Jump to content

స్థానిక భాషా పత్రికల చట్టం

వికీపీడియా నుండి
స్థానిక పత్రికా చట్టం, 1878 ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు చేయబడింది దేశద్రోహ ప్రచురణల చట్టం, 1882
స్థితి: రద్దు చేయబడింది

బ్రిటిషు భారతదేశంలో, ఐరిష్ ప్రెస్ చట్టాల ఆధారంగా చేసిన స్థానిక భాషా పత్రికల చట్టం (1878), భారతీయ పత్రికల స్వేచ్ఛను హరించడానికీ, బ్రిటిషు విధానాలపై విమర్శల వ్యక్తీకరణను నిరోధించడానికీ రూపొందించబడింది. ముఖ్యంగా రెండవ ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధం (1878–80) ప్రారంభంతో పెరిగిన వ్యతిరేకతను అణచడానికి దీన్ని ఉద్దేశించారు. స్థానిక ప్రజలలో ప్రభుత్వం పట్ల అసంతృప్తిని కలిగించే బలమైన ప్రజాభిప్రాయాన్నీ, రాజద్రోహ రచనలనూ ప్రచురించకుండా స్వదేశీ పత్రికలను నియంత్రించడానికి ప్రభుత్వం ఈ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టాన్ని అప్పటి భారత వైస్రాయ్ లిట్టన్ ప్రతిపాదించగా, 1878 మార్చి 14న వైస్రాయ్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దక్షిణ భారతదేసం మినహా, దేశంలోని ప్రతిచోటా 'ప్రాచ్య భాషలలో ప్రచురణలు'లో దేశద్రోహ రచనలను నియంత్రించడానికి ఉద్దేశించినందున, ఈ చట్టం ఆంగ్ల భాషా ప్రచురణలను మినహాయించింది. ఆ విధంగా బ్రిటిషు వారు భారతీయ భాషా పత్రికలపై పూర్తిగా వివక్ష చూపారు.

ఈ చట్టం, ప్రభుత్వానికి పత్రికలపై ఈ క్రింది విధాలుగా ఆంక్షలు విధించే అధికారం ఇచ్చింది:

1. ఐరిష్ ప్రెస్ చట్టం తరహాలో రూపొందించబడిన ఈ చట్టం, స్థానిక భాషా పత్రికలలో నివేదికలనూ, సంపాదకీయాలనూ సెన్సార్ చేయడానికి ప్రభుత్వానికి విస్తృత హక్కులను కల్పించింది.

2. ప్రభుత్వం ప్రాంతీయ భాషా వార్తాపత్రికలను క్రమం తప్పకుండా ట్రాక్ చేస్తుంది.

3. వార్తాపత్రికలో ప్రచురితమైన ఏదైనా నివేదిక దేశద్రోహంగా భావించినపుడు, ఆ వార్తాపత్రికను హెచ్చరించేవారు.

1857 తిరుగుబాటు తరువాత, ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను అణచివేయాలని భావించింది. తిరుగుబాటు తర్వాత ఆగ్రహించిన ఆంగ్లేయులు, పత్రికలను అణిచివేయాలని డిమాండ్ చేశారు. స్థానిక భాషా వార్తాపత్రికలు జాతీయవాదాన్ని దృఢంగా వినిపించడంతో, వలస ప్రభుత్వం కఠినమైన నియంత్రణ చర్యలను ప్రారంభించింది.

స్పందన

[మార్చు]

బ్రిటిషు ప్రభుత్వం ఎటువంటి స్పందనల కోసం చూడకుండా ఈ బిల్లును ఆమోదించడానికి తొందరపడటంతో, కలకత్తాలోని సాధారణ పత్రికలలో బిల్లు గురించి ప్రచురించబడనే లేదు. వాయవ్య ప్రావిన్సులకు ఈ సమాచారం పొందడంలో ఆలస్యం జరిగింది. వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం ఆమోదించబడిన వారం లోనే కలకత్తా లోని అమృత బజార్ పత్రిక పూర్తిగా ఇంగ్లీషు వారపత్రికగా మారిపోయింది. ఈ చట్టం ఉనికిలోకి వచ్చిన రెండు వారాల తర్వాత కూడా ఉత్తరాదిలోని పత్రికలకు దానిలోని కచ్చితమైన నిబంధనలు ఏమిటో తెలియలేదు. తరువాతి సంవత్సరాల్లో కొత్తగా అనేక బెంగాలీ పత్రికలు రావడం, వెంటనే అదృశ్యం కావడం జరిగింది. వాటి భాష, ఆలోచనలూ ఆకట్టుకోకపోవడంతో ప్రజల మద్దతు పొందడంలో విఫలమయ్యాయి.[1]

ప్రచురణకర్తలకు ఈ నిబంధనల గురించి తెలిసాక, అణచివేత చర్యల పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. మతం, కులం, జాతితో సంబంధం లేకుండా అన్ని స్థానిక సంఘాలు ఈ చర్యను ఖండించాయి. బెంగాల్ లోనూ, ఒతర భారతదేశం లోనూ ప్రముఖ నాయకులందరూ ఈ చట్టాన్ని అనవసరమైనదిగా, అన్యాయమైనదిగా ఖండించారు. దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. స్వయంగా వార్తాపత్రికలు కూడా ఈ చర్యను విమర్శిస్తూనే ఉన్నాయి. తరువాత వచ్చిన లార్డ్ రిప్పన్ ప్రభుత్వం, ఈ చట్టం తర్వాత జరిగిన పరిణామాలను సమీక్షించి చివరకు 1881 లో దానిని ఉపసంహరించుకుంది. అయితే, అది భారతీయులలో కలిగించిన ఆగ్రహం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఆజ్యం పోసింది. భారత జాతీయ కాంగ్రెసుకు పూర్వజసంస్థగా పరిగణించబడే ఇండియన్ అసోసియేషన్, ఈ చట్టాన్ని తీవ్రంగా విమర్శించింది.[2] పత్రికా సంపాదకులపై దేశద్రోహం నేరం మోపబడిన సందర్భంలో న్యాయ విచారణ జరపాలనే కీలకమైన డిమాండును ప్రభుత్వం ఎప్పుడూ అంగీకరించలేదు. అయితే, 1878 అక్టోబరులో ఈ చట్టాన్ని స్వల్పంగా సవరించారు; ప్రచురణకు ముందే రుజువులను సమర్పించాలనే నిబంధనపై పట్టుబట్టలేదు. అయినప్పటికీ బెయిల్-బాండ్ మాత్రం అలాగే ఉంది.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 . "The Indian Press 1870-1880: A Small World of Journalism". ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :1 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు