స్టెవియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్టెవియా
Stevia rebaudiana flowers.jpg
Stevia rebaudiana flowers.
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): Asterids
క్రమం: Asterales
కుటుంబం: ఆస్టరేసి
జాతి: Eupatorieae
జాతి: స్టెవియా
Cav.
జాతులు

About 240 species, including:
Stevia eupatoria
Stevia ovata
Stevia plummerae
Stevia rebaudiana
Stevia salicifolia
Stevia serrata

స్టెవియా (ఆంగ్లం: Stevia) ఆస్టరేసి (పొద్దు తిరుగుడు పువ్వు) కుటుంబం లోని మూలికలు మరియు తుప్పలకు చెందిన 240 జాతుల యొక్క ప్రజాతి వర్గం. ఇది పశ్చిమ ఉత్తర అమెరికా నుండి దక్షిణ అమెరికాలోని ఉపఉష్ణమండల ఉష్ణమండల ప్రాంతాల్లో ఉంది. స్టెవియా రెబాడియినా జీవజాతులు, సాధారణంగా స్వీట్‌లీఫ్, స్విట్ లీఫ్, చక్కెరఆకు, లేదా సింపుల్‌గా స్టెవియా గా అందరికీ తెలుసు, దీని తియ్యటి ఆకుల కోసం దీన్ని విస్తృతంగా పండిస్తున్నారు. స్వీటెనర్‌గా మరియు చక్కెరకు ప్రత్యామ్నాయంగా, స్టెవియా రుచి చక్కెరతో పోలిస్తే మెల్లగా మొదలై చాలా సేపు ప్రభావం చూపుతుంటుంది. అయితే వీటినుంచి వెలికి తీసిన పదార్ధాలు గాఢ ద్రావణిల వద్ద కాస్త చేదుగా లేదా రుచి అనంతరం లైకోరైస్-లా ఉంటాయి.

దీంతో తయారు చేసిన పదార్ధాలు చక్కెరకంటే 300 రెట్లు తీయగా ఉన్నందున, తక్కువ-కార్బోహైడ్రేట్, చక్కెర తక్కువగా ఉన్న ఆహార ప్రత్యామ్నాయాల కోసం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో స్టెవియా ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఊబకాయం మరియు అధిక రక్తపోటుకు చికిత్సలో స్టెవియా ప్రయోజనకరంగా ఉంటుందని వైద్య పరిశోధన స్పష్టం చేసింది. రక్త గ్లూకోజ్‌పై కాస్త ప్రభావాన్ని చూపుతున్నందున, కార్బొహైడ్రేట్- నియంత్రిత ఆహార పదార్థాల విషయంలో ప్రజలను ఇది సహజ స్వీటెనర్‌లా ఆకర్షిస్తోంది.

స్టెవియా లభ్యత దేశం నుంచి దేశానికి వేరు వేరుగా ఉంటోంది. కొన్ని దేశాల్లో ఇది దశాబ్దాలు లేదా శతాబ్దాలుగా స్వీటెనర్‌గా లభిస్తూ వచ్చింది; ఉదాహరణకు, దశాబ్దాలుగా స్టెవియా లభ్యమవుతున్న జపాన్‌‌లో దీన్ని విస్తృతంగా తీపినిచ్చే పదార్థంగా వాడుతున్నారు. కొన్ని దేశాల్లో, స్టెవియాపై ఆంక్షలు విధించారు లేదా నిషేధించారు. ఇతర దేశాల్లో, ఆరోగ్య భయాలు మరియు రాజకీయ వివాదాలు దీని లభ్యతను పరిమితం చేశాయి; ఉదా. సప్లిమెంట్‌గా ముద్రిస్తే తప్ప, యునైటెడ్ స్టేట్స్‌లో దీన్ని 1990ల మొదట్లో నిషేధించారు, కాని 2008లో దీన్ని ఆహార సంకలితంలాగా రెబౌడియోసైడ్-ఎ పదార్థంగా ఆమోదించారు. గత కొద్ది సంవత్సరాలుగా, చాలా దేశాలలో స్వీటెనర్‌గా స్టెవియా అందుబాటులోకి రావడం పెరుగుకూ వచ్చింది.

చరిత్ర ఉపయోగాలు[మార్చు]

స్టెవియోల్ అనేది స్టేవియాస్ స్వీట్ గ్లైకోసైడ్స్ యొక్క ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్: దిగువ ఉదజని పరమాణువును గ్లూకోస్‌తో, ఎగువ ఉదజని పరమాణువును రెండు లేదా మూడు అనుసంధాన గ్లూకోస్ గ్రూపులతో భర్తీ చేయడం ద్వారా స్టెవియోసైడ్ మరియు రిబాడియోసైడ్‌ A నిర్మించబడ్డాయి.

