సోలమన్ దీవులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Solomon Islands
Flag of the Solomon Islands the Solomon Islands యొక్క చిహ్నం
నినాదం
"To Lead is to Serve"
జాతీయగీతం
God Save Our Solomon Islands
the Solomon Islands యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
Honiara
9°28′S 159°49′E / 9.467°S 159.817°E / -9.467; 159.817
ప్రజానామము Solomon Islander
ప్రభుత్వం Constitutional monarchy and parliamentary system
 -  Monarch Queen Elizabeth II
 -  Governor General Frank Kabui
 -  Prime Minister Derek Sikua
Independence
 -  from the UK 7 July 1978 
 -  జలాలు (%) 3.2%
జనాభా
 -  2009 అంచనా 523,000[1] (170th)
జీడీపీ (PPP) 2009 అంచనా
 -  మొత్తం $1.514 billion[2] 
 -  తలసరి $2,818[2] 
జీడీపీ (nominal) 2009 అంచనా
 -  మొత్తం $657 million[2] 
 -  తలసరి $1,223[2] 
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.552 (medium) (136th)
కరెన్సీ Solomon Islands dollar (SBD)
కాలాంశం (UTC+11)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .sb
కాలింగ్ కోడ్ +677

సోలమన్ దీవులు en-us-Solomon Islands.ogg /ˈsɒləmən ˈaɪləndz/ [3]) అనేది పాపువా న్యూ గినియాకు తూర్పున ఉన్న ఓషనియాకి చెందిన దేశం. ఇది దాదాపు వెయ్యి దీవులతో కూడి ఉంటుంది. ఇవి 28,400 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి (10,965 చదరపు మైళ్లు). ఈ దీవుల రాజధాని హోనియరా, ఇది గ్వాడల్‌కెనాల్ అనే దీవిలో ఉంది.

సోలమన్ దీవులలో వేలాది సంవత్సరాలుగా మెలనేసియా ప్రజలు నివాసం ఏర్పర్చుకున్నట్లు భావిస్తున్నారు. 1893లో యునైటెడ్ కింగ్‌డమ్ సోలమన్ దీవులలో ఒక సంరక్షిత రాజ్యాన్ని నెలకొల్పింది. రెండో ప్రపంచ యుద్ధంలో, బ్యాటిల్ ఆఫ్ గ్వాడల్‌కెనాల్‌తో పాటుగా, 1942-45 నాటి సోలమన్ దీవుల క్యాంపెయిన్‌లో భాగంగా అమెరికా మరియు జపాన్ సేనల మధ్య భీకరమైన పోరు జరిగింది. ఈ క్రమంలో 1976వ సంవత్సరంలో స్వంత ప్రభుత్వాన్ని మరియు రెండు సంవత్సరాల అనంతరం ప్రజాస్వామ్యాన్ని సాధించుకున్నాయి. సోలమన్ దీవుల రాణితో రాజ్యాంగబద్ధ రాజరికం సోలమన్ దీవులలో అమలులో ఉంది, ప్రస్తుతం ఎలిజబెత్ II దేశాధినేతగా ఉన్నారు.

1998 నుండి జాతి హింస, ప్రభుత్వ అసమర్థత మరియు నేరాలు వంటివి ఇక్కడి సుస్థిరతను, సమాజాన్ని బలహీనపర్చాయి. శాంతిని నెలకొల్పి, జాతి వైషమ్యాలతో రగులుతున్న మిలిటెంట్లను నిరాయుధులుగా చేసి, పౌరపాలనను మెరుగుపర్చడం కోసం ఆస్ట్రేలియా నాయకత్వంలోని మల్టీనేషనల్ బలగం రీజినల్ అసిస్టెన్స్ మిషన్‌ టు సోలమన్ ఐలాండ్స్ (RAMSI), 2003 జూన్‌లో ఈ దీవులకు చేరుకుంది.

పేరు[మార్చు]

సోలమన్ దీవుల రాజ్యాంగం [3] చే పొందుపర్చబడి, ప్రభుత్వం[4][5] మరియు దేశ ప్రెస్[6][7] ద్వారా ఉపయోగించబడుతున్న విధంగా దేశ అధికారిక పేరు "సోలమన్ ఐలాండ్స్", దీనికి నిర్దిష్ట అధికరణం లేదు. కాబట్టి రీజినల్ అసిస్టెన్స్ మిషన్‌ టు సోలమన్ ఐలాండ్స్[8] వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ పేరునే వాడుతున్నాయి. ఇంగ్లీష్ మాట్లాడే ఇతర దేశాల్లో, నిర్దిష్టమైన అధికరణం తరచుగా జోడించబడుతూ ఉంటుంది[9]

చరిత్ర[మార్చు]

1895లో అలంకరించబడ్డ యుద్ధనౌకలో సోలమన్ దీవుల యుద్ధవీరులు.

క్రీస్తు పూర్వం సుమారు 30,000 సంవత్సరాల క్రితం పాపువాన్ మాట్లాడే వలస ప్రజలు ఈ ప్రాంతంలో ప్రవేశించినట్లు నమ్ముతున్నారు. అలాగే క్రీస్తు పూర్వం సుమారు 4,000 సంవత్సరాల క్రితం సిర్కా ప్రాంతానికి చేరుకున్న ఆస్ట్రోనేషియన్ మాట్లాడే ప్రజలు సోలమన్ అవుట్‌రిగ్గర్ కానో వంటి తమదైన సాంస్కృతిక అంశాలను ఈ దీవుల్లోకి తీసుకువచ్చారు. క్రీస్తు పూర్వం 1200 మరియు 800 మధ్య పోలినేసియ‌న్ల పూర్వీకులైన లపిటా ప్రజలు బిస్మార్క్ ఆర్చిపెలాగో నుండి వారి సెరామిక్‍స్ లక్షణాలతో ఇక్కడికి వచ్చారు. 1568లో పెరూకు చెందిన అల్వారో డే మెన్‌డనా డే నైరా అనే స్పానిష్ నావిగేటర్ ఈ సోలమన్ దీవులను సందర్శించిన మొట్టమొదటి యూరోపియన్‌గా చెప్పవచ్చు. యూరోపియన్లు రాకముందు సోలమన్ దీవుల ప్రజలు తమ తలల వేట మరియి నరమాంసభక్షణకు పేరుమోశారు.

19వ శతాబ్దం మధ్య కాలం నుంచి సోలమన్ దీవులను మిషనరీలు సందర్శించటం ప్రారంభించారు. మొదట్లో వాళ్లు కాస్త పురోగతి సాధించారు, "బ్లాక్‌బర్డింగ్" (క్వీన్స్‌లాండ్ మరియు ఫిజీ దీవులలోని చెరకు తోటల కోసం పాశవికంగా కూలీలను నియమించుకోవడం) కారణంగా వరుసగా అణచివేతలు, ఊచకోతలకు దారితీసింది. కూలీల వ్యాపారంలోని క్రూరత్వం వల్ల యునైటెడ్ కింగ్‌డమ్ 1893 జూన్‌లో దక్షిణ సోలమన్‌ని సంరక్షితరాజ్యంగా ప్రకటించింది. ఇది బ్రిటిష్ సోలమన్ దీవుల సంరక్షకరాజ్యం కి పునాది. 1898 మరియు 1899లో పొరుగున ఉన్న మరికొన్ని దీవులు సంరక్షకరాజ్యంలో చేర్చబడ్డాయి; 1900లో అంతకుముందు జర్మన్ విచారణ పరిధిలోని ద్వీపాల సమూహంలో మిగిలిన భాగం బుకా మరియు బౌగైన్‌విల్లే దీవులతో పాటు బ్రిటిష్ పాలనలోకి మార్చబడింది, ఇవి (ప్రథమ ప్రపంచ యుద్ధం మొదలైన తర్వాత (ఆస్ట్రేలియాచే ఆక్రమించబడేంతవరకు) జర్మన్ న్యూగినియాలో భాగంగా జర్మన్ పాలనలో ఉండేవి. అయితే, మోనో మరియు అలూ (ది షార్ట్‌లాండ్స్) పశ్చిమ సోలమన్ దీవులకు, బౌగైన్‌విల్లే దక్షిణ ప్రాంతంలోని సాంప్రదాయిక సమాజాలకు మధ్య సాంప్రదాయిక వ్యాపారం మరియు సామాజిక సంబంధాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగేవి. సంరక్షకరాజ్యంలో మిషనరీలు సోలమన్ దీవుల్లో నివాసమేర్పర్చుకుని, జనాభాలో అధికభాగాన్ని క్రిస్టియానిటీ లోకి మార్చివేశారు. 20 శతాబ్ది మొదట్లో, పలు బ్రిటిష్ మరియు ఆస్ట్రేలియన్ సంస్థలు భారీ స్థాయిలో కొబ్బరి తోటల పెంపకాన్ని ప్రారంభించాయి. అయితే ఆర్థిక పురోగతి మందగించింది, దీవివాసులకు పెద్దగా ప్రయోజనం కలగలేదు.

ద్వితీయ ప్రపంచయుద్ధం[మార్చు]

1942లో గ్వాడన్‌కెనాల్ కేంపెయిన్ కాలంలో నేలపై విశ్రాంతి తీసుకుంటున్న US నావికాబలగాలు.

ద్వితీయ ప్రపంచయుద్ధం ఆకస్మికంగా చెలరేగడంతో, చాలామంది తోటల యజమానులు మరియు వ్యాపారులు ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు, దీంతో తోటల పెంపకం నిలిచిపోయింది. ద్వితీయ ప్రపంచయుద్ధంలోకెల్లా అత్యంత తీవ్రమైన పోరాటాల్లో కొన్ని సోలమన్ దీవుల్లోనే జరిగాయి. జపాన్ సామ్రాజ్యవాద శక్తులపై మిత్రరాజ్యాల సైనిక చర్యల్లో అతి ప్రధానమైనది 1942 ఆగస్టు 7న ప్రారంభించబడింది, ఫ్లోరిడా దీవుల లోని టులాగి[10] వద్ద మరియు గ్వాడల్‌కెనాల్ వద్ద ఏకకాలంలో నౌకా దాడులు, పెద్ద ఎత్తున సైనికుల మోహరింపు జరిగాయి. మిత్రరాజ్యాలు జపాన్ విస్తరణను తిప్పికొట్టడం ప్రారంభించినందున గ్వాడల్‌కెనాల్ యుద్ధం పసిఫిక్ యుద్ధంలో అతిముఖ్యమైన, తీవ్రమైన కేంపెయిన్‌గా మారింది. యుద్ధకాలంలో వ్యూహాత్మక ప్రాధాన్యత జపాన్ నియంత్రణలోని దీవుల్లోని మారుమూల ప్రాంతాల్లో పనిచేసిన కోస్ట్‌వాచర్లకు దక్కింది, వీరు కేంపెయిన్ పొడవునా జపాన్ నావికా, సైనిక, వాయుసేన కదలికలపై ముందస్తు హెచ్చరిక, నిఘా సమాచారాన్ని అందించారు.[11] సార్జెంట్-మేజర్ జాకబ్ వౌజా సుప్రసిద్ధ కోస్ట్‌వాచర్, ఇతను పట్టుబడి జపాన్ సామ్రాజ్యవాద సేనలచేత తీవ్ర చిత్రహింసలకు గురయినప్పటికీ మిత్రరాజ్యాల సమాచారాన్ని బయటపెట్టలేదు. ఇతడు అమెరికన్ల నుంచి సిల్వర్ స్టార్ అవార్డు పొందాడు. బైకు గాసా మరియు ఎరోని కుమనా దీవి వాసుల గురించి నేషనల్ జ్యాగ్రపీ ప్రముఖంగా పేర్కొంది, వీరు జాన్ ఎఫ్. కెన్నడీ మరియు అతడి సిబ్బందికి చెందిన ధ్వంసమైన PT-109 ఓడను మొట్టమొదటిసారి కనుగొన్నారు. డగౌట్ కేనోయ్ ద్వారా పంపిణీ చేయడం కోసం ప్రమాద సందేశాన్ని రాయడానికి కొబ్బరికాయను ఉపయోగించవలసిందిగా వారు సూచించారు, దీన్ని కెన్నడీ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడైన తర్వాత తన డెస్క్‌పై అలంకరించుకున్నాడు.

తూర్పు సోలమన్ యుద్ధ కాలంలో ఏరియల్ దాడికి గురైన ఎయిర్‌క్రాప్ట్ కారియర్[21]

దక్షిణ పసిఫిక్ యొక్క ప్రధాన స్టేజింగ్ కేంద్రాలలో సోలమన్ దీవులు ఒకటి మరియు మేజర్ గ్రెగ్ "పప్పీ" బోయింగ్టన్ నేతృత్వం వహించిన సుప్రసిద్ధ VMF-214 "బ్లాక్ షీప్" స్క్వాడ్రన్కు ఇది ఆశ్రయం. గ్వాడల్‌కెనాల్‌లోని జపనీస్ సైనిక స్థావరానికి సరఫరాల కోసం టోక్యో ఎక్స్‌ప్రెస్ దానిని ఉపయోగించుకున్నప్పుడు ఈ ప్రదేశం కి న్యూ జార్జియా సౌండ్ అని పేరు ఉండేది. గ్వాడల్‌కెనాల్‌లోని 36,000కు పైగా జపనీస్ సైనికులలో 15,000 మంది చంపబడ్డారు లేదా తప్పిపోయారు, 9,000 మంది వ్యాధుల బారిన పడ్డారు మరియు 1,000 మంది పట్టుబడ్డారు.[12]

ఉద్రిక్తతలు[మార్చు]

సాధారణంగా ఉద్రిక్తతలు లేదా జాతి ఉద్రిక్తతగా పేర్కొనబడుతున్న ప్రారంభ పౌర అశాంతి ప్రధానంగా ఇసాటాబు ఫ్రీడమ్ మూవ్‌మెంట్ (గ్వాడల్‌కెనాల్ రివల్యూషనరీ ఆర్మీగా సుపరిచితం) మరియు మలైటా ఈగిల్ ఫోర్స్ (మరావు ఈగిల్ ఫోర్స్‌గా కూడా పేరొందినది) మధ్య పోరాటం ద్వారా వర్గీకరించబడింది. ఘర్షణలో చాలా భాగం గ్వాలెస్ మరియు మలైటాన్స్, 'జాతి ఘర్షణ' ముద్ర మరీ సాధారణీకరించినట్లుగా ఉందని కబుటౌలాకా (2001) మరియు డిన్నెన్ (2002) వాదించారు. ఉద్రిక్తతల గురించిన సమగ్ర చర్చల కోసం, ఫ్రేంకెల్ (2004) మరియు మోర్ (2004) ని కూడా చూడండి.)

1998 చివర్లో గ్వాడన్‌కెనాల్ దీవిలోని మిలిటెంట్లు మలైటన్ సెటిలర్లకు వ్యతిరేకంగా బెదిరించి, హింసకు పాల్పడే కేంపెయిన్ ప్రారంభించారు. మరుసటి సంవత్సరంలో, వేలాదిమంది మలైటన్లు మలైటా లేక రాజధాని, హోనియారాకు పారిపోయారు (ఇది గ్వాడన్‌కెనాల్‌లోనే ఉన్నప్పటికీ, ప్రధానంగా మలైటిన్లు, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన సోలమన్ దీవుల ప్రజలే ఎక్కువగా ఉండేవారు). దీనికి ప్రతిస్పందనగా 1999లో, మలైటా ఈగిల్ ఫోర్స్ (MEF) ఏర్పర్చబడింది.

తలెత్తిన ఈ ఘర్షణల సంక్లిష్టతలతో వ్యవహరించడానికి భార్తోలోమ్యు ఉలుఫాలు సంస్కరణ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. 1999 చివరలో ప్రభుత్వం నాలుగు నెలల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. సత్సంబంధాల పునరుద్ధరణ సమావేశాలలో రాజీకోసం పలు ప్రయత్నాలు జరిగాయి కాని ఫలించలేదు. అతడు 1999లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను సాయం చేయమని అభ్యర్థించాడు కాని అవి తిరస్కరించాయి.

