Jump to content

స్నేహల్ షిండే

వికీపీడియా నుండి
స్నేహల్ షిండే
Personal information
Nationalityభారతీయురాలు
Born (1992-04-29) 1992 ఏప్రిల్ 29 (వయసు: 34)
Sport
Sportకబడ్డీ
Coached byరాజేష్ ధమ్‌ధేరే,
జయంత్ వార్ఘడే
Medal record
మహిళలకబడ్డీ
Representing భారతదేశం
దక్షిణాసియా క్రీడలు
Gold medal – first place2016 గౌహతిమహిళల జట్టు
ఆసియా క్రీడలు
Gold medal – first place2022 హాంగ్‌జౌమహిళల జట్టు

స్నేహల్ షిండే (జననం 29 ఏప్రిల్ 1992) ఒక భారతీయ కబడ్డీ క్రీడాకారిణి.[1][2] 2022 ఆసియా క్రీడలలో బంగారు పతకం సాధించిన జట్టులో ఈమె భాగస్తురాలు.[3] ఫైనల్లో, భారతదేశం 7 అక్టోబర్ 2023న చైనీస్ తైపీని 26-24 స్కోరుతో ఓడించింది.[4][5]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఈమె మహారాష్ట్రకు చెందిన వ్యక్తి.[4] ఈమె తండ్రి ప్రదీప్ షిండే బాక్సింగ్‌లో జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్నాడు. తల్లి సురేఖ.[6] ఈమె సాగర్ శేఖర్‌ను వివాహం చేసుకుంది. ఈమె సోదరుడు నిఖిల్, సోదరి కిశోరి ఇద్దరూ కబడ్డీ క్రీడాకారులు. వారి ప్రేరణతో ఈమె కబడ్డీ క్రీడలో ప్రవేశించింది.[7] ఈమె తన ఏడవ యేటి నుండే కబడ్డీ ఆడటం ప్రారంభించి రాజేష్ ధమ్‌ధేరే, జయంత్ వార్ఘడేల శిక్షణలో మెలకువలు నేర్చుకుంది.[6] ఈమె యువ క్రీడాకారుల కోసం కబడ్డీ అకాడమీని ప్రారంభించే యోచనలో ఉంది.

వృత్తి

[మార్చు]

2009లో మలేషియాలో జరిగిన జూనియర్ ఆసియా ఛాంపియన్షిప్‌ను గెలుచుకున్న భారత జట్టులో భాగమైనప్పుడు షిండే తన మొదటి అంతర్జాతీయ పతకాన్ని సాధించింది. తరువాత, 2016లో అస్సాంలో జరిగిన దక్షిణాసియా క్రీడలలో సీనియర్ భారత జట్టులో భాగంగా ఈమె బంగారు పతకాన్ని గెలుచుకుంది. గాయాల కారణంగా ఈమె 2014 ఆసియా క్రీడలకు, 2018 ఆసియా క్రీడలకు దూరమైంది. కానీ 2022 ఆసియా క్రీడలలో పాల్గొని భారత జట్టు బంగారు పతకాన్ని సాధించడంలో తన తోడ్పాటును అందించింది.[6] 2022లో గుజరాత్ లో జరిగిన 36వ జాతీయ క్రీడలలో ఈమె మహారాష్ట్ర జట్టుకు నాయకత్వం వహించింది.[8]

అవార్డులు

[మార్చు]

షిండే 2014 సంవత్సరానికి మహారాష్ట్రలో అత్యున్నత క్రీడా పురస్కారం అయిన శివ ఛత్రపతి అవార్డును అందుకున్నది.[6]

మూలాలు

[మార్చు]
  1. "Kabaddi SHINDE Snehal Pradeep - The 19th Asian Games". info.hangzhou2022.cn. Archived from the original on 2023-10-08. Retrieved 2023-10-08.
  2. Parkar, Ubaid (2023-08-25). "Pawan Sehrawat, Naveen Kumar headline Indian men's kabaddi team - full squad". www.olympics.com. Retrieved 2023-10-08.
  3. "We will win gold medal: Kabaddi legends on Indian teams' Asian Games prospects". The Times of India. 2023-10-04. ISSN 0971-8257. Retrieved 2023-10-08.
  4. 1 2 "With third Asian Games kabaddi gold, women's team are stars abroad but forgotten at home". ESPN (in ఇంగ్లీష్). 2023-10-07. Retrieved 2023-10-08.
  5. Sportstar, Team (2023-10-07). "Asian Games 2023: India achieves 100 medals after women's kabaddi team beats Chinese Taipei to clinch gold". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2023-10-08.
  6. 1 2 3 4 "Chicken biriyani to taste better for this kabaddi player after clinching gold at Asian Games 2022". The Indian Express (in ఇంగ్లీష్). 2023-10-13. Retrieved 2023-10-17.
  7. Dolare, Rahul (2023-10-12). "Pune: City welcome Asian Games Kabaddi Gold medalist Snehal with grand rally Listening to the national anthem is a surreal feeling, says Snehal". Punekar News (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-10-17.
  8. "Snehal Shinde To Lead Maharashtra Women Team At 36th National Games". Khel Kabaddi (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-10-17. Retrieved 2023-10-17.

బాహ్య లింకులు

[మార్చు]