Jump to content

స్టావాంగర్

అక్షాంశ రేఖాంశాలు: 58°58′12″N 05°43′53″E / 58.97000°N 5.73139°E / 58.97000; 5.73139
వికీపీడియా నుండి
స్టావాంగర్
Stavanger kommune
మునిసిపాలిటీ
పైనుండి: బ్రీవాట్‌నెట్, స్కాగెన్‌కైన్ వీధి, గమ్లే స్టావాంగర్, ఓవ్రే హోల్మెగేట్ వీధి, స్వెర్డ్ ఇ ఫ్యెల్, నగర కేంద్రం
Coat of arms of స్టావాంగర్
Nickname(s): 
ఓల్యేబయెన్, చమురు రాజధాని
Location of స్టావాంగర్
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/Rogaland" does not exist.
Coordinates: 58°58′12″N 05°43′53″E / 58.97000°N 5.73139°E / 58.97000; 5.73139
దేశం Norway
మునిసిపాలిటీస్టావాంగర్
కౌంటీరోగాలాండ్
జిల్లాజేరెన్
అధికారిక భాషబోక్మాల్
స్థాపన1125
విస్తీర్ణం
 • మునిసిపాలిటీ
71.35 కి.మీ2 (27.55 చ. మై)
 • పట్టణపు
77.98 కి.మీ2 (30.11 చ. మై)
 • Metro
2,598 కి.మీ2 (1,003 చ. మై)
జనాభా
 (2023)
 • మునిసిపాలిటీ
1,48,682
 • సాంద్రత2,100/కి.మీ2 (5,400/చ. మై.)
 • Urban
2,37,369
 • Urban density3,000/కి.మీ2 (7,900/చ. మై.)
 • Metro
3,60,000
 • Metro density140/కి.మీ2 (360/చ. మై.)
 • Municipality/ Urban rank
3 వ
 • Metro rank
3 వ
DemonymSiddis
Nationalities
 • నార్వేజియన్లు75%
 • Other25%
GDP
 • Metro€31.582 billion (2021)
కాల మండలంUTC+01:00 (CET)
 • Summer (DST)UTC+02:00 (CEST)

స్టావాంగర్, [a] నార్వేలోని ఒక నగరం, మునిసిపాలిటీ . ఇది నార్వేలో మూడవ అతిపెద్ద నగరం,[5] మూడవ అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతం[6] (పొరుగున ఉన్న సాండ్నెస్‌తో కలిసి). ఇది రోగలాండ్ కౌంటీకి పరిపాలనా కేంద్రం. నార్వేలో అత్యధిక జనాభా కలిగిన మునిసిపాలిటీల్లో ఈ మునిసిపాలిటీ నాల్గవ స్థానంలో ఉంది. నైరుతి నార్వేలోని స్టావాంగర్ ద్వీపకల్పంలో ఉన్న స్టావాంగర్‌ను అధికారికంగా స్థాపించినది 1125 లో. ఆ సంవత్సరం స్టావాంగర్ కేథడ్రల్ పూర్తయింది. స్టావాంగర్‌లో ప్రధాన భాగం ఎక్కువగా 18వ, 19వ శతాబ్దాల నాటి చెక్క ఇళ్ళు.[7] వీటిని నగర సాంస్కృతిక వారసత్వంలో భాగంగా పరిగణించి, సంరక్షించారు. దీని వలన పట్టణ కేంద్రం, నగరపు అంతర్భాగం అధిక నిష్పత్తిలో విడిగా ఉన్న ఇళ్లతో ఒక చిన్న-పట్టణం లాగా ఉండగా,[8] గ్రేటర్ స్టావాంగర్ నగరం బయటికి విస్తరించింది.

20 వ శతాబ్దం చివరిలో ఇక్కడి చమురు పరిశ్రమ కారణంగా నగర జనాభా వేగంగా పెరిగింది. స్టావాంగర్‌ను నార్వేకు చమురు రాజధానిగా పరిగణిస్తారు.[9] నార్డిక్ ప్రాంతంలో అతిపెద్ద కంపెనీ అయిన నార్వే ఇంధన సంస్థ ఈక్వినార్, ప్రధాన కార్యాలయం స్టావాంగర్‌లోనే ఉంది.[10] ఉన్నత విద్య కోసం స్టావాంగర్‌లో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. వీటిలో అతిపెద్దది స్టావాంగర్ విశ్వవిద్యాలయం.

నాటో జాయింట్ వార్‌ఫేర్ సెంటర్‌తో సహా దేశీయ, అంతర్జాతీయ సైనిక స్థావరాలు స్టావాంగర్‌లో ఉన్నాయి. ఇతర అంతర్జాతీయ సంస్థలు, ముఖ్యంగా విదేశీ చమురు, గ్యాస్ కంపెనీల స్థానిక శాఖలు నగరంలో గణనీయమైన విదేశీ జనాభాకు కారణమయ్యాయి. ఈ నగరానికి బలమైన అంతర్జాతీయ ప్రొఫైల్‌ ఉంది. జనాభాలో 22.1% మందికి వలస నేపథ్యం ఉంది.[11][12] 2020 లో ECA ఇంటర్నేషనల్, నార్వేలో యూరోపియన్ ప్రవాసులకు అత్యంత జీవనయోగ్యమైన నగరంగాను, యూరప్‌లో 5 వ స్థానాన్నీ ఇచ్చింది.[13] 2000 ల ప్రారంభం నుండి, స్టావాంగర్‌లో నిరుద్యోగ రేటు యూరోపియన్ సగటు కంటే గణనీయంగా తక్కువగా ఉంది.[14] 2022 ఆగస్టులో నిరుద్యోగిత రేటు 1.6%.[15] ఈ నగరం ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితాలలో ఒకటి. కొన్ని సూచికలైతే ఇదే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా కూడా స్థానమిచ్చాయి.[16][17][18]

