సౌర లాంతరు పధకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సౌర లాంతరు పథకం లక్ష్యాలు[మార్చు]

  • కిరసనాయిలు లాంతర్లు, వత్తితో వెలిగే దీపాల స్థానంలో సౌర శక్తితో వెలిగే లాంతర్లను వినియోగించడం ద్వారా వెలుతురు కొరకు అయ్యే కిరసనాయిలు వాడకాన్ని తగ్గించడం.
  • శిలాజ ఇంధనాలు అవసరం లేని, కాలుష్యాలు విడుదల చేయని, ఆరోగయానికి హాని చేయని, అగ్ని ప్రమాదాల ముప్పు లేని, పర్యావరణానికి అనుకూలమైన కాంతి వ్యవస్థల వినియోగం ద్వారా గ్రామీణవాసుల జీవన స్థాయి మెరుగుపరచడం.
  • చిన్న చిన్న కాంతి అవసరాలకు ఒక ప్రత్యామ్నాయ పద్ధతిని చూపించడం

ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న సంస్థలు[మార్చు]

ఈ సౌర లాంతరు కార్యక్రమం రాష్ట్ర కేంద్ర సంస్థల ద్వారానూ, అక్షయ ఉర్జ దుకాణాల ద్వారా మాత్రమే అమలౌతోంది. తయారీదారులు లేక వారి సంఘాలు తెరిచిన / నిర్వహించే షాపులు ఈ పధకం కిందకి రావు. తమ దుకాణాలు ఈ లాంతరును అమ్మేందుకు తయారీదారులకు లక్ష్యాలను నిర్దేశించే అధికారం రాష్ట్ర కేంద్ర సంస్థలకు లేదు. అలాగే తయారీదారులకూ, వారి సంఘాలకూ, లేదా ప్రభుత్వేతర సంస్థలకూ సరాసరి అమ్మకం చేసేందుకు మంత్రిత్వ శాఖ కూడా ఎటువంటి లక్ష్యాలూ పెట్టదు.

అర్హత కలిగిన లబ్ధిదారులు[మార్చు]

  • ప్రత్యేక కోవకు చెందిన రాష్ట్రాలలోని, కేంద్ర పాలిత దీవులలోని, విద్యుత్ సదుపాయం లేని గ్రామాలలో అన్ని వర్గాలకు చెందిన వ్యక్తిగత లబ్ధిదారులు & లాభాపేక్ష లేని సంస్థలు ఈ పధకం కింద సౌర లాంతర్లు పొందడానికి అర్హులు.
  • ఒక కుటుంబానికి ఒకటి కన్నా ఎక్కువ సౌర లాంతర్లు ఇవ్వబఢవు.
  • ఆడపిల్లల్లో విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో ఒక్కొక్క దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబంలో, 6 నుంచి 12 తరగతి చదివే ఒక అమ్మాయికి ఒక సౌర లాంతరు ఉచితంగా ఇస్తారు. అయితే ఇంక ఆమె స్కూలు చదువు పూర్తయ్యేవరకూ ఇంకొక సౌర లాంతరు పొందడానికి అర్హురాలు కాదు. ఆడపిల్లలకు ఈ సౌర లాంతర్లు పంపకం చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర కేంద్ర సంస్థలు చేపడతాయి. ఇందుకు గాను జిల్లా కార్యాలయం వారి సహకారంతో ఆ బాలిక చదువుతున్న తరగతి, పాఠశాల గురించిన వివరాలను, దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాల హొదాను తనిఖీ చేస్తారు. లబ్ధిదారులు గుర్తింపు కొరకు సంబంధిత సంస్థకు రేషన్ కార్డు, వోటరు గుర్తింపు కార్డు వంటివి చూపించవలసి ఉంటుంది.
  • ఎస్.సి. /ఎస్.టి. లబ్ధిదారులకు సౌర లాంతర్లు: ఈ కార్యక్రమాన్ని అమలు చేసే సంస్థలు, పంపకానికై ఇచ్చిన సౌర లాంతర్లలో కనీసం 15 % షెడ్యూలు కులాల వారికి, 10 % షెడ్యూలు తెగల వారికి అందేటట్లు చూడాలి.
  • సౌర లాంతరు పధకంలో స్త్రీల పాత్ర: ఈ సౌర లాంతర్లు ముందుగా ఆడపిల్లల వసతి గృహాలకూ, స్త్రీ వయోజన విద్యా కేంద్రాలకూ, డ్వాక్రా కేంద్రాలకూ పంపిణీ చేయాలి. పాఠశాలకు వెళ్ళే ఆడ పిల్లలు ఉన్న కుటుంబాలకు కూడా ముందు ఇవ్వాలి.
  • సౌర లాంతర్ల పంపిణీ ఒకే కూటమి పద్ధతిలో చేపట్టినట్లయితే, దాని అమలు, నిర్వహణ, అమ్మకం అనంతరపు సేవలు, సౌర లాంతర్ల తనిఖీ సులభతరమౌతుంది.

