స్నార్కెలింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫిజి దగ్గరలోని కోరల్ రీఫ్ మధ్యనున్న కోరల్.

స్నార్కెలింగ్ (బ్రిటీష్ స్పెల్లింగ్ :స్నార్కెల్లింగ్ ) అనేది సాధారణంగా స్విమ్ ఫిన్స్ మరియు స్నార్కెల్ అనే ట్యూబ్ ఆకారంగల డైవింగ్ మాస్క్‌తో కూడిన ఒక ఈత అభ్యాసం. చల్లని నీళ్ళలో అయితే వెట్ సూట్‌ని కూడా ధరిస్తారు. స్నార్కెలర్ అనే పరికర వాడకం ద్వారా మనం చిన్న ప్రయత్నంతో సముద్రపు లోతుల్లో ఎక్కువ సేపు ఉండవచ్చు.

స్నార్కెలింగ్ అనేది ఉష్ణమండల రిసార్ట్ మరియు స్కూబా డైవింగ్ ప్రదేశాలలో చేసే ఒక ఉల్లాసభరితమైన కార్యం. ఈ స్నార్కెలింగ్ ప్రక్రియలో కష్టభరితమైన ఉపకరణాలు కాని, స్కూబా డైవింగ్ కొరకు ప్రత్యేకమైన శిక్షణ కాని మరియు స్కూబా డైవింగ్ కొరకు ఉద్దేశింపబడిన ప్రత్యేకమైన సూట్ అవసరం లేకుండా సముద్రపు లోతుల్లో దాగి ఉన్న ప్రాకృతిక జీవితం గురించి తెలుసుకోవడం దీని ప్రాథమిక ఉద్దేశం.

ఉపరితల పైభాగాన కాని, సముద్ర ప్రమాదాల నుండి కాపాడే సముద్ర రక్షణ దళాలకు మరియు స్కూబా డైవర్స్ స్నార్కెలింగ్ ఉపయోగకరమైన పరికరం. సముద్రపు హాకీ, సముద్రపు ఐస్ హాకీ, సముద్రపు రగ్బీ మరియు స్పియర్ ఫిషింగ్ లాంటి ప్రసిద్ధమైన క్రీడలలో దీనిని ఉపయోగిస్తారు.

స్నార్కెల్[మార్చు]

స్నార్కెల్ తోపాటు పైన స్ప్లాష్ గార్డ్ కలిగి సంప్ వాల్వ్ లేని స్విమ్మర్స్.

ఈ స్విమ్మర్స్ స్నార్కెల్ 30 సెం.మీ ల పొడవు మరియు లోపల 1.5 నుండి 2.5 సెం.మీ వ్యాసంతో,సాధారణంగా L లేదా J ఆకారంతో అడుగుభాగాన మౌత్ పీస్ కలిగి ఉండి రబ్బర్ లేదా ప్లాస్టిక్ తో తయారుచేయబడిన ఒక ట్యూబ్. ఈ ట్యూబ్ ధరించిన వారు మునిగిన తరువాత నీటి ఉపరితలం నుండి శ్వాస తీసుకోడానికి ఉపయోగపడుతుంది. స్నార్కెల్ సాధారణంగారబ్బర్ తో తయారుచేయబడి డైవింగ్ మాస్క్ కు బయటి భాగాన అతికించబడి ఉంటుంది. పాత పద్ధతి ప్రకారం స్నార్కెల్ మాస్క్ నాడా మరియు తల మధ్య భాగంలో ఇమిడి ఉండేది, కాని ఈ పద్ధతిలో మాస్క్ లీకయ్యే అవకాశాలు ఎక్కువ.