దక్షిణ అమెరికా, మధ్య అమెరికా మరియు మెక్సికోలలో 240[1] జీవజాతులకు చెందిన స్టెవియా ప్రజాతి వర్గం స్థానికంగా లభ్యమవుతోంది వీటిలో అనేక జీవజాతులు అరిజోనా, న్యూ మెక్సికో, మరియు టెక్సాస్ వంటి సుదూర ఉత్తరాన కూడా కనిపించాయి[2] స్పానిష్ వృక్షశాస్త్రజ్ఞుడు మరియు వైద్యుడు పెడ్రో జైమ్ ఎస్టెవె మొట్మమొదట వీటిపై పరిశోధించాడు, స్టెవియా పదం అతడి ఇంటిపేరు యొక్క లాటినీకరణం చేయబడిన వ్యుత్పత్తి.[3] మనుషులు ఉపయోగించే తీపి జీవజాతులు ఎస్. రెహాడియానా దక్షిణ అమెరికాలో పుట్టాయి. స్టెవియా ఆకులు సుక్రోస్ (సాధారణ టేబుల్ షుగర్) కంటే 30–45 రెట్లు ఎక్కువగా తీపిని కలిగి ఉంటాయి..[4] ఆకులను తాజాగా తినవచ్చు లేదా టీ మరియు ఆహార పదార్ధాలలో వాడవచ్చు.

1899లో, స్విస్ వృక్షశాస్త్రజ్ఞుడు మోయిసెస్ శాంటియాగో బెర్టోనీ, తూర్పు పరాగ్వేలో పరిశోధిస్తున్న సమయంలో ఈ మొక్కను, దాని తీపి రుచిని వివరంగా వర్ణించాడు.[5] అయితే ఈ అంశంపై పరిమిత పరిశోధన మాత్రమే నిర్వహించబడింది, 1939లో ఇద్దరు ఫ్రెంచ్ రసాయన శాస్త్రజ్ఞులు స్టెవియాకు తీపి రుచిని ఇస్తున్న గ్లైకోసైడ్‌లను వేరుపర్చారు.[6] ఈ మిశ్రమాలకు స్టెవియోసైడ్ మరియు రెబాడియోసైడ్ అని పేరు పెట్టారు, ఇవి సుక్రోస్ కంటే 250–300 రెట్లు అధికంగా తీపిని కలిగి ఉన్నాయి, ఇవి వేడిని తట్టుకుంటాయి, pHని తట్టుకుంటాయి మరియు -పులిసిపోవు.[7]

అగ్లైకోన్ మరియు గ్లైకోసైడ్ అసలు నిర్మాణం 1955లో ప్రచురించబడింది.

1970ల మొదట్లో, కార్సినోజెన్‌గా అనుమానిస్తున్న సైక్లమేట్ మరియు సచ్చారిన్ వంటి కృత్రిమ తీపిపదార్ధాలకు ప్రత్యామ్నాయంగా జపాన్ స్టెవియాను సాగుచేయడం ప్రారంభించింది. మొక్క ఆకులు, ఆకులనుంచి సంగ్రహించిన జల ద్రావణం, శుద్ది చేసిన స్టెవో కొమ్మలు వంటివి స్వీటెనర్‌గా ఉపయోగించబడేవి. జపనీస్ సంస్థ మోరిటా కగాకు కోగ్యో కో. లిమిటెడ్ 1971లో జపాన్‌లో మొట్టమొదటి వ్యాపారపరమైన స్టెవియా స్వీటెనర్‌ను ఉత్పత్తి చేసింది[8] జపానీయులు ఆహార పదార్థాలలో శీతల పానీయాలు ( కోకా కోలా),[9] మరియు బోజనాల బల్లపై కూడా స్టెవియాను ఉపయోగించారు. జపాన్ ప్రస్తుతం మరే దేశం కంటే ఎక్కువగా స్టెవియాను వినియోగిస్తోంది, స్వీటెనర్ మార్కెట్‌లో స్టెవియా వాటా 40%గా ఉంది.[10]

ఈరోజు, స్టెవియానూ తూర్పు ఆసియాలో ప్రతిచోటా సాగు చేస్తూ, ఆహారంలో ఉపయోగిస్తున్నారు. చైనా (1984 నుంచి), కొరియా, తైవాన్, థాయ్‌లాండ్, మరియు మలేసియా. ఇది సెయింట్ కిట్స్ మరియు నెవిస్‌లో, దక్షిణ అమెరికా (బ్రెజిల్, కొలంబియా, పెరూ, పరాగ్వే, మరియు ఉరాగ్వే) మరియు ఇజ్రాయిల్ లోని కొన్ని చోట్ల కూడా కనబడుతోంది. చైనా ప్రపంచంలోనే అతి పెద్ద స్టెవియోసైడ్‌ను ఎగుమతి దారు.[10]

స్టెవియా జీవజాతులు అరణ్యంలో పచ్చిక బయళ్ల నుంచి పర్వత ప్రాంతాల వరకు అర్ధ-నీటివనరులు నివాసప్రాంతాలలో కనబడతాయి. కాని వీటిలో అతి తక్కువ శాతం మాత్రమే మొలకెత్తుతుంటాయి. క్లోన్ చేయబడిన స్టెవియాను నాటడం అత్యంత సమర్థవంతమైన పునరుత్పత్తి పద్ధతి.

వైద్యపరమైన ఉపయోగం[మార్చు]

ఎస్. రెబాడియానా ఫోలియేజ్
అయితే కొన్ని దేశాలు స్వీటెనర్‌గా దీని ఉపయోగంపై ఆంక్షలు విధించడం లేదా నిషేధించడం చేసినప్పటికీ, స్టెవియా మొక్కను చట్టబద్దంగా అనేక దేశాల్లో పెంచవచ్చు.