స్టావాంగర్‌కు సోలాలోని స్టావాంగర్ అంతర్జాతీయ విమానాశ్రయం సేవలు అందిస్తోంది, ఇక్కడి నుండి చాలా ప్రధాన యూరోపియన్ దేశాలలోని నగరాలకు విమాన సౌకర్యం ఉంది. అలాగే పరిమిత సంఖ్యలో ఖండాంతర చార్టర్ విమానాలను కూడా అందిస్తుంది. 2020లో OAG ఈ విమానాశ్రయాన్ని ప్రపంచంలోని అత్యంత సమయపాలన పాటించే విమానాశ్రయాలలో ఒకటిగా రేటింగ్ ఇచ్చింది. [19]

చరిత్ర

[మార్చు]

స్టావాంగర్ ప్రాంతంలో మొదటి స్థిరనివాస జాడలు చివరి మంచు యుగం తర్వాత సుమారు 10,000 సంవత్సరాల క్రితం, మంచు తగ్గిన రోజుల నుండి ఉన్నాయి. 9వ, 10వ శతాబ్దాల నాటికే నార్త్ -జెరెన్ ఒక ఆర్థిక, సైనిక కేంద్రంగా ఉండేదని, 872 లో జరిగిన హాఫర్స్‌ఫ్జోర్డ్ యుద్ధంలో దేశం ఏకీకరణ చెందిందని అనేక మంది చరిత్రకారులు నమ్మకంగా వాదించారు. 1100–1300 ప్రాంతంలో స్టావాంగర్ చర్చి పరిపాలన కేంద్రంగా, ఒక ముఖ్యమైన నైరుతి తీర మార్కెట్ పట్టణంగా అభివృద్ధి చెందింది.[20]

1120లలో స్టావాంగర్ బిషప్రిక్ స్థాపించబడినప్పటి నుండి, దానికి నగరంగా హోదా (1125) రాకముందు స్టావాంగర్ పట్టణంగా ఉండేది. ఇంగ్లాండ్‌లోని వించెస్టర్ నుండి వచ్చిన బిషప్ రీనాల్డ్, 1100 ప్రాంతంలో స్టావాంగర్ కేథడ్రల్ ( స్టావాంగర్ డోమ్‌కిర్కే ) నిర్మాణాన్ని ప్రారంభించాడని చెబుతారు. [21] ఇది 1125 ప్రాంతంలో పూర్తయింది. 1125 నే స్టావాంగర్ నగరాన్ని స్థాపించిన సంవత్సరంగా భావిస్తుంది.[22]

స్టావాంగర్ 1838 జనవరి 1 న నిసిపాలిటీగా ఏర్పడింది. 1867 జనవరి 1 న హెట్లాండ్ మునిసిపాలిటీలోని ఒక చిన్న ప్రాంతం (జనాభా: 200) స్టావాంగర్ నగరంలో కలిసిపోయింది. మళ్ళీ 1879 జనవరి 1 న హెట్లాండ్‌లోని మరొక ప్రాంతాన్ని (జనాభా: 1,357) విలీనం చేసారు. తరువాత మళ్ళీ 1906 జనవరి 1 న నగరం మళ్ళీ హెట్లాండ్‌లోని మరొక ప్రాంతాన్ని (జనాభా: 399) స్వాధీనం చేసుకుంది. 1923 జూలై 1 న హెట్లాండ్‌లో కొంత భాగాన్ని (జనాభా: 3,063) మరోసారి నగరానికి తరలించారు. చివరికి 1953 జూలై 1 న హెట్లాండ్‌లోని చివరి భాగం (జనాభా: 831) కూడా విలీనమైంది. 1960 లలో స్కీ కమిటీ నివేదిక అనుసారం, నార్వే అంతటా అనేక మునిసిపల్ విలీనాలకు దారితీసింది. దీని ఫలితంగా, 1965 జనవరి 1 న స్టావాంగర్ నగరంలో (జనాభా: 51,470) పొరుగున ఉన్న మాడ్లా (జనాభా: 6,025), హెట్లాండ్‌లోని ఎక్కువ భాగం (జనాభా: 20,861) విలీనమయ్యాయి.[23]

ఈ నగర చరిత్రంతా ఆర్థిక వృద్ధి, మాంద్యాల మధ్య మారుతూ ఉంటుంది.[24] ఇక్కడి అతి ముఖ్యమైన పరిశ్రమలు షిప్పింగ్, షిప్ బిల్డింగ్, చేపల క్యానింగ్ పరిశ్రమ, అనుబంధ ఉప కాంట్రాక్టర్లు.

1969 లో ఉత్తర సముద్రంలో మొదటిసారి చమురు నిక్షేపాలు కనుగొనబడినప్పుడు కొత్త విజృంభణ ప్రారంభమైంది.[25] చాలా చర్చల తర్వాత, నార్వేజియన్ సెక్టార్‌లోని ఉత్తర సముద్రంలో చమురు పరిశ్రమకు ఆన్-షోర్ కేంద్రంగా స్టావాంగర్ ఎంపికైంది. ఆ తర్వాత వేగవంతమైన అభివృద్ధి యుగం మొదలైంది. [25]

2020 జనవరి 1 న పొరుగున ఉన్న ఫిన్నోయ్, రెన్నెస్సోయ్ మునిసిపాలిటీలు స్టావాంగర్‌తో విలీనం అయ్యి కొత్త, పెద్ద మునిసిపాలిటీ ఏర్పడింది.[26]

చమురు రాజధాని

[మార్చు]
1982లో ఆయిల్ ప్లాట్‌ఫామ్ స్టాట్‌ఫ్‌జోర్డ్ ఎ. స్టావాంగర్ నేడు నార్వేలో చమురు పరిశ్రమకు కేంద్రంగా రాజ్యమేలుతోంది.

