స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్
Jump to navigation
Jump to search
ఎస్పీయే విజయవాడ | |
![]() | |
నినాదం | ప్రపంచం ఇక్కడే ఉంది, ప్రణాళిక పరిధిలో. భూమి మా పరిధి, వాస్తుకళ మా సంస్కృతి |
---|---|
రకం | స్వతంత్ర ప్రతిపత్తి |
స్థాపితం | 7 జులై 2008 |
డైరక్టరు | డా. ఎన్. శ్రీధరన్ |
విద్యాసంబంధ సిబ్బంది | 23 పూర్తి స్థాయి, 41 విజిటింగ్ |
విద్యార్థులు | 470 |
స్థానం | విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం |
కాంపస్ | పట్టణం, 4 ఎకరాలు (1.6 హె.) నగరం 7 ఎకరాలు (2.8 హె.) |
రంగులు | ముదురు పసుపు రంగు తెలుపు |
జాలగూడు | www.spav.ac.in |
స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కటెక్చర్, విజయవాడ (ఎస్పీయే విజయవాడ) విజయవాడలోనున్న ఉన్నత విద్యాసంస్థ. ఈ విద్యాసంస్థ పట్టణ ప్రణాళిక విషయమై ప్రత్యేక పరిశోధన, బోధన జరుపుతుంది. ఇలాంటి ప్రత్యేక విద్యాసంస్థలు మూడింటిలో ఇదొకటి. ఈ సంస్థలను మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నడుపుతుంది. 2008లో ఈ సంస్థకు స్వతంత్ర ప్రతిపత్తి అందింది. ఈ సంస్థ పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వం ద్వారా నిధులు పొందుతుంది. ఇలా పనిచేస్తున్న ఇతర సంస్థలు - భోపాల్, ఢిల్లీలో ఉన్నాయి.