సోమదత్తా సింహా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వృత్తిమహిళా శాస్త్రవేత్త

సోమదత్తా సింహా చిన్నతనంలో తండ్రి ఉద్యోగరీత్యా బదిలీలు అధికంగా ఉన్నందువలన పలు ప్రదేశాలలో నివసించవలసిన అవసరం ఏర్పడింది. కఠినమైన సాంఘిక నియమాల నుండి తప్పించుకోవడానికి అది ఒక అవకాశంగా మారడం ఆమెకు ఆనందం కలిగించింది. ఆమె తండ్రి అకాలంగా మరణించిన తరువాత వారు శాంతినికేతన్‌లో స్థిరపడ్డారు. కాళాత్మకత, సాహిత్యకత నిండి ఉన్న శాంతినికేతన్ నివాసం ఆమెకు ఆనందం ఇచ్చింది. ఠాగూరు ఆలోచనలకు ప్రతిబింబంగా ఏర్పాటుచేయబడిన శానితినికేతన్‌లో విద్యాభ్యాసం కొనసాగడం అదృష్టమని ఆమె భావించింది. ఆమె తల్లి కుమార్తెలిద్దరినీ వారి కోరిన విధంగా చదువుకుని స్థిరపడమని చెప్పింది. ఆ అవకాశాలను అందుకుని సోమదత్తా సింహా కూడా చక్కగా చదివి స్కాలర్‌షిప్ సాధించింది. ఆమెకు అప్పుడే విజ్ఞాన శాస్త్రము అంటే ఆరాధన కలిగింది. తగినవిధంగా టీచర్లు కూడా తోడ్పాటు ప్రోత్సాహం అందించారు. సోమదత్తా సింహా విజ్ఞాన శాస్త్రము అందులోని సమస్యలను అధ్యయనంచేసి అందులో తలెత్తే సందేహాలకు పరిష్కారం కనుక్కోవడానికి జీవితాలను అంకితం చేసిన శాస్త్రవేత్తల జీవితకథలను చదివి వారిపట్ల ఆరాధనా భావం పెంచుకున్నది.అలాగే వారిలా పరిశోధనలు చేయాలన్న తహ తహ కూడా మొదలైంది.

కాలేజ్[మార్చు]

సోమదత్తా ఉన్నత పాఠశాల టాపర్‌గా ఉత్తీర్ణత సాధించిన తరువాత సోమదత్తా సింహాకు కాకేజి చదువు, పోస్ట్ గ్రాజ్యుయేషన్‌లలో ఆమె మరో ఆలోచన లేకుండా ఫిజిక్స్‌ను ఎంచుకున్నది పలు ఆర్థిక, సాంఘిక సమస్యల మధ్య ఆమె జీవితం నిరాడంబరంగా సాగింది. తరువాత " ది నేషనల్ టాలెంట్ స్కాలర్‌షిప్పు " (ఎన్.ఎస్.టి.ఎస్) లభించింది. అది ఆమె అదువు ఒకదారికి వచ్చే వరకు సహకరించింది. తండ్రి లేని పిల్లలని త్వరగా వివాహం చెయ్యమని బంధువులు తీసుకువచ్చిన వత్తిడి నుండి అక్కచెల్లెళ్ళనిద్దరిని వారితల్లి కాపాడింది. అనుకు టీచర్లు, స్నేహితులు మద్దతు ఇచ్చారు. ఆమె స్కూలులో చదివే సమయంలో పాఠ్యపుస్తకాలను సీనియర్లు ఆనందంగా అందించారు. స్కాలర్ స్కాలర్‌షిప్పులో భాగగా పుస్తకాలు కూడా లభించడం మరికొంత సహకరించింది. కాలేజ్ చదువుకు కొంత నిధిసహాయం అందింది. కాలేజ్ రోజులలో ఆమె పలు విజ్ఞాన శాస్త్రము మాగజింస్ చదువుతుండేది.