1969 లో ఉత్తర సముద్రంలో మొదటిసారి చమురు నిక్షేపాలు కనుగొనబడినప్పుడు కొత్త వృద్ధి ప్రారంభమైంది. చాలా చర్చల తర్వాత, నార్వేజియన్ సెక్టార్‌లోని ఉత్తర సముద్రంలో చమురు పరిశ్రమకు ఆన్-షోర్ కేంద్రంగా స్టావాంగర్ ఎంపికైంది. ఆ తర్వాత వేగవంతమైన అభివృద్ధి యుగం మొదలైంది.

1965 మార్చిలో మధ్యస్థ రేఖ సూత్రం ద్వారా ఖండాంతర షెల్ఫ్‌ను పంచుకోవడంపై నార్వే, యునైటెడ్ కింగ్‌డమ్‌ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అదే సంవత్సరం నార్వే, డెన్మార్క్‌ల మధ్య కూడా ఇలాంటి ఒప్పందమే కుదిరింది. ఇది చమురు అన్వేషణకు చట్టపరమైన పాలనగా రూపొందించబడింది. నార్వేజియన్ షెల్ఫ్‌లో మొదటి లైసెన్సింగ్ రౌండ్‌ను 1965 ఏప్రిల్ 13న ప్రకటించారు. అదే సంవత్సరం ఆగస్టులో ప్రభుత్వం, చమురు కంపెనీలు లేదా కంపెనీల సమూహాలకు 78 బ్లాకులకు 22 లైసెన్సులను మంజూరు చేసింది. ఉత్పత్తి లైసెన్స్ చమురు కంపెనీలకు వార్షిక రుసుముతో నిర్దిష్ట కాలానికి నిర్వచించబడిన భౌగోళిక ప్రాంతంలో అన్వేషణ, డ్రిల్లింగ్, ఉత్పత్తికి ప్రత్యేక హక్కులను ఇచ్చింది. నార్వే తీరంలో చమురు కోసం తవ్వకాలు ప్రారంభించిన మొదటి చమురు కంపెనీ ఎస్సో. సెమీ-సబ్‌మెర్సిబుల్ డ్రిల్లింగ్ నౌక ఓషన్ ట్రావెలర్‌ను న్యూ ఓర్లీన్స్ నుండి నార్వేకు లాక్కుపోయారు. ఆ నౌక 1966 జూలై 19 న బ్లాక్ 8/3 వద్ద, స్టావాంగర్‌కు నైరుతి దిశలో దాదాపు 180 కి.మీ. (110 మై.) దూరంలో డ్రిల్లింగ్ ప్రారంభించింది.

కోట్ ఆఫ్ ఆర్మ్స్

[మార్చు]

హెరాల్డ్రీలో ప్రముఖ నిపుణుడైన హాల్వార్డ్ ట్రెటెబర్గ్^ను (1898–1987), స్టావాంగర్‌కు అధికారిక కోట్ ఆఫ్ ఆర్మ్స్‌ను రూపొందించడానికి నియమించారు. ఈ పని 1920ల చివరి నుండి 1939 ఆగస్టు 11 న ఆమోదించబడే వరకు కొనసాగింది. అతని డిజైన్ను నగరం ఆయుధాలు, జెండా. ముద్రగా కూడా ఉపయోగిస్తారు. ఈ కోట్ ఆఫ్ ఆర్మ్స్ 1591 నాటి ముద్రపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒక తీగ (విటిస్ వినిఫెరా) కొమ్మను చూపిస్తుంది. కోట్ ఆఫ్ ఆర్మ్స్ పై చిత్రీకరించబడిన ఆకులు, కొమ్మ రకం ఏమిటి అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ తీగ యొక్క అసలు అర్థం, ప్రాతినిధ్యం ఇంకా తెలియదు. [27]

పేరు యొక్క మూలం

[మార్చు]

ఆ పేరు యొక్క పాత నార్స్ రూపం స్టాఫాంగ్ర్ . ఈ పేరు మూలం ఏమిటనేది దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉంది. ఎక్కువగా ఇచ్చే వివరణ ఏమిటంటే ఇప్పుడు వాగెన్ అని పిలువబడే ఇన్లెట్ పేరు దీనికి ఉండేది. బే కు తూర్పు ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం వద్దనే ఒరిజినల్‌గా నగరం ఉండేది.[28]

పేరు లోని మొదటి పదం స్టాఫ్ర్ (stafr) కు అర్థం శాఖ అని. చివరి పదం యాంగ్ర్ (angr) అంటే 'ఇన్‌లెట్, బే' అని అర్థం. ఉత్తర సముద్త్రానికి అభిముఖంగా ఉన్న స్టావాంగర్ అభివృద్ధి సముద్రంపై చాలా ఆధారపడింది.[28]

పరిపాలన

[మార్చు]

స్టావాంగర్ మునిసిపాలిటీ ప్రాథమిక విద్య (10వ తరగతి వరకు), అవుట్ పేషెంట్ ఆరోగ్య సేవలు, సీనియర్ సిటిజన్ సేవలు, సంక్షేమం ఇతర సామాజిక సేవలు, జోనింగ్, ఆర్థిక అభివృద్ధి, మునిసిపల్ రోడ్లు, యుటిలిటీలకు బాధ్యత వహిస్తుంది. ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన ప్రతినిధులతో కూడిన మునిసిపల్ కౌన్సిల్ ఈ మునిసిపాలిటీని పాలిస్తుంది. మేయర్ పరోక్షంగా మున్సిపల్ కౌన్సిల్ ఓటు ద్వారా ఎన్నికౌతారు. ఈ మునిసిపాలిటీ సోర్-రోగాలాండ్ జిల్లా కోర్టు, గులేటింగ్ కోర్టు ఆఫ్ అప్పీల్ పరిధిలో ఉంది.

