సౌమిత్ర ఖాన్
| సౌమిత్ర ఖాన్ | |||
| |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2014 మే 16 | |||
| ముందు | సుస్మిత బౌరి | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | బిష్ణుపూర్ | ||
| పదవీ కాలం 2011 – 2014 | |||
| ముందు | కల్పనా కోలే | ||
| తరువాత | శ్యామల్ సంత్రా | ||
| నియోజకవర్గం | కతుల్పూర్ | ||
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు , ఆల్ ఇండియా తృణమూల్ యూత్ కాంగ్రెస్
| |||
| ముందు | సువెందు అధికారి | ||
| తరువాత | అభిషేక్ బెనర్జీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1980 December 8[1] దుర్లభ్‌పూర్, బంకురా జిల్లా, పశ్చిమ బెంగాల్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2019-ప్రస్తుతం) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | తృణమూల్ కాంగ్రెస్ (2014-2019) భారత జాతీయ కాంగ్రెస్ (2014 వరకు) | ||
| పూర్వ విద్యార్థి | పంచముర మహావిద్యాలయ[1] | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| సంతకం | |||
పార్లమెంటరీ కమిటీ సభ్యత్వాలు[1]
| |||
సౌమిత్ర ఖాన్ (జననం: 8 డిసెంబర్ 1980) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బిష్ణుపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]సౌమిత్ర ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 2011 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో కతుల్పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి పూర్ణిమ బాగ్డిపై 1433 ఓట్ల మెజారిటీతో గెలిచి పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన ఆ తరువాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిష్ణుపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎఐటిసి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప సీపీఎం అభ్యర్థి సుస్మిత బౌరిపై 1,49,685 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
సౌమిత్ర ఖాన్ ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2019 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎఐటిసి అభ్యర్థి శ్యామల్ సంత్రాపై 78,047 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎఐటిసి అభ్యర్థి సుజాత మండల్‌పై 5,567 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Members Bioprofile". loksabhaph.nic.in. Lok Sabha Secretariat. Retrieved 19 August 2020.
- ↑ "Among BJP's West Bengal winners, a tribal leader, businessman, software expert" (in ఇంగ్లీష్). The Indian Express. 4 March 2024. Archived from the original on 3 July 2025. Retrieved 3 July 2025.
- ↑ "Only 62 Out of 543 MPs Have Clocked 100% Attendance" (in ఇంగ్లీష్). The New Indian Express. 1 March 2015. Archived from the original on 3 July 2025. Retrieved 3 July 2025.
- ↑ "32 newly elected under-35 MPs & what they intend to do for their constituencies". The Economic Times. 25 May 2014. Archived from the original on 20 July 2025. Retrieved 20 July 2025.
- ↑ "2024 Loksabha Elections Results - Bishnupur" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 24 July 2025. Retrieved 24 July 2025.
- ↑ "Bishnupur Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 24 July 2025. Retrieved 24 July 2025.