సౌఖ్యం (సినిమా)
సౌఖ్యం | |
---|---|
![]() సౌఖ్యం సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | ఏ.ఎస్. రవికుమార్ చౌదరి |
నిర్మాత | వి. ఆనంద్ ప్రసాద్ |
రచన | శ్రీధర్ సీపన్న (మాటలు) |
స్క్రీన్ ప్లే | కోన వెంకట్ గోపి మోహన్ |
కథ | శ్రీధర్ సీపన్న |
నటులు | తొట్టెంపూడి గోపీచంద్ రెజీనా |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
ఛాయాగ్రహణం | ప్రసాద్ మూరెళ్ళ |
కూర్పు | గౌతంరాజు |
నిర్మాణ సంస్థ | భవ్య క్రియేషన్స్ |
విడుదల | 24 డిసెంబరు 2015 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఖర్చు | ₹15 crore (US$2.1 million) |
బాక్సాఫీసు | ₹6.8 crore (US$9,50,000) |
సౌఖ్యం 2015, డిసెంబరు 24న విడుదలైన తెలుగు చలనచిత్రం. భవ్య క్రియేషన్స్ వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో ఏ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తొట్టెంపూడి గోపీచంద్, రెజీనా, ముఖేష్ రిషి, దేవన్, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం నటించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.[1] క్రిస్టమస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.[2][3]
కథ[మార్చు]
అనుబంధాలకు విలువనిచ్చే కుటుంబానికి చెందిన శ్రీను (గోపీచంద్) ఫ్రెండ్స్‌తో జాలీగా తిరుగుతుంటాడు. రైలు ప్రయాణంలో శైలజ (రెజీనా)ని చూసి ప్రేమిస్తాడు. శైలజ కూడా శ్రీనును ప్రేమిస్తుంది. ఒకరోజు శైలజని కిడ్నాప్ అవుతుంది. తండ్రి కృష్ణారావు (ముఖేష్ రుషి) చెప్నడంతో శ్రీను శైలజని వెతకడం మానేస్తాడు. కానీ గతంలో శ్రీనుతో ఉన్న గొడవల కారణంగా భావూజీ (ప్రదీప్ రావత్) మనుషులు శ్రీనును చంపాలనుకుంటారు. అది కుదరకపోవడంతో భావూజీ ప్లాన్ వేసి కలకత్తాలో కింగ్ మేకర్ అయిన పిఆర్ (దేవన్) కూతుర్ని లేపుకు రమ్మని శ్రీనుతో చెప్తాడు. పరిస్థితుల వల్ల భావూజీ మాట మేరకు కలకత్తా వెళ్తాడు. ఆ తురవాత ఏం జరిగిందనేది మిగతా కథ.[4][5]
నటవర్గం[మార్చు]
- తొట్టెంపూడి గోపీచంద్ (శ్రీనివాస్ రావు-సీను)
- రెజీనా (శైలజ-శైలు)[6]
- ముఖేష్ రిషి (కృష్ణరావు-సీను తండ్రి)
- దేవన్ (పీఆర్-శైలు తండ్రి)
- ప్రదీప్ రావత్ (బావుజీ)
- బ్రహ్మానందం (దయా)
- జయప్రకాష్ రెడ్డి (పెళ్ళికొడుకు)
- పోసాని కృష్ణమురళి (తిరుపతి రైలు ప్రయాణికుడు)
- పృథ్వీరాజ్ (శివుడు)
- రఘుబాబు (దేవా)
- సత్య కృష్ణన్ (దేవా భార్య)
- సత్యం రాజేష్ (డా. సిద్ధప్ప)
- షావుకారు జానకి (మోడ్రన్ బామ్మ)
- ప్రగతి (సుజాత)
- నారమల్లి శివప్రసాద్ (పెర్ఫ్యూమ్ ప్రసాద్)
- సప్తగిరి (గిరి)
- కృష్ణ భగవాన్
- శివాజీ రాజా
- సురేఖా వాణి
- గుండు సుదర్శన్
- అంబటి అర్జున్ (బావుజీ కొడుకు)
- చంటి (కానిస్టేబుల్)
- సి.వి. సుబ్బారెడ్డి
- సారిక రామచంద్ర రావు
- రామచంద్ర
- కారుమంచి రఘు
- టార్జాన్
- రజిత
- అపూర్వ
- జ్యోతి
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం: ఏ.ఎస్. రవికుమార్ చౌదరి
- నిర్మాత: వి. ఆనంద్ ప్రసాద్
- కథ, మాటలు: శ్రీధర్ సీపన్న
- చిత్రానువాదం: కోన వెంకట్, గోపి మోహన్
- సంగీతం: అనూప్ రూబెన్స్
- ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ
- కూర్పు: గౌతంరాజు
- నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్స్
పాటలు[మార్చు]
Untitled | |
---|---|
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. 2015, డిసెంబరు 13న ఒంగోలులో జరిగిన పాటల విడుదల కార్యక్రమంలో జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[7]
పాటల జాబితా | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
సంఖ్య. | పాట | గాయకులు | నిడివి | |||||||
1. | "నాకేం తోచదే (రచన: రామజోగయ్య శాస్త్రి)" | హరిహరన్ | 4:06 | |||||||
2. | "యు ఆర్ మై హనీ (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | నకేశ్ అజిజ్, మోహన భోగరాజు | 3:40 | |||||||
3. | "అలారే ఆల (రచన: రామజోగయ్య శాస్త్రి)" | మనీషా ఎర్రబత్తిని, రాహుల్ పాండే | 3:46 | |||||||
4. | "జిగి జిగి జిందగీ (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామన్ | 3:20 | |||||||
5. | "లాలిపాప్ (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | గీతా మాధురి | 4:00 | |||||||
మొత్తం నిడివి: |
18:55 |
మూలాలు[మార్చు]
- ↑ మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.
- ↑ "Soukhyam (Review)". International Business Times.
- ↑ "Soukhyam (Trailer)". YouTube.
- ↑ 123 తెలుగు, రివ్యూ (27 December 2015). "సౌఖ్యం తెలుగు సినిమా రివ్యూ". www.123telugu.com. Retrieved 11 June 2020.
- ↑ The Hindu, Movie Review (2015-12-24). "Soukhyam: Don't go by the title". Sangeetha Devi Dundoo. Archived from the original on 2020-06-11. Retrieved 2020-06-11.
- ↑ సాక్షి, సినిమా (20 November 2015). "అప్పుడు రకుల్... ఇప్పుడు రెజీనా". Sakshi. Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.
- ↑ ప్రజాశక్తి, వార్తలు (22 November 2015). "డిసెంబర్ 13న ఒంగోలులో సౌఖ్యం ఆడియో విడుదల". www.prajasakti.com. Archived from the original on 11 జూన్ 2020. Retrieved 12 June 2020. Check date values in:
|archivedate=
(help)
ఇతర లంకెలు[మార్చు]
- Pages with non-numeric formatnum arguments
- 2015 సినిమాలు
- Articles which use infobox templates with no data rows
- గోపిచంద్ నటించిన చిత్రాలు
- 2015 తెలుగు సినిమాలు
- జయప్రకాశ్ రెడ్డి నటించిన చిత్రాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- పోసాని కృష్ణ మురళి సినిమాలు
- రఘుబాబు నటించిన చిత్రాలు
- కృష్ణ భగవాన్ నటించిన చిత్రాలు
- శివాజీ రాజా నటించిన చిత్రాలు