భౌగోళికం

[మార్చు]
రాండాబర్గ్ లోని ఒక బీచ్

స్టావాంగర్ మునిసిపాలిటీ సముద్ర తీరప్రాంతంలో ఉంది. పశ్చిమాన సముద్రం, ఈశాన్యంలో బోక్నాఫ్జోర్డెన్ సరిహద్దులుగా ఉన్నాయి. బైఫ్‌జోర్డెన్, గాండ్స్‌ఫ్‌జోర్డెన్‌లు నగరానికి తూర్పు వైపున నడుస్తాయి. ఇది లో -జెరెన్‌లో భాగం, ఇది ఎక్కువగా మార్ష్, ఇసుక, రాతి అవుర్‌లతో కూడిన చదునైన భూమి ప్రాంతం. ఇది దక్షిణాన ఓగ్నా నది నుండి ఉత్తరాన తుంగెనెస్ వరకు ఉంటుంది; ఇది స్టావాంగర్‌కు ఉత్తర కొస. మునిసిపాలిటీలో ఎక్కువ భాగం ఎత్తు సముద్ర మట్టం నుండి 0 -- 50 మీ. (0 -- 164 అ.) మధ్య ఉంటుంది. నివాసం లేదా వ్యవసాయం లేని రాళ్ళు, కొండలతో ఈ ప్రకృతి దృశ్యం విలక్షణమైన రూపాన్ని కలిగి ఉంది. స్టావాంగర్ నగరానికి సముద్రంతో, నీటితో దగ్గరి సంబంధం ఉంది. ఐదు సరస్సులు ( బ్రియావాట్నెట్, స్టోరా స్టోక్కావాట్నెట్, మోస్వాట్నెట్ సహా), మూడు ఫ్యోర్డ్‌లు (హాఫ్ర్స్ఫ్జోర్డెన్, బైఫ్జోర్డెన్, గాండ్స్ఫ్జోర్డెన్ ) ఉన్నాయ. వృక్షసంపద, వన్యప్రాణులతో సమృద్ధిగా ఉన్న తీరప్రాంతం ఇది.

భూభాగం పల్లపు ప్రాంతం: 49% ప్రాంతం సముద్ర మట్టానికి పైన 20 మీ. (66 అ.) కంటే తక్కువ ఉండగా, 7% భూమి 60 మీ. (200 అ.) వద్ద ఉంది. స్టావాంగర్‌లో ఎత్తైన ప్రదేశం 514 మీ. (1,686 అ.) ఎత్తున ఉన్న బాండసెన్.

నగర తీరంలో జోర్నోయ్, బోయ్, ఎంగోయ్, గ్రాస్‌హోల్మెన్, హెల్లెసోయ్, హుండ్వాగ్, కాల్వోయ్, లిండోయ్, సోలిస్ట్, వాస్సోయ్ వంటి అనేక ద్వీపాలున్నాయి. అమోయ్ ద్వీప తూర్పు భాగం కూడా ఇందులోదే.[28]

వాతావరణం

[మార్చు]

నార్వే నైరుతి తీరంలో ఉన్న స్టావాంగర్‌లో, ఉత్తర సముద్రంలోని సమశీతోష్ణ నీటి ప్రభావంతో, అట్లాంటిక్ అల్పపీడనాల ప్రభావంతో శీతాకాలంలో తేలికపాటి పశ్చిమ గాలులు వీస్తయి. ఇదే అక్షాంశాల వద్ద ఉన్న ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడ ఏడాది పొడవునా వెచ్చని ఉష్ణోగ్రతలుంటాయి. ముఖ్యంగా శరదృతువు చివరలో, శీతాకాలంలో వర్షం రూపంలో సమృద్ధిగా అవపాతం కురుస్తుంది. కోపెన్ వాతావరణ వర్గీకరణ ప్రకారం, స్టావాంగర్‌లో సమశీతోష్ణ సముద్ర వాతావరణం ( Cfb ) ఉంటుంది. ఓ ఐదు నెలల సగటు ఉష్ణోగ్రత 10 °C (50 °F) కంటే ఎక్కువగా ఉంటుంది. వసంతకాలం, వేసవి ప్రారంభం అత్యంత పొడిగా ఉండే కాలం. నగరంలో సార్వకాలిక అత్యధిక ఉష్ణోగ్రత 33.5 °C (92.3 °F). ఇది 1975 ఆగస్టులో విమానాశ్రయంలో నమోదైంది. స్టావాంగర్‌లో నమోదైన అత్యంత వెచ్చని గరిష్ట ఉష్ణోగ్రత 2018 జూలైలో స్టావాంగర్-వాలాండ్ (72 మీ) వాతావరణ కేంద్రం వద్ద 34.4 °C (93.9 °F). స్టావాంగర్ విమానాశ్రయంలో నమోదైన అత్యంత వెచ్చని నెల 2002 ఆగస్టు. సగటు ఉష్ణోగ్రత 19.3 °C (66.7 °F). సగటు రోజువారీ గరిష్ట ఉష్ణోగ్రత 23.2 °C (73.8 °F). ఆల్ టైమ్ కనిష్ట స్థాయి −19.8 °C (−3.6 °F) 1987 జనవరిలో నమోదైంది. 1963 ఫిబ్రవరి అత్యంత శీతలమైన నెలగా నమోదైంది - సగటు ఉష్ణోగ్రత −5 °C (23 °F), సగటు రోజువారీ కనిష్ట ఉష్ణోగ్రత −9.6 °C (14.7 °F). రాత్రిపూట ఘనీభవించే సగటు చివరి తేదీ ( 0 °C (32.0 °F) కంటే తక్కువ ) వసంతకాలంలో ఏప్రిల్ 20.[29] శరదృతువులో మొదటి ఘనీభవన సగటు తేదీ అక్టోబరు 31.[30] అంటే కనీసం 193 రోజుల పాటు మంచు లేని సీజన్‌ ఉంటుంది.