ఆమోదింపబడ్డ సౌర లాంతర్ల నమూనాలు[మార్చు]

పూర్తీ విదేశీ సౌర లాంతర్లు ఈ పధకం పరిధి లోనికి రావు. కానీ విదేశీ బ్యాటరీలు, ఇతర భాగాలు అనుమతింపబడతాయి. అయితే ఈ దిగుమతి చేసుకున్న భాగాలు ఎం.ఎన్.ఆర్.ఇ. నిర్దేశించిన ప్రమాణాలకు సరిపోయేటట్లు ఉన్నాయో లేదో అని ఒక స్వతంత్ర పరీక్షా సంస్థ వాటి పని తీరును ధ్రువీకరించ వలసి ఉంటుంది.

ఈ పధకాన్ని అమలుచేసే సంస్థలు కేవలం ఎం.ఎన్.ఆర్.ఇ. నిర్దేశించిన ప్రమాణాలకు సరిపోయేటట్లు ఉండే సౌర లాంతర్లను మాత్రమే కొనుగోలు చేయాలి.

అక్షయ ఉర్జ షాపుల ద్వారా ఈ పధకం అమలుపరుచుట[మార్చు]

భారతదేశపు నవ్య, పునరుత్పత్తి శక్తి మంత్రత్వ శాఖ, పెద్ద నగరాలలో ఆదిత్య సౌర దుకాణాలను ఏర్పరచడాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ దుకాణాలు ఇప్పుడు అక్షయ్ ఊర్జా దుకాణాలుగా పిలవబడుచున్నాయి. ఇవి అన్ని రకాల పునరుత్పత్తి శక్తి సాధనాలు, వ్యవస్ధలను, సౌర శక్తి ఉత్పత్తులతో సహా అమ్మకాలకు, నిర్వహణకు ఉద్దేశించబడ్డాయి. ఈ దుకాణాలు, దిగువ పేర్కొన్న విధులను నిర్వహిస్తాయి.

  • వివిధ రకాలైన పునరుత్పత్తి శక్తి, శక్తి సామర్థ్యం గల సాధనాల అమ్మకం
  • పునరుత్పత్తి శక్తి సాధనాలను మరమ్మతు చేయుట, నిర్వహణ లోపాలను సరిచేయుట
  • పునరుత్పత్తి శక్తి సాధనాలు, వ్యవస్ధల గురించిన సమాచారం ప్రచారం చేయుట,,
  • వ్యక్తులు / సంస్ధలు ( కంపెనీలు) పునరుత్పత్తి శక్తి సాధనాలను వినియోగించుటకై ప్రోత్సహించుట
  • రాష్ట్ర సంస్థలు, ప్రైవేటు వ్యాపార వేత్తలు, ఎన్ జి.ఓలు పెట్టిన అక్షయ ఉర్జ దుకాణాలు సంబంధిత రాష్ట్ర సంస్థల నుండి లక్శాలు పొంది ఎం.ఎన్.ఆర్.ఇ. నిబంధనలు, మార్గసూచికలకు కట్టుబడి ఉండి అమ్మకాలు జరుపుకోగలరు.

పునః చెల్లింపు పద్ధతిపై అక్షయ ఉర్జ షాపులు రాష్ట్ర సంస్థల నుండి రాయితీ పొందవచ్చు. ఇందుకు గాను అవి పూర్తి చిరునామాలతో, అమ్మకపు తేదీలతో, అమ్మకపు వెలతో, నమూనాలు, ఉత్పత్తి దారుల పేరు, సమకూర్చబడిన వస్తువు, పి.వి. భాగాల యొక్క క్రమ సంఖ్య, కొనుగోలుదారుల గుర్తింపు వివరాలు (రేషను కార్డు, టెలిఫోన్ బిల్లు, విద్యుత్ బిల్లు, పాస్ పోర్టు, బాంక్ అక్కౌంట్) వంటి వివరాలతో కూడిన కొనుగోలుదారుల జాబితాను సంబంధిత రాష్ట్ర సంస్థలకు సమర్పించవలసి ఉంటుంది. ప్రైవేటు వారు, ఎన్.జి.ఓ. ల వారు పెట్టుకున్న అక్షయ ఉర్జ దుకాణాలకు రాయితీ మొత్తాన్ని, వారు పంపిణీ చేసిన సౌర లాంతర్లలో 20 % వాటిని యాదృచ్ఛిక పద్ధతిలో తనిఖీ జరిపిన తరువాత సంబంధిత రాష్ట్ర నోడల్ సంస్థ /ఎం.ఎన్.ఎ. ఎస్. ప్రాంతీయ కార్యాలయము వారు తిరిగి చెల్లిస్తారు.

