స్టాకరు బాయిలరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్టాకరు బాయిలరుlu
స్టాకరు బాయిలరులు
లాంకషైర్ బాయిలరురు వున్న స్టాకరులు
మూవింగు/పయనించే చైన్ గ్రేట్ స్టాకరు బాయిలరు

స్టాకరుఅనేవి ఘన ఇంధనాన్ని క్రమ పద్ధతిలో బాయిలరు దహనగదిలోకి పంపి మండించు బాయిలరు అదనపు యంత్ర పరికరాలు. వీలున్నంత వరకు ఎక్కువ ఇంధనం దహన గదిలో దహనం అయ్యేలా స్టాకరు చెయ్యును. స్టాకరులు ఫీడ్ హాపర్, గ్రేట్ (grate) వంటివి కలిగి వుండును. ఈ గ్రేట్ అనేవి రెండు రకాలు ఒకటి స్థిరంగా వుండే ఫిక్సుడ్ గ్రేట్, రెండవరకం కదిలే రకం లేదా మూవింగు చైన్ గ్రేట్[1].

స్టాకరు లోని గ్రేట్ రకాలు[మార్చు]

స్థిర గ్రేట్[మార్చు]

లాంకసైర్ వంటి బాయిలర్లలో, ప్యాకేజ్ కోల్ లేదా వుడ్/కలప ఫైర్డ్ బాయిలర్లలో ఫిక్సుడ్ గ్రేట్ వుండును. గ్రేట్ పట్టిలు కలిగి వుండును.ఈ పట్టిలు పోత ఇనుము (cast iron) తో చెయ్యబడి వుండును.గ్రేట్ యొక్క పోత ఇనుము పట్టిలను ఒకదాని పక్క మరొకటి అడ్డుపట్టిల మీద దహన గదిలో అమర్చబడి వుండును.పట్టిల మధ్య చిన్న ఖాళి వుండి, ఇంధనం మండిన తరువాత ఏర్పడు బూడిద ఈ రంధ్రా ల, ఖాలిల ద్వారా దహనగది అడుగుభాగంలో జమ అగును. అప్పుడప్పుడు దహనగది అడుగున జమ అయ్యిన బూడిదను తొలగించెదరు. గ్రేట్ పట్టిలకున్నఖాళి ద్వారా గాలి లోపలికి ప్రసరించి ఇంధనంతో కల్సి దహన క్రియచురుకుగా జరుగును.

చెయిన్ గ్రేట్/మూవింగు గ్రేట్[మార్చు]

కదిలే గ్రేట్ చెయిన్ వంటి నిర్మాణం కలిగి నెమ్మదిగా కదులును.ఇక కదిలే గ్రేట్ చెయిన్ వంటి నిర్మాణం కలిగి నెమ్మదిగా కదులును.పట్టిల మధ్య తగినంత ఖాళి వుండి ఈ ఖాలిల ద్వారా ఇంధనం మండుటకు అవసరమైన గాలిని అందించెదరు.ఈ రకపు గ్రేట్ మొదటి చివర ఇంధనాన్ని ఫీడ్ హాపర్ ద్వారా కావల్సిన ప్రమాణంలో అందించగా, ఇంధనం కాలగా మిగిలిన బూడిద చెయినుగ్రేట్ రెండొవ చివరకు చేరి కింద పడును.ఇక్కడ జమ అయిన బూడిదను కన్వెయరు ద్వారా లేక మాన్యువల్ గా లేబరు ద్వారా తొలగించెదరు.ఇంధన దహనానికి అవసరమైన గాలిని కొంత మొదట గ్రేట్ కింద నుండి/ ఇంధనం అడుగు భాగం నుండి అందివగా మిగిన గాలిని మండుచున్న ఇంధన పైభాగంగాన ప్రసరించి అందించెదరు.ఎక్కువ కెపాసిటీ కలిగిన బాయిలరులలో ఇంధన దహనానికి అవసరమైన గాలిని ఫ్యానుల ద్వారా అందిస్తారు.ఇలా గాలి పర్నేసులోని ఇంధ్నానికి తగినంత అందించు ఫ్యాను/పంకా/బ్లోవరునుఫోర్సుడ్ డ్రాఫ్ట్ ఫ్యాన్/Forced Draft fan అంటారు.తెలుగులో బలత్క్రుత గాలి ప్రసరణ పంఖా అనవచ్చు[1].

ఈ స్టాకరు విధానాన్ని అండరు ఫీడ్, ఓవరు ఫీడ్ స్టాకరు అని విభజించారు/వర్గీకరించారు.

అండరు ఫీడ్ స్టాకరు/Underfeed stokers[మార్చు]

అండరు ఫీడ్ స్టాకరులు ఇంధనాన్ని బాయిలరుకు అందించడం తోపాటు ప్రాథమిక దహనానికి అవసరమైన గాలిని గ్రేట్ అడుగునుండి అందించును.ఈ అండరు ఫీడ్ స్టాకరులో ఇంధనం హపరులోపడి, అక్కడినుండి స్క్రూ లేదా రామ్ డ్రైవ్ మెకానిజం ద్వారా గ్రేట్ మీదకు వెళ్ళును.ఇంధనం గ్రేట్ మీద కదులుతూ వేడి గాలి వికరణఉష్ణానికి లోనయ్యి ఇంధ్నంతో కలిసి మండుట మొదలగును.బొగ్గును ఇంధనంగా వాడుతున్నప్పుడు క్లింకరు/చిట్లం ఏర్పడ కుండా ఉండుటకు కదేలే గ్రేట్‌లు వాడుత మంచిది.సాధారణంగా అండరు ఫీడ్ స్టాకరులు హారిజాంటల్ ఫీడ్-సైడ్ డిచార్జి, గ్రావిటిఫీడ్ రియర్ యాష్ డిచార్జి అని రెండు రకాలు ఉపయోగంలో వున్నవి[2].

ఒవర్ ఫీడ్ స్టాకరు[మార్చు]

ఒవర్ ఫీడ్ స్టాకరులు మాస్ ఫీడ్ స్టాకరు లేదా స్ప్రెడరు స్టాకరు అని ఇంధనాన్ని అందించే, కాల్చే విధానన్ని బట్టి పైరెండు రకాలుగా వర్గీకరించారు.

మాస్ ఫీడ్ స్టాకరు[మార్చు]

మాస్ ఫీడ్ స్టాకరు, బాయిలరులో గ్రేట్ మీద ఇంధనం ముందుకు కదులుతున్నప్పుడు నిరంతరంగా గ్రేట్ యొక్క ఒక చివరనుండి ఇంధనాన్ని అందించును.గ్రేట్ మీద ఇంధనపు ఎత్తును రెండి రకాలుగా నియంత్రించెదరు. ఒక పద్ధతిలో గ్రేటు/grate పైకి కిందికి కదుపుట ద్వారా కావాల్సిన ఎత్తులో ఇంధనాన్ని అందించడం.గ్రేట్ ముందుకు కదులునపుడు ఇంధనం మండగా ఏర్పడిన బూడిద గ్రేట్ యొక్క రెండవ చివర కింద పడును. ప్రాథమిక దహన గాలి గ్రేట్ కింద నుండి, దానికి వున్న సందులు/ఖాలిల ద్వారా ఇంధనం మొదట మండుటకు అందించబడును.ప్రాథమిక మాస్ ఫీడ్ స్టోకర్లు వాటరు కూల్డ్ వైబ్రేటింగు గ్రేట్, మూవింగ్ ( vibratingchain and traveling chain) గ్రేట్ స్టాకరు.

స్ప్రేడరు(spreader) స్టాకరు[మార్చు]

స్ప్రేడరు స్టాకరు అనేవి చాలా విభిన్నమైన (versatile) టువంటి, సాధారణంగా వాడు స్టోకర్లు.spreader అను అంగ్లపదానికి తెలుగులో ప్రవర్ధని లేదా విస్తరణి అనవచ్చును. ఈవిధానంలో ఒక ప్రత్యేకమైన ఉపకరణంతో ఇంధనం సమానంగా సమతలంగా సమానమైన ఎత్తులో గ్రేట్ అంతా వ్యాపించేలా, విస్తరించేలా వెదచల్లబడి మండించబడును[3].చిన్నధూళికణాలుగా/పొడిగాచేసిన ఇంధనాన్ని గ్రేట్ పైభాగాన, కొంత ఎత్తులో గాలిలో సమానంగా మిశ్రమం అయ్యేలా వెదచల్లబడును.ఇలా చిన్న చిన్న ముక్కలుగా/తునకులుగా (1.0-3.0మీ.మీ) చెయ్యబడిన ఇంధనం/బొగ్గు గ్రేట్ కు కొంత ఎత్తులో గాలిలో గ్రేట్ వైశాల్యంమొత్తం వ్యాపించేలా చెయ్యుటకు గాలినే ఎజెక్టరు ద్వారా పంపెదరు. పొడి రూపంలో వున్నా ఇంధనాన్ని వేగంగా బాయిలరులోనికి విసరినపుడు/విస్తరింప చేసినపుడు గాలిలో తేలుతున్న ఇంధన కణాలు/పొడి అప్పటికే 1000°Cకు మించి వేడిగా వున్నదహనగదిలో గాలిలోనే, అనగా గ్రేట్ మీద పడక ముందే మండటం ప్రారంచించును.కొంచెం పెద్దవిగా వున్న ఇంధన తునకలు గ్రేట్ ఉపరితలం మీద పడి కాలడం మొదలగును.ఇంధనాన్ని చిన్నచిన్న ముక్కలుగా చేసి ఎజెక్టరు ద్వారా గాలితో మిశ్రమం చేసి దహనగదిలో గ్రేట్ మీద పాడుటకు ముందే దహన క్రియను ప్రారంభించడం వలన, మాస్ స్టాకరు కన్న స్ప్రేడరు స్టాకరు బాయిలరులో ఇంధనం త్వరితంగా, బాగా దహనం చెందును.

ఇందన ప్రాథమిక దహనానికి అవసరమైన గాలిని గ్రేట్ కింద నుండి అందించబడును/సప్లై చేయబడును.ద్వితీయస్థాయి దహనానికి అవసరమైన గాలిని సెకండరి ఎయిర్ నాజిల్స్/సూచీముఖంద్వారా అందించెదరు. ఫర్నేష్ లో ఇంధనాన్ని స్ప్రే చెయ్యుటకు, సెకండరిఎయిర్/దితీయ స్థాయిదశ గాలిని అందించుటకు ఫోర్సుడ్ డ్రాఫ్ట్ ఫ్యానును ఉపయోగిస్తారు.స్ప్రేడరు స్టాకరు బాయిలర్లలో స్థిరంగా వుండే గ్రేట్‌ల కన్న కదిలే గ్రేట్‌లనే ఎక్కువగా వాడెదరు.ట్రావెలింగు గ్రేట్స్, ఎయిర్ కూల్డ్ వైబ్రేటింగు గ్రేట్స్ లేదా వాటరు కూల్డ్ వైబ్రేటింగు గ్రేట్స్ స్ప్రేడరు స్టాకరు బాయిలర్లలో చక్కగా పనిచేయును.

బయటి లింకుల వీడియోలు[మార్చు]

ఇవి కూడా చదవండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]