Jump to content

స్టీవ్ వోజ్నియాక్

వికీపీడియా నుండి
స్టీవ్ వోజ్నియాక్
2017 లో వోజ్నియాక్
జననం
స్టీఫెన్ గ్యారీ వోజ్నియాక్

(1950-08-11) 1950 ఆగస్టు 11 (age 74)
శాన్ హోసె, కాలిఫోర్నియా, అమెరికా
ఇతర పేర్లు
  • వోజ్
  • బర్కిలీ బ్లూ (hacking alias)[1]
  • రాకీ క్లార్క్ (స్టూడెంట్ అలియాస్)[2]
పౌరసత్వంఅమెరికా
సెర్బియా
విద్యకొలరాడో బౌల్డర్ విశ్వవిద్యాలయం (బహిష్కరణ)
డీ ఆంజా కళాశాల (హాజరు)
కాలిఫోర్నియా బర్కిలీ విశ్వవిద్యాలయం (బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్)
వృత్తి
  • ఔత్సాహిక వ్యాపారవేత్త
  • ఎలక్ట్రికల్ ఇంజనీర్
  • ప్రోగ్రామర్
  • ఆవిష్కర్త
  • దాత
  • పెట్టుబడిదారు
క్రియాశీల సంవత్సరాలు1971–ప్రస్తుతం
వీటికి ప్రసిద్ధి
  • వ్యక్తిగత కంప్యూటర్ల విప్లవానికి ఆద్యుడు, స్టీవ్ జాబ్స్ తో కలిపి
  • ఆపిల్ సంస్థ సహవ్యవస్థాపకుడు
  • ఆపిల్ 1 సృష్టికర్త
  • ఆపిల్ 2 సహ ఆవిష్కర్త, లీడ్ డెవలపర్
  • మ్యాకింతోష్ సహ సృష్టికర్త, కో డెవలపర్
జీవిత భాగస్వామి
ఆలిస్ రాబర్ట్‌సన్
(m. 1976; div. 1980)
కాండీస్ క్లార్క్
(m. 1981; div. 1987)
సుసాన్ ముల్కెర్న్
(m. 1990; div. 2004)
జానెట్ హిల్
(m. 2008)
పిల్లలు3
Call signex-WA6BND (ex-WV6VLY)

స్టీఫెన్ గ్యారీ వోజ్నియాక్ (జ. ఆగస్టు 11, 1950) అమెరికన్ సాంకేతిక వ్యాపారవేత్త, ఎలక్ట్రికల్ ఇంజనీరు, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఆవిష్కర్త, దాత. ఈయన 1976 లో స్టీవ్ జాబ్స్ తో కలిసి ఆపిల్ కంప్యూటర్స్ అనే సంస్థను ప్రారంభించాడు. 1970, 1980 దశకాల్లో ఆయన చేసిన కృషిని వ్యక్తిగత కంప్యూటర్ల విప్లవంలో ఆయనను ఒక వైతాళికుడుగా నిలబెట్టింది.[3]

1975 లో ఈయన ఆపిల్ 1 అనే కంప్యూటర్ మీద పనిచేయడం ప్రారంభించాడు.: 150 ఆ తర్వాతి సంవత్సరం ఈ కంప్యూటర్ ను మార్కెటింగ్ చేయడంతో ఆపిల్ సంస్థ ప్రారంభమైంది. 1977 లో విడుదలైన, బాగా విజయవంతమైన మైక్రోకంప్యూటరు ఆపిల్ 2 కంప్యూటరు రూపకర్త కూడా ఈయనే.[4] ఈ కంప్యూటర్ కోసం స్టీవ్ జాబ్స్ ఫోమ్ మౌల్డింగ్ తో కూడిన ప్లాస్టిక్ కేస్ తయారు చేయగా, ఆపిల్ మొదటి తరం ఉద్యోగుల్లో ఒకడైన రాడ్ హాల్ట్ స్విచింగ్ పవర్ సప్లై రూపకల్పన చేశాడు.

