సోనియా గాంధీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

సోనియా గాంధీ (About this sound pronunciation ; అసలు పేరు అడ్విగె ఆంతోనియా మాయినో[1][2][3]. ఇటలీకి చెందిన ఈమె భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. 9 డిసెంబర్ 1946న జన్మించారు సోనియా. 1998 నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సోనియా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్య ఈమె. 1991లో రాజీవ్ గాంధీ హత్య తరువాత కాంగ్రెస్ నాయకులు ఆమెను ప్రధాని పదవి తీసుకోమని అడుగగా  ఆమె నిరాకరించారు[4]. 1997లో రాజకీయ రంగప్రవేశం చేసిన సోనియా 1998లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా  ఎన్నికయారు.

2004 నుంచి సోనియా గాంధీ లోక్ సభలోని యునైటెడ్ ప్రాగ్రెసివ్ ఎలియస్స్ కు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 2010లో వరుసగా నాలుగోసారి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎంపికవడంతో 125 ఏళ్ళ చరిత్రగల కాంగ్రెస్ పార్టీకి అతి ఎక్కువ కాలం అధ్యక్షురాలిగా వ్యవహరించిన వారిగా ఆమె చరిత్ర సృష్టించారు[5]. ఆమె విదేశీయురాలు కావడం ఎన్నో వివాదాలకు కారణమైంది[6][7]. ఇటలీకి చెందిన వ్యాపారవేత్త ఒట్టివో కాట్రొచి తో స్నేహం కూడా వివాదాలకు కారణమైంది. ఒట్టొవో బోఫోర్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు[8]. ఈమెకు ముందు కాంగ్రెస్ కు కొంతమంది విదేశీయులు అధ్యక్షులుగా ఉన్నా స్వాతంత్ర్యం తరువాత ఈమే మొదటి విదేశీ అధ్యక్షురాలు.[9]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

సోనియా గాంధి  జన్మస్థలం, 31, కంట్రడా మెయిని(మెయిని వీధి), లూసియానా,  ఇటలీ(కుడివైపు ఇల్లు)

సోనియా తల్లిదండ్రులు స్టిఫెనో, పోలా మైనో. ఇటలీలోని లూసియానా దగ్గర ఉన్న  కంట్రడా మెయిని గ్రామంలో జన్మించారు ఆమె[10][11]. ఈ గ్రామం  విచెంజా కు 30 కి.మీ. దూరంలో ఉంది.  ఈ గ్రామంలో  మెయిని ఇంటి పేరు గల కుటుంబాలు కొన్ని  తరాలుగా  ఉంటున్నారు[12][13][14]. వీరు రోమన్  కేథలిక్ లు.  సోనియా టురిన్ కు దగ్గర్లోని ఒర్బస్సానో అనే పట్టణంలో ఆమె పెరిగారు[15]. ఈమె తండ్రి స్టీఫెనోకు ఆ పట్టణంలోనే ఒక నిర్మాణ వ్యాపార సంస్థ ఉంది[16]. ఆయన రెండో ప్రపంచ యుద్ధం లో సోవియట్  మిలటరీకి  వ్యతిరేకంగా పోరాడారు. ముస్సోలిని కి, ఇటలీకి చెందిన నేషనల్ ఫాసిస్ట్ పార్టీకి అనుకులునిగా ప్రకటించుకున్నారు. ఆయన 1983లో మరణించారు[17]. ఇప్పటికీ సోనియా తల్లి, అక్కాచెల్లెళ్ళు  ఒర్బస్సానో పట్టణానికి దగ్గర్లోనే ఉంటున్నారు.

1964లో బెల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ భాషా స్కూల్ లో ఇంగ్లీష్ నేర్చుకునేందుకు ఆమె కేంబ్రిడ్జ్ నగరం వచ్చారు.[18] ఆ నగరంలోని ఓ గ్రీక్ రెస్టారెంట్ లో 1965లో ఆమె రాజీవ్ గాంధీ ని ఆమె కలిశారు.  కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాలలో రాజీవ్ ఇంజినీరింగ్  చదివేవారు. వీరిద్దరూ 1968లో హిందూ వివాహ  సంప్రదాయంలో  పెళ్ళి చేసుకున్నారు[19]. పెళ్ళయ్యాకా సోనియా తన అత్తగారూ, అప్పటి భారత ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ నివాసానికి  మారారు.

