సోడియం నైట్రైట్ (వైద్య ఉపయోగం)
| Clinical data | |
|---|---|
| అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | FDA Professional Drug Information |
| ప్రెగ్నన్సీ వర్గం | ? |
| చట్టపరమైన స్థితి | ? |
| Identifiers | |
| ATC code | ? |
| Chemical data | |
| Formula | NaNO2 |
| Mol. mass | 68.9953 |
| |
సైనైడ్ విషప్రయోగం చికిత్సకు సోడియం థియోసల్ఫేట్ కలిసి సోడియం నైట్రైట్ మందులుగా ఉపయోగిస్తారు.[1] ఇది తీవ్రమైన సైనైడ్ విషప్రభావం ఉన్న సందర్భాలలో మాత్రమే సిఫార్సు చేయబడుతుంది.[2] సైనైడ్ విషప్రభావం, కార్బన్ మోనాక్సైడ్ విషప్రభావం రెండూ ఉన్నవారిలో సాధారణంగా సోడియం థయోసల్ఫేట్‌ను మాత్రమే సిఫార్సు చేస్తారు.[3] ఇది సిరలోకి నెమ్మదిగా ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[1]
దుష్ప్రభావాలలో తక్కువ రక్తపోటు, తలనొప్పి, శ్వాస ఆడకపోవడం, స్పృహ కోల్పోవడం, వాంతులు ఉంటాయి.[1] అంతర్లీన గుండె జబ్బులు ఉన్న వ్యక్తులలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి.[1] చికిత్స సమయంలో ప్రజల మెథెమోగ్లోబిన్ స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.[1] గర్భధారణ సమయంలో బాగా అధ్యయనం చేయకపోయినా, శిశువుకు హాని కలిగించే అవకాశం ఉందని కొన్ని ఆధారాలు ఉన్నాయి.[4] సోడియం నైట్రైట్ మెథెమోగ్లోబిన్‌ను సృష్టించడం ద్వారా పనిచేస్తుందని నమ్ముతారు, ఇది తరువాత సైనైడ్‌తో బంధించి మైటోకాండ్రియా నుండి దానిని తొలగిస్తుంది.[4]
సోడియం నైట్రైట్ 1920లు, 1930లలో వైద్యపరమైన వాడుకలోకి వచ్చింది.[5][6] ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర ఔషధాల జాబితా ఉంది.[7] యునైటెడ్ స్టేట్స్‌లో సోడియం థయోసల్ఫేట్‌తో కలిపి దీని ధర సుమారు US$110.
మూలాలు
[మార్చు]- 1 2 3 4 5 World Health Organization (2009). Stuart MC, Kouimtzi M, Hill SR (eds.). WHO Model Formulary 2008. World Health Organization. p. 65. hdl:10665/44053. ISBN 9789241547659.
- ↑ "Sodium Nitrite Solution for Injection - Summary of Product Characteristics (SPC) - (eMC)". www.medicines.org.uk. Archived from the original on 18 September 2017. Retrieved 15 January 2017.
- ↑ Baren, Jill M. (2008). Pediatric Emergency Medicine (in ఇంగ్లీష్). Elsevier Health Sciences. p. 1018. ISBN 978-1416000877. Archived from the original on 2017-01-16.
- 1 2 "Sodium Nitrite Injection - FDA prescribing information, side effects and uses". www.drugs.com. Archived from the original on 2017-01-18.
- ↑ Dart, Richard C. (2004). Medical Toxicology (in ఇంగ్లీష్). Lippincott Williams & Wilkins. p. 172. ISBN 9780781728454. Archived from the original on 2017-01-16.
- ↑ Bryan, Nathan S.; Loscalzo, Joseph (2011). Nitrite and Nitrate in Human Health and Disease (in ఇంగ్లీష్). Springer Science & Business Media. p. 226. ISBN 9781607616160. Archived from the original on 2017-01-16.
- ↑ World Health Organization (2019). World Health Organization model list of essential medicines: 21st list 2019. Geneva: World Health Organization. hdl:10665/325771. WHO/MVP/EMP/IAU/2019.06. License: CC BY-NC-SA 3.0 IGO.