కేంద్ర ఆర్ధిక సహకారం[మార్చు]

రాష్ట్ర కేంద్ర సంస్థలు, అక్షయ ఉర్జ దుకాణాల ద్వారా అర్హత కలిగిన లబ్ధిదారులకు మంత్రిత్వ శాఖ ఒక సౌర లాంతరుకు Rs. 2,400 చొప్పున కేంద్ర ఆర్థిక సహకారాన్ని అందచేస్తుంది. మంత్రిత్వ శాఖ సర్వీసు చార్జీల నిమిత్తం రాష్ట్ర కేంద్ర సంస్థలకు, అక్షయ ఉర్జ దుకాణాలకు ఒక సౌర లాంతరుకు Rs.100 చొప్పున అందచేస్తుంది. అక్షయ ఉర్జ దుకాణాలలో, ఎన్.జి.ఓ.లు నడిపే షాపులలో అమ్మే సౌర లాంతర్లను తనిఖీ చేసేందుకు ఎం.ఎన్.ఆర్.ఇ., రాష్ట్ర కేంద్ర సంస్థలకు లాంతరుకు Rs.100 చొప్పున అందచేస్తుంది. రాష్ట్ర కేంద్ర సంస్థలు నడిపే దుకాణాలకు వేరే సర్వీసు చార్జీలు ఇవ్వబడవు. ఎం.ఎన్.ఇ. ఎస్. ఇచ్చే కేంద్ర ఆర్థిక సహకారంలో 50 % ఎస్.ఎన్.ఏ.లకు అడ్వాన్సుగా ఇస్తారు. మిగిలిన 50 % కేంద్ర ఆర్థిక సహకారం, సర్వీసు చార్జీలు పధకం పూర్తయిన తర్వాత ఇస్తారు.

ఆర్ధిక సహాయం తీసుకొనుటకు అర్హత కలిగిన సంస్ధలు[మార్చు]

రాష్ట్ర కేంద్ర సంస్ధలు ( state nodal agencies), వ్యాపారులు ( private enterprenaurs), సేవా సంస్ధలు ( ngos), దేశంలోని అన్ని జిల్లాలలో ఈ దుకాణాలను స్ధాపించి నిర్వహించగలవు. ధన సహాయము

  • అభ్యర్థులు, ఏర్పాటు చేసే సంస్ధ యొక్క వ్యయంలో 85 శాతం పరిమితి వరకూ రుణాలు, నిర్ధేశిత బ్యాంకుల నుండి, 10 లక్షలకు మించకుండా 7 శాతం వడ్డీ రేటుతో పొందడానికి అర్హులు. ఇది, ఐదు సంవత్సరాల కాల పరిమితితో తిరిగి చెల్లించవలసి ఉంటుంది.
  • రాష్ట్ర కేంద్ర సంస్ధల ( state nodal agencies) ద్వారా ప్రభుత్వం నిర్ణీత సమయానికి విడుదల చేసే గ్రాంటులు ( మంజూరు చేసే ధనం) ప్రోత్సాహకాలు ( నియమిత ఆదాయాన్నీనుసరించి)
  • కార్మికులకు, విద్యుత్తు, టెలిఫోన్ బిల్లులు, యితర రకాలైన ఖర్చులకు, నెలకు 5000 చొప్పున ప్రభుత్వం యిచ్చే గ్రాంటు.
  • ఈ దుకాణాల నిర్వహణలో నెలకు కనిష్ఠంగా 50,000 రూపాయల ఆదాయం, మొదటి సంవత్సరములో ఉన్నప్పుడు, నెలకు కనిష్ఠంగా 1,00,000 రూపాయల ఆదాయం రెండవ సంవత్సరములో ఉన్నప్పుడు ప్రోత్సాహకంగా (incentive) 5,000 రూపాయలు నెలకు అందుతుంది.
  • ఈ పధకం, రాష్ట్ర కేంద్ర సంస్ధలు, ireda ల ఆధ్వర్యంలో నిర్వహింపబడుతుంది.

