సోమనాథ్ చోప్రా
| Personal information | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| National team | |||||||||||||||
| Born | 1915 పంజాబ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా | ||||||||||||||
| Died | 13 ఏప్రిల్ 1988 (aged 72–73) జలంధర్, పంజాబ్ | ||||||||||||||
| Years active | 1 | ||||||||||||||
| Sport | |||||||||||||||
| Country | భారతదేశం | ||||||||||||||
| Sport | అథ్లెటిక్స్ వాలీబాల్ | ||||||||||||||
| Event(s) | హ్యామర్ త్రో డిస్కస్ త్రో జావెలిన్ త్రో | ||||||||||||||
Medal record
| |||||||||||||||
సోమనాథ్ "నాట్" సింగ్ చోప్రా (1915-13 ఏప్రిల్ 1988) భారత జాతీయ వాలీబాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఒక భారతీ వాలీబాల్ ఆటగాడు.[1] ఇతడు అథ్లెటిక్స్ క్రీడాకారుడు కూడా. ఇతడు 1948 వేసవి ఒలింపిక్స్ లో పురుషుల హామర్ త్రో క్రీడలో పోటీ పడ్డాడు.
వృత్తి
[మార్చు]అథ్లెటిక్స్
[మార్చు]చోప్రా 1930లలో పంజాబ్ ఛాంపియన్షిప్లలో పాల్గొన్న అగ్రశ్రేణి అథ్లెటిక్ పోటీదారులలో ఒకరు. 1938 నుండి 1955 వరకు హామర్ త్రో, 1945 నుండి 1952 వరకు డిస్కస్ త్రోలో జాతీయ రికార్డులను నెలకొల్పాడు. ఇతడు జావెలిన్ త్రోలో కూడా పోటీ పడ్డాడు. ఇతడు 1948 వేసవి ఒలింపిక్స్ లో భారత బృందంలో ఉన్నాడు, అక్కడ ఇతడు హామర్ త్రో ఈవెంట్లో పాల్గొన్నాడు, కానీ క్వాలిఫైయింగ్ రౌండ్లను దాటలేదు. 1951లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో హామర్ త్రోలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.[2][1]{[3][4]
వాలీబాల్
[మార్చు]చోప్రా వాలీబాల్‌లో కూడా పాల్గొన్నాడు. 1952లో మాస్కోలో జరిగిన ఎఫ్ఐవిబి పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ పోటీలో పాల్గొన్న పదకొండు దేశాలలో భారతదేశం ఏడవ స్థానంలో నిలిచింది.[1]
పతకాలు
[మార్చు]ఇతడు అంతర్జాతీయ పోటీలలో గెలుపొందిన పతకాల వివరాలు[5]:
| సంవత్సరం | పోటీ | ప్రదేశం | స్థానం | ఈవెంటు | నోట్స్ |
|---|---|---|---|---|---|
| 1951 | ఆసియా క్రీడలు | న్యూఢిల్లీ, భారతదేశం | 2వ | హ్యామర్ త్రో | 43.35 |
మూలాలు
[మార్చు]- 1 2 3 "Nat Singh Somnath". Olympedia. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 October 2020.
- ↑ "Men Hammer Throw Athletics XIV Olympic Games London 1948 - Saturday 31.07". todor66.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 November 2025.
- ↑ "ASIAN GAMES". gbrathletics.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 November 2025.
- ↑ "Athletics Results - 1951 Asian Games" (PDF).
- ↑ వెబ్ మాస్టర్. "Som Nath". Athletics Podium. Şevket Furkan. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 January 2026.