స్థిర ఆదాయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 • స్థిర ఆదాయం అనేది క్రమపద్ధతిలో (లేదా స్థిరంగానైనా) రాబడి ఫలాన్నిచ్చే ఒక పెట్టుబడి లాంటిది. ఉదాహరణకు, మీరు ఎవరికైనా డబ్బు అప్పిచ్చినట్టైతే అప్పు తీసుకున్నవారు నెలకోసారి వడ్డీ చెల్లిస్తారు, తద్వారా మీరు ఒక స్థిర-ఆదాయ భద్రతను పొందినట్టవుతుంది. * ప్రభుత్వాలు తమ సొంత ద్రవ్యంతో ప్రభుత్వ బాండులను, విదేశీ ద్రవ్యంతో సావరీన్ బాండులను జారీ చేస్తాయి. స్థానిక ప్రభుత్వాలు సొంత ఆర్థిక సహకారం కోసం మున్సిపల్ బాండులను జారీ చేస్తాయి. ప్రభుత్వ సహకారంతో నడిచే ఏజెన్సీలు జారీ చేసిన రుణాలను ఏజెన్సీ బాండ్లుగా పిలుస్తారు. వ్యాపార సంస్థలు కార్పొరేట్ బాండులను జారీ చేస్తాయి లేదా కార్పొరేట్ లోన్ ద్వారా ఏదైనా బ్యాంకు నుంచి డబ్బును సమకూర్చుకుంటాయి ("ఎంచుకోబడ్డ నిల్వలు" కూడా ఒక్కోసారి స్థిరాదాయంగా పరిగణింపబడతాయి) భద్రతాయుత బ్యాంకు రుణాలు (ఉదా. క్రెడిట్ కార్డ్ రుణం, కారు లోన్లు లేదా తాకట్టు) అనేవి కార్పొరేట్ మరియు ప్రభుత్వ బాండ్ల లాగా మార్పిడి పై వర్తకం చేయగలిగే ఎబిఎస్ - ఎస్సెట్ - బ్యాక్‍డ్ సెక్యూరిటీస్ లాంటి ఇతర స్థిరాదాయ ఉత్పత్తులుగా పరిగణించవచ్చు.
 • స్థిరాదాయం అనే పదం ఏ కాల వ్యవధిలోనూ మార్పు చెందని ఒక వ్యక్తి యొక్క నికరాదాయానికి కూడా వర్తిస్తుంది. బాండ్లు మరియు ఎంచుకోబడ్డ నిల్వలు లేదా స్థిరాదాయానికి హామీనిచ్చే ఉపకారవేతనాల్లాంటి వాటి ద్వారా ఉత్పన్నమయ్యే ఆదాయాన్ని కూడా దీనిలో భాగంగానే చెప్పవచ్చు. ఎప్పుడైతే ఉపకారవేతన గ్రహీతలు లేదా రిటైర్ అయిన వ్యక్తులు వారి ఆదాయానికి ప్రబలమైన మూలకంగా ఉపకారవేతనం పై ఆధారపడతారో, "స్థిర ఆదాయం" అనే మాట వారి పరిమిత విచక్షణాపూర్వక ఆదాయానికీ లేదా భారీ వ్యయాలకు సరిపోని ఆర్థిక స్వాతంత్ర్యానికీ కూడా వర్తిస్తుంది.
 • స్థిర-ఆదాయ సెక్యూరిటీలు నిల్వలు లాంటి పరివర్తక రాబడుల సెక్యూరిటీలతో విభేదిస్తాయి. ఒక వ్యాపార సంస్థ తన వ్యాపారాన్ని పెంచుకునే క్రమంలో భాగంగా ఏదైనా స్వాధీనపర్చుకోడానికి, పరికరాల కొనుగోలుకు లేదా భూమి లేదా కొత్త ఉత్పత్తి అభివృద్ధికి అయ్యే పెట్టుబడి కోసం డబ్బును సమకూర్చుకోవాల్సి వస్తుంది. వ్యాపారసంస్థ యొక్క సామర్ధ్యానికి అనుగుణంగా తగిన రాబడిని పొందవచ్చునని మదుపుదార్లు నమ్మితే, మదుపుదార్లు ఆ వ్యాపారసంస్థకు డబ్బు మాత్రమే చెల్లిస్తారు. దానిలో భాగంగానే ఆ వ్యాపార సంస్థ తన (నిల్వ)లో వాటాను ఇవ్వడం గానీ, లేదా ప్రామాణికమైన వడ్డీ మరియు రుణం మీది అసలును తిరిగి చెల్లించే వాగ్దానంగానీ చేస్తుంది (బాండు, బ్యాంకు రుణం, లేదా ఎంచుకోబడ్డ నిల్వ).
 • ఈ స్థిరాదాయం అనే మాట కొన్నిసార్లు ద్రవ్యోల్బణంతో ముడిపడ్డ బాండ్ల ద్వారా సంక్రమించే పరివర్తక ఆదాయం వల్ల, తద్వారా రాబడి తగ్గడం వల్ల దారితప్పుతోంది.

పరిభాష[మార్చు]

 • బాండు అనేది సాధారణంగా అప్పుతీసుకున్న డబ్బు మీద చెల్లించే వడ్డీకి సంబంధించిన వాగ్దానం అయినప్పటికీ, ఈ స్థిర-ఆదాయ పరిశ్రమలో కొంత ముఖ్యమైన పరిభాష వాడటం జరుగుతుంది:
 • ఎవరైతే కొంత మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకుని (బాండును జారీచేయువారు) దానికి వడ్డీ చెల్లిస్తారో, ఆ జారీ చేయు వారిని (సంస్థ లేదా ప్రభుత్వం) ఎంటిటీ అంటారు.
 • ది ప్రిన్సిపల్ అఫ్ ఎ బాండ్ - దీన్ని మెచ్యూరిటీ విలువ, ఫేస్ వాల్యూ, పార్ వాల్యూ అనికూడా అంటారు- ఇది అప్పు ఇచ్చిన వారికి[1] తప్పనిసరిగా తిరిగి చెల్లించేందుకు, జారీచేయువారు అప్పుగా తీసుకున్న సొమ్ము.
 • కూపన్ (బాండు యొక్క) అనేది జారీచేయువాడు తప్పనిసరిగా చెల్లించాల్సిన వడ్డీ.
 • మెచ్యూరిటీ అనేది జారీచేయువారు తప్పనిసరిగా తిరిగి చెల్లించాల్సిన తేదీ, బాండ్ యొక్క ముగింపు.
 • ఈష్యూ అనేది బాండ్‍కు ఉన్న మరో పర్యాయపదం.
 • ఇండెంచర్ అనేది బాండ్‍కు సంబంధించిన సమస్త షరతులను తెలియజేసే ఒప్పందం.

మదుపుదార్లు[మార్చు]

 • స్థిర-ఆదాయ సెక్యూరిటీలకు సంబంధించినంత వరకూ మదుపుదార్లు ప్రత్యేకంగా తమ పెట్టుబడి పై నిరంతర భద్రతాయుతమైన రాబడిని ఆశిస్తున్నారు. ఉదాహరణకు, పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి తను జీవన భృతి కోసం నిరంతరంగా ఆధారపడగలిగే వేతన చెల్లింపును పొందడాన్ని కోరుకుంటాడు, కానీ మూలధనాన్ని ఖర్చుపెట్టాలని అనుకోడు. ఈ వ్యక్తి తమ డబ్బుతో ఒక బాండ్ కొనుక్కుని, మరియు దాని కూపన్ చెల్లింపును (వడ్డీ) తను నిరంతరంగా ఆధారపడగలిగే వేతన చెల్లింపుగా ఉపయోగించుకుంటాడు. ఎప్పుడైతే ఆ బాండ్ మెచ్యూర్ అవుతుందో లేదా రీఫైనాన్స్ చెయ్యబడుతుందో, అప్పుడు ఆ వ్యక్తి తమ డబ్బును తిరిగి అందుకుంటాడు.