1979 నుండి 1981 మధ్యలో హ్యూమన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ లో నిష్ణాతుడైన జెఫ్ రాస్కిన్ తో కలిసి ఒరిజినల్ మ్యాకింతోష్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. ఆ సమయంలో వోజ్నియాక్ ఒక విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో స్టీవ్ జాబ్స్ ఆ ప్రాజెక్టు పగ్గాలు చేపట్టవలసి వచ్చింది.[5][6] 1985 లో ఆపిల్ ని శాశ్వతంగా వదిలేశాక వోజ్నియాక్ CL 9 అనే సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ ద్వారా మొదటిసారిగా యూనివర్సల్ ప్రోగ్రామబుల్ రిమోట్ ని 1987 లో విడుదల చేశాడు. దీని తర్వాత ఈయన తన కెరీర్లో వేరే వ్యాపారాలు, దాతృత్వ కార్యక్రమాలు కూడా నిర్వహించాడు. ముఖ్యంగా కె-12 పాఠశాలల్లో సాంకేతికత వాడకం మీద దృష్టి సారించాడు.

జూన్ 2024 నాటికి ఈయన ఆపిల్ సంస్థలో నామమాత్రపు ఉద్యోగిగా కొనసాగుతూనే ఉన్నాడు.[7][8] ఇటీవలి సంవత్సరాల్లో ఈయన జిపిఎస్, టెలికమ్యూనికేషన్స్, ఫ్లాష్ మెమరీ, సాంకేతిక విద్య, పర్యావరణం, శాటిలైట్లు మొదలైన రంగాల్లో కృషి చేశాడు.

బాల్యం

[మార్చు]

స్టీఫెన్ గ్యారీ వోజ్నియాక్ ఆగస్టు 11, 1950 న అమెరికాలోని కాలిఫోర్నియా, శాన్ హోసె లో జన్మించాడు.[9]: 18 [10][11]: 13 [12]: 27  తల్లి మార్గరెట్ లూయిస్ వోజ్నియాక్ వాషింగ్టన్ రాష్ట్రానికి చెందినది. తండ్రి ఫ్రాంసిస్ జాకబ్ వోజ్నియాక్ మిషిగన్ రాష్ట్రానికి చెందినవాడు. ఈయన్ లాక్‌హీడ్ కార్పొరేషన్ లో ఇంజనీరు. వోజ్నియాక్ 1968లో కూపర్టినో లోని హోమ్‌స్టెడ్ హైస్కూలు నుంచి ఉత్తీర్ణుడయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. Dayal, Geeta (February 1, 2013). "Phreaks and Geeks". Slate. Archived from the original on December 12, 2018. Retrieved November 22, 2017.
  2. Stix, Harriet (May 14, 1986). "A UC Berkeley Degree Is Now the Apple of Steve Wozniak's Eye". Los Angeles Times. Archived from the original on April 2, 2019. Retrieved November 22, 2017.
  3. McConnell, Steve (December 7, 2018). "Steve Wozniak: Inventor and Apple co-founder". Berkeley Engineering (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on August 2, 2022. Retrieved September 4, 2022.
  4. Reimer, Jeremy (December 14, 2005). "Total share: 30 years of personal computer market share figures". Ars Technica. Archived from the original on December 4, 2008. Retrieved May 22, 2017.
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; TheVerge అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. "About Steve Wozniak aka 'The Woz'". Woz.org. Archived from the original on May 6, 2017. Retrieved March 19, 2017.
  7. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; wozemployee అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  8. "Woz says he's still an Apple employee, paid 'about $50 a week'". The Mercury News (in అమెరికన్ ఇంగ్లీష్). February 6, 2020. Archived from the original on October 5, 2022. Retrieved November 4, 2022.
  9. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; iWoz అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  10. "Steve Wozniak". Biography.com. Archived from the original on July 3, 2016. Retrieved July 4, 2016.
  11. Rebecca Gold (1994). Steve Wozniak: A Wizard Called Woz. Lerner. ISBN 9780822528814.
  12. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Apple Confidential అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు