స్నిగ్ధ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్నిగ్ధ
జననం
రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
తల్లిదండ్రులుజగదీష్ (తండ్రి)
రాజేశ్వరి (తల్లి)[1]

స్నిగ్ధ ఒక తెలుగు సినీ నటి. ఎక్కువగా సహాయ పాత్రలు పోషించింది. 2011 లో నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చింది.

ప్రారంభ జీవితం[మార్చు]

స్నిగ్ధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి నగరంలో జగదీష్ రాజేశ్వరి దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి జగదీష్ సినిమా దర్శకుడు, తల్లి గృహిణి.[1] ఆమె ఏలూరు లోని సి.ఆర్ రెడ్డి కళాశాలలో ఎం.బి.ఎ చదువుతున్నప్పుడు బంగారు పతకం సాధించింది.[2] ఆమె సినిమాలలోనికి రాకముందు ఆమె హైదరాబాదులోని లాజికల్ బైట్స్ లో హెచ్.ఆర్ మేనేజరుగా పనిచేసింది.[3]

కెరీర్[మార్చు]

ఆమె సినిమా రంగ ప్రవేశం బి.వి.నాగిరెడ్డి దర్శకత్వంలో మొదలైన అలా మొదలైంది. ఆమె ఈచిత్రంలో పింకీ పాత్రలో ముఖ్యతారాగణమైన నాని, నిత్యా మీనన్ లకు స్నేహితురాలిగా నటించింది. ఆమె మేం వయసుకు వచ్చాం, రొటీన్ లవ్ స్టోరీ, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, దమ్ము చిత్రాలలో కూడా నటించింది.[4] ఆమె నటనతో పాటు లఘు చిత్రాలలో సంగీత స్వరకల్పన చేస్తున్నారు.[5] ఆమె సంగీతకారిణి కూడా. [6] [7]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2011 అలా మొదలైంది పింకీ తెలుగు
2012 మేం వయసుకు వచ్చాం ఎస్సెమ్మెస్ శ్యామల తెలుగు
2012 రొటీన్ లవ్ స్టోరీ సంజు
2012 దమ్ము తెలుగు
2013 ఒక్కడినే సుజాత తెలుగు
2015 టైగర్ గంగ స్నేహితురాలు తెలుగు
2015 జత కలిసే తెలుగు
2016 గుంటూర్ టాకీస్ తెలుగు
2016 కల్యాణ వైభోగమే
2017 కిట్టు ఉన్నాడు జాగ్రత్త తెలుగు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Focus Light: Snigdha - Telugu cinema news". idlebrain.com.
  2. "Focus Light: Snigdha - Telugu cinema news". idlebrain.com. Retrieved 2017-09-16.
  3. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; :0 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. "Kittu Unnadu Jagratha Review {2.5/5}: For the fans of Raj Tarun, the film might offer a few moments of weekend fun". The Times of India. Retrieved 2017-09-16.
  5. "Another Decent Number From Snigdha". Telugu Filmnagar. 2016-10-25. Retrieved 2017-08-28.
  6. K, Manaswini. "Young Lady Singer & Comedian Snigdha Opens up About facial Hair". www.mirchi9.com (in ఇంగ్లీష్). Retrieved 2017-09-16.
  7. "Review: Rushi is a meaningful film". Rediff. Retrieved 2017-09-16.

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=స్నిగ్ధ&oldid=2989279" నుండి వెలికితీశారు