స్పీడ్ (1994)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సినిమా పోస్టరు

స్పీడ్ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఈ చిత్రం 1994 లో విడుదలైంది . ఇది జాన్ డి బోంట్ దర్శకత్వం వహించిన మొదటి చలన చిత్రం. కీను రీవ్స్, డెన్నిస్ హాప్పర్, సాండ్రా బుల్లక్, జో మోర్టన్, అలాన్ రక్, జెఫ్ డేనియల్స్ ఈ చిత్రంలో నటించారు.[1] ఈ చిత్రం $30 మిలియన్ బడ్జెట్ తో తెరకెక్కిస్తే $350.4 మిలియన్ వసూళ్లు సాధించింది.[2] ఇది 1995లో రెండు అకాడమీ పురస్కారాలు గెలుచుకున్నది: ఉత్తమ సౌండ్ ఎడిటింగ్, ఉత్తమ సౌండ్ మిక్సింగ్.

ప్లాట్లు[మార్చు]

లాస్ ఏంజిల్స్ పోలీసు శాఖ (ఎల్.ఏ.పి.డి) స్వాట్ అధికారులు జాక్ ట్రావెన్, హ్యారీ టెంపుల్ $3 మిలియన్ అడుగుతున్న ఒక బాంబరు నుండి ఎలివేటరులో చిక్కుకున్నవారిని కాపాడుతారు. ఆ బాంబరు పేరు హోవార్డ్ పేన్ అని తరువాత తెలుస్తుంది. పేన్ ను వారు ముట్టడించగా అతను హ్యారీను అడ్డుపెట్టుకుని తప్పించికోబోతాడు. జాక్ హ్యారి కాలుపై కాల్చగానే పేన్ అతనిని వదిలేసి అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో తన స్వంత పేలుడులో చనిపోయినట్లు నటిస్తాడు. జాక్, హ్యారీలను లెఫ్టినెంట్ మెక్ మెక్మాన్ ప్రశంసించి వారికి ధైర్య పతకాలతో సత్కరిస్తారు.[3]

కొంత సమయం తరువాత, జాక్ ఒక సిటి బస్సు పేలుడును తిలకిస్తాడు. ఇప్పటికీ సజీవంగా ఉన్న పేన్, జాక్ కు ఒక పే ఫోన్ చేసి, ఆ బాంబును పోలినది మరొక బస్సులో ఉందని. ఒకసారి ఆ బస్సు 50 మైళ్ళ (80 కి.మి.) వేగాన్ని అందుకుని మరలా అంతకు తగ్గితే ఆ బాంబు పేలుతుందని హెచ్చరిస్తాడు. అతనుకు $3.7 మిలియన్ ఇవ్వకపోయినా లేక బస్సు నుండి ప్రయాణికులను దించినా బస్సును పేల్చడం కాయం అని బెదిరిస్తాడు. జాక్ ఫ్రీవేలో ట్రాఫిక్ మధ్య కదిలే ఆ బస్సులోకి దూకుతాడు, అది అప్పటికే 50 మైళ్ళ వేగాన్ని దాటుతుంది. అతను పరిస్థితిని డ్రైవర్ సామ్ కు వివరిస్తాడు. బస్సులో ప్రయాణిస్తున్న చిన్న క్రిమినల్ జాక్ తనను బంధించడానికే వచ్చాడని తన తుపాకీతో కాలుస్తాడు, పొరపాటున అది డ్రైవరుకు తగులుతుంది. మరొక ప్రయాణీకురాలయిన, అన్నీ పోర్టర్ బస్సును నడుపుతుంది. గత్యంత్రంలేక జాక్ ఆ బాంబు గురించి ప్రయాణికులకు చెప్తాడు. జాక్ కదులుతున్న బస్సు కిందకు వెళ్ళి ఆధారాల కోసం బాంబును పరీక్షించి విషయాన్ని చరవాణి ద్వారా హ్యారికు తెలియజేస్తాడు.[4]

పోలీసులు బస్సును ఇంకా తెరవని 105 ఫ్రీవే పైకి పంపుతారు. మాక్ ప్రయాణికులు దింపాలనుకోగా జాక్ అందుకు ఒప్పుకోడు. పేన్ అనుమతితో అధికారులు గాయపడ్డారు సామ్ ను వైద్యం కోసం ఒక ట్రక్కులోకి ఎక్కిస్తారు. అదే సమయంలో తప్పించుకోబోతున్న ప్రయాణీకురాలను ఒక చిన్న బాంబుతో పేన్ హతమారుస్తాడు.

