Jump to content

సౌరభ్ భరద్వాజ్

వికీపీడియా నుండి
సౌరభ్ భరద్వాజ్

పదవీ కాలం
9 మార్చి 2023 – 2025
Lieutenant Governor వినయ్ కుమార్ సక్సేనా
ముందు సత్యేంద్ర కుమార్ జైన్
పదవీ కాలం
2013 డిసెంబర్ 28 – 2014 ఫిబ్రవరి 14
Lieutenant Governor నజీబ్ జంగ్
ముందు రమాకాంత్ గోస్వామి
తరువాత రాష్ట్రపతి పాలన

పదవీ కాలం
2015 ఫిబ్రవరి 14 – 2025 ఫిబ్రవరి 8
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత శిఖా రాయ్
పదవీ కాలం
2013 డిసెంబర్ 28 – 2014 ఫిబ్రవరి 14
ముందు విజయ్ కుమార్ మల్హోత్రా
తరువాత రాష్ట్రపతి పాలన
నియోజకవర్గం గ్రేటర్ కైలాష్

ఢిల్లీ జల్ బోర్డు వైస్ చైర్మన్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2022 మార్చి 22
ముందు రాఘవ్ చద్దా

వ్యక్తిగత వివరాలు

జననం (1979-12-12) 1979 డిసెంబర్ 12 (వయసు: 46)[1]
న్యూఢిల్లీ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ
జీవిత భాగస్వామి శివానీ భరద్వాజ్
నివాసం న్యూఢిల్లీ, భారతదేశం
పూర్వ విద్యార్థి భారతి విద్యాపీఠ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఉస్మానియా యూనివర్సిటీ

సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[2] ఆయన ఢిల్లీ శాసనసభకు గ్రేటర్ కైలాష్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆరోగ్య, పట్టణాభివృద్ధి & నీటి వనరుల శాఖ మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సౌరభ్ భరద్వాజ్ 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో గ్రేటర్ కైలాష్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి విజయ్‌కుమార్ మల్హోత్రాపై 13,092 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2013 డిసెంబర్ 28 నుండి 2014 ఫిబ్రవరి 14 వరకు రవాణా, ఆహారం & సరఫరా, పర్యావరణం& జీఏడీ శాఖ మంత్రిగా పని చేశాడు.

సౌరభ్ భరద్వాజ్ 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో గ్రేటర్ కైలాష్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాకేష్ కుమార్ గుల్లయ్యపై 14,583 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ పై 16,809 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[3][4] 2023 మార్చి 9 నుండి 2025 ఫిబ్రవరి 8 వరకు హోం, ఆరోగ్యం, విద్యుత్, నీరు, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, నీటిపారుదల& వరద నియంత్రణ శాఖల శాఖ మంత్రిగా పని చేశాడు.[5][6]

సౌరభ్ భరద్వాజ్ 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో గ్రేటర్ కైలాష్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ చేతిలో 3188 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. "Saurabh Bhardwaj birth date | Who is Saurabh Bhardwaj | Saurabh Bhardwaj Biography".
  2. "Who is Saurabh Bhardwaj". Business Standard. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
  3. The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  4. Financialexpress (11 February 2020). "Delhi Election 2020: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  5. "Ministers Saurabh Bhardwaj, Atishi take charge of their respective depts". Business Standard. 10 March 2023. Retrieved 8 February 2025.
  6. "Meet Saurabh Bhardwaj, AAP candidate from Greater Kailash seat in Delhi elections 2025" (in ఇంగ్లీష్). ET Now. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
  7. "Greater Kailash Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.