సోనిపట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Sonipat జిల్లా

सोनीपत ज़िला
ਸੋਨੀਪਤ ਜ਼ਿਲਾ
Haryana లో Sonipat జిల్లా స్థానము
Haryana లో Sonipat జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంHaryana
పరిపాలన విభాగముRohtak
ముఖ్య పట్టణంSonipat
మండలాలు1. Sonipat, 2. Kharkhauda, 3. Gohana, 4. Gannaur
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుSonipat
 • శాసనసభ నియోజకవర్గాలుGanaur, Rai, Kharkhauda, Sonipat, Gohana, Baroda
విస్తీర్ణం
 • మొత్తం2,260 కి.మీ2 (870 చ. మై)
జనాభా
(2001)
 • మొత్తం12,78,830
 • సాంద్రత570/కి.మీ2 (1,500/చ. మై.)
 • పట్టణ
321
జనగణాంకాలు
 • అక్షరాస్యత73.71
 • లింగ నిష్పత్తి839/1000
ప్రధాన రహదార్లుNH-1 NH-71
సగటు వార్షిక వర్షపాతం624 మి.మి.
జాలస్థలిఅధికారిక జాలస్థలి

హర్యానా రాష్ట్ర 21 జిల్లాలలో సోనీపట్ జిల్లా (హిందీ:सोनीपत ज़िला) (పంజాబు:ਸੋਨੀਪਤ ਜ਼ਿਲਾ)ఒకటి. జిల్లా కేంద్రంగా సోనీపట్ పట్టణం ఉంది. హర్యానా రాష్ట్రంలోని ఢిల్లీ, గుర్‌గావ్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్ ( ఉత్తరప్రదేశ్) వంటి కేంద్రపాలిత ప్రాంతాలలో సోనీపట్ జిల్లా ప్రాంతం ఒకటి. సోనీపట్ జిల్లా దక్షిణ సరిహద్దులో కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ, ఉత్తర సరిహద్దులో పానిపట్ జిల్లా, వాయవ్య సరిహద్దులో జింద్ జిల్లా, తూర్పు సరిహద్దులో యమునానదీ తీరంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతాలు, పశ్చిమ సరిహద్దులో రోహ్‌తక్ జిల్లా ఉన్నాయి.

పేరువెనుక చరిత్ర[మార్చు]

జిల్లా పరిపాలక రాజధానిగా వున్న సోనిపట్ పేరును ఈ జిల్లాకు పెట్టారు. సోనిపట్ అనే పేరు అంతకుముందు రెండు సంస్కృత పదాల నుండి వచ్చింది, ఇది తరువాత స్వర్ణ ప్రస్థ అయింది (గోల్డెన్ సిటీ) స్వర్ణ (గోల్డ్ ), ప్రస్థ (ప్రదేశం ) .కాలాను గుణంగా ఈ పేరు స్వర్ణ ప్రస్థ ఉచ్ఛారణ దాని ప్రస్తుత రూపంలో, సోనిపట్ గా మారినది. ఈ నగరం యొక్క సూచన మహాభారతంలో వస్తుంది, ఆ సమయంలో, అది హస్తినాపూర్ రాజ్యంలో భాగంగా వుండేది. పాండవుల రాయ బార సమయంలో పాండవులు తమకు ఐదు ఊళ్ళు అయినా ఇమ్మని అడిగిన..... ఆ అయిదు ఊళ్ళలో ఇది కూడా ఒకటి.

చరిత్ర[మార్చు]

మునుపటి రోహ్‌తక్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి 1972లో ఈ జిల్లా రూపొందించబడింది.

భౌగోళికం[మార్చు]

సోనీపట్ జిల్లా అంతా పంజాబు మైదానంలో భాగంగా ఉంది. అయినప్పటికీ కొన్ని భూభాలలో నేల చదరంగా ఉండదు. జిల్లాలో అత్యధిక భాగం మెత్తని మట్టి ఉంటుంది. కొన్ని భూభాగాలలో ఇసుక ఉంటుంది. మైదానాలు తూర్పు, దక్షిణంగా వాలుగా ఉంట్జుంది. భౌగోళికంగా జిల్లా 3 భూభాగాలుగా విభజించబడింది : ఖదార్, ఎగువభూమి, ఇసుక భూమి.

కదార్[మార్చు]

యమునానదీ తీరం వెంట 2-4 మైళ్ళ వెడల్పున వరదభూములుగా ఉన్నాయి. ఖాదర్ మైదానం 20-30 మైళ్ళపొడవు ఉంటుంది. ఈ భూభాగంలో యమునానది తీసుకువద్తున్న మెత్తని బంక మట్టి ఉంటుంది. ఖాదర్ ప్రాంత వ్యవసాయదారులు వరి, చెరుకు పండించబడుతుంది. సమీపకాలంలో జిల్లారైతులు అరటి, బొప్పాయి పంటలు వేయడం మొదలు పెట్టారు.

ఎగువమైదానం[మార్చు]

ఖదార్ పశ్చిమంలో సోనీపట్ తాలూకా ఉంది: ఎగువ మైదానం సారవంతమైన మట్టితో కప్పబడి ఉంది. దీనికి చక్కగా సాగునీరు అందుతూ విస్తారమైన పంటలను అందిస్తుంది. నూనెగింజలు, హార్టికల్చర్ మొక్కలు,మ్నూనెగింజలు, కూరగాయలు, పూలు ఉత్పత్తి ఔతున్నాయి. గొహనా తాలూకా లోయలు ఆరవల్లి ఉత్తరభాగంగా పరిగణించబడుతుంది.

ఇసుక భూమి[మార్చు]

జిల్లాలో స్వల్పభాగం ఇసుక, ఇసుకరాళ్ళతో కప్పబడి ఉంది.

విభాగాలు[మార్చు]

జిల్లాలో 3 ఉపభాగాలు ఉన్నాయి: గనూర్, సోనీపట్, గోహన. అవి అదనంగా 4 తాలూకాలుగా విభజించబడ్డాయి: గనూర్, సోనిపట్, ఖర్ఖుడా, గొహన. సోనిపట్, ఖర్ఖౌడా సోనిపట్ న్యాయపరిధిలో ఉన్నాయి. గనూర్, గొహనాలు వరుసగా వాటివాటి న్యాయపరిధిలో ఉన్నాయి. అదనంగా ఇవి 7 బ్లాకులుగా విభజించబడ్డాయి: గనూర్, సోనీపట్, రాజ్, ఖర్ఖొడా, గొహనా, కథురా, ముంద్లనా. జిల్లాలో 343 గ్రామాలు ఉన్నాయి. వీటిలో 15 నిర్జనగ్రామాలుగా ఉన్నాయి. జిల్లాలో 6 విధానసభ నియోజకవర్గాలు ఉన్నాయి : గనౌర్, రాజ్, ఖర్ఖౌడా, సోనీపట్, గొహన, బరొడా. ఇవన్నీ సోనీపట్ పార్లమెంటు నియోజక వర్గంలో భాగంగా ఉన్నాయి. సోనీపట్ పార్లమెంటు నియోజక వర్గంలోజింద్ జులానా, సాఫీడన్, జింద్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.[1] జిల్లాలో ఒకేఒక మునిసిపల్ కౌంసిల్, 3 మునిసిపల్ కమిటీలు ఉన్నాయి: గనౌర్,గొహన, ఖర్ఖొడా.

సోనీపట్ న్యాయపరిధిలో ఉన్న గ్రామాలు :

 • బిచ్పరి
 • భయాంపూర్
 • జఖౌలి
 • ఖెవ్రా, హర్యానా
 • కుండ్లి

 • నహ్రి
 • రైపూర్ (సోనీపట్)
 • సిస్నా

విద్య[మార్చు]

సోనీపట్ జిల్లా ఉత్తర భారతదేశంలోని ప్రధాన విద్యాకేంద్రాలలో ఒకటి. జిల్లాలో పలు పాఠశాలలు, కళాశాలలతో జిల్లాలో పలు విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి. 1987లో ముర్తల్ లో " స్థాపించబడున దీనబంధు చోటురాం రాం యూనివర్శిటీ ఆఫ్ సైంస్ అండ్ టెక్నాలజీ ", 2006లో సోనిపట్‌లో " భగత్ ఫూల్ సింగ్ మహిళా విశ్వవిద్యాలయం ", 2009లో రాత్ధానా వద్ద స్థాపించబడిన " ఒ.పి. జిండల్ గ్లోబల్ యూనివర్శిటీ మొదలైనవి ఉన్నాయి.

ప్రయాణ సౌకర్యాలు[మార్చు]

సోనిపట్ రైల్వే స్టేషను " నార్తన్ రైల్వే జోన్ " లో భాగంగా ఉంది. అంబాలా-ఢిల్లీ రైల్ మార్గం , పలు పాసెంజర్ రైళ్ళు ఈ మర్గంద్వారా పయనిస్తుంటాయి. జాతీయరహదారి 1 , జాతీయరహదారి 71 ఈ జిల్లాను దాటిపోతుంది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,480,080,[2]
ఇది దాదాపు. గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 338 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 697 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 15.71%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 853:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 80.8%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలు[మార్చు]

 1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 150, 157.
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Gabon 1,576,665 line feed character in |quote= at position 6 (help)
 4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Hawaii 1,360,301 line feed character in |quote= at position 7 (help)

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సోనిపట్&oldid=2877245" నుండి వెలికితీశారు