శతాబ్దాలుగా, పరాగ్వే, బొలీవియా మరియు బ్రెజిల్ దేశాలకు చెందిన గ్వరాని తెగలు స్టెవియాను ఉపయోగించేవి, వాళ్లు దీన్ని కా హీ ("తీపి మూలిక"), అని పిలిచేవారు, దీన్ని వారు యెర్బా మాటెలో స్వీటెనర్‌గాను, గుండెమంట మరియు ఇతర రుగ్మతలకోసం వైద్యపరమైన టీగా వాడేవారు.[11] ఇటీవల జరిగిన వైద్య పరిశోధనలు ఊబకాయం[12] మరియు రక్తపోటును కూడా ఇది తగ్గించగలదని తెలుపుతున్నాయి.[13][14] స్టెవియా రక్త గ్లూకోస్‌పై వ్యతిరేక ప్రభావం చూపగలదు, చివరకు గ్లూకోస్‌ను భరించే శక్తినిపెంచుతుంది కూడా;[15] అందుచేత, ఇది మధుమేహం మరియు ఇతర కార్బొహైడ్రేట్-ని నియంత్రించే ఆహార పదార్థాలకు పకృతి సహజ స్వీటెనర్‌గా కూడా పనిచేస్తుంది.[16]

బోలు ఎముకల వ్యాధిని కూడా ఇది తగ్గిస్తుందని పేషెంట్ అప్లికేషన్ సూచిస్తోంది, కోడి ఆహారంలో స్టెవియా ఆకు పొడిని కాస్త పరిమాణంలో కలిపితే గుడ్డు పెంకు విరిగిపోవడాన్ని 75% వరకు అరికడుతుందని ఒక వైద్య పరిశోధన ప్రకటించింది కూడా.[17] పందులకు స్టెవియా ఆకును తినిపిస్తే వాటి ఆహారంలో కాల్షియం కంటెంట్ రెండు రెట్లు పెరుగుతుందని సూచించబడింది కాని ఈ ప్రకటన నిర్ధారించబడలేదు.[18]

లభ్యత[మార్చు]

ప్రస్తుత లభ్యత[మార్చు]

స్వీటెనర్‌గా విస్తృతంగా ఉపయోగించబడింది
ఆహార సంకలితం (స్వీటెనర్)గా లభిస్తోంది
ఆహార సప్లిమెంట్‌‍గా లభిస్తుంది
ఆహార సంకలితం లేదా ఆహార సప్లిమెంట్‌గా లభిస్తోంది
లభ్యం (క్రమబద్దీకరణ ప్రతిపత్తి నిర్ధారించబడలేదు)
నిషేధించబడింది

లభ్యతా పత్రాలు[మార్చు]

 • యునైటెడ్ స్టేట్స్‌లో డిసెంబరు 2008నాటికి, రిబాడియోసైడ్ A సాధారణంగా సురక్షితం (GRAS)గా గుర్తించబడింది[24][24] ఆకులు మరియు ఇతర పదార్దాలు ఆహార సప్లిమెంట్‌లుగా లభ్యమవుతున్నాయి.
 • ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లలో 2008 అక్టోబరులో అన్ని స్టెవియల్ గ్లైకోసైడ్‌లను ఆమోదించడానికి ముందుగా, స్టెవియా ఆకులు ఆహారంగా అమ్మబడేవి.[27]
 • యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఒక భద్రతా సమీక్ష నిర్వహిస్తోంది, 2010లో EU సభ్యదేశాలలో స్టెవియా పదార్ధాలను ఉపయోగించడానికి ఇది అనుమతిస్తుందని ఆశిస్తున్నారు.[28]
  • ఈ సమీక్ష నుంచి 2010 మార్చి 10న జారీ చేయబడిన ఒక నివేదిక, రోజుకు 4 mg/kg శరీర బరువు/తేదీ లెక్కన తీసుకున్నట్లయితే (ADI) స్టెవియల్ గ్లైకోసైడ్‌లు సురక్షితమేనని సూచిస్తోంది, కాని పిల్లలు, పెద్దలు ఇద్దరిలోనూ ప్రతిపాదిత గరిష్ఠ ఉపయోగితా స్థాయిలను పైన సూచించిన పరిమాణాలు మించిపోనున్నాయి.[29]

వ్యాపారీకరణ[మార్చు]

జపాన్‌లో ప్రముఖ స్టెవియా పదార్థాల ఉత్పత్తిదారు అయిన జపనీస్ సంస్థ మోరిటా కగాకు కోగ్యో లిమిటెడ్ 1971లో మొదటిసారిగా స్టెవియోల్ గ్లైకోసైడ్‌లను స్వీటెనర్‌గా వ్యాపారీకరణ చేసింది.

ఈ పంటను వాణిజ్యపరంగా పెంచే అవకాశాలను నిర్ణయించడానికి కెనడా లోని ఒంటారియోలో స్టెవియాను ప్రయోగ ప్రాతిపదికన 1987 నుండి పెంచుతున్నారు.