సాధారణ స్నార్కెల్ ట్యూబ్నీటిలో ఉన్నప్పుడు సులభంగా కదలడానికి ఉపయోగపడుతుంది. స్నార్కెల్ ధరించిన వ్యక్తి దీర్ఘ నిచ్వాస క్రియ ద్వారా ఉపరితలం పైకి రావడం (బ్లాస్ట్ క్లియరింగ్ ) లేదా తలని ఊపుతూ ఉపరితలాని చేరే లేదా "తాకే" సమయంలో దీర్ఘ నిచ్వాస జరిపుతూ(డిస్ ప్లేస్ మెంట్ పద్ధతి ) తర్వాత శ్వాస తీసుకొనే ముందు ముందుకు జరిగే పద్ధతి. ఈ చలన పద్ధతిలో స్నార్కెల్ ఉన్న నీటిని గాలి ద్వారా బయటికి పంపించబడుతుంది. ఇది స్నార్కెల్ ఎప్పటికప్పుడు శుభ్రపరచి ఒక ప్రత్యేకమైన శిక్షణతో కూడిన అధునాతమైన పద్ధతి.

స్నార్కెల్లర్ నీటిలో ఉన్నప్పుడు స్నార్కెల్ తోనున్న సంప్ వాల్వ్ తో నీటి అడుగుభాగాన్ని స్పష్టంగా చూడవచ్చు.

కొన్ని అధునాతనమైన స్నార్కెల్స్ మౌత్ పీస్లో సంప్ కలిగిఉండి, తక్కువ పరిమాణంలో నీటిని పంపి స్నార్కెల్లర్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగించదు. కొన్ని సంప్ లు ఒకే మార్గం కల వాల్వ్ కలిగిఉండి తనంతటతానుగా సంప్‌లోని నీటిని ఖాళీ చేస్తాయి. మరికొన్ని స్నార్కెల్స్ నీటి ప్రవాహ వాల్వ్స్ ట్యూబ్ పైభాగాన అతికించబడి స్నాకెల్లర్ మునిగినప్పుడు నీటిని బయటకి పంపుతాయి మరియు ఆధునిక స్నార్కెల్స్ ట్యూబ్ పైభాగాన స్ప్లాష్ డిఫ్లెక్టర్ ని కలిగిఉండి నీటిని బయటకి నెట్టడం ద్వారా స్నార్కెల్లర్స్ నోటిలోకి నీరు పోకుండా కాపాడుతుంది.

కొన్ని స్నార్కేల్స్ "పింగ్ పాంగ్" బాల్స్ తో తయారుచేయబడి కేజ్ లా ఉండి నీరు లోనికి వెళ్ళకుండా నిరోధిస్తాయి,కాని ఇవి స్నార్కెల్లర్స్ కి ప్రమాదకరంగా పరిగణింపబడినప్పటి నుండి ఎక్కువకాలం పాటు వాడబడలేదు. అదేవిధంగా వీటి డైవింగ్ మాస్క్ కూడా అంత సురక్షితమైనవి కాకుండా మరియు వాడుకలో లేనివిగా పరిగణింపబడ్డాయి.

స్నార్కెల్ ట్యూబ్ యొక్క అప్టిమం డిజైన్ పొడవు 40 సెం.మీ(దాదాపుగా 16 అంగుళాలు). ఈ పొడవైన ట్యూబ్ ఎక్కడైతే నీటి ఒత్తిడి ఉంటుందో అక్కడ ఊపిరితిత్తులు సరిగా శ్వాసక్రియ జరపక పోవడం వలన స్నార్కెల్లర్ శ్వాస తీసుకోడానికి వీలుపడదు. ఈ ఎక్కువ[1] ఒత్తిడి వలన కండరాలు ఊపిరితిత్తులను వ్యాకోజింపచేయలేని కారణంగా స్నార్కెల్లర్ శ్వాస తీసుకోవడం వీలుపడదు. ఎప్పుడయితే స్నార్కెల్ మరొక శ్వాస తీసుకోవడం జరుగుతుందో, అంతకుముందే స్నార్కెల్ లో ఉన్న వదిలిన గాలి తిరిగి ఊపిరితిత్తులలోకి పంపబడి,శ్వాస తీసుకొనే సామర్ధ్యాన్ని తగ్గించివేసి, రక్తంలో కార్బన్ డై ఆక్సైడ్ ని నింపి హైపర్ కాప్నియాకు దారితీస్తుంది, ఈ స్థితినే "డెడ్ ఎయిర్ స్పేస్" అంటారు ఈ పరికరం లోని ఎక్కువ వైశాల్యమే ఈ సమస్యకు కారణం.

