Jump to content

స్త్రీ శక్తి పథకం

వికీపీడియా నుండి
విశాఖపట్నంలో బస్సు ఎక్కుతున్న మహిళ
విశాఖపట్నంలో బస్సు ఎక్కుతున్న మహిళ
జీరో ఫేర్ టికెట్
జీరో ఫేర్ టికెట్

స్త్రీ శక్తి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 ఆగష్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించే పథకం. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయానించవచ్చు.[1][2] ఇది ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మహిళలకు, బాలికలకు, ట్రాన్స్‌జండర్లకు వర్తిస్తుంది. గుర్తింపు కార్డును ధృవీకరించి, ప్రభుత్వ రాయితీ వివరాలతో కూడిన జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తారు.[3]

నేపథ్యం

[మార్చు]

మహిళలకు ఉచిత బస్సు పథకం మొదట 2019లో డిల్లీలో కేజ్రీవాల్ హయాం ప్రవేశపెట్టారు. తరువాత తమిళనాడు, కేరళ, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీరు, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు చేసారు.[4] కర్ణాటకలో స్త్రీ శక్తి అని, తెలంగాణలో మహాలక్ష్మి పథకం అనే పేర్లతో అమలవుతుంది.[5][6]

ఉపయోగాలు

[మార్చు]

ఉద్యోగాలు, విద్యాసంస్థలు, మార్కెట్లకు వెళ్ళే మహిళలకు ప్రయాణ ఖర్చు తగ్గడంతో వారికి ప్రోత్సాహకంగా ఉండి, సమాజంలో వారి భాగస్వామ్యాన్ని పెంచి, సాధికారతకు దారితీస్తుంది. బస్సు సౌకర్యం వాడటం వల్ల వ్యక్తిగత రవాణా వాహనాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గి, రహదారి ప్రమాదాలు, ట్రాఫిక్, ఇంధన వినియోగం కూడా తగ్గి, పర్యావరణానికి మేలు జరుగుతుంది.[7] అంతర్జాతీయ స్థాయిలో కూడా ఉచిత ప్రజా రవాణాపథకాలను అమలు చేస్తున్నారు. 2020లో లక్సెంబర్గ్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బస్సులు, ట్రాములు, రైళ్లు ఉచితంగా మార్చి, ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా నిలిచింది.[8][9] తరువాత 2022లో మాల్టా కూడా ఎక్కువ భాగం బస్సు మార్గాలను ఉచితంగా మార్చింది, అయితే ఇది లక్సెంబర్గ్‌తో పోలిస్తే కేవలం ఆ దేశ నివాసితులకే వర్తిస్తుంది.[10] సుమారు తొమ్మిది దేశాలలో ఉచిత ప్రజా రవాణా వ్యవస్థలు ఉన్నాయి.[11]

వ్యతిరేకత

[మార్చు]

ఉచిత బస్సు రవాణా పథకం అమలుతో ఆటోరిక్షా డ్రైవర్లు, ఇతర చిన్న ప్రయివేటు రవాణా వర్గాలు తమ ఉపాధి తగ్గిపోతుందనే ఆందోళనను వ్యక్తం చేశాయి.[12] ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయంగా రూ. 10,000 ప్రకటించారు.[13] పెరుగుతున్న డిమాండ్ కు తగినంత సంఖ్యలో డ్రైవర్లు, బస్సులను సమకూర్చుకోవాల్సి ఉంది.[14]

మూలాలు

[మార్చు]
  1. "నేటి నుంచే 'స్త్రీ శక్తి'". ప్రజాశక్తి. 2025-08-15.
  2. Telugu, TV9 (2025-07-31). "Andhra: ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఫ్రీ టికెట్‌ను మీరూ చూశారా.?". TV9 Telugu. Retrieved 2025-08-15.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆగస్టు 15 నుంచి అమలు, విధివిధానాలు ఏమిటంటే?". BBC News తెలుగు. 2025-08-12. Retrieved 2025-08-17.
  4. "List Of Indian States Offering Free Bus Rides For Women (2025)" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-01-02. Retrieved 2025-08-17.
  5. "ఆర్టీసీ ఉచిత ప్రయాణం తో మహిళలకు దక్కిన గౌరవం మహాలక్ష్మి పథకం మహిళలకు ఓ వరం రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ..!". Mahaa Daily (in అమెరికన్ ఇంగ్లీష్). 2025-07-25. Retrieved 2025-08-15.
  6. "TGSRTC అరుదైన రికార్డ్.. ఏకంగా రూ.6700 కోట్లు, సంబరాలకు సిద్ధమైన ఉద్యోగులు". Samayam Telugu. Retrieved 2025-08-15.
  7. "Free Bus Travel for Women in Andhra Pradesh 2025: Empowering Mobility with Super Six Scheme". Mahayojanaa. 2025-07-11. Retrieved 2025-08-17.
  8. Telugu, TV9 (2020-03-02). "ఆ దేశంలో ప్రయాణం ఉచితం.. పైసా ఖర్చులేకుండా రైళ్లల్లో, బస్సుల్లో..!". TV9 Telugu. Retrieved 2025-08-17.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  9. Velugu, V6 (2020-03-01). "ఎవరైనా సరే బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయోచ్చు". V6 Velugu. Retrieved 2025-08-17.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  10. NewsDesk (2021-10-12). "మాల్టాలో ఉచిత ప్రజా రవాణ". idhatri (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-08-17.
  11. "Free public transport: ఈ 9 దేశాల్లో మీరు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు.. ఎక్కడో తెలుసా?". telugu.news18.com. 2022-01-05. Retrieved 2025-08-17.
  12. Greatandhra (2025-07-10). "ఫ్రీ బస్సు మీద ఆటోల కస్సు బుస్సు Great Andhra". Great Andhra. Retrieved 2025-08-17.
  13. Telugu, ntv (2025-07-28). "Kollu Ravindra: ఉచిత బస్సు ప్రయాణం ఆగష్టు15 నుంచే.. ఆటో డ్రైవర్‌కు 10 వేలు!". NTV Telugu. Retrieved 2025-08-17.
  14. Ilyas, M. D. (2025-08-11). "Arrangements for Free Bus Travel to AP Women Gain Momentum". www.deccanchronicle.com (in ఇంగ్లీష్). Retrieved 2025-08-17.