్ ఈట్స్ హాఫ్ రైంలో తన లేడా అండ్ ది స్వాన్ అనే ప్రముఖ సొనెట్ ను రచించాడు. విల్ఫ్రెడ్ ఓవెన్ రాసిన ఆన్తం ఫర్ డూండ్ యూత్ అనేది 20 వ శతాబ్దం తొలినాళ్ళలో వచ్చిన మరో సొనెట్. డబ్ల్యు.హెచ్.ఆడెన్ తన కెరీర్ మొత్తంలో ఎన్నో సొనెట్ లు మరియు సొనెట్ సీక్వెన్స్ లను రచించి వాటిలో అనేక రకాల ప్రాస ప్రక్రియలను విస్తృతంగా వినియోగించాడు. ఆడెన్ ఇంగ్లీష్ లో తొలిసారిగా "ది సీక్రెట్ ఏజెంట్" (1928) అనే ప్రాస లేని సొనెట్ ను కూడా రచించాడు. 1950 నుండి ప్రాస సగం ప్రాసతోటి, అసలు ప్రాస లేకుండా మరియు మీటర్ కూడా లేకుండా ఎన్నో సొనెట్ లు వ్యాప్తి లోనికి వచ్చాయి. సగం ప్రాసలు వాడబడినటువంటి సీమాస్ హేనీ యొక్క గ్లాన్మోర్ సొనెట్లు మరియు క్లియరెన్స్‌లు మరియు జెఫ్రీ హిల్ యొక్క సీక్వెన్స్ "యాన్ అపాలజీ ఫర్ ది రివైవల్ ఆఫ్ క్రిస్టియన్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇంగ్లాండ్"లు ఈ సమయంలో వచ్చిన ఉత్తమ సొనెట్ లుగా గుర్తింపు పొందాయి. 1990 లలో కొంత సాంప్రదాయ సొనెట్ లను పునరుద్ధరించడం జరిగినప్పటికీ గత దశాబ్దం లోనే కొన్ని సాంప్రదాయ సొనెట్ లను వ్రాయడం జరిగింది.

స్పెన్సేరియన్ సొనెట్[మార్చు]

ఎడ్మండ్ స్పెన్సర్ (c.1552–1599) పేరుతో ప్రాముఖ్యత పొందిన స్పెన్సేరియన్ సొనెట్ అనేది ఇంగ్లీష్ సొనెట్ కు కొంత రూపాంతరం చేయబడినదిగా ఉండి ఇందులో abab, bcbc, cdcd, ee అనే ప్రాస నియమం ఉంటుంది. పెట్రార్చన్ సొనెట్ లో ఉన్నట్లు స్పెన్సేరియన్ సొనెట్ లో తొలుత ఒక సమస్యను వ్యక్తపరిచే అష్టపది మరియు రెండవ భాగంలో ఆ సమస్యను పూరించే షట్పది అనే పద్ధతి ఉండవలసిన అవసరం లేదు. దీనికి బదులుగా, ఈ ప్రక్రియలో ఒక క్రమబద్ధమైన ప్రాస నియమాన్ని అనుసరించే ఒక మూడు చతుష్పాదాలు వరుసగా ఉండి తరువాత ఒక ద్విపాదం కొనసాగింపుగా వస్తుంది. తెర్జా రీమా వంటి ఇటాలియన్ రూపాలలో ఉన్నటువంటి ప్రాస అనుసంధాన విధానాన్నే ఎడ్మండ్ తన సొనెట్ చతుష్పాదాలలోను వినియోగించారు. అమోరెట్టి నుండి ఈ క్రింది ఉదాహరణ తీసుకోబడింది.

Happy ye leaves! whenas those lily hands

Happy ye leaves! whenas those lily hands, (a)
Which hold my life in their dead doing might, (b)
Shall handle you, and hold in love's soft hands, (a)
Like captives trembling at the victor's sight. (b)
And happy lines on which, with starry light, (b)
Those lamping eyes will deign sometimes to look,(c)
And read the sorrows of my dying sprite, (b)
Written with tears in heart's close bleeding book. (c)
And happy rhymes! bathed in the sacred brook (c)
Of Helicon, whence she derived is, (d)
When ye behold that angel's blessed look, (c)
My soul's long lacked food, my heaven's bliss. (d)
Leaves, lines, and rhymes seek her to please alone, (e)
Whom if ye please, I care for other none. (e)

ఆధునిక సొనెట్[మార్చు]

