స్నెల్లెన్ చార్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చూపు తీక్షణతను అంచనా వేయడానికి ఉపయోగించే సాధారణ స్నెల్లెన్ చార్ట్

స్నెల్లెన్ చార్ట్ అనేది దృష్టి తీవ్రతను కొలవటానికి ఉపయోగించే ఒక కన్ను చార్ట్. డచ్ నేత్ర వైద్యులు హెర్మన్ స్నెల్లెన్ 1862 లో ఈ చార్టు అభివృద్ధి పరచటం వలన వీటికి తరువాత స్నెల్లెన్ చార్టులు అని నామకరణం చేయటం జరిగింది.[1] అనేక మంది నేత్ర వైద్యులు, దృష్టి శాస్త్రవేత్తలు ఇప్పుడు లాగ్‌మార్ చార్ట్ అని పిలవబడే మెరుగుపరచబడిన చార్టును ఉపయోగిస్తున్నారు.

చరిత్ర

[మార్చు]

5 × 5 యూనిట్ గ్రిడ్ ఆధారంగా చిహ్నాలను ఉపయోగించి స్నెలెన్ ఈ చార్టులను అభివృద్ధి చేశాడు. 1861 లో అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక పటాల్లో నైరూప్య చిహ్నాలను ఉపయోగించాడు. [2] 1862 లో ప్రచురించబడిన స్నెల్లెన్ పటాల్లో 5 × 5 గ్రిడ్‌లో ఆల్ఫాన్యూమరిక్ క్యాపిటల్ అక్షరాలను ఉపయోగించాడు. అసలు చార్టులో A, C, E, G, L, N, P, R, T, 5, V, Z, B, D, 4, F, H, K, O, S, 3, U, Y, A, C, E, G, L, 2. అనేవి ఉంటాయి [3]

వివరణ

[మార్చు]
హెర్మన్ స్నెల్లెన్.

సాధారణ స్నెల్లెన్ చార్ట్ పదకొండు పంక్తుల పెద్దబడి (క్యాపిటల్ అక్షరాలు) లోని అక్షరాలతో ముద్రించబడుతుంది. మొదటి పంక్తిలో చాలా పెద్ద అక్షరం ఉంటుంది, ఇది అనేక అక్షరాలలో ఒకటి కావచ్చు, ఉదాహరణకు E, H, లేదా N. తరువాతి వరుసలలోని అక్షరాల పరిమాణం తగ్గుతూ అక్షరాల సంఖ్య పెరుగుతూంటుంది. పరీక్ష చేస్తున్న వ్యక్తి 6 మీటర్లు లేదా 20 అడుగుల దూరం నుండి ఒక కన్నును మూసి ఉంచి, అన్నిటికంటే పైన్న వరుసతో మొదలుపెట్టి ప్రతి అడ్డు వరుస లోని అక్షరాలను బిగ్గరగా చదువుతాడు. కచ్చితంగా చదవగలిగే అతిచిన్న వరుస ఆ కంటిలోని దృశ్య తీక్షణతను సూచిస్తుంది. అక్యూటీ చార్టులోని చిహ్నాలను అధికారికంగా "ఆప్టోటైప్స్" అని పిలుస్తారు. సాంప్రదాయ స్నెల్లెన్ చార్ట్ విషయంలో, ఆప్టోటైప్‌లు బ్లాక్ అక్షరాల రూపాన్ని కలిగి ఉంటాయి. వాటిని అక్షరాలుగా చూడటానికీ, చదవడానికీ ఉద్దేశించబడ్డాయి. అయితే, అవి ఏ సాధారణ టైపోగ్రాఫర్ ఫాంట్ నుండి వచ్చిన అక్షరాలు కాదు. వాటికి ప్రత్యేకమైన, సరళమైన జ్యామితి ఉంది.

మూలాలు

[మార్చు]
  1. H. Snellen, Probebuchstaben zur Bestimmung der Sehschärfe, Utrecht 1862.
  2. "New Page 1". Archived from the original on 2017-02-26. Retrieved May 10, 2017.
  3. "Wayback Machine" (PDF). Retrieved 10 May 2017.