అధునాతనమైన స్నార్కెలింగ్ పరిజ్ఞానం కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడింది. మార్క్ ఆర్.జాన్సన్ ఎండి ద్వారా కనిపెట్టబడి పిలవబడిన "కడేన్స్ టెక్నాలజీ" అనే స్నార్కెల్ లో ఒకే మార్గంలో గాలి ప్రవాహం, ఉచ్చ్వాస నిచ్వాస మార్గాలు వేరుచేయబడి ఉంటాయి. స్నార్కెల్ లోని నిచ్వాసమార్గం లోని వాల్వ్ ఒత్తిడిని తగ్గించి,క్రమబద్దంగా ఊపిరితిత్తుల ద్వారా శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది. నీటిలో మునిగిన తర్వాత ఉచ్వాస మార్గం మూసుకుపోతుంది.స్నార్కెల్లర్ ఉపరితలం పైకి వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా [2]స్నార్కెల్ ద్వారా శ్వాస తీసుకోడానికి వీలుపడుతుంది.

స్నార్కెల్లింగ్ ప్రాక్టీస్[మార్చు]

సాధారణంగా మాస్క్ మరియు స్నార్కెల్ ను ధరించి ఎటువంటి నీటిలోనైనా ఈత కొట్టడాన్ని "స్నార్కెల్లింగ్" అనవచ్చు. సముద్రంలో నున్నరాతివరస,మునిగి నాశనమై ఉన్న వస్తువులు, సముద్రగర్భంలో దాగి ఉన్న వస్తువులు మాత్రమేకాక వివిధ రకాలైన చేపలు, ఆల్గే లేదా రాతిచట్టులను గమనించడానికి "స్నార్కెల్లర్" ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. స్నార్కెల్లింగ్ క్రీడ కంటే ఒక వినోదభరిత కార్యంగానే పరిగణింపబడింది.

స్నార్కెల్ మరియు మాస్క్ తోనున్న స్నార్కెల్లర్.

స్నార్కెలింగ్ కు ఈత కొత్తగలిగే సామర్ద్యం మరియు స్నార్కెల్ ద్వారా శ్వాస తీసుకోగలిగితే సరిపోతుంది.దీనికి ప్రత్యేకమైన శిక్షణ అవసరం లేదు. అయినప్పటికీ జాగ్రత్త కొరకు ఒక "అనుభవజ్ఞుడైన"స్నార్కెలర్, టూర్ గైడ్, డైవ్ షాప్ మరియు పరికరాలు అద్దెకిచ్చే దుకాణం సూచించబడింది. ఇదేకాకుండా వస్తువుల వాడుక,ప్రాథమిక జాగ్రర్త మరియు సముద్రంలోనో జీవులకు ఎటువంటి ప్రాణ హాని కలగకుండా(పగడం లాంటి పెళుసు వస్తువులకు స్నార్కెలర్స్ మరియు ఈతగాళ్ళ ద్వారా నష్టం జరగకుండా)జాగ్రర్తలు తీసుకోవాలి. స్కూబా డైవింగ్ చేసేటప్పుడు ఒంటరిగా కాకుండా "గైడ్"కానీ,"స్నేహితుడు"కానీ,లేదా టూర్ గ్రూప్ ఉంటే మంచిది.

కొన్ని స్నార్కెలింగ్ వాణిజ్య ప్రదేశాలలో స్నార్కెలర్స్ కు తేలియాడే పరికరం లాంటి గాలితో నింపబడి ఉండే లోచోక్కా అవసరం. ఇవి మామూలుగా ముదురు పసుపు లేదా నారింజరంగుతో ఒక ప్రత్యేకమైన పరికరం కలిగిఉండి దీని వాడుకదారులు మునిగిపోకుండా తమంతటతాము దీనిని అదుపులో ఉంచుకోవచ్చు. అయినప్పటికీ ఈ పరికరాలు స్నార్కెలర్ ను ఎక్కువలోతులోకి వెళ్ళకుండా ఆపుతాయి. ముఖ్యంగా చల్లని నీటిలో మందంగా ఉన్న వెట్ సూట్ ని సాధారణంగా ధరిస్తారు.వెట్ సూట్ ధరించడం వలన అది మునిగిపోకుండా కాపాడుతుంది. ఉష్ణ ప్రదేశాలలో, స్నార్కెలర్స్ (ప్రత్యేకించి వివర్ణమైన చర్మం కల)రాష్ గార్డ్ లేదా చొక్కా లేదా బోర్డ్ షార్ట్స్ లను ధరించి వీపుభాగం మరియు కాళ్ళ వెనుక భాగానులను సూర్యరశ్మి నుండి కాపాడుకుంటారు.

కొందరు స్నార్కెలర్స్ అసంపూర్ణమైన జ్ఞానంతోఫ్రీ డైవింగ్ చేస్తూ ఉంటారు కాని అనుభవజ్ఞుడైన డైవర్ లేక డైవ్ శిక్షకుని వద్ద తర్ఫీదు తీసుకుంటే మంచిది.

జాగ్రత్తలు[మార్చు]

స్నార్కెలర్స్ కు జెట్ స్కైస్, స్పీడ్ బోట్స్ మరియు చిన్న ఒడ్డు కలిగిన సముద్రప్రాంతాలు ప్రమాదకరం. స్నార్కెలర్ సముద్రం లో మునిగి ఉన్నప్పుడు ట్యూబ్ మాత్రమే పైకి కనబడుతుంది. ఇటువంటప్పుడు నీటిలో ప్రయాణం చేసే జెట్ స్కైస్ లేదా స్పీడ్ బోట్స్ స్నార్కెలర్స్ ను డీ కొట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెరచాపలు,గాలి పడవలు నుండి ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుంది,ఎందుకనగా ఇవి ధ్వనిని కలిగించవు కావున స్నార్కెలర్ దీనిని గమనించడం లేకపోతాడు.అదే మోటార్ పడవలు ఎక్కువ ధ్వనిని కలిగిఉండి మరియు నాలుగు రెట్లు వేగవంతంగా ఉంటాయి. ఇలాంటి వాటి ద్వారా స్నార్కెలర్ నీటి మధ్యలోనే ప్రమాదంలో పడతాడు. బోటింగ్ కొరకు సముద్రం లో కొన్ని నిర్దిష్ట ప్రదేశాలు నిర్ణయింపబడి ఉంటాయి.ఆ సరిహద్దుల అవతల స్నార్కెలర్స్ ఎటువంటి ప్రమాదం ఉండదు. కాబట్టి స్నార్కెలర్స్ ముదురు లేక ఎక్కువ పరావర్తనం చెందించే రంగులు గల బట్టలు మరియు డైవ్ ఫ్లాగ్స్ కలిగిఉంటే ఇతరులు మరియు పడవ నడుపువారు సులభంగా గుర్తిస్తారు.

స్నార్కెలర్స్ వీపుభాగాన సూర్యరశ్మి తాకిడి వలన ఎక్కువ నష్టం(కొద్దిగా మునిగి ఉన్నప్పటికీ) కూడా వాటిల్లుతుంది. "రాష్ గార్డ్ "(వేడి నీటిలో),టి-షర్ట్,వెట్ సూట్ లేదా సన్ బ్లాక్ వంటి దుస్తులు ధరించడం వలన సూర్యరశ్మి ప్రభావాన్ని తగ్గించవచ్చు.

డీ హైడ్రేషన్ మరొక గుర్తించాల్సిన విషయం. స్నార్కెల్ ధరించి సముద్రంలో ఎక్కువ సమయం గడపవలసి వచ్చినప్పుడు డీ హైడ్రేషన్ కాకుండా సరైన జాగ్రర్తలు తీసుకోవాలి. హైడ్రేషన్ పట్ల సరైన జాగ్రర్తలు తీసుకోవడం వలన కండరాలకు నష్టాన్ని జరగకుండా నివారించవచ్చు.

స్నార్కెలర్స్ పైన "హైపర్ వెంటిలేషన్" ప్రభావం చూపినప్పుడు "షాలో వాటర్ బ్లాక్ అవుట్" అనే పరిస్థితికి దారి తీస్తుంది.తోటి స్నార్కెల్ (తన సహచరుని పరిస్థితి పై అవగాహన కలిగి ఉన్నట్లయితే)సహాయంతో ఈ పరిస్థితిని ఎదుర్కొనవచ్చు.

స్నార్కెల్లింగ్ చేసేటప్పుడు కోరల్ రీఫ్(సముద్రజీవుల అవశేషాలు)వద్ద సురక్షితమైన గ్లోవ్స్ ధరించడం వల్ల మరియు తన పరిసరాలపట్ల జాగురుకతతో ఉండాలి. బూటీస్ మరియు సర్ఫ్ షూస్ లోతైన నీళ్ళలో రాతిచట్టుపై జారిపోకుండా ఎక్కడానికి సహకరిస్తాయి.

స్నార్కెలింగ్ చేసే ప్రదేశాలు[మార్చు]

మెక్సిగో, కజ్యుమెల్ లో చేపలను పరిశీలిస్తున్న స్నార్కెల్లర్స్.

స్నార్కెలింగ్ ఎటువంటి నీటిలోనైనా చేయవచ్చు. సాధారణంగా కొద్దిపాటి అలల ప్రవాహం,వెచ్చని నీరుమరియు ప్రత్యేకించి ఉపరితల భాగానికి దగ్గరగా ఉండే ప్రదేశాలు దీనికి అనుకూలం.

సాధారణంగా స్నార్కెలర్స్ కు సముద్రమట్టానికి 1నుండి 4మీటర్లు (3నుండి 12అడుగులు )ఎత్తులో ఉండే లోతులేని రాతిచట్టాలు అనుకూలం. సాధారణంగా లోతైన రాతిచట్టాలు కూడా అనుకూలమైనవి, కాని ఇది స్నార్కెలర్స్ యొక్క నైపుణ్యము,శారీరక దృడత్వము,శ్వాస పైన పట్టు మరియు అభ్యాసముపై ఆధారపడి ఉంటుంది.

వివిధ మరియు సంబంధిత కార్యకలాపాలు[మార్చు]

వీటిని కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

మూస:Nofootnotes

  1. ఆర్.స్టిగ్లర్,డై తాషేరి లోని ఫోర్ట్స్ క్రిట్టే డెర్ నాచుర్ విసేన్స్చఫ్టిలికేన్ ఫోర్స్చుంగ్,IX.బ్యాండ్ , బెర్లిన్,వియాన్ 1913.
  2. untitled (swf). Kapitol Reef Aquatics. 2009. Retrieved 16 December 2009.
  • ది బ్రిటీష్ సబ్-యాక్వా క్లబ్, మరియు హాల్ బ్రుక్,మైక్. స్నార్కెల్లింగ్ ఫర్ ఆల్ . లండన్:ఎబ్యురి,2001. ISBN 0-7407-5029-1

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూస:UnderwaterDiving