స్టార్ మహిళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్టార్ మహిళ
తరంఆటల కార్యక్రమం
సమర్పణసుమ కనకాల
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సిరీస్‌లసంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య3,181
ప్రొడక్షన్
ప్రొడక్షన్ locationsఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ
నడుస్తున్న సమయం40 - 45 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీమల్లెమాల ఎంటర్టైన్మెంట్స్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్ఈటీవీ తెలుగు
వాస్తవ విడుదల9 ఆగస్టు 2008 (9 ఆగస్టు 2008) –
26 జనవరి 2019 (2019-01-26)
బాహ్య లంకెలు
Website

స్టార్ మహిళ ఈటీవీలో ప్రసారమైన మహిళల ఆటల కార్యక్రమం.[1] సుమ కనకాల వ్యాఖ్యాతగా 2008, అగస్టు 9న ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటల నుండి 2 గంటల వరకు ప్రసారం చేయబడింది. 3,181 భాగాలతో భారతదేశంలోనే అతిపెద్ద రెండవ ఆటల కార్యక్రమంగా నిలిచిన స్టార్ మహిళ చివరిభాగం 2019, జనవరి 26న ప్రసారం కాబడింది.[2][3]

కార్యక్రమ నేపథ్యం[మార్చు]

మహిళల కోసం రూపొందించడిన ఈ కార్యక్రమంలో ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకోవటానికి వివిధ రకాలతో కూడిన సరదా ఆటలో మహిళలు పాల్గొనేవారు. ప్రతి ఎపిసోడ్ చివరిలో పాల్గొనేవారికి వ్యాఖ్యాత చేతులమీదుగా ఉచిత బహుమతులు అందజేయబడుతాయి.

ప్రతి ఎపిసోడ్ లో మొత్తం ఆరుగురు మహిళు పాల్గొంటారు. ఇందులో పాల్గొన్న ప్రతిఒక్కరికి ఎపిసోడ్ ప్రారంభంలో సున్నా పాయింట్లు ఉంటాయి. పాల్గొన్నవారితో వ్యాఖ్యాత సరదా ఆటలను ఆడిస్తుంది, ప్రశ్నలను కూడా అడుగుతుంది. వాటిల్లో గెలిచినవారికి పాయింట్లు లభిస్తాయి. ఎపిసోడ్ చివర్లో ఎవరి దగ్గరైతే ఎక్కువ పాయింట్లు ఉంటాయో వారు స్టార్ మహిలా టైటిల్‌ను గెలుచుకుంటారు.

ఇతర వివరాలు[మార్చు]

  1. ఒకే వ్యాఖ్యాతతో ఎక్కువకాలం నిర్వహించబడిన ఆటల కార్యక్రమంగా ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.[4][5]
  2. ఈ కార్యక్రమానికి సుమ కనకాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.[6][7]
  3. 2018 ఏప్రిల్‌లో 3000వ భాగం సందర్భంగా విజయోత్సవ కార్యక్రమం జరుపబడింది.
  4. 2019 సంక్రాంతి పండుగ సందర్భంగా 2019, జనవరి 14 నుండి 2019, జనవరి 19 వరకు వారంరోజులపాటు స్టార్ మహిళ ప్రత్యేక కార్యక్రమం జరిగింది.[8]

మూలాలు[మార్చు]

  1. "Star Mahila on ETV – A show for women | News". Metromasti.com. 17 August 2011. Retrieved 2 January 2020.
  2. "Anchor Suma creates new record". gulte.com. Archived from the original on 26 April 2019. Retrieved 2 January 2020.
  3. "STAR-MAHILA-Is-Going-To-Be-Stop-Says-Anchor-Suma". Tupaki.com. Retrieved 2 January 2020.
  4. "Suma enters Limca Book of Records for Star Mahila!". The Times of India. 5 March 2015. Retrieved 2 January 2020.
  5. నమస్తే తెలంగాణ, ఫీచర్ వార్తలు (17 August 2018). "స్టార్ మ‌హిళ కార్య‌క్ర‌మానికి పులిస్టాప్ పెట్టిన సుమ‌". www.ntnews.com. Archived from the original on 15 January 2019. Retrieved 2 January 2020.
  6. "Father's Day special on Star mahila". Retrieved 2 January 2020.
  7. "Star Mahila to complete 2000 episodes". timesofindia.com. Retrieved 2 January 2020.
  8. "star-mahila-farewell-week-promo-is-out". Times of India. Retrieved 2 January 2020.

ఇతర లంకెలు[మార్చు]