శీతోష్ణస్థితి డేటా - Stavanger Airport Sola 1991–2020 (7 m, extremes 1947–present, sunhours 1961–1990)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
[మూలం అవసరం]
శీతోష్ణస్థితి డేటా - Stavanger Airport (2002–2020 averages & extremes)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
[మూలం అవసరం]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

20వ శతాబ్దం ప్రారంభంలో, స్టావాంజర్ పరిశ్రమ ప్రధానంగా మత్స్య సంపద, షిప్పింగుకు సంబంధించినది. శతాబ్దం మొదటి అర్ధభాగంలో ఇది డబ్బాలకు ప్రసిద్ధి చెందింది. 1950లలో పట్టణంలో 50కి పైగా డబ్బాల తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈ పట్టణాన్ని నార్వే "డబ్బాల రాజధాని" అని కూడా పిలిచేవారు, ఈ కర్మాగారాలలో చివరిదాన్ని 2002లో మూసివేసారు.

1950 ప్రాంతంలో, నగరంలోని శ్రామిక జనాభాలో సగానికి పైగా పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమలో నిర్మాణాత్మక మార్పులు, సేవా రంగం యొక్క బలమైన అభివృద్ధి నగర ఆర్థిక స్థితిని సమూలంగా మార్చేసఅయి. సేవా పరిశ్రమ ఇప్పుడు 11 శాతానికి పైగా ఉపాధిని ఇస్తోంది. కౌంటీ మొత్తం పారిశ్రామిక ఉపాధిలో 29 శాతం నగరం నుండి వస్తోంది

ఇంజనీరింగ్ ఇప్పుడు ప్రధాన పరిశ్రమగా ఉంది, ఇందులో 59 శాతం తయారీ ఉపాధి ఉంది. ఇది ఎక్కువగా ఆఫ్‌షోర్ పెట్రోలియం పరిశ్రమకు సంబంధించినది. కేవలం ఒక్క చమురు ప్లాట్‌ఫారమ్‌ల ఉత్పత్తికి మాత్రమే 40 శాతం వాటా ఉంది. ఇతర ముఖ్యమైన పరిశ్రమలు ప్రచురణలు - ముఖ్యంగా హై ప్రింటింగ్, పట్టణంలోని ప్రధాన దినపత్రికలు, స్టావాంజర్, రోగలాండ్ అవిస్ ఆఫ్టెన్‌బ్లాడ్. ఆహారం, పానీయాలు, వీటిలో జెరెన్ నుండి స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ ఉన్నాయి. అతిపెద్ద వధశాలలలో ఒకటైన గిల్డ్ వెస్ట్ నగరంలో ఉంది.

2007లో పని ప్రదేశం, పరిశ్రమల వారీగా ఉపాధి - ప్రాథమిక రంగంలో 0.6%, ద్వితీయ, తృతీయ స్థాయి పరిశ్రమలలో 27.4% 71.7%. 2007లో రంగాల వారీగా పని ప్రదేశం, ఉపాధి ప్రభుత్వ రంగంలో 24.4%, ప్రైవేట్ రంగం, ప్రభుత్వ సంస్థలలో 75.6%.

ఇటీవలి సంవత్సరాలలో పరిశ్రమ బాగా వికేంద్రీకరించబడింది. కొత్త పారిశ్రామిక ప్రాంతాలలో ముఖ్యమైనవి దక్షిణాన, సాండ్నస్,

సోలా సరిహద్దులో ఫోరస్, ఉత్తరాన, రాండ్‌ఫోంటెయిన్ సరిహద్దులో డుసావిక్ (ప్రధానంగా పెట్రోలియం సంబంధిత కార్యకలాపాలు). ముఖ్యమైన పాత పారిశ్రామిక ప్రాంతాలు హిల్లెవాగ్, బుయోయ్, తూర్పు జిల్లాలు, తీరప్రాంతంలోని కొన్ని ప్రదేశాలలో ఉన్నాయి. నౌకానిర్మాణం, షిప్పింగ్ కూడా సాంప్రదాయకంగా నగర ఆర్థిక వృద్ధికి చాలా ముఖ్యమైనవి. 1896లో స్థాపించబడిన రోసెన్‌బర్గ్ షిప్‌యార్డ్ హండ్వాగ్‌లో ఉంది. నేడు స్టావాంజర్ దేశంలోని అతి ముఖ్యమైన సముద్ర నగరాల్లో ఒకటి, ఓస్లో, బెర్గెన్ అలెసుండ్ నగరాల తర్వాత నమోదైన నౌకాదళాల పరంగా స్టావాంగర్ నాల్గవ స్థానంలో ఉంది.

రవాణా

[మార్చు]