స్టెవియా-నుండి తయారు చేసిన తమ స్వీటెనర్ రెబియానాను 2009 నాటికి యునైటెడ్ స్టేట్స్‌లో ఆహార సంకలితంలా ఉపయోగించబోతున్నట్లు ది కోకా-కోలా కంపెనీ 2007లో ప్రకటించింది. అలాగే స్టెవియాను ఆహార సంకలితంలా ఉపయోగించడానికి అనుమతించే 12 దేశాల్లో రెబియనా-తీపి ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి కూడా పథకం రచిస్తోంది.[30][31] ఎరిత్రిటోల్ మరియు రెబియానా[32]ను కలిగిన కన్సూమర్ బ్రాండ్ స్టెవియా స్వీటెనర్ ట్రువియా లభ్యత గురించి కోక్ అండ్ కార్గిల్ కంపెనీ 2008 మే నెలలో ప్రకటించింది, దీనిని FDA 2008 డిసెంబరులో ఆహార సంకలితంలా అనుమతించింది.[33] కోకా-కోలా 2008 డిసెంబరు చివరలో స్టెవియా-తీపి శీతలపానీయాలను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.[34]

తర్వాత కొంతకాలానికి, పెప్సీకో మరియు ప్యూర్ సర్కిల్ తమ బ్రాండ్ స్టెవియా ఆధారిత స్వీటెనర్ ప్యూర్‌వియాను ప్రకటించాయి కాని FDA అనుమతి పత్రాన్ని సాధించేవరకు రిబాడియోసైడ్ A తీపి శీతల పానీయాల విడుదలను నిలిపి ఉంచాయి. ట్రువియా మరియు ప్యూర్‌వియాలను FDA అనుమతించడంతో కోకా-కోలా మరియు పెప్సీకో తమ నూతన స్వీటెనర్‌లను కలిగిన ఉత్పత్తులను ప్రకటించాయి.[35]

తీపి మిశ్రమాలను సంగ్రహించడం[మార్చు]

రిబాడియోసైడ్ A స్టెవియా మొక్కలోని అన్ని తీపి మిశ్రమాలలో తక్కువ చేదును కలిగి ఉంటోంది. రిబాడియోసైడ్ Aని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి, స్టెవియా మొక్కలను ఎండబెట్టి నీటిని పూర్తిగా తొలగించే ప్రక్రియకు గురి చేయాలి. ఈ ముడి పదార్థం 50% రిబాడియోసైడ్ Aని కలిగి ఉంటుంది మరియు మొక్కనుంచి తీసిన పలు గ్లైకోసైడ్ అణువులను వేరు చేయడానికి గాను దీనిని ఎథనాల్, మెథనాల్, క్రిస్టలీకరణ మరియు వేరుపరిచే సాంకేతిక జ్ఞానాలను ఉపయోగించి శుద్ధి చేస్తారు. స్వచ్ఛమైన రిబాడియోసైడ్ Aని వేరుపర్చడానికి ఇది ఉత్పత్తిదారును అనుమతిస్తుంది.[36]

కెనడాలోని నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ 0-25 °C ఉష్ణోగ్రతల వద్ద కాలమ్ సంగ్రహణ పద్ధతిలో స్టెవియా నుండి తీపి మిశ్రమాలను సంగ్రహించి, నానో వడపోత ద్వారా దాన్ని శుద్ధి పరిచే ప్రాసెస్‌పై పేటెంట్ తీసుకుంది. సంగ్రహించిన పదార్థాన్ని నిర్ధారించడానికి మైక్రో వడపోత ప్రీట్రీట్‌మెంట్ ప్రక్రియ ఉపయోగించబడింది. ఆల్ట్రా వడపోత తర్వాత నానో వడపోత ద్వారా శుద్ధీకరణ జరుగుతుంది.[37]

భద్రత[మార్చు]

స్టెవియోసైడ్ మరియు రిబాడియోసైడ్ (స్టెవియా ఆకు లోని రెండు స్టెవియల్ గ్లైకోసైడ్ తీపి పదార్థాలు) నుండి వచ్చిన ఉత్పత్తి అయిన స్టెవియల్ ముందస్తు చికిత్స జరిపిన ఎలుకల లివర్ సంగ్రహణలో కనబడిన జన్యు పరివర్తన ఏజెంట్ అని 1985లో నిర్వహించిన ఓ అధ్యయనం నివేదించింది.[38] అయితే శుద్దిచేసిన నీరు కూడా జన్యు ఉత్పరివర్తన ఏజెంట్‌గా కనిపించేలా డేటాను తప్పుగా పొందుపర్చినట్లుగా ఈ అధ్యయనం విమర్శల పాలైంది.[39] తర్వాతి సంవత్సరాలలో టాక్సికాలజీ నిబంధనలు మరియు స్టెవియానుంచి తీసిన పదార్ధాల తీవ్ర ప్రభావాలపై జీవమాపకం, కణ సంస్కృతి, మరియు జంతు అధ్యయనాలు మిశ్రమ ఫలితాలను చూపించాయి. స్టెవియల్ మరియు స్టెవియోసైడ్‌లు బలహీన జన్యు ఉత్పరివర్తనలు[40][41]గా నివేదికలు రావడంతో అధ్యయనాలలో చాలా భాగం హానికరమైన ప్రభావాలను కనిపించకుడా చేసి చూపించాయి.[42][43] 2008 సమీక్షలో, 14 నుంచి 16 అధ్యయనాలు స్టెవియోసైడ్‌ కోసం జెనోటాక్సిక్ చర్యను చూపించగా, 11 నుంచి 15 అధ్యయనాలు స్టెవియల్‌లో జెనోటాక్సిక్ చర్య ఏదీ లేదని చూపించాయి, రిబాడియోసైడ్ Aలో జెనోటాక్సిసిటీ ఉన్నట్లు ఏ అధ్యయనమూ చూపలేదు. స్టెవియా భాగాలు కేన్సర్ లేదా జన్మలోపాలకు కారణమవుతున్నట్లుగా తెలపే సాక్ష్యమేదీ కనిపించలేదు.[42][43]