ఉలుఫాలు మలైటన్ జాతీయుడే అయినప్పటికే తమ ప్రయోజనాలను కాపాడటానికి తాను చేసిందేమీ లేదని భావించిన MEF మిలీషియా సభ్యులు 2000 జూన్‌లో అతడిని అపహరించారు. మిలీషియా నిర్బంధం నుంచి విడుదలైన ఉలుఫాలు వెనువెంటనే రాజీనామా చేశారు. మొదట్లో ఉలుఫాలు ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేసి తర్వాత ప్రతిపక్షంలో చేరిన మనస్సేహ్ సొగవరే, రెవరెండ్ లెస్‌లైల్ బొసెటోపై పోటీలో 23-21తో నెగ్గి ప్రధానమంత్రి పదవికి ఎన్నికయ్యాడు. అయితే ఆరుగురు ఎంపీలు (బొసెటో మద్దతుదారులే అయినప్పటికీ) కీలకమైన ఓటింగ్ సమయంలో పార్లమెంట్‌కు హాజరు కాలేకపోవడంతో సొగెవర్ ఎన్నిక తక్షణమే వివాదాస్పదమైంది. (మూర్ 2004, ఎన్.5 పుట. 174).

2000 అక్టోబరులో, మిలిషియా ఈగిల్ ఫోర్స్, IFM శక్తులు మరియు సోలమన్ దీవుల ప్రభుత్వం మధ్య టౌన్స్‌విల్లె శాంతి ఒప్పందం, [13] పై సంతకాలు జరిగాయి. దీనితర్వాత 2001 ఫిబ్రవరిలో మరావు శాంతి ఒప్పందం కుదిరి, మరావు ఈగిల్ ఫోర్స్, ఇసాటబు ఫ్రీడమ్ మూవ్‌మెంట్, గ్వాడల్‌కెనలాల్ ప్రాదేశిక ప్రభుత్వం మరియు సోలమన్ దీవుల ప్రభుత్వం సంతకాలు చేశాయి. అయితే కీలకమైన గ్వాల్ మిలిటెంట్ నేత హరోల్డ్ కెకె, ఒప్పందంపై సంతకం పెట్టడానికి నిరాకరించడంతో గ్వాల్ గ్రూపులలో చీలికలు వచ్చాయి. వెనువెంటనే, ఒప్పందంపై సంతకాలు పెట్టిన గ్వాల్ జాతీయులు ఆండ్రూ టెరె నేతృత్వంలో జాయింట్ ఆపరేషన్స్ ఫోర్స్‌ని ఏర్పర్చడంకోసం మలైటన్ ఆధిపత్యంలోని పోలీసు బలగాల్లో చేరిపోయారు. కేకే అతడి గ్రూపును పట్టుకోవడంలో జాయింట్ ఆపరేషన్‌ల ప్రయత్నాలు విఫలం కావడంతో తదుపరి రెండు సంవత్సరాల కాలంలో ఘర్షణ గ్వాడల్‌కెనాల్ వెదర్‌కోస్ట్‌ ప్రాంతానికి తరలింది..

2001 డిసెంబరులో జరిగిన నూతన ఎన్నికల్లో సర్ అల్లాన్ కెమకెజా తన పీపుల్స్ అలయెన్స్ పార్టీతో పాటు, ఇండిపెండెంట్ మెంబర్స్ అసోసియేషన్ మద్ధతుతో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఘర్షణ వెదర్‌కోస్ట్ ప్రాంతానికి తరలిపెళ్లినందున నిరంతరాయ హింసతో శాంతిభద్రతలు క్షీణించాయి, దీన్ని సావకాశంగా తీసుకున్న హొనియరా మిలిటెంట్లు క్రమంగా నేర, దోపిడీ చర్యలకు దిగారు. ఆర్థిక శాఖకు నిధులు వచ్చే సమయంలో ఆ శాఖ భవనాన్ని సాయుధులు చుట్టుముట్టేవారు. 2002 డిసెంబరులో, మిలిటెంట్లు తుపాకి గురిపెట్టి చెక్కుపై సంతకం చేయవలసిందిగా బెదిరించడంతో ఆర్థిక మంత్రి లౌరీ చాన్ రాజీనామా చేశాడు. పశ్చిమ ప్రాంతంలో స్థానికులు, మలైటన్ సెటిలర్లకు మధ్య ఘర్షణ బద్దలైంది. బౌగైన్‌విల్లే రివల్యూషనరీ ఆర్మీ (BRA) రెనగేడ్లను సంరక్షక బలగంగా చేరమని ఆహ్వానించారు కాని, వారి వల్ల మరిన్ని సమస్యలు తలెత్తడంతో వారిని పక్కకు నెట్టారు.

చట్టరాహిత్యం, విచ్చలవిడి దోపిడీలు, అసమర్థ పోలీసుల కారణంగా సోలమన్ దీవుల ప్రభుత్వం బయటివారి సహాయాన్ని అభ్యర్థించింది. దేశం దివాళా తీసి, రాజధాని కల్లోలభరితంగా మారడంతో పార్లమెంట్ ఈ అభ్యర్థనను ఏకగ్రీవంగా ఆమోదించింది.

2003 జూలైలో ఆస్ట్రేలియన్, పసిఫిక్ ఐలండ్ పోలీసుల మరియు బలగాలు ఆస్ట్రేలియన్ రీజనల్ అసిస్టెన్స్ మిషన్ టు సోలమన్ ఐలండ్స్ (RAMSI) నేతృత్వంలో సోలమన్ దీవులను చేరుకున్నాయి. ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ మరియు 20 ఇతర పసిఫిక్ దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు దాదాపు 2,200 మంది పోలీసులు, బలగాలతో కూడిన అంతర్జాతీయ భద్రతా బలగాలు, ఆపరేషన్ హెల్పెమ్ ఫ్రెన్ పేరిట చేరుకోవడం ప్రారంభించాయి. అప్పటినుంచి కొంతమంది వ్యాఖ్యాతలు దేశాన్ని విఫల రాజ్యం.[14]గా గుర్తిస్తూ వచ్చారు.

2006 ఏప్రిల్‌లో కొత్తగా ఎన్నికయిన ప్రధానమంత్రి స్నిడర్ రిని పార్లమెంట్ సభ్యులను కొనివేయడానికి చైనా వ్యాపారినుంచి ముడుపులు తీసుకున్నాడని ఆరోపణలు రావడంతో రాజధానిహొనియరాలో ప్రజా తిరుగుబాటు చెలరేగింది. మైనారిటీకి చెందిన చైనా వాణిజ్య కమ్యూనిటీపై తీవ్ర అసమ్మతి చెలరేగడంతో నగరంలోని చైనాటౌన్ దాదాపుగా ధ్వంసమైపోయింది దీంతోపాటు చైనా నుండి భారీ ఎత్తున డబ్బు దేశంలోని తరలించబడిందని పుకార్లు వ్యాపించడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. దాడులను తప్పించుకోవడానికి పారిపోతున్న వందలాది చైనీయులను తరలించడం కోసం చైనా చార్టర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ పంపించింది. ఆస్ట్రేలియన్ మరియు బ్రిటిష్ పౌరుల తరలింపు తక్కువ స్థాయిలో మాత్రమే జరిగింది. అశాంతిని పారదోలడానికి మరిన్ని ఆస్ట్రేలియన్, న్యూజిలాండ్ మరియు ఫిజియన్ పోలీసులు, సైనిక బలగాలను పంపారు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనక ముందే రిని పదవికి రాజీనామా చేశాడు, పార్లమెంట్ మనాస్సేహ్ సొగవరెని ప్రధానిగా ఎన్నుకుంది.

మరింత చదవడానికి

 • రాండెల్, ఎన్ (2003) ది వైట్ హెడ్‌కౌంటర్ కరోల్ & క్రాఫ్ పబ్లిషర్స్, న్యూయార్క్
 • డిన్నెన్ (2002), విన్నర్స్ అండ్ లూజర్స్ పాలిటిక్స్ అండ్ డిసార్డర్ ఇన్ ది సోలమన్ ఐలండ్స్ 2000-2002’, ది జర్నల్ ఆఫ్ పసిఫిక్ హిస్టరీ, సంపుటి.37, సంచిక.3, పుట. 285–98.
 • ఫ్రాంకెల్, J. (2004) ది మానిప్యులేషన్ ఆఫ్ కస్టమ్: ప్రమ్ అప్‌రైసింద్ టు ఇంటర్‌వెన్షన్ ఇన్ ది సోలమన్ ఐలండ్స్, పాండనుస్ బుక్స్, సిడ్నీ,, పాండనుస్ బుక్స్, సిడ్నీ
 • మూర్, C. (2004) హ్యాపీ ఐసెల్స్ ఇన్ క్రైసిస్: ది హిస్టారికల్ కాజెస్ ఫర్ ఎ ఫెయిలింగ్ స్టేట్ ఇన్ సోలమన్ ఐలండ్స్ , 1998–2004, ఆసియా పసిఫిక్ ప్రెస్ కాన్‌బెర్రా
 • కబుటౌలక, T (2001) బియాండ్ ఎథ్నిసిటీ దీ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ది గ్వాడల్‌కెనలా క్రైసిస్ ఇన్ సోలమన్ ఐలండ్స్ , SSGM వర్కింగ్ పేపర్ 01/1

