సోమవారిపేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోమవారిపేట
—  రెవిన్యూ గ్రామం  —
సోమవారిపేట is located in Andhra Pradesh
సోమవారిపేట
సోమవారిపేట
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°33′00″N 79°07′00″E / 15.5500°N 79.1167°E / 15.5500; 79.1167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం బెస్తవారిపేట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,098
 - పురుషుల సంఖ్య 537
 - స్త్రీల సంఖ్య 561
 - గృహాల సంఖ్య 296
పిన్ కోడ్ 523346
ఎస్.టి.డి కోడ్

సోమవారిపేట , ప్రకాశం జిల్లా, బేస్తవారిపేట మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గంగానమ్మ తల్లి:- 2014, నవంబరు-9, కార్తీకమాసం, ఆదివారంనాడు, గ్రామస్థులు అమ్మవారికి, పంటలు బాగా పండాలని కోరుతూ ప్రత్యేకపూజలు నిర్వహించారు. వరి పంట కోతలకు ముందు ప్రతి సంవత్సరం అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది. ముందు గ్రామ పొలిమేర రాళ్ళకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. కుంకుమబండ్లు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ పొలిమేరలోని అమ్మవారి ప్రతిమకు విశేషపూజలు నిర్వహించారు. బస్సు స్టాండు సమీపంలోని పోలేరమ్మకు కాయా కర్పూరాలు, బోనాలు సమర్పించారు. దీనితో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,098 - పురుషుల సంఖ్య 537 - స్త్రీల సంఖ్య 561 - గృహాల సంఖ్య 296

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,045.[2] ఇందులో పురుషుల సంఖ్య 515, స్త్రీల సంఖ్య 530, గ్రామంలో నివాస గృహాలు 251 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2014, నవంబరు-10; 4వపేజీ.