ఈ దుకాణాల స్ధాపనకు అనుసరించవలసిన సూచనలు[మార్చు]

  • ప్రతీ జిల్లాలో కేవలం ఒక్క దుకాణమే ఏర్పాటు చేయాలి. ఇప్పటికే, ఈ దుకాణాలు ఏర్పాటు చేసిన జిల్లాలలో మరికొన్ని దుకాణాలు ఏర్పాటు చేయుటకు అర్హత లేదు.
  • ఈ దుకాణమునకు కనీసం 200 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన స్థలం అవసరం. ( గిడ్డంగి నిలువ ఉంచే స్ధలాన్ని మినహాయించి). ఈ దుకాణములు నిర్మించాలి లేదా కొనాలి లేదా పునరుద్దరించబడాలి. బాడుగకు తీసుకున్న దుకాణాలు, ప్రభుత్వ సహకారానికి అర్హత పొందవు.
  • ఈ దుకాణం నగరంలోని ముఖ్యమైన ప్రదేశంలో ఉండి, అక్కడకి చేరడానికి అనువైన సౌకర్యాలు కలదై ఉండాలి.
  • ఈ దుకాణం యొక్క పేరు దేశం మొత్తం మీద ఒకటే ఉండాలి. అక్షయ్ ఊర్జా షాప్ (Akshay urja shop) అన్న పేరు కనీసం 8 x 3 సైజు కల కాంతి వంతమైన ఫలకం (board) పై వ్రాయబడి ప్రదర్శించబడాలి. దుకాణం యొక్క పేరు ఆరంభంలో వేరే పదంతో ఉండవచ్చు. ఉదాహరణకు దుకాణ యజమాని పేరుతో ఉండి, తరువాత .............. అక్షయ్ ఊర్జా షాప్ అని ఉండాలి.
  • ఈ దుకాణం, అందంగా, ఆకర్షణీయంగా, విద్యుదీపాలంకరణతో, వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉండాలి.
  • ఈ దుకాణంలో కనీసం ఇద్దరు ఉద్యోగులు ఉండాలి. అందులో ఒకరు సాంకేతిక నిపుణుడై ( టెక్నిషియన్ ), పునరుత్పత్తి శక్తి సాధనాలను బాగు చేసి, నిర్వహించగలవాడై ఉండాలి.
  • నవ్య, పునరుత్పత్తి శక్తి మంత్రత్వ శాఖ, దుకాణాలలో నియమింపబడిన ఉద్యోగుల పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉండరు.
  • ఈ దుకాణం, సాధారణ వ్యాపార దుకాణాల వలెనే పని చేయాలి. ఆ విధంగా ఆదాయం కూడా ఆర్జించగలిగి ఉండాలి.
  • దుకాణంలో అమ్మే వస్తువుల, సాధనాలకు, మరమ్మత్తు, సంరక్షణ సౌకర్యం, కేవలం తాము అమ్మినవాటికే కాక, వేరే సంస్ధల నుండి తయారైన శక్తి ఉత్పత్తులు, అమర్చబడిన సాధనాలకు కూడా సరసమైన ధరలో మరమ్మత్తు చేయాలి.
  • ఈ దుకాణం, వినియోగదారుడితో స్నేహపూర్వకంగా మెలిగే సంస్ధగా ఉండాలి. కఠినంగాగాని, అనువుగాని వేళల్లో వ్యాపారం గాని, నిర్లక్ష్యధోరణి గాని అవలబించకూడదు.
  • ఈ దుకాణం అనేక మంది ఉత్పత్తిదారుల ఉత్పత్తిచేసిన పునరుత్పత్తి శక్తి సాధనాలను వివిధ నమూనాల్లో ప్రదర్శిస్తుంది. ఆ విధంగా, వినియోగదారుడు తనకు కావలసిన వస్తువులను ఎన్నుకోగలుగుతాడు.
  • ఈ దుకాణంలో అమ్మే వస్తువుల ధరల పట్టిక తగిన విధంగా ప్రజలకు తెలిసే విధంగా ప్రకటించాలి. అంతే కాకుండా, తమ వద్దకు వచ్చే వ్యక్తులకు ( వినియోగదారులకు) ఈ సాధనాల గురించి సమాచారం వివరించాలి.
  • ఈ సౌర దుకాణాలు వ్యాపారపరంగా తగిన గుర్తింపు పొందడానికి, శక్తి - సామర్థ్యం కలిగిన వస్తువులను ఉదాహరణకు, చిన్నవైన ఫ్లోరోసెంట్ దీపాలు ( cfl – compact fluor escent lamps) విద్యుద్దీపాలకు కావలసిన అదనపు హంగులు, అధిక సామర్థ్యం కల కిరోసిన్ స్టవులు మొదలైన వాటిని, తాము అమ్మే పునరుత్పత్తి శక్తి సాధనాలకు సంబంధించిన వస్తువులతో పాటు అమ్మవచ్చు.
  • వినియోగదారుల సౌకర్యార్ధం, దుకాణం, బ్యాంకుల సహకారంతో వివిధ పునరుత్పత్తి శక్తి ఉత్పత్తులను కొనడానికి సులభమైన రుణ ఏర్పాట్లు కూడా చేస్తుంది.

వనరులు[మార్చు]

http://te.pragatipedia.in/rural-energy/policy-support/renewable-energy[permanent dead link]