విమానాశ్రయం

[మార్చు]
స్టావాంగర్ విమానాశ్రయం, సోలా

స్టావాంగర్ విమానాశ్రయం, నగర కేంద్రం నుండి 14 నిమిషాల దూరంలో సోలాలో ఉంది. ఈ విమానాశ్రయాన్ని 1937 లో ప్రారంభించారు. 1940లో ఫోరస్‌లోని స్టావాంగర్ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. కానీ 1989లో మూసివేసారు. 2013 లో సోలా విమానాశ్రయం ద్వారా 4 మిలియన్లకు పైగా ప్రయాణీకులు ప్రయాణించారు. ఇది రోగాలాండ్ కౌంటీలో అతిపెద్ద విమానాశ్రయం. ఇది నార్వేలో 3వ అతిపెద్ద విమానాశ్రయం, నార్డిక్ దేశాలలో 7వది. అత్యంత రద్దీగా ఉండే ఓస్లో-గార్డెర్మోన్ మార్గంలో 1.5 మిలియన్ల మంది ప్రయాణిస్తారు. 7,00,000 మంది ప్రయాణికులతో ఫ్లెస్‌ల్యాండ్‌లోని బెర్గెన్ విమానాశ్రయం రెండవ అత్యంత ప్రజాదరణ పొందింది. ఓస్లో-టోర్ప్ మూడవ అత్యంత ప్రజాదరణ పొందినది. దేశీయంగా ట్రోండ్‌హీమ్ విమానాశ్రయం, వార్నెస్, క్రిస్టియన్‌సండ్ విమానాశ్రయం, కెజివిక్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా, అత్యంత రద్దీగా ఉండే మార్గాలు కోపెన్‌హాగన్, ఆమ్స్టర్‌డామ్, అబెర్డీన్. స్టావెంజర్ నుండి లండన్, పారిస్, బార్సిలోనా, స్టాక్‌హోమ్, వార్సా వంటి దేశీయ, యూరోపియన్ గమ్యస్థానాలకు కూడా విమానాలున్నాయి. దేశీయ గమ్యస్థానాలు ట్రోమ్సో నుండి క్రిస్టియన్‌సాండ్ వరకు ఉన్నాయి.

రైల్వే

[మార్చు]
స్టావాంగర్ ఎస్

స్టావాంగర్ స్టేషన్ను 1878లో ప్రారంభించారు. ఇది సోర్లాండెట్ లైన్, జెరెన్ లైన్ రెండింటికీ టెర్మినస్.

దక్షిణ రైల్వే ఓస్లో సెంట్రల్ స్టేషన్ నుండి డ్రామెన్ వరకు, క్రిస్టియన్‌సాండ్ స్టేషన్ నుండి, చివరకు స్టావాంగర్ స్టేషన్ వరకు వెళుతుంది. ఓస్లో, స్టావాంగర్‌ల మధ్య 545 కిలోమీటర్లు (339 మైళ్లు). ఈ మార్గంలో ప్రతిరోజూ నాలుగు రైళ్ళు నడుస్తాయి. ప్రయాణానికి దాదాపు ఏడు గంటలు పడుతుంది. ఈ రైలుమార్గాన్ని అనేక దశల్లో నిర్మించారు. మొదటి విభాగాన్ని 1871 లో ప్రారంభించగా, చివరిది 1944 లో తెరిచారు. ఓస్లోకు పశ్చిమం వైపు మోయి దాకా రైల్వే నర్మాణం నిరంతరం జరుగుతుంటే, పశ్చిమ నార్వేలోని ఎగర్సుండ్ నుండి స్టావాంగర్ వరకు ఉన్న జెరెన్ లైన్ 1878 లో ప్రారంభించబడింది. 1913 వరకు పూర్తయిన విభాగాలకు వెస్ట్‌ల్యాండెట్ లైన్ (ది వెస్ట్ కంట్రీ లైన్) అనే పేరు వాడారు.

రోడ్లు

[మార్చు]

యూరోపియన్ మార్గం E39 మాస్ట్రాఫ్‌జోర్డ్ టన్నెల్, బైఫ్‌జోర్డ్ టన్నెల్ ద్వారా స్టావాంగర్ గుండా వెళుతుంది. తరువాత దక్షిణంగా సాండ్నెస్‌కు వెళుతుంది. ఫిల్‌కెస్వీ 44, స్టావాంగర్‌లో మొదలై సాండ్నెస్, ఫ్లెక్కెఫ్జోర్డ్‌ల మీదుగా క్రిస్టియన్‌శాండ్‌లో ముగుస్తుంది.

జాతీయ రహదారి 509 టాస్టా బరో నుండి టనాంజర్, సోలా, స్టావాంగర్ విమానాశ్రయం, ఫోరస్ గుండా వెళ్ళి జాట్టెన్ సమీపంలోని E39 వద్ద ముగుస్తుంది.

2021 నాటికి, స్టావాంగర్, హౌగెసుండ్‌ల మధ్య ప్రయాణాన్ని సులభతరం చేసే సముద్రగర్భ రోడ్డు సొరంగం - రోగ్‌ఫాస్ట్ - నిర్మాణం కొనసాగుతోంది.

సముద్రం

[మార్చు]

స్టావాంగర్ వెలుపల ఉన్న ఒక ఓడరేవు, డెన్మార్క్‌లోని హిర్ట్‌షాల్స్‌కు ఫెర్రీలను అందిస్తుంది. ఫారో దీవులు, డెన్మార్క్‌ల మధ్య ఉన్న స్మిరిల్ లైన్ ఫెర్రీని స్టావాంగర్‌లో ఆపాలని వాదించేవారు ఉన్నారు. ఎందుకంటే రిసావికాలోని కొత్త ఓడరేవును దీనికి వాడితే మొత్తం నౌకాయాన సమయం ఒక గంట మాత్రమే పెరుగుతుంది.

స్థానిక పడవలు టౌ, క్విట్సోయ్ లకు వెళ్తాయి, అయితే ఫాస్ట్ ప్యాసింజర్ పడవలు స్టావాంగర్ నుండి హౌగెసుండ్, సౌదా వరకు ప్రధాన మార్గాల మధ్య అనేక గ్రామాలు, దీవులకు వెళ్తాయి.

2008లో నిలిపివేయబడిన యునైటెడ్ కింగ్‌డమ్‌లోని న్యూకాజిల్‌కు ఫెర్రీ లింక్‌ను తిరిగి స్థాపించే ప్రణాళికలు ఉన్నాయి.[31]

బస్సు

[మార్చు]
పొరుగున ఉన్న స్టావాంగర్ నగరమైన సాండ్నెస్‌లోని బస్ టెర్మినల్

స్టావాంగర్‌లోని స్థానిక బస్ సర్వీసును "కొలంబస్" బ్రాండ్ పేరుతో రోగాలాండ్ కొల్లెక్టివ్‌ట్రాఫిక్ (RKT) నిర్వహిస్తుంది. [32] బస్సులను బోరియల్ ట్రాన్స్‌పోర్ట్ నడుపుతుంది. రోగాలాండ్ కౌంటీలోని అన్ని బస్సు మార్గాలను RKT నిర్వహిస్తుంది.

ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులు స్టావాంగర్ సిటీ టెర్మినల్ నుండి క్రిస్టియన్‌శాండ్, బెర్గెన్, హౌగేసుండ్‌లకు నార్-వే బస్సెక్స్‌ప్రెస్ ద్వారానూ, క్రిస్టియన్‌శాండ్ మీదుగా ఓస్లోకు లావ్‌ప్రిసెక్స్‌ప్రెస్సేన్ ద్వారానూ నిర్వహించబడతాయి.

నగరంలో అనేక బస్సు సర్వీసులు, టాక్సీలు ఉన్నాయి.

విద్య

[మార్చు]
ఉల్లంధాగ్ క్యాంపస్. స్టావాంగర్ విశ్వవిద్యాలయం
జట్టా అప్పర్ సెకండరీ స్కూల్

యూనివర్శిటీ ఆఫ్ స్టావాంగర్ (UIS) నార్వేలో స్థాపించబడిన ఐదవ విశ్వవిద్యాలయం. ఇది 2004 అక్టోబరు 29 న కౌన్సిల్ నిర్ణయం ద్వారా హోగ్స్కోలెన్ ఐ స్టావాంగర్ (HiS) విశ్వవిద్యాలయ హోదాను పొందింది. ఈ విశ్వవిద్యాలయంలో దాదాపు 9,000 మంది విద్యార్థులు, 1,200 మంది ఉద్యోగులూ ఉన్నారు. ఇందులో మూడు ఫ్యాకల్టీలున్నాయి. అవి: ఫ్యాకల్టీ ఆఫ్ హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్. పురావస్తు మ్యూజియం కూడా విశ్వవిద్యాలయంలో భాగం. ఈ క్యాంపస్ ఉల్లాందౌగ్‌లో ఉంది. చాలా విభాగాలు అక్కడే ఉన్నాయి. మారిట్ బోయెసెన్ 2011 నుండి 2015 వరకు ప్రిన్సిపాల్‌గా పనిచేసింది. 2011 ఆగస్టు 1 నుండి రెక్టార్‌గా తన పదవీకాలాన్ని ప్రారంభించింది. ఆమె రెక్టర్‌గా, స్టావాంగర్ విశ్వవిద్యాలయం యొక్క విద్యా కార్యకలాపాలకు అధిపతిగా, విశ్వవిద్యాలయ బోర్డు ఛైర్మన్‌గా ఉంది. 2012 అక్టోబరులో స్టావాంగర్ విశ్వవిద్యాలయం యూరోపియన్ కన్సార్టియం ఆఫ్ ఇన్నోవేటివ్ యూనివర్సిటీస్ (ECIU)లో సభ్యురాలైంది.

నగరంలో VID ప్రత్యేక విశ్వవిద్యాలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ మిషన్ అండ్ థియాలజీ లేదా మిస్జోన్షోగ్స్కోలెన్ (MHS)గా ప్రారంభమైంది, 1843 లో స్థాపించబడి, 2008లో పరిశోధనా విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది. ఇందులో దాదాపు 20 దేశాల నుండి 300 మంది విద్యార్థులు ఉన్నారు. MHS నార్వేజియన్ మిషనరీ సొసైటీ యాజమాన్యంలో ఉంది. సెంటర్ ఫర్ ఇంటర్ కల్చరల్ కమ్యూనికేషన్ (SIK) ఈ కళాశాల లక్ష్యంతో ముడిపడి ఉంది. 2016లో ఇది VID ప్రత్యేక విశ్వవిద్యాలయంలో భాగమైంది.

ఇతర ప్రైవేట్ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ స్టావాంగర్, ది బ్రిటిష్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ స్టావాంగర్, స్టావాంగర్ ఫ్రెంచ్ స్కూల్ ఉన్నాయి.

నగరంలోని ఇతర పాఠశాలలు ఎంటర్‌ప్రైజ్ టెక్నికల్ కాలేజ్ స్టావంజర్, నోరోఫ్ ఇన్‌స్టిట్యూట్ స్టావెంజర్, ఉట్‌డానింగ్‌షుసెట్ స్టావాంగర్, ఆక్టా బైబిల్, BI స్టావాంగర్, ఫ్జెల్టున్ బైబిల్, ఫోల్కేయూనివర్సిటెట్ స్టావాంగర్, ఇమెంటే వొకేషనల్ స్కూల్ స్టావెంజర్, నార్ ఆఫ్‌షోర్ స్టావాంగర్, నార్వేజియన్ స్టావ్ క్రియేటివ్ స్టావ్‌కాడేస్ స్కూల్ ఆఫ్ క్రియేటివ్ పెటేకా - స్టావాంగర్, PNI శిక్షణా కేంద్రం, స్టావాంగర్ ఆఫ్‌షోర్ టెక్నికల్ కాలేజ్.