ఫ్రీ వర్స్ పద్ధతి ప్రాచుర్యం లోకి రావడంతో ఈ సొనెట్ లు ఓల్డ్ ఫాషన్ గా మారి అనేక పద్ధతులలో రాసే కవులు కూడా దీనిని కొంతకాలం పాటు వినియోగించడం మానివేశారు. అయితే విల్ఫ్రెడ్ ఓవెన్, జాన్ బెర్రీమాన్, జార్జ్ మెరేడిత్, ఎడ్విన్ మోర్గాన్, రాబర్ట్ ఫ్రాస్ట్, రూపర్ట్ బ్రూక్, జార్జ్ స్టెర్లింగ్, ఎడ్నా సెయింట్ విన్సెంట్ మిల్లె, యి.యి.కమ్మింగ్స్, జోర్గ్ లూయిస్ బోర్గ్స్, పాబ్లో నెరుడా, జాయన్ బ్రోస్సా, విక్రం సేథ్, రైనేర్ మారియా రిల్క్, జాన్ కల్, కిమ్ అద్దోనిజియో, మరియు సీమాస్ హీనే వంటి ఎందరో ఆధునిక కవులు ఈ ప్రక్రియను తిరిగి కొనసాగించారు. సాధారణ సొనెట్ మీటర్ లో కాకపోయినా పాల్ మల్డూన్ 14 పంక్తులు మరియు సొనెట్ ప్రాసలతో ఎన్నో ప్రయోగాలు చేసారు. యునైటెడ్ స్టేట్స్ లో ప్రారంభమైన న్యూ ఫార్మలిజం ఉద్యమం కూడా సొనెట్ ల పై ఈ సమకాలికుల్లో ఆసక్తి కలగడానికి కారణమయింది. దీనిలో ప్రాస ఉండాల్సిన అవసరం లేదు కానీ సంగతత్వం ఉండాల్సి ఉంటుంది.

వీటిని కూడా చూడండి[మార్చు]

సొనెట్ లలోని రకాలు[మార్చు]

సొనెట్ లలోని వర్గాలు[మార్చు]

సొనెట్ లతో దగ్గరి సంబంధం కలిగి ఉండే రూపాలు[మార్చు]

గమనికలు[మార్చు]

 1. ఎర్నస్ట్ హాచ్ విల్కిన్స్, ది ఇన్వెన్షన్ ఆఫ్ ది సొనెట్ అండ్ అదర్ స్టడీస్ ఇన్ ఇటాలియన్ లిటరేచర్ (రోమ్:Edizioni di Storia e letteratura, 1959), 11-39
 2. మిడైవల్ ఇటలీ: యాన్ ఎన్సైక్లోపీడియా, వాల్యూం 2, క్రిస్టోఫర్ క్లేన్హేన్జ్[1]
 3. [2]
 4. 4.0 4.1 బెర్తోని, 119.
 5. ఫిలిప్ III ఆఫ్ ఫ్రాన్సు
 6. ఫిలిప్ ది ఫెయిర్ అండ్ చార్లెస్ ఆఫ్ వలోయిస్
 7. రాబర్ట్ II ఆఫ్ అర్తోయిస్
 8. ఎడ్వర్డ్ I ఆఫ్ ఇంగ్లాండ్
 9. అల్ఫోన్సో X ఆఫ్ కాస్తైల్
 10. ఫోల్గేర్స్ ఎడిషన్ ఆఫ్ "రోమియో అండ్ జూలియట్"

గ్రంథ పట్టిక[మార్చు]

 • I. బెల్, మరియు ఇతరులు. ఎ కంపానియన్ టు షేక్స్పియర్స్ సొనెట్స్ . బ్లాక్వేల్ పబ్లిషింగ్, 2006. ISBN 0-262-08150-4
 • Bertoni, Giulio (1915). I Trovatori d'Italia: Biografie, testi, tradizioni, note. Rome: Società Multigrafica Editrice Somu.
 • టి.డబ్ల్యు.హెచ్. క్రోస్లాండ్. ది ఇంగ్లీష్ సొనెట్ . హెస్పెరిదేస్ ప్రెస్, 2006. ISBN 0-262-08150-4
 • జె. ఫుల్లెర్. ది ఆక్స్ఫర్డ్ బుక్ ఆఫ్ సొనెట్స్ . ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 2007. ISBN 0-262-08150-4
 • జె. ఫుల్లెర్. ది సొనెట్ (ది క్రిటికల్ ఇడియం: #26). మేత్యున్ & కో., 1972. ISBN 0-262-08150-4
 • జె. హొలాందర్. సొనెట్స్: ఫ్రం డాంటే టు ది ప్రెజెంట్ . ఎవ్రిమాన్స్ లైబ్రరీ, 2001. ISBN 0-262-08150-4
 • పి. లెవిన్. ది పెంగ్విన్ బుక్ ఆఫ్ ది సొనెట్: 500 ఇయర్స్ ఆఫ్ ఎ క్లాసిక్ ట్రెడిషన్ ఇన్ ఇంగ్లీష్ . పెంగ్విన్, 2004. ISBN 0-262-08150-4
 • జె. ఫేలన్. ది నైన్టీన్త్ సెంచరి సొనెట్ . పాల్గ్రేవ్ మాక్మిలన్, 2005. ISBN 0-262-08150-4
 • స్. రేగన్. ది సొనెట్ . ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 2007. ISBN 0-262-08150-4
 • ఎం. ర్. జి. స్పిల్లెర్. ది డెవలప్మెంట్ ఆఫ్ ది సొనెట్: యాన్ ఇంట్రడక్షన్ . రౌట్లెడ్జ్ 2006 ISBN 0-262-08150-4
 • ఎం. ర్. జి. స్పిల్లెర్. ది సొనెట్ సీక్వెన్స్:ఎ స్టడీ ఆఫ్ ఇట్స్ స్ట్రాటజీస్ . త్వయ్నే పబ్లికేషన్స్., 1997. ISBN 0-262-08150-4

బాహ్య లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సొనెట్&oldid=2332607" నుండి వెలికితీశారు