రచన[మార్చు]

సోమదత్తా సింహా విద్యార్థింగా ఉన్నప్పుడే బెంగాలీ భాషలో వ్రాసిన కొన్ని వ్యాసాలు ప్రాంతీయ భాషలో అందించిన కాతణంగా పలువురి ఆదరణను చూరగొన్నాయి. ఆమె ఎన్.ఎస్.టి.సిలో రెండు సమ్మర్ క్యాపులలో పాల్గొన్నది. అక్కడ ఆమెకు పతిచయమైన వారిలో కొంతమందితో జీవితకాలం స్నేహం కొనసాగింది. వారిలో కొంతమంది జాతీయస్థాయిలో గుర్తింపు పొంది ఉన్నారు. చిన్న పట్టణం నుండి వచ్చిన సోమదత్తా సింహాకు సమ్మర్ క్యాంపులు జాతీయస్థాయిలో విద్యార్థుల అనుభవాలను అవగాహన చేసుకోవడానికి అవకాశం కలిగించాయి. ఉన్నతస్థాయి అధ్యయనానికి ఆమె తతల్లి ఆలోచనలకు భిన్నంగా కొలకత్తాకు వెలుపలి ప్రాంతాలను ఎంచుమున్నది. అదే సమయం బెంగాలులో కొన్ని సమాజిక అల్లర్లు చెలరేగాయి. రాజకీయ యుద్ధాల కారణంగా అంతర్జాతీయంగా యు.ఎస్, ఫ్రాన్స్ విశ్వవిద్యాలయాలలో అస్థిరత చోటుచేదుకుంది. చైనా, క్యూబాలలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

ఉన్నత విద్య[మార్చు]

సోమదత్తా సింహా ఎం.ఎస్.సి పూర్తిచేసిన తరువాత ఢిల్లీ లోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో దియరేటికల్, ఎంవిరాన్‌మెంటల్ విజ్ఞాన శాస్త్రము, బెంగుళూరు ఐ.ఐ.ఎస్.సిలో ఫిజిక్స్ అధ్యయనం చేయాలని నిశ్చయించుకున్నది. చాలామందికి థియరాటికల్ ఎంవిరాన్‌మెంటల్ విజ్ఞాన శాస్త్రము అంటే స్పష్టంగా తెలియదు. తరువాత రెండు సంచత్సరాలు ఢిల్లీ, బెంగుళూరుల మద్య అటూఇటూ పలుమార్లు ఆమె ప్రయాణాలు కొనసాగించింది. సహ విద్యార్ధూతో, టీచర్ల మద్య అనేక చర్చలు కొనసాగాయి. ఆమెలో ఈ అనుభవంతో రెండు సబ్జెక్టులను సమన్వయం చేస్తూ సరికొత్త ఆలోచనలు మొదలైయ్యాయి. తరువాత ఆమె జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో మాథమెటికల్, ఎక్స్‌పెరిమెంటల్ టూల్స్ ఉపయోగిస్తూ హైడ్రాలో డెవలప్‌మెంటల్ ప్రోసెస్ గురించి అధ్యయనం చెయడం మొదలు పెట్టింది. ఐ.ఐ.ఎస్.సి అతున్నత విద్యాసంబంధిత వాతావరణం, నెహ్రూ విశ్వవిద్యాలయంలో రాజకీయ, సామాజిక వాతావరణం ఆమెను మరింత ప్రభావితం చేసాయి.

ఉద్యోగం[మార్చు]

1983లో సోమదత్తా సింహా హైదరాబాదులో కొత్తగా స్థాపినచబడిన " ది సెంటర్ ఫర్ సెల్ల్యులర్ , మాలిక్యులర్ బయాలజీ "కి అభ్యర్థించి అందులో పనిచేయడం మొదలుపెట్టింది. ది సెంటర్ ఫర్ సెల్ల్యులర్ , మాలిక్యులర్ బయాలజీ "లో చురుకైన మేధావంతులైన యువత అధికంగా పనిచేస్తున్నారు. వారంతా శక్తివంతమైన నాయకత్వంలో చక్కని ఊహాత్మకమైన ఆలోచనలతో పనిచేస్తుండేవారు.

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.