వెల సంబంధిత అంశాలు[మార్చు]

 • వడ్డీరేట్లు వివిధ అంశాల మీద ఆధారపడి కాలానుగుణంగా మారుతుంటాయి, ముఖ్యంగా మూలాధార వడ్డీరేట్లను యుఎస్ ఫెడరల్ రిజర్వ్, యుకె బ్యాంక్ అఫ్ ఇంగ్లండ్, మరియు యూరో జోన్ ఇసిబి లాంటి సెంట్రల్ బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఒకవేళ బాండ్ యొక్క కూపన్ అప్పటికి చెలామణిలో ఉన్న వడ్డీ రేటు కన్నా తక్కువగా ఉంటే, దీనివల్ల ధర తగ్గి, దానికి అనులోమంగా తక్కువ వడ్డీ రేట్ల వల్ల ఇవ్వబడిన కూపన్ యొక్క ఆకర్షణ పెరిగి, తద్వారా ధర పెరుగుతుంది.
 • ఎవరైనా ఏదైనా బాండు కొంటున్నప్పుడు, కొనుగోలుదార్ల దృష్టికోణంలో ఏ విధంగా దాని వడ్డీరేట్లు మరియు మార్పిడి రేట్లు దాని జీవితకాలాన్ని ప్రభావితం చేస్తాయనే దాన్నిబట్టి, తగ్గింపుకు లోనయ్యే నిర్దిష్టమైన నగదు వెల్లువను కొంటున్న ప్రభావంలో ఉంటారు.
 • ముఖ్యంగా మార్కెట్ లోని భాగస్వాములు తమ పెట్టుబడులతో సతమతమయ్యే పక్షంలో, సరఫరా మరియు డిమాండ్ ధరను ప్రభావితం చేస్తుంది. భీమా సంస్థలు సాధారణంగా తక్కువ రిస్కుతో ఉండి, ఊహించగలిగే నగదు వెల్లువతో, దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్ల[2]లాగా, వాళ్ళు పరిరక్షించుకోవాలనుకునే దీర్ఘకాలిక భీమాలను కలిగి ఉంటాయి.

ద్రవ్యోల్బణ - సంబంధిత బాండ్లు[మార్చు]

 • ఒక నిర్దిష్టమైన ధర సూచికతో సంబంధం ఉన్న స్థిర-ఆదాయ సెక్యూరిటీలే, ద్రవ్యోల్బణ-సూచిక బాండ్లు. ఉదాహరణకు యుఎస్ ట్రెజరీ ఇన్‍ఫ్లేషన్ ప్రొటెక్టెడ్ సెక్యూరిటీస్ (టిఐపిఎస్) మరియు యుకె ఇండెక్స్ లింక్‍డ్ గిల్ట్స్. ఈ విధమైన స్థిరాదాయం ఒక వినియోగదారుని ధర సూచికకు సర్దుబాటు అవుతుంది (యుఎస్ లో ఇది పట్టణ వినియోగదారుల కోసం సిపిఐ-యు), తర్వాత ఒక నిజమైన ఫలం సర్దుబాటుకు లోనైన అసలుకు అనువర్తిస్తుంది. అంటే దీని అర్థం ఈ బాండ్లు ద్రవ్యోల్బణాన్ని పారద్రోలేందుకు హామీ ఇస్తాయి - (ప్రభుత్వం బాండును రద్దు చేసుకోనంత వరకూ). ఇది అన్ని రకాల మదుపుదార్ల యొక్క డబ్బుకున్న కొనుగోలు శక్తిని ఎప్పుడూ అస్థిరంగా ఉండే ద్రవ్యోల్బణం వల్ల హరించిపోకుండా చూస్తుంది. ఉదాహరణకు, ఒక సంవత్సర కాలానికి ద్రవ్యోల్బణం 3.88% ఉందనుకుంటే (దాదాపు 56 సంవత్సరాల సగటు ద్రవ్యోల్బణ రేటు, చాలా వరకు 2006 అంతా), మరియు నిజమైన ఫలం ఒక 2.61% ఉంటే (అక్టోబర్ 19, 2006 నాటి స్థిరమైన యుఎస్ నిజ ఫలం, 5 సం.ల టిఐపిఎస్ కోసం), సర్దుబాటుకు గురయ్యే స్థిరాదాయం యొక్క అసలు 100 నుంచి 103.88 కు పెరిగి మరియు సర్దుబాటుకు గురయ్యే అసలుకు నిజ ఫలాన్ని చేర్చితే, దాని అర్థం 103.88 x 1.0261, అనేది 106.5913 కి సమానం; అంటే 6.5913% పూర్తి రాబడిని ఇస్తుంది. అక్టోబర్ 19, 2006 నాటి ఒక సం. బిల్లు కోసం 5.05% మాత్రమే ఫలాన్ని అందించిన సాంప్రదాయ యుఎస్ ట్రెజరీలను TIPS మధ్యస్థంగా నియంత్రిస్తుంది.

ఉత్పన్నాలు[మార్చు]

 • స్థిరాదయ ఉత్పాదకాలు, వడ్డీ రేటు ఉత్పాదకాలను మరియు రుణ ఉత్పాదకాలనూ కలిగి ఉంటాయి. తరచుగా ద్రవ్యోల్బణ ఉత్పాదకాలు కూడా ఈ నిర్వచనంలో చోటు సంపాదిస్తుంటాయి. ఇక్కడ విస్తృత శ్రేణిలో స్థిరాదాయ ఉత్పాదక ఉత్పత్తులున్నాయి: ఆప్షన్స్, స్వాప్స్, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ అలాగే ఫార్వార్డ్ కాంట్రాక్ట్స్. ఎక్కువ విస్తృతంగా అమ్ముడుపోయిన రకాలు
 • రుణ ఎగవేత మార్పిడిలు
 • వడ్డీ రేటు మార్పిడిలు
 • ద్రవ్యోల్బణ మార్పిడిలు
 • 2/10/30-సంవత్సర గవర్నమెంట్ బాండ్స్ మీది బాండ్ ఫ్యూచర్స్
 • 90-రోజుల ఇంటర్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ మీది ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్స్
 • ఫార్వార్డ్ రేట్ అగ్రిమెంట్స్

అపాయాలు[మార్చు]

 • ఏదేని ఎంటిటీకి సంబంధించిన అన్ని స్థిరాదాయ సెక్యూరిటీలు మినహాయింపులేని ఈ రిస్కులను కలిగి ఉన్నవి:
 • ద్రవ్యోల్బణ అపాయం
 • వడ్డీ రేటు అపాయం
 • కరెన్సీ అపాయం
 • డీఫాల్ట్ అపాయం
 • అసలు తిరిగి చెల్లించే అపాయం
 • రీ ఇన్వెస్టిమెంట్ అపాయం
 • లిక్విడిటీ అపాయం
 • మెచ్యూరిటీ అపాయం
 • స్ట్రీమింగ్ ఇన్‍కమ్ పేమెంట్ అపాయం
 • కాలపరిమితి అపాయం
 • కన్వెక్సిటీ అపాయం
 • క్రెడిట్ క్వాలిటీ అపాయం
 • రాజకీయ అపాయం
 • సుంకం సర్దుబాటు అపాయం
 • మార్కెట్ అపాయం
 • వాతావరణ అపాయం
 • ఈవెంట్ అపాయం

వీటిని కూడా చూడండి[మార్చు]

 • స్థిరాదాయ విశ్లేషణ

సూచనలు[మార్చు]

 1. http://apps.finra.org/investor_information/smart/bonds/bondglossary.asp
 2. http://www.ft.com/cms/s/0/b6d3f390-20e5-11df-b920-00144feab49a.html

బాహ్య లింకులు[మార్చు]

 • ది యుకె డెబిట్ మేనేజ్‍మెంట్ ఆఫీస్ http://www.dmo.gov.uk

మూస:Bond market మూస:Debt