2007 భూకంపం మరియు సునామీ[మార్చు]

2007 ఏప్రిల్‌లో, సోలమన్ దీవులు భారీ భూకంపం బారినపడ్డాయి దాంతో పాటు అతి పెద్ద సునామీ వచ్చింది చిన్న దీవి గిజోను తాకిన సునామి కారణంగా అనేక మీటర్ల ఎత్తున నీళ్లు పైకి ఎగిశాయని ప్రారంభ నివేదికలు సూచించాయి (కొన్ని నివేదికల ప్రకారం 10 మీటర్లు (33 అడుగులు) ఎత్తుకు నీరు ఎగిసింది, ఫారిన్ ఆఫీస్ ప్రకారం 5 మీటర్లు (16 1/3 అడుగుల) వరకు నీరు ఎగిసింది. సునామీ కారణంగా 8.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇది దీవుల రాజధాని హోనియరాకు వాయవ్య దిశలో 217 మైళ్లు (349 కిమీ.) పరిధిలో భూకంప కేంద్రం ఏర్పడింది, లాట్ -8.453 పొడవు 156.957 మరియు 10 కిలోమీటర్లు (6.2 మైళ్లు).[15] లోతులో ఇది విస్తరించింది.

యునైటెడ్ స్టేట్స్ జాగ్రఫీ సర్వే ప్రకారం 2007 ఏప్రిల్ 1 ఆదివారం 20:39:56 UTC సమయంలో భూకంపం చెలరేగింది. ప్రారంభ ఘటన తరువాత 2007 ఏప్రిల్ 4 బుధవారం 22:00:00 UTC సమయానికి 5.0 కంటే ఎక్కువ మాగ్నిట్యూడ్‌తో కూడిన 44 ప్రకంపనలు ఈ ప్రాంతంలో నమోదయ్యాయి.

సునామి తాకిడికి కనీసం 52 మంది చనిపోయారు, 900 పైగా గృహాలను సునామీ ధ్వంసం చేసింది, వేలాదిమంది నిరాశ్రయులైపోయారు.

భూకంపం వల్ల భూమిపై కలిగిన ఒత్తిడి రనోన్‌గ్గా అనే దీవి తీరప్రాంతం నుంచి దాదావు 70 మీటర్లు (230 అడుగులు) వరకు విస్తరించింది. దీంతో ఒకప్పుటి పురాతన పగడపు దిబ్బల స్థానంలో కొత్తగా అనేక బీచ్‌లు నెలకొన్నాయి.

రాజకీయాలు[మార్చు]

జాతీయ పార్లమెంట్ భవంతి యునైటెడ్ స్టేట్స్ నుండి వచ్చిన బహుమతి

సోలమన్ దీవులలో రాజ్యాంగబద్ధ రాచరికం ఉంది మరియు పార్లమెంటరీ వ్యవస్థ ప్రభుత్వాన్ని కలిగి ఉంది. క్వీన్ ఎలిజబెత్ II ప్రస్తుతం సోలమన్ దీవుల రాణి మరియు ప్రభుత్వాధినేతగా ఉన్నారు. ఇక్కడ 50 మందితో కూడిన ఏకైక పార్లమెంట్ ఉంది, దీన్ని నాలుగేళ్లకోసారి ఎన్నుకుంటారు. అయితే, వ్యవధి పూర్తి కాకముందే మెజారిటీ సభ్యుల ఓటు ద్వారా పార్లమెంటును రద్దు చేయవచ్చు. ఏక సభ్య నియోజకవర్గాల ప్రాతిపదికన పార్లమెంటరీ ప్రాతినిధ్యం ఉంటుంది. 21 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉంటుంది.[16] ప్రధానమంత్రి ఇక్కడ ప్రభుత్వాధినేతగా ఉంటున్నారు, ఇతడు పార్లమెంటుచే ఎన్నికై, మంత్రిమండలిలోని ఇతర సభ్యులను ఎంపిక చేసుకుంటారు. ప్రతి మంత్రిత్వ శాఖ మంత్రిమండలి సభ్యుడి నేతృత్వంలో పనిచేస్తుంది, ఇతడికి శాశ్వత కార్యదర్శి సహకరిస్తారు, మంత్రిత్వశాఖలోని సిబ్బందిపై ప్రభుత్వోద్యోగి ఒకరు ఆజమాయిషీ చేస్తారు.

సోలమన్ దీవుల ప్రభుత్వాలు బలహీనమైన రాజకీయ పక్షాలచే కూడి ఉంటున్నాయి (చూడండి సోలమన్ దీవులలోని రాజకీయ పార్టీల జాబితా) మరియు ఇక్కడ సుస్థిరత ఏమాత్రం లేని పార్లమెంటరీ సంకీర్ణాలు ఉంటున్నాయి. తరచుగా ఇవి అవిశ్వాస తీర్మానాలకు గురవుతుంటాయి, దీని ఫలితంగా ప్రభుత్వ నాయకత్వం తరచుగా మారుతుంటుంది. మంత్రిమండలిలో మార్పులు సహజంగా జరుగుతాయి.

భూయాజమాన్యం సోలమన్ దీవుల ప్రజలకు మాత్రమే కేటాయించబడింది. నివాస స్థలాలను వదిలి వెళ్లిపోయిన చైనీయులు మరియు కిరిబాటి వంటి వారు సహజీకరణ ద్వారా పౌరసత్వం పొందవచ్చు. భూమి ఇప్పటికీ సాధారణంగా కుటుంబం లేదా గ్రామ ప్రాతిపదికన ఆజమాయిషీలో ఉంటుంది, స్థానిక ఆచారం ప్రకారం తల్లి లేదా తండ్రి నుంచి ఇది పిల్లలకు చెందుతుంది. దీవి ప్రజలు సాంప్రదాయికేతర ఆర్థిక అవసరాలకోసం భూమిని తీసుకోవడం ఇష్టపడరు, దీనితో భూ యాజమాన్యంపై నిరంతర వివాదాలు చెలరేగుతుంటాయి.

ఒక సరిహద్దు రక్షణ విభాగంతో పాటు. దాదాపు 500 మందితో కూడిన పోలీసు బలగం ఉన్నప్పటికీ, సోలమన్ దీవులలో సైనిక బలగాలు లేవు పోలీసులు అగ్నిమాపక సేవలు, విపత్తు పునరావాసం మరియు తీరప్రాంత నిఘా వంటి బాధ్యతలు కూడా చేపడుతుంటారు. పోలీసు బలగాలకు కమీషనర్ అధిపతి, ఇతడిని గవర్నర్ జనరల్‌చే నియమించబడి, ప్రధానమంత్రికి బాధ్యత పడతాడు. 2006 డిసెంబరు 27న సోలమన్ దీవుల ప్రభుత్వం, పసిఫిక్ ప్రాంత దేశం నుంచి తిరిగి వస్తున్న దేశ ఆస్ట్రేలియన్ పోలీసు ఛీఫ్‌ను అడ్డుకోవడానికి చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. 2007 జనవరి 12న, ఇరుదేశాల మధ్య నాలుగు నెలలుగా సాగుతున్న వివాదాన్ని పరిష్కరించి రాజీ చేసుకోవడంలో భాగంగా, రాజకీయ జోక్యం చేసుకున్నాడనే ఆరోపణతో సోలమన్ దీవుల నుంచి బహిష్కరించబడిన తన ప్రధాన దౌత్యవేత్త స్థానంలో మరొకరిని ఆస్ట్రేలియా నియమించింది.

సోలమన్ దీవుల అటార్నీ జనరల్‌గా జూలియన్ మోటి 2007 జూలై 11న ప్రమాణ స్వీకారం చేశాడు. మోటి ప్రస్తుతం పిల్లలకు సంబంధించిన సెక్స్ నేరాలకు గాను ఆస్ట్రేలియాలో వాంఛనీయ వ్యక్తిగా ఉన్నాడు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి జాన్ హోవార్డ్ ఈ ఘటనను అసాధారణ చర్యగా పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా విదేశీమంత్రి అలెగ్జాండర్ డౌనర్ సోలమన్ దీవులను నాగరిక ప్రపంచానికి ఒక అవహేళనగా వర్ణించాడు.[17] అయితే వనాటులో జరిగిన ఘటనలకు సంబంధించి మోటిపై మోపిన నేరారోపణలను, వనాటు కోర్టులలో అదేసమయంలో మోపిన నేరారోపణలను 1990లలో కొట్టివేసింది. 2006లో చెలరేగిన హొనియరా అల్లర్లను రెచ్చగొట్టడంలో ఆస్ట్రేలియా పాత్రపై విచారణ చేపట్టవలసిందిగా సోలమన్ దీవుల ప్రభుత్వానికి సూచించిన జూలియన్ మోటి ఆస్ట్రేలియన్ దృష్టిని ఆకర్షించాడు.

2007 డిసెంబరు 13న ప్రధానమంత్రి మనస్సేహ్ సొగవరి తన కేబినెట్‌లోని ఐదుగురు మంత్రులు ప్రతిపక్షంలోకి ఫిరాయించడంతో, పార్లమెంటు[18]లో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవినుంచి తొలగించబడ్డాడు. సోలమన్ దీవులలో ఒక ప్రధానమంత్రి తన పదవిని ఈవిధంగా కోల్పోవడం అదే మొదటిసారి. డిసెంబరు 2న, ప్రతిపక్ష అభ్యర్థి (మరియు మాజీ విద్యా మంత్రి) డెరెక్ సికువా 32-15 ఓట్ల తేడాతో నెగ్గి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు.[19][20]

రాష్ట్రాలు[మార్చు]

సోలమన్ దీవుల రాష్ట్రాలు, 1989 నాటి దృశ్యం (పెద్దవి చేసేందుకు క్లిక్ చేయండి)

స్థానిక ప్రభుత్వం కోసం, దేశం 10 పాలనా ప్రాంతాలుగా విభజించబడింది, వీటిలో తొమ్మిది రాష్ట్రాలను ఎన్నుకోబడిన రాష్ట్రాల శాసనసభలు పాలిస్తాయి, 10వదైన హొనియరా పట్టణం హొనియరా పట్టణ కౌన్సిల్ చేత పాలించబడుతుంది.

 1. సెంట్రల్
 2. చౌసియుల్
 3. గ్వాడల్‌కెనాల్
 4. ఇసాబోల్
 5. మకిరా-ఉలవా
 6. మలైటా
 7. రెన్నెల్ మరియు బెల్లోనా
 8. టెమోటు
 9. పశ్చిమం
 10. హొనియరా, పట్టణం

విదేశీ సంబంధాలు[మార్చు]

సోలమన్ దీవులు యునైటెడ్ నేషన్స్, కామన్‌వెల్త్, దక్షిణ పసిఫిక్ కమిషన్, దక్షిణ పసిఫిక్ ఫోరమ్, ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్, మరియు యూరోపియన్ యూనియన్/ఆఫ్రికన్, కరీబియన్, మరియు పసిఫిక్ (ACP) దేశాలు (EEC/ACP) (లోమ్ సదస్సు) లలో సభ్యురాలు.

సోలమన్ దీవుల రాజకీయ రంగం తైవాన్ రిపబ్లిక్ చైనా మరియు చైనా పీపుల్స్ రిపబ్లిక్ చైనాలతో తన దౌత్య ప్రాముఖ్యతతో ప్రభావితమవుతుంటుంది. సోలమన్ దీవులు ROCకి దౌత్యపరమైన గుర్తింపును ఇచ్చింది, చైనా మొత్తానికి ఏకైక చట్టబద్ధ ప్రభుత్వంగా గుర్తించింది, అలాగే యునైటెడ్ నేషన్స్‌లో తైవాన్‌కు కీలకమైన ఓట్లు అందించింది. భారీ పెట్టుబడులు, రాజకీయ నిధులు, మరియు భారీ రుణాలు ROC మరియు PRC రెండు దేశాలనుంచి తరలివచ్చాయి. దీంతో సోలమన్ దీవుల రాజకీయ రంగంలో వీటి ఈ రెండింటి ప్రభావం పెరుగుతూ వచ్చింది.

బౌగెన్‌విల్లె తిరుగుబాటు ఘటననుండి శరణార్థుల వెల్లువ మరియు బౌగన్‌విల్లె తిరుగుబాటుదారుల నుండి ప్రేరణ పొందిన శక్తులు సోలమన్ దీవుల ఉత్తర ప్రాంతాలపై కొనసాగించిన దాడుల కారణంగా పాపువా న్యూగినియాతో దెబ్బతిన్న సంబంధాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. బౌగన్‌విల్లె సమస్యపై 1998లో కుదిరిన శాంతి ఒప్పందం వల్ల సైనిక ప్రమాదం తొలిగిపోయింది, రెండు దేశాలు 2004లో కుదిరిన ఒప్పందంలో సరిహద్దు ఆపరేషన్లను క్రమబద్ధీకరించాయి.

సైన్యం[మార్చు]

స్థానికంగా నియమించబడిన బ్రిటిష్ సోలమన్ దీవుల సంరక్షక రక్షణ బలగం అనేది మిత్ర రాజ్య బలగాలలో భాగం, ఇది ద్వితీయ ప్రపంచ యుద్ధకాలంలో సోలమన్ దీవుల్లో జరిగిన పోరాటంలో భాగం పంచుకుంది, స్వాంతంత్ర్యం వచ్చినప్పటినుంచి దేశానికి రెగ్యులర్ సైన్యం లేదు. రాయల్ సోలమన్ ఐలండ్స్ పోలీస్ (RSIP) యొక్క పలు పారామిలటరీ బలగాలు రీజనల్ అసిస్టెన్స్ మిషన్ టు సోలమన్ ఐలండ్స్ (RAMSI) జోక్యం కారణంగా 2003లో రద్దు చేయబడ్డాయి మరియు RSIP కూడా ఆయుధాలు వదిలిపెట్టింది.. RAMSI ఆస్ట్రేలియన్ కమాండర్ నేతృత్వంలోని ఒక చిన్న సైనిక దళం, అంతర్గత, బాహ్య రక్షణకు సంబంధించి RAMSIలో ఉన్న పోలీసులకు సహకరించడం దీని బాధ్యత. RSIP ఇప్పటికీ రెండు పసిఫఇక్ క్లాస్ పెట్రోల్ బోట్లు (RSIPV అయుకి మరియు RSIPV లాటా ) లను నడుపుతోంది, ఇది సోలమన్ దీవుల అధికారిక నౌకాబలగంలో భాగం.

దీర్ఘకాలంలో RSIP రక్షణ పాత్రను తిరిగి చేపడుతుందని ఊహించబడింది. పోలీసు బలగం కమిషనర్ నేతృత్వంలో ఉంటుంది, ఇతడు ప్రభుత్వ జనరల్‌చే నియమించబడి, పోలీస్, జాతీయ భద్రత & కరెక్షనల్ సేవల మంత్రిత్వ శాఖకు బాధ్యత పడతాడు.

సోలమన్ దీవుల పోలీస్ బడ్జెట్ నాలుగేళ్ల అంతర్యుద్ధం కారణంగా ఖాళీ అయిపోయింది. 2002 డిసెంబరులో టికోపియా మరియు అనూటా దీవులపై విరుచుకుపడిన తుపాన్ జో' నేపథ్యంలో, సహాయ సరఫరాలను తరలించడానికి లాటా గస్తీ బోటుకు ఇంధనం మరియు సరఫరాల కోసం సోలమన్ దీవుల ప్రభుత్వానికి ఆస్ట్రేలియా 200,000 సోలమన్ డాలర్ల ($50,000 ఆస్ట్రేలియన్) ను అందించవలసి వచ్చింది. తన బడ్జెట్‌ను స్థిరీకరించుకోవడంలో సోలమన్ దీవుల ప్రభుత్వానికి సహాయం చేయడం కూడా (RAMSI పనిలో ఒక భాగంగా ఉంది.)