ఉన్నత పాఠశాలలను రోగాలాండ్ కౌంటీ కింద వర్గీకరించారు. అయితే ప్రత్యేకంగా స్టావంజర్ మునిసిపాలిటీలో పాఠశాలలు సెయింట్ ఒలావ్, [33] సెయింట్ స్విథున్, [34] స్టావాంగర్ కేథడ్రల్ స్కూల్, [35] హెట్‌ల్యాండ్, [36] జట్టా, [37] స్టావాంగర్ ఆఫ్‌షోర్, [38] కాలేజ్ [39] బెర్గెలాండ్.[40]

మూలాలు

[మార్చు]
  1. "Gross domestic product (GDP) at current market prices by metropolitan regions". ec.europa.eu.
  2. మూస:Cite LPD
  3. మూస:Cite EPD
  4. మూస:Cite Merriam-Webster
  5. "Tabell 1 Tettsteder. Folkemengde og areal, etter kommune. 1. Januar 2009". Archived from the original on 18 September 2009. Retrieved 20 September 2009.
  6. "Greater Stavanger". Archived from the original on 13 August 2013. Retrieved 5 January 2013.
  7. "Gamle Stavanger" (in నార్వేజియన్). 5 January 2013. Archived from the original on 27 June 2016. Retrieved 5 January 2013.
  8. "Boforhold, flytting og befolkningsutvikling i storbyene" (PDF) (in నార్వేజియన్). sintef.no. 1 January 2000. Archived (PDF) from the original on 30 June 2013. Retrieved 5 June 2012.
  9. "About Stavanger". www.npd.no (in ఇంగ్లీష్). Retrieved 2022-12-20.
  10. "The Global 2000". Forbes. 21 April 2010. Archived from the original on 30 July 2017. Retrieved 15 September 2017.
  11. "Stavanger, Norway - Intercultural City - Intercultural cities programme - publi.coe.int". Intercultural cities programme (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-12-20.
  12. "KommuneProfilen. Statistikk som sammenlikner økonomiske regioner etter antall og andel innvandrere og innvandring etter landbakgrunn - basert på statistikk fra SSB". Archived from the original on 9 January 2022. Retrieved 9 January 2022.
  13. Nilsen, Ruth Einervoll (2020-02-14). "Stavanger er Noregs beste by å bu i". NRK (in నార్వేజియాన్ న్యోర్స్క్). Retrieved 2022-12-20.
  14. "Stavangerstatistikken – arbeidsløshet" (in నార్వేజియన్). stavanger.kommune.no. 6 June 2012. Archived from the original on 1 May 2013. Retrieved 6 June 2012.
  15. "3.5 Arbeidsledighet og sysselsetting » Rapportering". tertialrapport.stavanger.kommune.no (in నార్వేజియన్ బొక్మాల్). Retrieved 2022-12-20.
  16. Results from ECA International survey "And the world's most expensive city for expats is ... Tokyo". numbeo.com. 7 December 2011. Archived from the original on 10 June 2012. Retrieved 6 June 2012.
  17. "The World's Most Expensive Cities 2010". businessweek.com. 2011. Archived from the original on 13 July 2014. Retrieved 6 June 2012.
  18. "Numbeo Costs of Living". numbeo.com. 6 June 2012. Archived from the original on 5 March 2021. Retrieved 6 June 2012.
  19. Worldwide, OAG Aviation. "Punctuality League 2020 Report". www.oag.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-12-20.
  20. Phenomenology and the pioneer settlement on the Western Scandinavian Peninsula (Ingrid Fuglestvedt (2009) Lindome : Bricoleur Press) ISBN 978-91-85411-07-8
  21. "Catholic Encyclopedia: Ancient See of Stavanger". newadvent.org. Archived from the original on 5 March 2021. Retrieved 4 April 2011.
  22. "UArctic Education – Student Portal". uarctic.org. Archived from the original on 7 July 2014. Retrieved 7 February 2016.
  23. Jukvam, Dag (1999). "Historisk oversikt over endringer i kommune – og fylkesinndelingen" (PDF) (in నార్వేజియన్). Statistisk sentralbyrå. Archived (PDF) from the original on 1 September 2012. Retrieved 5 May 2016.
  24. "Stavanger kommune – Byhistorie". Archived from the original on 28 September 2007. Retrieved 24 July 2007.
  25. 25.0 25.1 "Stavanger kommune – Byhistorie". Archived from the original on 21 June 2008.
  26. "Om nye Stavanger" (in నార్వేజియన్). Archived from the original on 7 November 2017. Retrieved 4 November 2017.
  27. "Civic heraldry of Norway – Norske Kommunevåpen". Heraldry of the World. Archived from the original on 6 August 2016. Retrieved 4 May 2016.
  28. 28.0 28.1 28.2 Store norske leksikon. "Stavanger" (in నార్వేజియన్). Archived from the original on 5 March 2016. Retrieved 27 April 2016. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "snl" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  29. "Siste frostnatt om våren". 4 May 2012.
  30. "Første frostnatt". 25 September 2013.
  31. Adrian Pearson (27 August 2012). "North Shields to Norway ferry plan raises job hopes". journallive. Archived from the original on 10 November 2012. Retrieved 27 August 2012.
  32. "Kolumbus AS". kolumbus.no. Archived from the original on 7 January 2010. Retrieved 3 November 2009.
  33. "St. Olav". Archived from the original on 5 September 2022. Retrieved 14 November 2018.
  34. "St. Svithun vgs". Archived from the original on 27 November 2018. Retrieved 14 November 2018.
  35. "Stavanger katedralskole". Archived from the original on 14 November 2018. Retrieved 14 November 2018.
  36. "Hetland". Archived from the original on 14 November 2018. Retrieved 14 November 2018.
  37. "Jåttå videregående skole". Archived from the original on 14 November 2018. Retrieved 14 November 2018.
  38. "Stavanger Offshore tekniske skole". Archived from the original on 14 November 2018. Retrieved 14 November 2018.
  39. "Godalen vgs". Archived from the original on 14 November 2018. Retrieved 14 November 2018.
  40. "Bergeland – Bergeland VGS". Archived from the original on 14 November 2018. Retrieved 14 November 2018.


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు