Jump to content

సోడియం

వికీపీడియా నుండి
సోడియం, 00Na
సోడియం
Appearancesilvery white metallic
Standard atomic weight Ar°(Na)
సోడియం in the periodic table
Groupgroup 1: hydrogen and alkali metals
Periodperiod 3
Block 
Electrons per shell2,8,1
Physical properties
Phase at STPsolid
Melting point370.944 K ​(97.794 °C, ​208.029 °F)
Boiling point1156.090 K ​(882.940 °C, ​1621.292 °F)
Density (near r.t.)0.968 g/cm3
when liquid (at m.p.)0.927 g/cm3
Critical point(extrapolated)
2573 K, 35 MPa
Heat of fusion2.60 kJ/mol
Heat of vaporization97.42 kJ/mol
Molar heat capacity28.230 J/(mol·K)
Vapor pressure
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 554 617 697 802 946 1153
Atomic properties
Oxidation states−1, 0,[3] +1 (a strongly basic oxide)
ElectronegativityPauling scale: 0.93
Ionization energies
Atomic radiusempirical: 186 pm
Covalent radius166±9 pm
Van der Waals radius227 pm
Other properties
Natural occurrenceprimordial
Crystal structurebody-centered cubic (bcc)
Body-centered cubic crystal structure for సోడియం
Speed of sound thin rod3200 m/s (at 20 °C)
Thermal expansion71 µm/(m⋅K) (at 25 °C)
Thermal conductivity142 W/(m⋅K)
Electrical resistivity47.7 n Ω⋅m (at 20 °C)
Magnetic orderingparamagnetic[4]
Young's modulus10 GPa
Shear modulus3.3 GPa
Bulk modulus6.3 GPa
Mohs hardness0.5
Brinell hardness0.69 MPa
CAS Number7440-23-5
History
DiscoveryHumphry Davy (1807)
First isolationHumphry Davy (1807)
Symbol"Na": from New Latin natrium, coined from German Natron, 'natron'
Isotopes of సోడియం
Template:infobox సోడియం isotopes does not exist
 Category: సోడియం
| references

సోడియమ్ (ఆంగ్లం: Sodium) ఒక క్షార లోహము. దీన్ని 'Na' (లేటిన్ - నేట్రియమ్) అనే సంకేతముతో సూచిస్తారు. సోడియమ్ పరమాణు సంఖ్య -11, పరమాణు భారము - 22.9898 గ్రా/మోల్, ఆక్సీకరణ సంఖ్య +1. దీని ఒకే ఒక ఐసోటోపు - 23Na. కరిగించిన సోడియం హైడ్రాక్సైడ్ గుండా విద్యుత్ ప్రసరింపజేయడం ద్వారా సర్ హంఫ్రీ డేవీ 1807లో మొదటిసారిగా ఈ మూలకాన్ని స్వచ్ఛమైన రూపంలో విడదీయగలిగాడు. సోడియం చాలా త్వరగా వాతావరణంలో ఆక్సీకరణం చెందుతుంది మరియు నీటితో ఉధృతంగా చర్య జరుపుతుంది కావున దీనిని కిరోసిన్ వంటి ద్రావణంలో సాధారణంగా భద్రపరుస్తారు. ఇది ప్రకృతిలో సమ్మేళనాలుగా చాలా విస్తారంగా ఉంటుంది. సముద్రజలంలో 2.0 నుంచి 2.9 సోడియం క్లోరైడ్ (సాధారణ ఉప్పు) శాతం ఉంటుంది. జీవులన్నింటికి సోడియం ఒక కీలకమైన మూలకం.

సోడియమ్ ధర్మాలు

భౌతిక ధర్మాలు

  • సోడియమ్ చాలా మెత్తని లోహం. తాజాగా కోసిన సోడియమ్ వెండి లాగా తెల్లగా మెరుస్తూ ఉంటుంది. గాలిలో ఉంచినప్పుడు త్వరగా నల్లబడుతుంది. అందువల్ల దీన్ని కిరోసిన్ వంటి జడ ద్రావణాలలో నిల్వ చేస్తారు. దృగ్గోచర వర్ణపటంలో పసుపు ప్రాంతంలో దాని స్వాభావికమైన D1, D2 (588.9950 and 589.5924 nm) ఉద్గార రేఖలను ఇస్తుంది. మెర్క్యూరీతో ఎమాల్గమ్ ను ఏర్పరుస్తుంది.

రసాయన ధర్మాలు

  • తడిగాలిలో సోడియమ్ తళుకు పోగొట్టుకొంటుంది. సోడియమ్ ఆక్సైడ్, హైడ్రాక్సైడ్, చివరికి కార్బొనేట్ లు మెల్లిగా ఏర్పడటంవల్ల తెల్లని పొడిగా మారుతుంది.
  • సోడియమ్ నీటితో ఉధృతంగా చర్య జరిపి హైడ్రోజన్ నిస్తుంది. చర్యోష్ణం వల్ల కరిగిన సోడియమ్ నీటి పై కదలాడుతూ చివరకు మండుతుంది.
  • హైడ్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరీన్ లతో సంయోగం చెంది ద్విఘటక సమ్మేళనాలనిస్తుంది.
  • మలినాలు, ఉత్ప్రేరకాలు లేకుంటే సోడియమ్ శుద్ధ అమ్మొనియా ద్రవంలో కరిగి ముదురు నీలిరంగు ద్రావణాన్నిస్తుంది. అయితే ఇనుము వంటి ఉత్ప్రేరకాలుగాని, మలినాలు గాని ఉన్నప్పుడు సోడియమ్ ఎమైడ్ (సోడమైడ్), హైడ్రోజన్ లను ఇస్తుంది.
  • సోడియమ్ బలమైన క్షయకరణి. చాలా సమ్మేళనాలను ఇది క్షయకరణం చేస్తుంది.

సోడియమ్ ఖనిజాలు

  • రాతి ఉప్పు (Rock salt - NaCl)
  • చిలె సాల్ట్ పీటర్ (Chile Salt Petre - NaNO3)
  • సాజి మిట్టి (Na2CO3)
  • మిరాబిలైట్ (Mirabilite - Na2SO4)
  • బొరాక్స్ (Borax - Na2B4O7·10 H2O)
సోడియమ్ జ్వాల పరీక్ష

ఉపయోగాలు

  • సోడియమ్ ను ఉత్ప్రేరకంగా రబ్బర్ తయారీలో వాడతారు.
  • సోడియమ్ భాష్ప దీపాలు (Sodium vapour lamps) సోడియమ్ తో తయారుచేస్తారు.
  • Na - Pb మిశ్రమ లోహాన్ని లెడ్ టెట్రా ఇథైల్ (TEL), లెడ్ టెట్రా మైథైల్ (TML) వంటి 'ఏంటీ-నాక్ (Anti-knock) ' పదార్థాల తయారీల్లో వాడతారు. వీటిని అంతర్దహన యంత్రాల్లో వాడతారు.

మూలాలు

  1. "Standard Atomic Weights: Sodium". CIAAW. 2005.
  2. Prohaska, Thomas; Irrgeher, Johanna; Benefield, Jacqueline; et al. (2022-05-04). "Standard atomic weights of the elements 2021 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry (in ఇంగ్లీష్). doi:10.1515/pac-2019-0603. ISSN 1365-3075.
  3. The compound NaCl has been shown in experiments to exists in several unusual stoichiometries under high pressure, including Na3Cl in which contains a layer of sodium(0) atoms; see Zhang, W.; Oganov, A. R.; Goncharov, A. F.; Zhu, Q.; Boulfelfel, S. E.; Lyakhov, A. O.; Stavrou, E.; Somayazulu, M.; Prakapenka, V. B.; Konôpková, Z. (2013). "Unexpected Stable Stoichiometries of Sodium Chlorides". Science. 342 (6165): 1502–1505. arXiv:1310.7674. Bibcode:2013Sci...342.1502Z. doi:10.1126/science.1244989. PMID 24357316. S2CID 15298372.
  4. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Lide, D. R., ed. (2005). CRC Handbook of Chemistry and Physics (86th ed.). Boca Raton (FL): CRC Press. ISBN 0-8493-0486-5.
  5. Endt, P. M. (1990). "Energy levels of A = 21–44 nuclei (VII)". Nuclear Physics A. 521: 1–400. Bibcode:1990NuPhA.521....1E. doi:10.1016/0375-9474(90)90598-G.
"https://te.wikipedia.org/w/index.php?title=సోడియం&oldid=2008903" నుండి వెలికితీశారు