పరికరాలు

భౌగోళిక స్థితి[మార్చు]

ఆకాశం నుండి సోలమన్ దీవులు

సోలమన్ దీవులు పాపువా న్యూగినియా తూర్పున ఉన్న విశాల ద్వీప రాజ్యం, ఇది ఛోయిసూల్, షార్ట్‌ల్యాండ్ దీవులు; న్యూ జార్జియా దీవులు; శాంటా ఇసబెల్; రస్సెల్ దీవులు; ఎంగెలా (ది ఫ్లోరిడా దీవులు) ; మలైటా; గ్వాడన్‌కెనాల్; సికైనా; మరమాసైక్; ఉలావా; ఉకి; మకీరా (శాన్ క్రిస్టోబాల్) ; శాంటా అనా; రెన్నెల్ మరియు బెల్లోనా; శాంటా క్రజ్ దీవులు మరియు మూడు సుదూరంలోని చిన్న భూభాగాలు, టికోపియా, అనూటా, మరియు ఫటుటకాలతో కూడిన విశాల ద్వీప రాజ్యం. పశ్చిమ దిక్కున దూరంగా, తూర్పు +దిక్కున దూరంగా ఉన్న దీవుల మధ్య ఉన్న దూరం 1,500 కిలోమీటర్లు (930 mi) ఉంటుంది. శాంతా క్రజ్ దీవులు (దీనిలో టికోపియా కూడా భాగం), వనాటూ ఉత్తరాన ఉన్నాయి, ప్రత్యేకించి ఇవి ఇతర దీవుల నుండి 200 కిలోమీటర్ల (120 mi) కు పైబడిన దూరంలో ఉన్నాయి. బౌగైన్‌విల్లే భౌగోళికంగా సోలమన్ దీవులలో భాగం కాని, రాజకీయంగా ఇది పాపువా న్యూగినియాకు చెందినది.

దీవులకు చెందిన సముద్ర-భూమధ్య రేఖా ప్రాంత వాతావరణం సంవత్సరం పొడవునా ఉక్కపోతగా ఉంటుంది, ఇక్కడ సగటు ఉష్ణోగ్రత 27 °C (80 °F) గాను, కొన్నిసార్లు అధిక ఉష్ణోగ్రత లేదా వాతావరణంతో ఉంటుంది. ఇక్కడ జూన్ నుండి ఆగస్టు వరకు చల్లగా ఉంటుంది. రుతువులను ప్రకటించనప్పటికీ, నవంబరు నుండి ఏప్రిల్ వరకు వాయవ్యం నుండి వచ్చే గాలుల ద్వారా అధిక వర్షపాతంతోపాటు తరచుగా తుపానులు, గాలివానలు వస్తుంటాయి. వార్షిక వర్షపాతం దాదాపు 3050 mm (120 in) గా ఉంటుంది.

సోలమన్ దీవుల ద్వీప సమూహం రెండు విశిష్టమైన ప్రాదేశిక పర్యావరణప్రాంతాలులో భాగం. దీవులలో అధిక భాగం సోలమన్ దీవుల వర్షాటవుల పర్యావరణ ప్రాంతంలో భాగం, పాపువా న్యూగినియాలో భాగమైన బౌగెన్‌విల్లె మరియు బుకా దీవులు కూడా దీనిలో భాగమే, అటవీ కార్యక్రమాల ద్వారా ఈ అడవులపై ఒత్తిడి పడుతోంది. పొరుగున ఉన్న వనాటు.ద్వీప సమూహంతో కూడిన +వనాటు వర్షాటవుల పర్యావరణ ప్రాంతంలో శాంతా క్రజ్ దీవులు ఒక భాగం, అగ్నిపర్వతపు (ఇక్కడ అతి పెద్ద ద్వీపాలలో వివిధ స్థాయిలతో కూడిన కొన్ని అగ్నిపర్వతాలు ఉన్నాయి) ఒండ్రుతోపాటు సాపేక్షికంగా నిస్సారమైన నేలలు ఇక్కడ ఉన్నాయి. దాదాపు 230 కంటే పైబడిన ఆర్చిడ్ రకాలు మరియు భూమధ్యరేఖా ప్రాంత పుష్పాలు ఇక్కడి భూమిని ప్రకాశవంతం చేస్తుంటాయి.

ఈ దీవులలో ఇప్పటికీ చురుగ్గా ఉన్న మరియు చల్లారిపోయిన అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇక్కడి టినాకుల మరియు కవాచి అగ్నిపర్వతాలు చాలా చురుగ్గా ఉంటున్నాయి.

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

$600 తలసరి GDPతో సోలమన్ దీవులు తక్కువ అభివృద్ధి చెందిన దేశంగా నిలిచింది, దాని శ్రామికశక్తిలో 75% కంటే ఎక్కువ మంది కనీస జీవనోపాధి, మరియు చేపల వేటలో మునిగి ఉంది. ఉత్పత్తి చేసిన సరకులు మరియు పెట్రోలియం ఉత్పత్తులలో చాలా భాగం దిగుమతి చేసుకుంటున్నారు. 1998 వరకు, అంటే భూమధ్యరేఖా ప్రాంతంలోని కలపకు ప్రపంచ మార్కెట్లో ధరలు బాగా పడిపోయేటంతవరకు సోలమన్ దీవులు ప్రధాన ఎగుమతి ఉత్పత్తిగా కలపే ఉండేది, ఇటీవలి సంవత్సరాలలో సోలమన్ అడవులను ప్రమాదకరరీతిలో మితిమీర కొట్టివేస్తున్నారు. ఇతర వ్యాపార పంటలు మరియు ఎగుమతి పంటలు కోప్రా మరియు పామాయిల్. 1988లో ఆస్ట్రేలియా రాస్ మైనింగ్ కంపెనీ గ్వాడల్‌కెనాల్‌లో గోల్డ్ రిడ్జ్ వద్ద బంగారాన్ని ఉత్పత్తి చేయడం మొదలు పెట్టింది. ఇతర ప్రాంతాల్లో ఖనిజాలను వెలికితీయడం కొనసాగింది. అయితే 2000 జూన్‌లో జాతి హింస నేపథ్యంలో, పామాయిల్ మరియు బంగారు ఎగుమతులు నిలిచిపోగా, కలప ఎగుమతులు పడిపోయాయి. అభివృధ్ధి చెందుతున్న దేశాల్లోని సీసం, జింక్, నికెల్, మరియు బంగారం వంటి ఖనిజ వనరులకు సోలమన్ దీవులు నిలయంగా ఉంది.

సోలమన్ దీవుల మత్స్యకారులు ఎగుమతి మరియు దేశీయ ఆర్థిక విస్తరణ అవకాశాలను కూడా ప్రతిపాదిస్తోంది. అయితే, దేశంలో మత్యసంబంధ ఆహార తయారీ రంగంలో ఉన్న జపనీస్ జాయింట్ వెంచర్ సోలమన్ టైయో లిమిటెడ్, జాతి సమస్యతో 2000 మధ్యలో మూతపడింది. స్థానిక యాజమాన్యం అధ్వర్యంలో ప్లాంట్ తిరిగి ప్రారంభించినప్పటికీ, టునా చేపల ఎగుమతి సాథ్యపడలేదు. గోల్డ్ రిడ్జ్ గనిని, ప్రధానమైన పామాయిల్ తోటలను తిరిగి ప్రారంభించడం కోసం చర్చలు కొనసాగుతున్నాయి.

పర్యాటక రంగం ప్రత్యేకించి, డైవింగ్ సోలమన్ దీవులకు ముఖ్యమైన సేవా పరిశ్రమగా ఉంది. అయితే మౌలిక సౌకర్యాల కల్పన మరియు రవాణా పరిమితుల కారణంగా ఈ పరిశ్రమలో పురోగతి నిలచిపోయింది.

సోలమన్ దీవుల ప్రభుత్వం 2002 నాటికి అస్థిరపడిపోయింది. 2003లో RAMSI జోక్యం చేసుకున్న తర్వాత, ప్రభుత్వం తన బడ్జెట్‌ను తిరిగి అంచనా వేసుకుంది. అది తన దేశీయ రుణాన్ని తిరిగి సంప్రదింపుల ద్వారా స్థిరపర్చుకుంది ఆస్ట్రేలియా మద్దతు ద్వారా విదేశీ చెల్లింపుల విషయమై తిరిగి సంప్రదింపులకు చూస్తోంది. ప్రధాన రుణదాతలు ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, యూరోపియన్ యూనియన్, జపాన్ మరియు రిపబ్లిక్ ఆఫ్ చైనా.

ఇటీవలే అంటే ఈ మధ్య కాలంలో, సోలమన్ దీవుల కోర్టులు లాభాలకోసమై, సజీవంగా ఉన్న డాల్ఫిన్‌లను దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఎగుమతి చేయడాన్ని తిరిగి ఆమోదించాయి. మెక్సికోకు 28 సజీవ డాల్పిన్‌లను ఎగుమతి చేయడంపై అంతర్జాతీయంగా నిరసన తలెత్తడంతో ప్రభుత్వం 2004లో ఈ విధానాన్ని నిలిపివేసింది. ఈ విధానాన్ని పునరుద్ధరించడంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో పాటు పలు సాంప్రదాయిక సంస్థలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి.

శక్తి[మార్చు]

పసిఫిక్ ఐలాండ్స్ అప్లైడ్ జియోసైన్స్ కమిషన్ (SOPAC) కోసం పనిచేస్తూ, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ పార్టనర్‌షిప్ (REEEP), ద్వారా నిధులు పొందుతున్న రెన్యూవబుల్ ఎనర్జీ డెవలపర్ల బృందం ఇక్కడి తెగలు ఎలాంటి నగదు ఖర్చు లేకుండానే, తిరిగి ఉపయోగించుకోగల సోలార్ వంటి శక్తిని పొందగలిగే పథకాన్ని రూపొందించింది. వీరు, నీరు మరియు పవనశక్తిని కూడా ఉపయోగిస్తున్నారు. ప్రాజెక్టు డెవలపర్లు రూపొందించిన సోలార్ లాంతర్లకు చెల్లించడానికి దీవి ప్రజల వద్ద నగదు లేనట్లయితే వారు పంటలను చెల్లించవచ్చు.[21]

జనాభా వివరాలు[మార్చు]

2006 నాటికి సోలమన్ దీవులలోని 552,438 ప్రజలలో ఎక్కువమంది జాతిపరంగా మెలనేషియన్‌లు (94.5%). పోలినేసియన్ (3%) మరియు మైక్రోనేసియన్‌‌ (1.2%) లు ఈ దీవులలోని మరో రెండు ప్రధాన గ్రూపులు. ఇక్కడ కొన్ని వేలమంది చైనా జాతీయులు ఉన్నారు.
సోలమన్ దీవులలో నమోదైన స్థానిక భాషల సంఖ్య 74, వీటిలో 70 సజీవ భాషలు కాగా, 4 అంతరించిపోతున్నాయని «ఎత్నోలోగ్, లాంగ్వేజెస్ ఆఫ్ ది వరల్డ్» .తెలిపింది.[22] సెంట్రల్ ఐలాండ్స్‌లో మెలనేసియన్ భాషలు (ప్రధానంగా ఇవి వాయవ్య సాల్మనిక్ గ్రూపుకు చెందినవి) మాట్లాడే భాషలు. దూరప్రాంతాల్లో, దక్షిణాన రెన్నెల్ మరియు బెల్లోనా, దూరప్రాచ్యంలో టికోపియా, అనూటా మరియు ఫటుటాకా, ఈశాన్యంలో సికైన్నా, ఉత్తరాన లువానియువా మరియు (అంటోగ్ జావా ఎటోల్, లార్డ్ హోవె ఎటోల్‌గా సుపరిచతం), పోలినీసియన్ భాషలు మాట్లాడే భాషలుగా ఉన్నాయి. గిల్బర్టెస్ (ఐ-కిరిబాటి) మరియు టువాలుయన్లకు చెందిన వలస ప్రజలు మైక్రోనేసియన్ భాషలను మాట్లాడతారు. ఇంగ్లీష్ అధికార భాషగా ఉంది, జనాభాలో 1-2% మంది మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడతారు, లింగ్వా ఫ్రాన్కా సోలమన్ల పిజిన్.

ఆరోగ్యం[మార్చు]

2007 నాటికి, మహిళల ఆయుర్దాయం 66.7 సంవత్సరాలు కాగా, పురుషుల ఆయుర్దాయం 64.9 సంవత్సరాలుగా ఉంది.[23] 1990-1995 సంతాన రేటు ప్రకారం ఒక మహిళ 5.5 ఐదుగురికి జన్మనిస్తోంది[23] ప్రభుత్వం ఆరోగ్యంపై పెడుతున్న తలసరి ఖర్చు US$ 99 (PPP).[23] ఆరోగ్యకరమైన ఆయుర్దాయం 60 సంవత్సరాలుగా ఉంది[23]

మతం[మార్చు]

సోలమన్ దీవులలో 97% మంది క్రైస్తవ మతస్థులు వీరిలో కింది వర్గీకరణలు ఉన్నాయి: ఆంగ్లికన్ చర్చ్ ఆఫ్ మెలనేసియా 32.8%, రోమన్ కేథలిక్కులు 19%, సౌత్ సీస్ ఎవాంజెలికల్ చర్చ్ 17%, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ 11.2%, యునైటెడ్ చర్చ్ 10.3%, క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్ 2.4%, కాగా, ఇతర క్రిస్టియన్లు 4.4%గా ఉన్నారు. మిగిలిన 2.9% మంది దేశీయ మత విశ్వాసాలను పాటిస్తున్నారు.[24] ఇటీవలి నివేదికల ప్రకారం, సోలమన్ దీవులలో ఇస్లామ్ మతంలో దాదాపుగా 350మంది ముస్లింలు ఉన్నారని తెలుస్తోంది.

సంస్కృతి[మార్చు]

సోలమన్ దీవులకు చెందిన సాంప్రదాయిక సంస్కృతిలో, పురాతన సంప్రదాయాలు తరం తర్వాత తరానికి సంక్రమిస్తుంటాయి, సోలమన్ దీవుల సాంస్కృతిక విలువలను నెలకొల్పడానికి ప్రాచీనుల ఆత్మల నుండి ఇవి తర్వాతి తరాలకు అందించబడుతుంటాయిని నమ్మకం.

భాషా భేదాలు, నిరక్షరాస్యత[25], దేశంలోని కొన్ని ప్రాంతాల్లో టెలివిజన్ సిగ్నళ్లను అందుకోవడంలో సమస్యల కారణంగా సోలమన్ ఐలండ్స్‌లో రేడియో అతి శక్తివంతమైన మీడియాగా ఉంటోంది. సోలమన్ ఐలండ్స్ బ్రాడ్‌కాస్టంగ్ కార్పొరేషన్ (SIBC) జాతీయ స్టేషన్లు రేడియో హ్యాపీ ఐసెల్స్ మరియు వాంటోక్ FM, మరియు ప్రొవిన్షియల్ స్టేషన్లు రేడియో హ్యాపీ లగూన్ మరియు, అంతకు ముందుగా, రేడియో టెమొటు ఒక వాణిజ్య స్టేషన్, PAOA FM, సోలమన్ల గురించి ప్రసారం చేసేది. ఇక్కడ ఒక దిన పత్రికసోలమన్ స్టార్ (www.solomonstarnews.com) ఒక డైలీ ఆన్‌లైన్ న్యూస్ వెబ్‌సైట్ సోలమన్ టైమ్స్ ఆన్‌లైన్ (www.solomontimes.com), 2 వీక్లీ పేపర్స్ సోలమన్స్ వాయిస్ మరియు సోలమన్ టైమ్స్, మరియు 2 మాస పత్రికలు అగ్రికల్స్ నియుస్ మరియు సిటిజెన్స్ ప్రెస్ శాటిలైట్ TV స్టేషన్లను స్వీకరిస్తున్నప్పటికీ సోలమన్ దీవులలో TV సర్వీసులు లేవు. ఇక్కడ ABC ఆసియా పసిఫిక్ (ఆస్ట్రేలియాకు చెందిన ABC) మరియు BBC వరల్డ్ న్యూస్కి ఫ్రీ ఎయిర్-టు-ఎయిర్ యాక్సెస్ ఉంది.

సోలమన్ దీవుల రచయితలో నవలాకారులు రెక్స్‌ఫోర్డ్ ఒరోటలోవా మరియు జాన్ సౌననా మరియు కవి జుల్లీ మకిని కూడా ఉన్నారు.

క్రీడలు[మార్చు]

ప్రపంచ కప్ 2006కు అర్హత సాధించడానికి ఆస్ట్రేలియాతో క్వాలిఫైయింగ్ సాధించడం కోసం న్యూజిలాండ్‌ను ఓడించిన తొలి జట్టుగా సోలమన్ ఐలండ్స్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు చరిత్రకెక్కింది. వీరు ఆస్ట్రేలియాలో 7-0తో, స్వదేశంలో 2-1 తేడాతో ఓడించబడ్డారు.