కాగా, స్టెవియా, ఎలుక[44] లలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచినట్లు, అదనపు ఇన్సులిన్ ఉత్పత్తి[45]ని కూడా ప్రోత్సహించినట్లు ఇది మధుమేహం మరియు మెటబోలిక్ సిండ్రోమ్‌‌ను తిప్పికొట్టడంలో ఇది సహకరిస్తుందని ఇతర అధ్యయనాలు చూపించాయి.[46] ఒక అధ్యయనం రక్తపోటుపై ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపలేదని చూపినప్పటికీ స్టెవియా రక్తపోటు[47]ను తగ్గించడంలో సహాయపడుతుందని ప్రాథమిక మానవ అధ్యయనాలు సూచిస్తున్నాయి.[48] నిజానికి, జపాన్‌లో లక్షలాది మంది ప్రజలు గత ముప్పై సంవత్సరాలుగా ఎలాంటి హానికర ప్రభావాలు లేకుండానే స్టెవియాను ఉపయోగిస్తున్నారు.[49] అదే విధంగా, టైప్ II డయాబెటిస్ చికిత్సకోసం గిరిజన వైద్య సంప్రదాయంలో భాగంగా దక్షిణ అమెరికాలో శతాబ్దాలుగా అనేక తరాలు స్టెవియా ఆకులను ఉపయోగిస్తూన్నారు.[50]

జంతువులు, మానవులపై ఇటీవలే నిర్పహించిన స్టెవియోసైడ్ మరియు స్టెవియో ప్రయోగాత్మక అధ్యయనాలను 2006లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూలంకషంగా మదింపు వేసి, "స్టెవియోసైడ్ మరియు రిబాడియోసైడ్ A లు విట్రో లేదా వివో లలో జెనోటాక్సిక్‌ ను కలిగి లేవని, స్టెవియోల్ జెనోటాక్సిసిటీ మరియు విట్రోలో దాని కొన్ని ఆక్సీకరణ ఉత్పన్నాలు వివోలో వ్యక్తం కావటం లేదని తేల్చి చెప్పింది "[51] కాన్సర్ ప్రేరక చర్యకు ఆధారాలు లేవని కూడా ఈ నివేదిక కనుగొంది. పైగా, రక్తపోటు లేదా టైపే-2 డయాబెటిస్" ఉన్న రోగులలో కొన్ని ఔషధశాస్త్ర సంబంధ ప్రభావాలను స్టెవియోసైడ్ చూపిస్తోందని ఈ నివేదిక తెలిపింది కాని, తగిన డోసేజ్‌ని నిర్ణయించడానికి మరింత అధ్యయనం అవసరముందని ముగించింది.[51] శరీర బరువులో కిలో్గ్రామ్‌కి 4 మిల్లీగ్రాముల వరకు స్టెవియోల్ గ్లైకోసైడ్‌ను రోజువారీగా ఆమోదించిన స్థాయిలో తీసుకోవచ్చంటూ దీర్ఘకాలిక అధ్యయనాలపై ఆధారపడి, ఆహార సంకలితాలపై WHO యొక్క జాయింట్ ఎక్స్‌పర్ట్స్ కమిటీ చేసిన ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి.[52]

రాజకీయ వివాదం[మార్చు]

1991లో, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) స్టెవియాని "సురక్షితం కాని ఆహార సంకలితం"గా ప్రకటించి దాని దిగుమతిని అడ్డుకుంది. FDA దీనికి కారణం చెబుతూ, "స్టెవియాపై టాక్సికాలజీ సమాచారం దాని భద్రతను వివరించడానికి సరిపోవడం లేదని" పేర్కొంది.[53] అయితే ఈ ఆదేశం వివాదాస్పదమైంది, ఎందుకంటే స్టెవియా ప్రతిపాదకులు ఈ విషయమై ప్రకటిస్తూ, 1958కి ముందు వాడిన సహజ పదార్థాలు తీవ్రమైన ప్రభావాలు చూపినట్లు నివేదించబడలేదని FDA సూత్ర్రీకరించిన తన స్వంత మార్గదర్శకాలను పై ప్రకటన ఉల్లంఘిస్తోందని ఎత్తి చూపారు, 1958కి ముందున్న ఫార్మాట్‌ ప్రకారమే స్టెవియా పదార్ధాన్ని వాడినంత కాలం దాన్ని సాధారణంగా సురక్షితమైనదిగానే గుర్తించాలని (GRAS) వీరు పేర్కొన్నారు.

స్టెవియా సహజంగా పెరుగుతుంది కాబట్టి దాన్ని ఉత్పత్తి చేయడానికి పేటెంట్ అవసరం లేదు. ఫలితంగా, 1991లో దిగుమతిపై నిషేధం విధించినప్పటినుంచి FDA పరిశ్రమ ఒత్తిళ్లకు అనుగుణంగా ప్రతిస్పందించిందని స్టెవియా మార్కెటర్లు మరియు వినియోగదారులు విశ్వసించారు.[27] ఉదాహరణకు అరిజోనా కాంగ్రెస్ ప్రతినిధి జోన్ కీల్, స్టెవియాపై FDA చర్యను "కృత్రిమ స్వీటెనర్ పరిశ్రమకు లబ్ది కలిగించడానికి పూనుకున్న వ్యాపార నియంత్రణ"గా పేర్కొన్నాడు.[54] ఈ ఆరోపణను అడ్డుకోవడానికి, సమాచార స్వేచ్ఛా చట్టం కింద దాఖలు చేసిన అభ్యర్థనకు స్పందిస్తూ తాను చేసిన అసలు ఆరోపణలోని పేర్లను FDA తొలగించింది.[27]

1994 ఆహార సప్లిమెంట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ యాక్ట్ స్టెవియాను ఆహార సంకలితంగా కాకుండా ఆహార సప్లిమెంట్‌‌గా ఉపయోగించడానికి అనుమతించే విషయమై తన దృక్ఫథాన్ని మార్చుకోవలసిందిగా FDAని ఒత్తిడి చేసేంత వరకు స్టెవియా అమెరికాలో నిషేధానికి గురైంది, స్టెవియా ప్రతిపాదకులు ఈ వైఖరినే వివాదాస్పదంగా పేర్కొన్నారు ఎందుకంటే ఈ ఆరోపణ ఏకకాలంలో స్టెవియాను దాని అమ్మకాలపై ఆధారపడి సురక్షితం అని సురక్షితం కాదు అని ముద్రవేస్తోంది.[55]

అయితే మానవులను విడిచిపెట్టి, మెటబాలిక్ ప్రక్రియ జంతువులలో స్టెవియానుండి జన్యు ఉత్పరివర్తనను ఉత్పత్తి చేస్తుందా అనే అంశంపై ప్రశ్నలు పరిష్కరించబడకుండా అలాగే కొనసాగుతూ వస్తున్నాయి, ఆహారంలో స్టెవియాను ఉపయోగించడాన్ని యూరోపియన్ యూనియన్‌లో నిషేధించాలని 1999లో తొలి అధ్యయనాలు యూరోపియన్ కమిషన్‌ని ప్రభావితం చేయడంతో దీనిపై తదుపరి పరిశోధన వాయిదా పడింది.[56] సింగపూర్ మరియు హాంకాంగ్ కూడా స్టెవియాను నిషేధించాయి.[26] 2006[51] లో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన భద్రతా మదింపులో పొందుపర్చిన ఇటీవలి డేటా, ఈ విధానాలు ఉపయోగించడానికి తగవని సూచించింది.

2008 డిసెంబర్‌లో, (కార్గిల్ మరియు ది కోకా-కోలా కంపెనీవృద్ధి చేసిన) ట్రువియాకు, (పెప్సికో మరియు హోల్ ఎర్త్ స్వీటెనర్ కంపెనీ, మెరిశాంట్అనుబంధ సంస్థ వృద్ధి చేసిన) ప్యూర్‌వియా లకు GRAS ప్రతిపత్తిని ఇవ్వడానికి "వ్యతిరేకత లేదు" అనే ఆమోదాన్ని FDA ప్రకటించింది. ఈ రెండు సంస్థలూ స్టెవియా మొక్క నుంచి వ్యుత్పన్నమైన రెబాడియోసైడ్ Aని ఉపయోగిస్తున్నాయి.[57]

ఇతర దేశాలలో పేర్లు[మార్చు]

స్వీటెనర్ మరియు స్టెవియా మొక్క స్టెవియా రిబాడియానా రెండూ (యుపటోరియం రిబాడియనమ్‌‌ [58]గా కూడా తెలుసు) సాధారణంగా ఇంగ్లీష్ మాట్లాడే దేశాలతో పాటు ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇటలీ, పోర్చుగల్, ఇజ్రాయెల్, నార్వే, స్వీడెన్ దేశాలలో కూడా "స్టెవియా" అనే పదంతోటే చలామణీలో ఉంటున్నాయి (మూస:PronEng) వీటిలో కొన్ని దేశాలలో కింద చూపిన విధంగా ఇతర పదాలు కూడా ఉపయోగంలో ఉన్నాయి. జపాన్‌లో (సుటెబియా లేదా in కటకనాలో ステビア ) మరియు థాయ్‌లాండ్‌లో (సటివియా ). అనే పేర్లతో కూడా ఉచ్ఛరించబడుతున్నాయి. కొన్ని దేశాలలో (భారత్, ఉదాహరణకు) ఈ పేరును వాచ్యార్థంలో "తీపి ఆకు" అని అనువదిస్తున్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో స్టేవియా మొక్కను కింది పేర్లతో పిలుస్తున్నారు:[59]

పరాగ్వే స్టాంపు, గ్వారనీ మరియు మొక్క శాస్త్రీయనామాన్ని కలిగి ఉంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మరింత చదవడానికి[మార్చు]

 • Kirkland, James & Tanya. Sugar-Free Cooking With Stevia: The Naturally Sweet & Calorie-Free Herb. Crystal Health Publishing, Arlington Texas. p. 280. ISBN 192890615X. స్టేవియాను మొట్టమొదట యునైటెడ్ స్టేట్స్‌లో నిషేధించినప్పుడు FDA వినాశక ఆదేశాలతో నిషేధించాలని ప్రయత్నించిందని చెప్పడానికి ఈ పుస్తకం ఒక ఉదాహరణ.

గమనికలు మరియు సూచనలు[మార్చు]

 1. "Stevia". Flora of North America.
 2. "Stevia Cav". USDA PLANTS.
 3. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil). దిస్ రెఫెరెన్స్ రెఫర్స్ స్పెసిఫికల్లీ టు స్టేవియా యుపోటోరియా , ఎ రిలేటెడ్ వీడ్ హావింగ్ ది సేమ్ నోమెన్‌కల్చర్ ఆరిజిన్.
 4. "Opinion on Stevia Rebaudiana plants and leaves" (PDF) (Press release). European Commission Scientific Committee on Food. 17 June 1999. Retrieved 27 January 2008.
 5. Bertoni, Moisés Santiago (1899). Revista de Agronomia de l’Assomption. 1: 35.
 6. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 7. Brandle, Jim (19 August 2004). "FAQ - Stevia, Nature's Natural Low Calorie Sweetener". Agriculture and Agri-Food Canada. Retrieved 8 November 2006.
 8. "Stevia". Morita Kagaku Kogyuo Co., Ltd. 2004. Retrieved 6 November 2007.
 9. Taylor, Leslie (2005). The Healing Power of Natural Herbs. Garden City Park, NY: Square One Publishers, Inc. pp. (excerpted at weblink). ISBN 0-7570-0144-0.
 10. 10.0 10.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 11. Tanvir, Ashraf (24 May 2005). "Sugar Leav – A new breed of 'sweetener'". Pakistan Agricultural Research Council. Retrieved 2 January 2009.
 12. పబ్‌మెడ్ రీసెర్చ్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు ట్రీట్‌మెంట్స్ ఆఫ్ ఒబేసిటీ
 13. పబ్‌మెడ్ రీసెర్చ్ ఆర్టికల్స్ ఆన్ స్టేవియాస్ ఎఫెక్ట్స్ ఆన్ బ్లడ్ ప్రెషర్
 14. పబ్‌మెడ్ ఆర్టికల్స్ ఆన్ స్టేవియాస్ యూజ్ ఇన్ ట్రీటింగ్ హైపర్‌టెన్షన్
 15. Curi R, Alvarez M, Bazotte RB, Botion LM, Godoy JL, Bracht A (1986). "Effect of Stevia rebaudiana on glucose tolerance in normal adult humans". Braz. J. Med. Biol. Res. 19 (6): 771–4. PMID 3651629.CS1 maint: Multiple names: authors list (link)
 16. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 17. "US Patent #6,500,471". Retrieved 29 August 2009.
 18. "Stevia against Osteoporosis". OwnDoc.com. Retrieved 1 January 2010.
 19. 19.0 19.1 19.2 19.3 19.4 "Stevia Timeline Important Dates and Events" (PDF). truvia.com. 01-Jan-2010. Archived from the original (PDF) on 1 January 2010. Retrieved 5 March 2010. Check date values in: |date= (help)
 20. స్టేవియా గెట్స్ ఆస్ట్రేలియన్ అప్రూవల్ ఫర్ ఫుడ్ అండ్ బెవరేజెస్
 21. Halliday, Jess (08-Sep-2009). "France approves high Reb A stevia sweeteners". foodnavigator.com. Retrieved 23 January 2010. Check date values in: |date= (help)
 22. Halliday, Jess (15-Sep-2009). "France's first stevia products around the corner". foodanddrinkeurope.com. Retrieved 23 January 2010. Check date values in: |date= (help)
 23. Halliday, Jess (08-Jul-2009). "German-speaking countries show huge stevia interest". foodnavigator.com. Retrieved 5 March 2010. Check date values in: |date= (help)
 24. 24.0 24.1 Curry,Leslie Lake. "Agency Response Letter GRAS Notice No. GRN 000253". Retrieved 9 April 2010.
 25. 25.0 25.1 25.2 "Olam and Wilmar in 50:50 JV to Acquire 20% Stake in PureCircle, a Leading Producer of Natural High-Intensity Sweeteners for USD 106.2 Mln". www.flex-news-food.com. 01-Jul-2008. Retrieved 8 March 2010. Check date values in: |date= (help)
 26. 26.0 26.1 26.2 Li, Simon (27 March 2002). Fact Sheet: Stevioside (PDF). Hong Kong Legislative Council Secretariat Research and Library Services Division.
 27. 27.0 27.1 27.2 Hawke, Jenny (February–March 2003). "The Bittersweet Story of the Stevia Herb" (PDF). Nexus magazine. 10 (2). Retrieved 9 July 2008.CS1 maint: Date format (link)
 28. Halliday, Jess (1 June 2009). "France and the rest of Europe prepare for stevia approval". Decision News Media.
 29. "Scientific Opinion on the safety of steviol glycosides for the proposed uses as a food additive". foodnavigator.com. 10-Mar-2010. Retrieved 16 April 2010. Check date values in: |date= (help)
 30. Stanford, Duane D. (31 May 2007). "Coke and Cargill teaming on new drink sweetener". Atlanta Journal-Constitution. Archived from the original on 3 Jun 2007. Retrieved 31 May 2007.
 31. Etter, Lauren and McKay, Betsy (31 May 2007). "Coke, Cargill Aim For a Shake-Up In Sweeteners". Wall Street Journal. Retrieved 1 June 2007.CS1 maint: Multiple names: authors list (link)
 32. "Truvia ingredients". Retrieved 15 May 2008.
 33. "Stevia sweetener gets US FDA go-ahead". Decision News Media SAS. 18 December 2008. Retrieved 11 May 2009.
 34. Associated Press (15 December 2008). "Coke to sell drinks with stevia; Pepsi holds off". The Seattle Times. Retrieved 16 December 2008.
 35. "FDA Approves 2 New Sweeteners". The New York Times. Associated Press. 17 December 2008. Retrieved 11 May 2009.
 36. Purkayastha, S. ""A Guide to Reb-A," Food Product Design". Retrieved 28 March 2009.
 37. "United States Patent 5,972,120 Extraction of sweet compounds from Stevia rebaudiana Bertoni".
 38. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 39. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil). – ఆర్టికల్ టెక్స్ట్ ఈజ్ రీప్రొడ్యూస్‌డ్ హియర్.
 40. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 41. Nunes AP, Ferreira-Machado SC, Nunes RM, Dantas FJ, De Mattos JC, Caldeira-de-Araújo A (2007). "Analysis of genotoxic potentiality of stevioside by comet assay". Food Chem Toxicol. 45 (4): 662–6. doi:10.1016/j.fct.2006.10.015. PMID 17187912.CS1 maint: Multiple names: authors list (link)
 42. 42.0 42.1 Geuns JM (2003). "Stevioside". Phytochemistry. 64 (5): 913–21. doi:10.1016/S0031-9422(03)00426-6. PMID 14561506.
 43. 43.0 43.1 Brusick DJ (2008). "A critical review of the genetic toxicity of steviol and steviol glycosides". Food Chem Toxicol. 46 (7): S83–S91. doi:10.1016/j.fct.2008.05.002. PMID 18556105.
 44. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 45. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 46. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 47. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 48. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 49. "Products and Markets - Stevia" ([HTML]). Food and Agriculture Organization of the United Nations - Forestry Department. Retrieved 4 May 2007.
 50. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 51. 51.0 51.1 51.2 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 52. "Joint FAO/WHO Expert Committee on food additives, Sixty-ninth Meeting" ([dead link]). World Health Organization. 4 July 2008.
 53. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (1995, రివ్యూ 1996, 2005). ఇంపార్టెంట్ అలెర్ట్ #45-06: "ఆటోమేటిక్ డిటెన్షన్ ఆఫ్ స్టేవియా లీవ్స్, ఎక్స్‌ట్రాక్ట్ ఆఫ్ స్టేవియా లీవ్స్, అండ్ ఫుడ్ కంటెయినింగ్ స్టేవియా"
 54. కేవైల్, జాన్ (ఆర్-అరిజోనా) (1993). లెటర్ టు ఫార్మర్ ఎఫ్‌డీఏ కమీషనర్ డేవిడ్ ఆరోన్ కెస్లర్ అబౌట్ ది 1991 స్టేవియా ఇంపోర్ట్ బాన్, కోటెడ్ అట్ స్టేవియా.నెట్ సేఫ్టీ స్టడీస్.
 55. McCaleb, Rob (1997). "Controversial Products in the Natural Foods Market". Herb Research Foundation. Retrieved 8 November 2006.
 56. యూరోపియన్ కమీషన్ సైంటిఫిక్ కమిటీ ఆన్ ఫుడ్ (జూన్ 1999). ఒపీనియన్ ఆన్ స్టేవియాసైడ్ యాజ్ ఎ స్వీట్నర్
 57. Newmarker, Chris (2008). "Federal regulators give OK for Cargill's Truvia sweetener". Minneapolis / St. Paul Business Journal. Retrieved 18 December 2008.
 58. "Asteraceae Eupatorium rebaudianum Bertoni". International Plant Names Index.
 59. ది మల్టీలింగువల్ మల్టీస్క్రిప్ట్ ప్లాంట్ నేమ్ డేటాబేస్ హాజ్ టెర్మ్స్ ఫర్ ది స్టేవియా ప్లాంట్ ఇన్ వేరియస్ లాంగ్వేజెస్.

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=స్టెవియా&oldid=2415906" నుండి వెలికితీశారు