వీరికి ఇద్దరు పిల్లలు. రాహుల్ గాంధీ(జననం:1970), ప్రియాంక గాంధీ(జననం:1972). రాజీవ్ పైలెట్ గా పనిచేసేవారు. సోనియా కుటుంబాన్ని చూసుకునేవారు[20]ఇందిరా గాంధీ భారత అత్యవసర స్థితి తరువాత 1977లో రాజీవ్ తన కుటుంబంతో సహా కొన్ని నెలలు విదేశాలకు వెళ్ళిపోయారు[21]. 1982లో రాజీవ్ సోదరుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో  చనిపోయిన తరువాత ఆయన రాజకీయాలలోకి వచ్చారు. ఆ తరువాత నుంచి సోనియా కుటుంబంపై దృష్టి మరలకుండా ఉండేందుకు ప్రజలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.

రాజకీయ కెరీర్[మార్చు]

ప్రధాని భార్యగా..[మార్చు]

అత్త ఇందిరా గాంధి మరణం తరువాత, భర్త ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించాకా సోనియాకు భారతప్రజలతో మమేకం అవ్వాల్సి వచ్చింది. ప్రధాని భార్యగా ఆమె అధికారులు, నాయకలకు అతిధి మర్యాదలు  చేసేవారు. రాజీవ్ తో కలసి ఎన్నో రాష్ట్రాలను అధికారికంగా సందర్శించేవారు[22]. 1984లో అమేధి నియోజకవర్గంలో రాజీవ్  తన  వదిన మేనకా గాంధీ కి వ్యతిరేకంగా నిలబడినప్పుడు సోనియా తన  భర్త కోసం విపరీతంగా ప్రచారం చేశారు. రాజీవ్ పదవీకాలం పూర్తయిన తరువాత బోఫోర్స్ కుంభకోణం బయటపడింది. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఇటలీకి చెందిన వ్యాపారవేత్త ఒట్టోవియో  సోనియా స్నేహితుడని, ఆయన ప్రధాని అధికార నివాసానికి  వచ్చేవారని ప్రచారం విపరీతంగా జరిగేది[23]

సోనియా 27 ఏప్రిల్ 1983లో ఇటలీ ఎంబసీకి తన ఇటాలియన్  పాస్ పోర్ట్ తిరిగి ఇచ్చేసారని  సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అప్పట్లో ప్రకటించారు. 1992 వరకు భారత ప్రభుత్వం రెండు జాతీయతలను అంగీకరించలేదు. అందుకోసం 1983లో భారత పౌరసత్వం కోసం ఇటాలియన్  పౌరసత్వం వదులుకున్నారు.[24]

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా..[మార్చు]

డిసెంబర్ 2010లో దేశ పర్యటనలో భాగంగా  అప్పటి, ప్రస్తుత రష్యా ప్రధాని మిర్టీ మెద్వెదెవ్ తో  సోనియా

రాజీవ్ గాంధీ మరణం తరువాత, సోనియా ప్రధానమంత్రి పదవిని నిరాకరించడంతో పి.వి.నరసింహారావు ను ప్రధానిగా పార్టీ పెద్దలు,  సోనియా నిర్ణయించారు. 1996లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినపుడు  మాధవరావ్ సింధియా, రాజేష్ పైలట్, నారాయణ్ దత్ తివారీ, అర్జున్ సింగ్, మమతా బెనర్జీ, జి.కె.మూపనర్, పి. చిదంబరంజయంతి నటరాజన్ వంటి సీనియర్ నాయకులు అప్పటి పార్టీ అధ్యక్షులు సీతారాం కేసరిపై బహిరంగ తిరుగుబాటు చేసి, కొందరు పార్టీ నుంచి  బయటకు వచ్చేసి, పార్టీ లో చీలికలు తెచ్చారు.[25]

పార్టీని తిరిగి కలపడానికి, 1997లో సోనియా కలకత్తా ప్లీనరీ  సమావేశంలో ప్రాధమిక సభ్యత్వంతో మొదలు పెట్టి, 1998లో పార్టీ నాయకురాలిగా ఎదిగారు[2][26].

సోనియా గాంధీ (About this sound pronunciation ; అసలు పేరు అడ్విగె ఆంతోనియా మాయినో[27][2][28]. ఇటలీకి చెందిన ఈమె భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. 9 డిసెంబర్ 1946న జన్మించారు సోనియా. 1998 నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సోనియా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్య ఈమె. 1991లో రాజీవ్ గాంధీ హత్య తరువాత కాంగ్రెస్ నాయకులు ఆమెను ప్రధాని పదవి తీసుకోమని అడుగగా  ఆమె నిరాకరించారు[29]. 1997లో రాజకీయ రంగప్రవేశం చేసిన సోనియా 1998లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా  ఎన్నికయారు.

2004 నుంచి సోనియా గాంధీ లోక్ సభలోని యునైటెడ్ ప్రాగ్రెసివ్ ఎలియస్స్ కు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 2010లో వరుసగా నాలుగోసారి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎంపికవడంతో 125 ఏళ్ళ చరిత్రగల కాంగ్రెస్ పార్టీకి అతి ఎక్కువ కాలం అధ్యక్షురాలిగా వ్యవహరించిన వారిగా ఆమె చరిత్ర సృష్టించారు[30]. ఆమె విదేశీయురాలు కావడం ఎన్నో వివాదాలకు కారణమైంది[6][31]. ఇటలీకి చెందిన వ్యాపారవేత్త ఒట్టివో కాట్రొచి తో స్నేహం కూడా వివాదాలకు కారణమైంది. ఒట్టొవో బోఫోర్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు[32]. ఈమెకు ముందు కాంగ్రెస్ కు కొంతమంది విదేశీయులు అధ్యక్షులుగా ఉన్నా స్వాతంత్ర్యం తరువాత ఈమే మొదటి విదేశీ అధ్యక్షురాలు.[33]

1964లో బెల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ భాషా స్కూల్ లో ఇంగ్లీష్ నేర్చుకునేందుకు ఆమె కేంబ్రిడ్జ్ నగరం వచ్చారు.[34] ఆ నగరంలోని ఓ గ్రీక్ రెస్టారెంట్ లో 1965లో ఆమె రాజీవ్ గాంధీ ని ఆమె కలిశారు.  కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాలలో రాజీవ్ ఇంజినీరింగ్  చదివేవారు. వీరిద్దరూ 1968లో హిందూ వివాహ  సంప్రదాయంలో  పెళ్ళి చేసుకున్నారు[35]. పెళ్ళయ్యాకా సోనియా తన అత్తగారూ, అప్పటి భారత ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ నివాసానికి  మారారు.

వీరికి ఇద్దరు పిల్లలు. రాహుల్ గాంధీ(జననం:1970), ప్రియాంక గాంధీ(జననం:1972). రాజీవ్ పైలెట్ గా పనిచేసేవారు. సోనియా కుటుంబాన్ని చూసుకునేవారు[36]ఇందిరా గాంధీ భారత అత్యవసర స్థితి తరువాత 1977లో రాజీవ్ తన కుటుంబంతో సహా కొన్ని నెలలు విదేశాలకు వెళ్ళిపోయారు[37]. 1982లో రాజీవ్ సోదరుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో  చనిపోయిన తరువాత ఆయన రాజకీయాలలోకి వచ్చారు. ఆ తరువాత నుంచి సోనియా కుటుంబంపై దృష్టి మరలకుండా ఉండేందుకు ప్రజలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.

References[మార్చు]

 1. Sonia Gandhi.
 2. 2.0 2.1 2.2 "Sonia Gandhi Biography". Elections.in. Retrieved 24 May 2014. 
 3. Paranjoy Guha Thakurta, Shankar Raghuraman (2007). Divided we stand: India in a time of coalitions. Los Angeles : SAGE Publications, 2007. p. 148. ISBN 978-0-7619-3663-3. 
 4. "ASSASSINATION IN INDIA; Sonia Gandhi Declines Invitation To Assume Husband's Party Post". The New York Times. 24 May 1991. Retrieved 25 May 2014. 
 5. "Fourth time in a row, Sonia Gandhi is Congress chief". The Times of India. 4 September 2010. Retrieved 25 May 2014. 
 6. 6.0 6.1 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; autogenerated1 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 7. Ramaseshan, Radhika (30 August 2002). "BJP sees Gujarat ammo in Sonia origins". The Telegraph (Calcutta, India). Retrieved 2 February 2010. 
 8. Nelson, Dean (14 January 2011). "Sonia Gandhi under pressure over Bofors scandal relationship". The Telegraph (New Delhi, India). Retrieved 1 March 2014. 
 9. "On being foreign and being nationalist". Chennai, India: Frontline Magazine. 22 May – 4 June 1999. Retrieved 2 February 2010. 
 10. Pictures from the book-biography "The Red sari" by Javier Moro.
 11. "Edvige Antonia Albina Maino". geneall.net. 
 12. Maini Lusiana.
 13. Sonia Gandy.
 14. Lusiana: parish church, townhall square, landscape.
 15. http://www.scribd.com/doc/32475652/The-Red-Sari.
 16. Meeting Mr Maino.
 17. In Maino land Archived 17 డిసెంబరు 2013 at the Wayback MachineWayback Machine.
 18. "Sonia Gandhi Biography". Pressbrief.in. 23 September 2011. Retrieved 11 March 2014. 
 19. "News Features". Catholic Culture. 20 November 2001. Retrieved 11 March 2014. 
 20. BREAKING THE SILENCE Retrieved 20 July 2007.
 21. Ramachandran, Aarthi. Decoding Rahul Gandhi. p. 1973. Retrieved 27 May 2014. 
 22. Rasheeda Bhagat. "Sonia Gandhi: Ordinary Italian to powerful Indian | Business Line". Thehindubusinessline.com. Retrieved 11 March 2014. 
 23. Who is Quattrocchi?
 24. "Citizenship: How to lose it?". Trentini Nel Mondo. Archived from the original on 7 January 2012. Retrieved 2 February 2010. 
 25. "The Sitaram Kesri case: How dynasty trumped ethics | Latest News & Updates at". Daily News & Analysis. 10 July 2011. Retrieved 30 May 2014. 
 26. "Sonia Gandhi re-elected Congress president, unopposed". NDTV. 3 September 2010. Retrieved 30 May 2014. 
 27. Sonia Gandhi.
 28. Paranjoy Guha Thakurta, Shankar Raghuraman (2007). Divided we stand: India in a time of coalitions. Los Angeles : SAGE Publications, 2007. p. 148. ISBN 978-0-7619-3663-3. 
 29. "ASSASSINATION IN INDIA; Sonia Gandhi Declines Invitation To Assume Husband's Party Post". The New York Times. 24 May 1991. Retrieved 25 May 2014. 
 30. "Fourth time in a row, Sonia Gandhi is Congress chief". The Times of India. 4 September 2010. Retrieved 25 May 2014. 
 31. Ramaseshan, Radhika (30 August 2002). "BJP sees Gujarat ammo in Sonia origins". The Telegraph (Calcutta, India). Retrieved 2 February 2010. 
 32. Nelson, Dean (14 January 2011). "Sonia Gandhi under pressure over Bofors scandal relationship". The Telegraph (New Delhi, India). Retrieved 1 March 2014. 
 33. "On being foreign and being nationalist". Chennai, India: Frontline Magazine. 22 May – 4 June 1999. Retrieved 2 February 2010. 
 34. "Sonia Gandhi Biography". Pressbrief.in. 23 September 2011. Retrieved 11 March 2014. 
 35. "News Features". Catholic Culture. 20 November 2001. Retrieved 11 March 2014. 
 36. BREAKING THE SILENCE Retrieved 20 July 2007.
 37. Ramachandran, Aarthi. Decoding Rahul Gandhi. p. 1973. Retrieved 27 May 2014.