2008 సెప్టెంబరు నుంచి అక్టోబరు 19 వరకు బ్రెజిల్‌లో జరిగిన 2008 FIFA ఫుట్సల్ వరల్డ్ కప్‌కు క్వాలిఫై కావడంకోసం, 2008 జూన్ 14న జాతీయ సోలమన్ ఐలండ్ ఫుట్సల్ జట్టు ఫిజీలో ఓషేనియా ఫుట్సల్ ఛాంపియన్‌షిప్‌ను గెల్చుకుంది. సోలమన్ దీవులు ఓషేనియా ప్రాంతంలో పుట్సల్ డిఫెండిగ్ ఛాంపియన్. ఇటీవలే,[ఎప్పుడు?] నేషనల్ సోలమన్ ఐలండ్ ఫుట్సల్ జట్టు ఫిజీలో ఓషేనియా ఫుట్సల్ ఛాంపియన్‌షిప్‌ను గెల్చుకుంది. ఆతిథ్య దేశం ఫిజీపై వారు 8-0తో గెలుపు సాధించారు.

సోలమన్ దీవుల బీచ్ సాకర్ జట్టు ఓషేనియా,[ఉల్లేఖన అవసరం]లో ఉత్తమ జట్టుగా గుర్తింపు పొందింది మరియు గత మూడు FIFA బీచ్ సాకర్ వరల్డ్ కప్‌లు గెల్చుకుంది.

సోలమన్ ఐలండ్స్ నేషనల్ రగ్బీ యూనియన్ టీమ్ 1969 నుంచి అంతర్జాతీయ పోటీలలో ఆడుతోంది.

సోలమన్ ఐలాండ్ రగ్బీ లీగ్ టీమ్ ప్రపంచ కప్‌[ఉల్లేఖన అవసరం][ఎప్పుడు?]లో పోటీ చేసింది.

విద్య[మార్చు]

ప్రాధమిక పాఠశాలలలో హాజరు ప్రపంచ స్థాయితో పోలిస్తే సోలమన్ దీవుల్లో ప్రత్యేకించి, మలైటాలో చాలా తక్కువగా ఉంది. [26] విద్యాభ్యాసం చేస్తున్న మహిళల కంటే పురుషుల విద్యాభ్యాసం స్థాయి ఇక్కడ ఎక్కువ.[26] దక్షిణ పసిఫిక్ విశ్వవిద్యాలయం క్యాంపస్ గ్వాడల్‌కెనాల్‌లో ఉంది.[27]

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. Department of Economic and Social Affairs Population Division (2009). "World Population Prospects, Table A.1" (.PDF). 2008 revision. United Nations. Retrieved on 2009-03-12.
 2. 2.0 2.1 2.2 2.3 "Solomon Islands". International Monetary Fund. Retrieved 2010-04-21. Cite web requires |website= (help)
 3. 3.0 3.1 సోలమన్ ఐలాండ్స్ యొక్క రాజ్యాంగం (1978)
 4. సోలమన్ ఐలాండ్స్ యొక్క జాతీయ పార్లమెంటు
 5. సోలమన్ దీవుల కేంద్ర బ్యాంకు
 6. "మోర్ విక్టిమ్స్ రెడీ టు టెస్టిఫై ఇన్ నెక్ట్ హియరింగ్స్", సోలమన్ టైమ్స్ , మార్చి 11, 2010
 7. "కౌన్సిల్ ఆఫ్ విమెన్ కండెమ్న్స్ బీటింగ్", సోలమన్ స్టార్ , మార్చి 11, 2010
 8. RAMSI
 9. "కంట్రీ ప్రొఫైల్: సోలమన్ ఐలాండ్స్", BBC
 10. [1] ది టులగి బ్యాటిల్
 11. "[2] ది బ్యాటిల్ ఫర్ గ్వాడన్‌కెనాల్". NPR: నేషనల్ పబ్లిక్ రేడియో
 12. [3]'సీ పవర్: ఎ నావల్ హిస్టరీ". ఎల్మెర్ బెలెమోంట్ పోటర్, చెస్టర్ విలియమ్ నిమిట్జ్ (1960). p.709.
 13. అన్‌టైటిల్డ్ డాక్యుమెంట్ Archived 2011-02-10 at the Wayback Machine. ఎట్ www.commerce.gov.sb
 14. సోలమన్ ఈజ్ ఫెయిల్డ్ స్టేట్ ఆర్ నాట్ ఫెయిల్డ్ స్టేట్? Archived 2003-11-10 at the Wayback Machine. 12 అక్టోబరు 2008 పసిఫిక్ మేగజైన్ URL యాక్సెస్డ్ 2006-05-04
 15. "సోలమన్ ఐలండ్స్ ఎర్త్‌క్వేక్ అండ్ సునామి", బ్రేకింగ్ లీగల్ న్యూస్ - ఇంటర్నేషనల్, 04-03-2007
 16. CIA - ది వరల్డ్ ఫేస్‌బుక్ - సోలమన్ ఐలండ్స్
 17. "సోలమన్స్ ఈజ్ ఎ లాఫింగ్ స్టాక్", - SBS వరల్డ్ న్యూస్ , - 2007-07-11
 18. సిరెహెటి, జోవన్నా., & జోయ్ బాసి, - "సోలమన్ ఐలండ్స్ PM డిఫీటెడ్ ఇన్ నో-కాన్ఫిడెన్స్ మోషన్", - సోలమన్ టైమ్స్ , - 13 డిసెంబర్ 2007
 19. టుహైకా, నినా., - "న్యూ ప్రైమ్ మినిస్టర్ ఫర్ సోలమన్ ఐలండ్స్", - సోలమన్ టైమ్స్ , - 20 డిసెంబర్ 2007
 20. "సోలమన్ ఐలండ్స్ పార్లమెంట్ ఎలెక్ట్స్ న్యూ PM", - ABC రేడియో ఆస్ట్రేలియా, - 20 డిసెంబర్ 2007
 21. http://www.renewableenergyworld.com/rea/news/article/2009/04/solomon-islands-solar-a-new-microfinance-concept-takes-root?cmpid=WNL-Wednesday-April8-2009
 22. [4]
 23. 23.0 23.1 23.2 23.3 "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2013-10-15 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-09. Cite web requires |website= (help)
 24. Centre for Intercultural Learning, Foreign Affairs Canada. "Country Insights: Solomon Islands". మూలం నుండి 2007-05-15 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-04-18. Cite web requires |website= (help)
 25. BBC న్యూస్ కంట్రీ ప్రొఫైల్: సోలమన్ ఐలాండ్స్ URL యాక్సెస్డ్ 2006-05-04
 26. 26.0 26.1 http://www.spc.int/prism/Country/SB/Stats/Publication/DHS07/factsheet/SOL-DHS_1-Pop.pdf
 27. http://www.usp.ac.fj/index.php?id=campuses
 • ఆల్కహాల్ అండ్ డ్రగ్ యూజ్ ఇన్ హొనియరా, సోలమన్ ఐలాండ్స్: ఎ కాజ్ ఫర్ కన్సర్న్
 • హాడన్, రాబర్ట్ లీ. 2007 "ది జియాలజీ ఆఫ్ గ్వాడన్‌కెనాల్ ఎ సెలెక్టెడ్ బిబ్లియోగ్రఫీ ఆఫ్ ది జియాలజి, నాచురల్ హిస్టరీ, అండ్ ది హిస్టరీ ఆఫ్ గ్వాడన్‌కెనాల్ [5]." అలెగ్జాండ్రా, VA: టోపోగ్రఫిక్ ఇంజనీరింగ్ సెంటర్ 360 పుటలు. లిస్ట్స్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది బాడీస్ ఆఫ్ ది US మెరైన్స్ ఆఫ్ ది లెఫ్టినెంట్ కల్నల్ ఫ్రాంక్ బి. గోట్టేజ్ రికన్నాయిసెన్స్ పెట్రోల్ దట్ వాజ్ ఆంబుష్డ్ ఇన్ ఆగస్టు 1942.

ఈ కథనం యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్స్ & CIA వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ యొక్క వెబ్‌సైట్ల లోని పబ్లిక్ డొమైన్ పాఠాన్ని పొందుపర్చింది..}.

బాహ్య లింకులు[మార్చు]

Solomon Islands గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo.svg నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg ఉదాహరణలు వికికోటు నుండి
Wikisource-logo.svg మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png వార్తా కథనాలు వికీ వార్తల నుండి

ప్రభుత్వం
సాధారణ సమాచారం
న్యూస్ మీడియా
ప్రయాణం