జాక్ ఆ ఫ్రీవేలోని ఒక భాగం అసంపూర్తిగా ఉందని తెలుసుకుంటాడు, వారు బస్సును మరింత వేగవంతం చేయించి, ఆ ఖాళీ మీదగా దూకిస్తారు. జాక్ ఆదేశించడంతో పోర్టర్ సమీపంలోని లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్వేపైకి బస్సును తీసుకెళ్తుంది. ఇంతలో హ్యారీ, పేన్ ను మాజీ అట్లాంటా బాంబు స్క్వాడ్ ఆఫీసరుగా గుర్తించి, లాస్ ఏంజిల్స్ లోని తన స్థానిక చిరునామా తెలుసుకుని అక్కడకు వెళ్తారు. వీరు వెళ్ళిన మరుక్షణమే పేన్ ఆ ఇంటిని పేల్చేడం వలన, హ్యారితో పాటు కొంతమంది మరణిస్తారు.

జాక్ ఒక టోవ్డ్ స్లెడ్జి సహాయంతో రన్వేపై చక్కర్లు కొడుతున్న బస్సు కిందకు వెళ్ళి బంబును తొలగించడానికి ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో అనుకోకుండా టైర్లు, ఇంధన ట్యాంకులు పంక్చర్ అవడమే కాకుండ అతని టో లైన్ విడిపోతుంది. బస్సులో ఉన్న ప్రయాణికులు అతనిని పైకి లాగుతారు. హ్యారీ మరణించినట్లు, పేన్ బస్సులో ఉన్న ఒక కమెరా ద్వారా తమను చూస్తూనట్లు జాక్ తెలుసుకుంటాడు. పేన్ ను మోసం చేయడానికి మాక్ దగ్గరిలో ఉన్న మీడియాతో ఆ బస్సునుండి వెళ్తున్న బ్రాడ్కాష్ట్ ను లూప్ లో ఉంచుతారు. ప్రయాణికులు ఒక విమానాశ్రయం బస్సులోకి ఎక్కిస్తారు. బస్సు టైర్ ఫ్లాట్ అవుతుంది, బలవంతంగా జాక్, అన్నీ ఒక ఫ్లోర్ యాక్సెస్ ప్యానెల్ ద్వారా తప్పించుకుంటారు. ఇంధనం అయిపోయిన బస్సు వేగం 50 మైళ్ళకు తగ్గగానే ఖాళీగా ఉన్న బోయింగ్ 707 కార్గో విమానాన్ని తగిలి పేలిపోతుంది.[5]

జాక్, మాక్ పెర్షింగ్ స్క్వేర్ కు వెళ్ళి బాంబరు అడిగిన డబ్బును ఒక చెత్త కుండీలో వేస్తారు.తాను మోసంచేయబడిన విషయం తెలుసుకున్న పేన్ పోలీసు అధికారి దుస్తులు ధరించి అన్నీను అపహరిస్తాడు. జాక్ అతనను వెంబడించి మెట్రో రెడ్ లైన్ సబ్వేలోకి వెళ్ళి అన్నీకు వేసిన బాంబును చూస్తాడు. పేన్ సబ్వే రైలును హైజాక్ చేసి, అన్నీకు ఒక పోల్ తో చేతిసంకెళ్లు వేస్తాడు. రైలు కదలగానే జాక్ ఎక్కుతాడు. పేన్ రైలు డ్రైవర్ ను చంపేస్తాడు. అతని దగ్గర ఉన్న బ్యాగ్ లోని డబ్బులు ఒక డై ద్వారా నాశనం అవుతాయి. అతను, జాక్ కు రైలు పైకప్పు మీద పోరాటం జరుగుతుంది. పేన్ కు ఒక ఓవర్ హెడ్ లైట్ సిగ్నల్ వలన శిరచ్చేదం అవుతుంది.

జాక్ అన్నీ నుండి బాంబు చొక్కాను తొలగిస్తాడు, కానీ ఆమె ఇప్పటికీ చేతిసంకెళ్లు వేసుకుని ఉంటుంది.పేన్ డ్రైవర్ ను హత్య చేసి కంట్రోల్ ప్యానెల్ ను నాశనం చేసిన విషయం తెలుసుకుంటాడు. జాక్ రైలు వేగాన్ని పెంచడం వలన అది ట్రాక్ ముగింపు అయిన హాలీవుడ్ బౌలేవార్డ్ నుంచి బయటకు వస్తుంది.[6]

మూలాలు[మార్చు]

  1. "Speed IMDB". Retrieved 30 May 2018.
  2. "Box Office Collection". Retrieved 30 May 2018.
  3. "Speed-Rogerbert". Retrieved 30 May 2018.
  4. "Speed Radiotimes". Retrieved 30 May 2018.
  5. "20 Reasons to Love Speed, 20 Years Later". Retrieved 30 May 2018.
  6. "Keanu Reeves boards a bus that can't slow down for one of the great '90s action movies". Retrieved 30 May 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=స్పీడ్_(1994)&oldid=3874610" నుండి వెలికితీశారు